అయోధ్యలో విధ్వంసం పక్కా : ఖలిస్థాన్ వేర్పాటు వాది పన్నూ హెచ్చరిక | Destruction is sure in Ayodhya: Khalistan separatist Pannu warns

Vishwa Bhaarath
0
అయోధ్యలో విధ్వంసం పక్కా : ఖలిస్థాన్ వేర్పాటు వాది పన్నూ హెచ్చరిక | Destruction is sure in Ayodhya: Khalistan separatist Pannu warns
ఖలిస్థాన్ వేర్పాటు వాది పన్నూ

అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ దగ్గరపడుతున్న వేళ, ఖలిస్థాన్ వేర్పాటు వాది పన్నూ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో విధ్వంసం సృష్టిస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని కూడా పన్నూ హెచ్చరించారు. పన్నూ హెచ్చరికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. 

శుక్రవారంనాడు ఖలిస్థానీ సానుభూతిపరులుగా అనుమానిస్తోన్న ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ భద్రతా సంస్థలు అరెస్టు చేసిన ముగ్గురుని అనవసరంగా వేధింపులకు గురిచేయవద్దని పన్నూ ఓ ఆడియో సందేశంలో హెచ్చరించారు. అరెస్టు చేసిన ముగ్గురి యువకుల్లో ఒకరిని రాజస్థాన్‌కు చెందిన ధరమ్‌వీర్‌గా గుర్తించారు. రిపబ్లిక్ డే రోజున హతమారుస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కూడా పన్నూ బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. పన్నూ బెదిరింపుల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

Courtesy: vsk andhra

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top