వీళ్లకు మనం ఓటు వేయాలంటారా? - Should we vote for them?

Vishwa Bhaarath
0
వీళ్లకు మనం ఓటు వేయాలంటారా? - Should we vote for them?
Anti Hindu Politics!

వీళ్లకా ఓటు వేసేది?

నాలుగో విడత పోలింగ్‌ జరుగుతున్నది. దేశంలో బీజేపీయేతర పార్టీల వాస్తవ రూపం ఒక్కొక్క విడతలో ఒక్కొక్క రూపంలో జాతి ముందు నిలబడుతోంది. మూడో విడత పోలింగ్‌ నాటికి బయటపడిన కొన్ని నిజాలు విస్తుగొలిపేటట్టు ఉన్నాయి. వీళ్లకా దేశం కొందరు ఓటు వేయాలనుకుంటున్నది? రిజర్వేషన్‌లకు బీజేపీ వ్యతిరేకం అంటూ రాహుల్‌గాంధీ మొదలు రేవంత్‌రెడ్డి వరకు అబద్ధాన్ని దేశం మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. తాము మతం ప్రాతిపదికగా ఇచ్చే ముస్లిం రిజర్వేషన్‌లకు మాత్రమే వ్యతిరేకమని బీజేపీ వివరణ ఇచ్చుకుంటూనే ఉంది. విపక్షాల గోబెల్స్‌ ప్రచారం అడ్డూఆపూ లేకుండా సాగుతూనే ఉంది. అందరి నోట ఒకటే మాట. 
   బీజేపీ మూడో దఫా అధికారంలోకి వస్తే రిజర్వేషన్‌లు ఎత్తివేస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఆ రెండూ కూడా ఎవరి తరమూ కాదు. విష ప్రచారాన్ని ఇంకాస్త పెంచుతూ అయోధ్యను, రాముడిని కూడా వివాదంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాముడి పేరు జపం చేస్తే ఉద్యోగాలు వస్తాయా? అని ఒకరు. రాముడు మీకు బాబాయా? సీతమ్మ మీకు పిన్నా అంటూ చెత్త వాగే నికృష్టులు పెరిగిపోతున్నారు. భారత రాష్ట్రపతి మొదలు ప్రధాని, సైనిక దళాల ప్రధాన అధికారి అంతా సనాతనీలేనని ఇంకొక నిరక్షర కుక్షి వాగుతూనే ఉన్నారు. పూంచ్‌లో భద్రతాబలగాల కాన్వాయ్‌ మీద జరిగితే స్టంట్‌ అంటూ కొట్టిపారేసే విద్రోహ శక్తులు కూడా నోరు మూయడం లేదు. పుల్వమా దాడి విషయంలో, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ విషయంలో ఎలాంటి అబద్ధాలు, సైనిక వ్యతిరేక భావాలు వెదజల్లారో ఇప్పుడు కూడా అంతే. పూంచ్‌లో జరిగింది ఒక స్టంట్‌ అంటున్నాడు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చన్ని. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానంటూ జాతిని మోసగించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పుడు ఖలీస్తానీ ఉగ్రవాదుల నుంచి కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ దేశాన్ని రక్షిస్తామని చెబుతున్నది వీళ్లే. తమకి ఓటు వేయమంటున్నది ఈ మూకలే. బీజేపీనీ, మోదీనీ నిరంతరం విమర్శించే దివాంధులు వీళ్లే. వీళ్లకి ఓటు వేయాలని కొందరైనా అనుకోవడం బాధాకరం కాదా? దేశాన్ని అలాంటివాళ్ల చేతులలో పెట్టాలా? సిగ్గుచేటు కాదా? మన జాతికి మనం చేసుకుంటున్న ద్రోహం కాదా? ఓటర్లు ఆలోచించాలి. ఇక్కడ ఇస్తున్న ఈ ప్రకటనలు తాజావి మాత్రమే. సైనికుల త్యాగాన్ని హేళన చేస్తూ, హిందూధర్మాన్ని అవమానిస్తూ, అయోధ్య రామయ్యను నిందిస్తూ, సనాతన ధర్మాన్ని ఆడిపోసుకుంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి.  పాక్‌ అణుబాంబులు వేస్తుంది, జాగ్రత్త!

పాక్‌ అణుబాంబులు వేస్తుంది, జాగ్రత్త!

ఇలాంటి ప్రకటనలని ఎన్నికల వేళ ఆవేశంతో చేసినవని సరిపెట్టుకోవాలా? అది సాధ్యమేనా? ఢల్లీిలో ఉంటే జాతీయవాది, కశ్మీర్‌లో లోయలో నోరెత్తితే వేర్పాటువాది ఫరూక్‌ అబ్దుల్లా చెప్పిన మాటలు వింటే ఏమనిపిస్తుంది? ‘పాకిస్తాన్‌ గాజులు వేసుకుని కూర్చోలేదు. మన మీద అణుబాంబు వేయగలదు!’ ఇదీ ఆయన ప్రకటన. ఇదీ ఆయన పాకిస్తాన్‌కు గొంతై భారత్‌ను బెదిరించిన తీరు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ఒక వ్యాఖ్యకు అబ్దుల్లా స్పందన ఇది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో విలీనమవుతుందని రాజనాథ్‌ ఒక పాత ప్రకటననే ఒక సభలో సందర్భవశాత్తు చేశారు. రక్షణమంత్రి (రాజ్‌నాథ్‌) ఉద్దేశం అదే అయితే అలాగే చేయవచ్చు. మనం ఎవరం ఆపేందుకు? కానీ ఒకటి గుర్తుంచు కోవాలి. వారు (పాక్‌) గాజులు తొడుక్కో వడం లేదు. వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. దురదృష్టవ శాత్తు అవి మన నెత్తి మీదే పడతాయి!’ అన్నాడు ఆ జేకే మాజీ ముఖ్యమంత్రి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆ పార్టీ ప్రభుత్వాలు, దానిని నడిపిన వారి చరిత్ర గమనించిన వారికి ఇలాంటి ప్రకటన విడ్డూరం కాదు. కానీ అబ్దుల్లాల పాక్‌ భక్తి రోజురోజుకీ తీవ్రమవుతున్న సంగతి మాత్రం స్పష్టమవుతున్నది.

ఫరూక్‌ ప్రకటనకు ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా వంత పాడాడు. ఇంతకీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ కారణంగా రేగిన చిచ్చు సంగతి ఈ తండ్రీకొడుకులు గమనించారా? అందులో భారతదేశ ప్రజలతో పాటు, ఇండీ కూటమి ఐక్యత మీద నమ్మకం ఉన్న వారు కూడా గమనించవలసిన కీలక అంశాలు ఉన్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ కార్గిల్‌ శాఖ మొత్తం మూకుమ్మడి రాజీనామా సమర్పించింది. అందుకు కారణం ఏమిటో తెలుసా? అక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ అదేశించి నందుకు ఆ శాఖ మొత్తానికి ఆగ్రహం వచ్చింది. రాదా మరి! ఇది లద్దాక్‌ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సెరింగ్‌ నంగ్యాల్‌. ఆయన బౌద్ధుడు. కాబట్టే కార్గిల్‌ శాఖకి మండిపోయింది. ఇక్కడ మే నెల 20న పోలింగ్‌ జరుగుతుంది. బౌద్ధులంటే మైనారిటీలలో వారే. అయినా మైనారిటీల యందు ముస్లిం మైనారిటీలు వేరయా! అన్నది తెలిసిందే. అందుకే అక్కడే పోటీ చేస్తున్న మహమ్మద్‌ హనీఫా జాన్‌కు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని కార్గిల్‌ ఎన్‌సీ శాఖ తేల్చి చెప్పింది. షియా ముస్లిం హనీఫా లద్దాక్‌ స్థానానికి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. ‘లద్దాక్‌లో ఇండీ కూటమి అభ్యర్థి నంగ్యాల్‌కు మద్దతు ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ ఫరూక్‌ అబ్దుల్లా పేరుతో పార్టీ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. దీనికి కార్గిల్‌ ఎన్‌సీ శాఖ కార్యదర్శి, అక్కడ కొత్తగా తెరిచిన దుకాణం లద్దాక్‌ డెమాక్రటిక్‌ అలయెన్స్‌ నాయకుడు ఖమర్‌ అలీ అఖూన్‌ లద్దాక్‌ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హనీఫాకు మద్దతు ఇవ్వదలిచాం అని సమాధానం ఇచ్చాడు.

అయోధ్య తీర్పును తారుమారు చేయడమే కాంగ్రెస్‌ ధ్యేయం

ఐదువందల ఏళ్ల పోరాటం తరువాత, దశాబ్దాల న్యాయ పోరాటం తరువాత అయోధ్య రామజన్మభూమి మీద హిందువులకు హక్కు లభించింది. కానీ దీనిని కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించు కోలేకపోతున్నది. ఎప్పటికీ జీర్ణించుకోలేదు కూడా. అలనాడు షాబానో కేసులో రాజీవ్‌ గాంధీ సుప్రీం తీర్పును పక్కన పెట్టాలని చూసినట్టే, 2019లో అయోధ్య తీర్పు వచ్చినప్పుడు కూడా అలా పక్కన పెట్టే సూత్రం ఏదైనా ఉందా అంటూ అన్వేషణ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీలో చిరకాలం పనిచేసి, లక్నోలో అటల్‌ బిహారీ వాజపేయి మీద కూడా పోటీ చేసిన ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్‌ జాతి విస్తుపోయే విషయాన్ని మే ఆరో తేదీన (ఏఎన్‌ఐ వార్తా సంస్థ ద్వారా) బయటపెట్టారు. రామ మందిరం తీర్పు వెలువడిన తరువాత రాహుల్‌ తనకు అత్యంత సన్నిహితులతో ఒక రహస్య సమావేశం నిర్వహించాడు. సూపర్‌ పవర్‌ కమిషన్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ తీర్పును తిరగదోడాలని పథకం వేశాడు. అయితే ఆ పథకం పారలేదు. మోదీ, యోగి పదవుల నుంచి దిగిపోయాక అయోధ్య మళ్లీ మాదే అంటూ వాగిన కొందరు ముస్లిం మతోన్మాదులకీ, ఈ కాంగ్రెస్‌ మూకకీ మధ్య తేడా ఏముంది?

మే ఆరో తేదీనే అమేఠీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తన ప్రచార కార్య క్రమంలో ఇదే మాట చెప్పారు. రాహుల్‌ చేతికి కొద్ది పాటి అధికారం చిక్కినా రామాలయం విషయంలో ప్రతికూలంగానే వ్యవహరిస్తారని చెప్పారు. తిక్రియా అనే గ్రామానికి చెందిన ఒక కాంగ్రెస్‌ కార్యకర్త చెప్పిన విషయాలనే ఇరానీ తన ప్రచార సభలో చెప్పారు. 32 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఆ కార్యకర్త చెప్పిన ప్రకారం ఏ చిన్న అవకాశం వచ్చినా రాహుల్‌ అయోధ్య తీర్పును మార్చడానికి ప్రయత్నిస్తారు. సుప్రీం తీర్పును మార్పించి, మళ్లీ అక్కడ మసీదు నిర్మించడానికి ప్రయత్నిస్తారు అని ఆ కార్యకర్త చెప్పారని ఇరానీ వెల్లడిరచారు. ఇదీ కాంగ్రెస్‌ అసలు స్వరూపం. ఆ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ. సనాతన ధర్మానికి బద్ధవిరోధి. అయోధ్య రాముడిని ద్వేషిస్తుంది. రాముడంటే భారతీయ ఆత్మ అన్న సంగతిని ఆ పార్టీ ఏనాటికీ ఒప్పుకోదు.

రాజ్యాంగం మీద కన్హయకుమార్‌  భక్తి

జవాహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయకుమార్‌  తను పోటీ చేస్తున్న ఈశాన్య ఢల్లీి లోక్‌సభ నియోజకవర్గంలో మే6న ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. కాంగ్రెస్‌ ఇతడిని బరిలోకి దింపింది. కాబట్టి ఎన్నికల ప్రచారం చేశాడు. ఇందులో తప్పేమీ లేదు. కానీ కన్హయకుమార్‌ తల వెనుకే పెద్ద ఫోటో ఫ్రేంను ప్రదర్శించారు. అది భారత రాజ్యాంగ పీఠిక. దానిని పెద్దది చేయించి ఇలా పటం కట్టించి వెనక కనిపించేటట్టు పెట్టుకుని ఊరేగుతున్నాడు. ముంబై దాడుల కిరాతకుడు అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడం అమానుషం అంటూ సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టినవాడు కన్హయకుమార్‌. అలాగే పార్లమెంట్‌ దాడిలో నిందితులుకు ఉరి వేసినందుకు కూడా వీరంగం వేసినవాడు, సోదర విద్యార్థులతో వీరంగం వేయించినవాడు ఇతడే. అసలు భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తామని జేఎన్‌యూలో వీరావేశం ప్రదర్శిం చిన ఇతడు రాజ్యాంగ పీఠిక పట్టుకోవడం ఏమిటో అర్ధం కాదు. రాజ్యాంగం ఇలాంటి చర్యలను, నినాదా లను ఆమోదించిందా? దీనికి కాంగ్రెస్‌తో పాటు, కన్హయకుమార్‌ కూడా సమాధానం చెప్పాలి. 2019 ఎన్నికలలో సీపీఐ తరఫున పోటీ చేసిన కన్హయ ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నాడు. బీజేపీ నాయకుడు ప్రమోద్‌ తివారీ మీద ఇతడు పోటీ చేస్తున్నాడు.

2019లో కన్హయ బిహార్‌లోని బెగుసరాయ్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేశాడు. ఆనాడు కన్హయ వెంట సినీతారలు, జేఎన్‌యూ విద్యార్థులు పోటెత్తారు. చాలామంది ప్రొఫెసర్లు, జేఎన్‌యూ మాజీలు, పరిశోధకులు, మేధావులు నెల పాటు బెగుసరాయ్‌లో కూర్చుని కన్హయ గెలుపు కోసం చెమటోడ్చారు. డీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ వంటి అమాంబాపతు విద్యార్థి సంఘాలన్నీ వీధి నాటకాలు గట్రా గట్రా వేషాలతో ప్రచారం చేశాయి. అయినా కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్‌ సింగ్‌ ఇతడి మీద నాలుగు లక్షల మెజారిటీతో గెలిచారు. కానీ 2024 ఎన్నికలలో దృశ్యం పూర్తిగా మారిపో యింది. ఆ వేషగాళ్లు ఎవరూ ఇప్పుడు కన్హయని అంటకాగడం లేదు. ఆ మేధావులకు, ఉదారవాదు లకు కన్హ య కుమార్‌లో భావి భారత వెలుగు కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు, ఆప్‌ నేతలు వెంట రాగా కన్హయ నామినేషన్‌ దాఖలు చేశాడు. నిజమే మన దేశ మేధావులు, ప్రధానంగా లెఫ్ట్‌ మేధావులు అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేసుకుంటారు. ఇంతకీ ఈ వామపక్ష మేధావులకీ, ఉదారవాదులకీ కాంగ్రెస్‌ అంటే నచ్చదా ఏమిటి? ఫరవాలేదు, కాంగ్రెస్‌ కూడా కన్హయకుమార్‌ ఆశయాలకు, ఆలోచనలకు మద్దతు ఇవ్వగలదు. ఇదంతా చూస్తుంటే రాజ్యాంగకర్తలు అవమానంతో తలదించుకోరా?

ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల సన్నిహితుడు కేజ్రీవాల్‌

ఢల్లీి లిక్కర్‌ స్కాంలో పీకల్లోతు కష్టాలు మునిగి ఉన్నాడు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. స్వచ్ఛమైన రాజకీయాల నుంచి సారా దందా వరకు ఇతడి రాజకీయ ప్రస్థానం సాగింది. ఇప్పుడు కొత్తగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి కోట్ల రూపాయల నిధుల తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నుంచి పార్టీ నిధులు అందుకున్నట్టు ఆరోపణ వచ్చింది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. దేవేంద్ర పాల్‌ భల్లార్‌ అనే ఉగ్రవాదిని జైలు నుంచి విడుదల చేయించేందుకు కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఖలిస్తానీ ముఠాల నుంచి 1.6 కోట్ల అమెరికన్‌ డాలర్లు నిధులు తీసుకున్నట్టు తమకు ఫిర్యాదు అందిందని వీకే సక్సేనా కేంద్ర హోంశాఖకు మే ఆరో తేదీన లేఖ రాశారు. 2014`2022 మధ్య ఈ నిధులు ఇచ్చినట్టు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను ఆరోపించిన సంగతిని కూడా సక్సేనా ఆ లేఖలో ఉదహరించారు. 2014లో కేజ్రీవాల్‌ అమెరికాలో పర్యటించినప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు ఇదివరకే ఆరోపణలు వచ్చాయి. అన్నట్టు డబ్బు తీసుకున్నాడు గానీ, సదరు ఉగ్రవాదిని జైలు నుంచి విడుదల చేయించలేదని, కాబట్టి కేజ్రీవాల్‌ అంతు చూస్తామని పన్నుయే ఒక సందర్భంలో అన్నట్టు వార్తలు వెలువడినాయి. కాబట్టి కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులో ఉంటేనే క్షేమం కాదా!

పూంచ్‌లో తాజా దాడి కూడా స్టంటేనట

మే 4వ తేదీన కశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక దళ కాన్వాయ్‌ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతనాగ్‌, రాజౌరీలో పోలింగ్‌ జరగడానికి మూడు వారాల ముందు ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇందులో ఒక జవాను అమరుడయ్యాడు. అయితే ఇది కేవలం ‘స్టంట్‌’ అంటూ పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని హేళన చేశాడు. జలంధర్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, ఎన్నికలు వస్తే చాలు  ఇలాంటి దాడులు జరిగిపోతూ ఉంటాయని, ఇదంతా ఒక స్టంట్‌ వ్యవహారమని ఆయన వ్యాఖ్యానించాడు. పైగా బీజేపీ ప్రాణాలతో ఆటలాడుకుంటున్నదని కూడా ఆరోపించాడు. ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి అని, చన్ని మెదడు చచ్చిందా? అని బీజేపీ అధికార ప్రతినిధి విమర్శించారు. చిత్రంగా మే 6వ తేదీన చన్నియే మళ్లీ భారత సైనిక దళాల మీద ప్రశంసల వర్షం కురిపించాడు. మన జవాన్లు 40 మంది కశ్మీర్‌లో చనిపోయినప్పుడు  తాను పార్లమెంట్‌లో విచారం వ్యక్తం చేశానని దాడి కారకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా విమర్శించానని గుర్తు చేసే ప్రయత్నం చేశారు చన్ని. తాను బీజేపీ చేస్తున్నదే స్టంట్‌ అన్నానని సర్దుకున్నాడు.

గోవా కాంగ్రెస్‌కు ఈ రాజ్యాంగం వద్దట

దక్షిణ గోవా కాంగ్రెస్‌ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్‌ ఒక నిజం కక్కేశాడు. 2019 నాటి ఎన్నికలకు సంబంధించిన వివాదమిది. ఇప్పుడు బయటపడిరది. భారత రాజ్యాంగం వారి మీద (అనగా గోవా మీద) రుద్దారని విరియాటో చెబుతున్నారు. పోర్చుగీస్‌ నుంచి విముక్తి జరిగిన తరువాత (1961) భారత రాజ్యాంగాన్ని గోవాలో అమలు చేశారని ఆయన ఆరోపణ. ‘మేము (రాహుల్‌తో సమావేశమైనప్పుడు) 12 డిమాండ్లను ఆయన ముందు ఉంచాం. అందులో ఒకటి` ద్వంద్వ పౌరసత్వం. ఇది రాజ్యాంగబద్ధమా? అని రాహుల్‌ అడిగారు. మేం కాదు అని చెప్పాం. అప్పుడు నేను ఆయనకు వివరించాను. భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. గోవా పోర్చుగీస్‌ పాలన నుంచి 1961లో విముక్తమయింది. మీరు (కేంద్రం) బలవంతంగా మా మీద రుద్దారు.మా గురించి అందులో ప్రస్తావన లేదు’ అని చెప్పినట్టు విరియాటో ఏప్రిల్‌ 23న జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. విరియాటో ద్వంద్వ పౌరసత్వం కావాలని కోరుకుంటున్నారు. అంటే గోవాతో పాటు పోర్చుగీస్‌ పౌరసత్వం కూడా వీరికి కావాలట. దీని మీదనే ప్రధాని మోదీ తీవ్ర విమర్శలకు దిగారు.

అయోధ్య వెళ్లినందుకు కాంగ్రెస్‌ మార్కు శిక్ష

ఛత్తీస్‌గఢ్‌ మహిళా కాంగ్రెస్‌ నేత రాధికా ఖెరా
ఛత్తీస్‌గఢ్‌ మహిళా కాంగ్రెస్‌ నేత రాధికా ఖెరా

కాంగ్రెస్‌ పార్టీకి సనాతన ధర్మమంటే అంత ద్వేషమా? అయోధ్య రాముడంటే అంత వ్యతిరేకతా? అసలు హిందూధర్మమంటే ఇంత కక్ష ఎందుకు? ఛత్తీస్‌గఢ్‌ మహిళా కాంగ్రెస్‌ నేత రాధికా ఖెరా ఇటీవల బయటపెట్టిన విషయాలు దేశాన్ని నివ్వెరపరిచాయి. మీడియాలో ఆ విషయాలు మారుమోగాయి. కాంగ్రెస్‌ పార్టీలో తన సహచరులలో పురుషాంకారం విపరీతమని నేరుగా పత్రికల వారికి చెప్పిన ఖెరా తరువాత శతాధిక సంవత్సరాల కాంగ్రెస్‌ను ఎడంకాలితో తన్ని బీజేపీలో చేరారు. ‘న్ను ఒక గదిలోకి నెట్టేసి తాళం వేశారు. నన్ను విడిచిపెట్టమని వేడుకుంటూ కేకలు పెట్టాను. తరువాత నాకు జరిగిన ఈ అవమానం గురించి కింది స్థాయి నాయకత్వం నుంచి పై స్థాయి వరకు విన్నవించుకుని న్యాయం కోసం అర్ధించాను. కానీ నాకు న్యాయం జరగలేదు. పైగా ఈ విషయాలు చెప్పకుండా మౌనంగా ఉండమని ఆదేశించారు. అందుకే ఇవాళ (మే 4వ తేదీ) ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అని చెప్పారు రాధికా ఖెరా. ఇంతకీ ఖెరాను బంధించినది సాక్షాత్తు ఛత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలోనే. ఆమెను అంతదారుణంగా అవమానించడానికి కారణం అయోధ్య వెళ్లి రాములవారిని దర్శించుకు రావడమే. ఆ పుణ్యకార్యమే ఆమె చేసిన పాపమైపోయింది. ఇంత నీచత్వం ఎక్కడైనా ఉంటుందా?

‘అయోధ్య క్షేత్రమంటే రాముడి జన్మభూమి. మనందరికీ ఎంతో పవిత్రమైన క్షేత్రం. అందుకే అక్కడికి వెళ్లకుండా ఉండడం నా వల్ల కాలేదు. కానీ నేను అయోధ్య వెళ్లి వచ్చినందుకు ఇలాంటి దారుణ పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని మాత్రం ఊహించలేదు’ అన్నారు ఖెరా. ఇవన్నీ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు వివరించారు.

తాను రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్నానని, ఏనాడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని, నిబద్ధతతో పార్టీ కోసం శ్రమించానని ఖెరా చెప్పారు. నేను కేవలం అయోధ్యను సందర్శించినందుకే, నేను కేవలం హిందువుని అయినందుకే, సనాతన ధర్మాన్ని అవలంబిస్తాను కాబట్టే నాకు న్యాయం జరగలేదు. మీ పోరాటం (కాంగ్రెస్‌) రాముడితోనాÑ లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీతోనా?’ అని ఖెరా ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానం మీద అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన తరువాత న్యాయం జరుగుతుందేమోనని ఆమె ఆరు రోజులు ఎదురు చూశారు. ఆరు రోజుల క్రితం కొందరు కాంగ్రెస్‌ నాయకులకు తనకూ తీవ్ర వాగ్యుద్ధం జరిగిందనీ, వారంతా తనని అవమానించారని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.

ఇంతకీ రాధికా ఖెరా చిన్న నాయకురాలేమీ కాదు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కమ్యూనికేషన్లు, మీడియా కోఆర్డినేటర్‌ హోదాలో ఉన్నారు. కౌసల్య మాత పుట్టింట ఓ ఆడపడుచుకు పట్టిన గతి ఇది. ఇక్కడ స్త్రీకి రక్షణ లేదు. పురుషులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఆడపడుచులను అణచివేస్తున్నారు. వాటి గురించి నేను వెల్లడిస్తాను’ అని అంతకు ముందు ఆమె ట్వీట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ను కౌసల్య పుట్టినిల్లుగా చెబుతారు. అయితే ఇలాంటి ఒక ఘర్షణ జరిగినట్టు తన దృష్టికి రాలేదని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సచిన్‌ పైలట్‌ వ్యాఖ్యానించడం విశేషం. మహాలక్ష్మీ వందనం పేరుతో మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్‌, తన పార్టీలోని మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రం మాట్లాడడం లేదని ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ అధికార ప్రతినిధి కేదార్‌ గుప్తా వ్యాఖ్యానించారు.

జాగృతి సౌజన్యంతో

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top