అయోధ్యలో 45 రోజుల సంగీత ఉత్సవం ప్రారంభం | 45-days music festival begins in Ayodhya

Vishwa Bhaarath
0
అయోధ్యలో 45 రోజుల సంగీత ఉత్సవం ప్రారంభం | 45-days music festival begins in Ayodhya
అయోధ్య
కన్నులపండువగా గత సోమవారం ప్రాణప్రతిష్ఠ జరుపుకొన్న అయోధ్య రామమందిరంలో బాల రాముడికి అంకితమిస్తూ శుక్రవారం నుంచి భక్తి సంగీత ఉత్సవం మొదలైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు 45 రోజులపాటు కొనసాగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ‘‘శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది.

దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారు’’ అన్నారు. వైజయంతిమాల, హేమామాలిని, అనూప్‌ జలోటా, అనురాధ పౌడ్వాల్‌, మాలిని అవస్థీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, సురేశ్‌ వాడ్కర్‌, పద్మా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాయిద్యాలు ‘మంగళ ధ్వని’లో భాగం కానున్నాయి. ఈ వేడుకకు యతీంద్ర మిశ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, దిల్లీ సంగీత నాటక అకాడమి సహకరిస్తోంది.

___vskteam

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top