ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్ష‌క స‌మావేశాలు ప్రారంభం

Vishwa Bhaarath
0
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్ష‌క స‌మావేశాలు ప్రారంభం | RSS All India Representative Sabha Annual Meetings Begin

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్ష‌క స‌మావేశాలు ప్రారంభం

రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) సంఘం అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు హర్యానాలోని పానిపట్‌లో ఆదివారం మొదలయ్యాయి. వచ్చే ఏడాది కాలంలో దేశమంతటా సుమారు లక్ష ప్రాంతాలలో తన ఉనికిని, సేవా కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి అవసరమైన కార్యప్రణాళికను ఈ సమావేశాల్లో సమీక్షించి, ఖరారు చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల ఆరెస్సెస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హొసబలే భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించారు. మార్చి 14న ముగియనున్న ఎబిపిఎస్ సమావేశంలో దేశవ్యాప్తంగా 34 ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత సంస్థలకు చెందిన 1,474 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డా.మన్మోహన్ వైద్య మీడియాతో మాట్లాడుతూ 2025 నాటికి సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. స్వయం సేవకులు తమ రోజువారీ పనిలో సమయాన్ని వెచ్చించడం ద్వారా, తమ స్వంత డబ్బు ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ సామాజిక మార్పుకు దోహదపడటం ద్వారా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలను అంకితభావంతో వ్యాప్తి చేస్తున్నారని డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. ఆర్ఎస్ఎస్ శాఖలను వ్యక్తిత్వ అభివృద్ధికి కేంద్రాలుగా ఆయన అభివర్ణించారు.

2020లో కరోనా వ్యాప్తి తర్వాత సంఘ్ పని, ప్రభావం ఇంకా పెరిగిందన్నారు. 2020లో, 38,913 చోట్ల 62,491 శాఖలు, 20,303 ప్రదేశాలలో వారపు సమావేశాలు, 8,732 ప్రదేశాలలో నెలవారీ సమావేశాలు జరిగాయని మన్మోహన్ వైద్య తెలిపారు. ఈ సంఖ్యలన్నీ 2023లో గణనీయమైన పెరుగుదలను చూశాయని చెప్పారు.

భారతదేశ సమాజం అంతా ఒక్కటేనని, అందరూ సమానులే, అందరూ నావారేనని, సమాజానికి నేను ఏదైనా అందించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల నుంచి ఉద్ఘాటించే ఉదాత్తమైన ఆలోచనలు, విలువ వ్యవస్థలని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తన ప్రారంభ ప్రసంగంలో ప్రస్తావించారు. శాఖలకు హాజరయ్యే వ్యక్తులు గొప్ప విలువలను అలవర్చుకుంటారని, తర్వాత జాతీయవాద ఆలోచనలను మేల్కొల్పడం, సమాజాన్ని వెంట తీసుకెళ్లడం ద్వారా సామాజిక పరివర్తనలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఆకర్షణకు పెరుగుతున్నదని చెబుతూ ఇప్పుడు ఎక్కువ మంది దాని వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఆర్ఎస్ఎస్ కోసం అన్వేషిస్తూ డిజిటల్ మాధ్యమం ద్వారా జాతీయవాద సంస్థలో చేరాలని చూస్తున్నారని హొసబలే పేర్కొన్నారు. 2017 నుండి 2022 మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడానికి 7,25,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, ఈ దరఖాస్తుదారులలో ఎక్కువ మంది 20 నుండి 35 సంవత్సరాల వయస్సు గలవారని చెబుతూ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ లో చేరాలని చూస్తున్నారని వివరించారు.

ఆర్‌ఎస్‌ఎస్ దైనందిన శాఖలపై కూడా దేశ యువత ఆసక్తిని కనబరుస్తున్నారని చెబుతూ మొత్తం శాఖలలో 60 శాతం విద్యార్థి శాఖలు అని వెల్లడించారు. గత ఒక సంవత్సరంలో, 121,137 మంది యువకులు సంఘ్ ప్రాథమిక శిక్షణను పొందారని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ 109 శిక్షా వర్గలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెబుతూ, వీటిలో 20,000 మంది స్వయంసేవకులు పాల్గొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

సంఘ్ శిక్షణ గురించి డాక్టర్ వైద్య తెలియజేస్తూ 15-40 సంవత్సరాల మధ్య వయస్సు గల స్వయంసేవకులు ప్రథమ వర్ష శిక్షన్ (మొదటి సంవత్సరం శిక్షణ)లో పాల్గొంటారని, 17-40 సంవత్సరాలలోపు వారు ద్వితీయ వర్ష్‌కు హాజరవుతున్నారని, తృతీయ వర్ష్ అనేది 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఉద్దేశించినదని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ 40 ఏళ్లు పైబడిన స్వయంసేవకుల కోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం భగవాన్ మహావీర్ 2550వ నిర్వాణ సంవత్సరం, ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి 350 సంవత్సరాలు కావడంతో వీటిని పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ జరుప తలపెట్టింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు ప్రతినిధి సభ (ఎబిపిఎస్)లో ఆమోదిస్తారు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం కొనసాగుతున్న అమృత్ కాల్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక తీర్మానం కూడా ఆమోదిస్తారని డా. వైద్య తెలిపారు.

__Vishwa samvada kendram
Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top