ప్రయాగ్‌రాజ్ నుండి బలవంతపు మత మార్పిడి కేసు ఒకటి బయటపడింది, అక్కడ 21 ఏళ్ల రితికా కుష్వాహా తన సొంత సోదరుడి నుండి రక్షణ కోసం కేసు పెట్టింది. తన ఇష్టానికి విరుద్ధంగా మజార్లను సందర్శించడానికి, తావిజ్ ధరించడానికి, ఇస్లామిక్ ఆచారాలను అనుసరించడానికి తనను బలవంతం చేశారనేది ఆమె ఆరోపణ. కేసు వివరాల్లోకి వెళితే ప్రయగరాజ్ లో నివసించే రితిక ఐదుగురు తోబుట్టువులలో చిన్నది. ప్రయాగ్‌రాజ్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాపూర్ ఉచ్వాఘాడిలో నివసిస్తుంది. వారి తండ్రి మరణం తరువాత, కుటుంబం రాహుల్ సంరక్షణలోకి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ జైలులో ఉన్న తన స్నేహితుడి భార్య రుబియాను, తను మతం మార్చుకుని పెళ్లి చేసుకుని 2023లో ఇంటికి తీసుకని వచ్చాడు. రూబియాను వివాహం చేసుకునే ముందు రాహుల్ ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఎజాజ్‌గా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. రుబియా ప్రభావంతో అతను ఇస్లాం స్వీకరించడం మాత్రమే కాదు, ఇంటిలో ఉన్నవారిని కూడా ముస్లింలుగా మారమని ఒత్తిడిలు ప్రారంభమయ్యాయి. వారింటిలోని వంటగది, ప్రార్థన స్థలం మరియు మొత్తం ఇల్లు మజార్ లాంటి ప్రదేశంగా మారిపోయాయి. వారిని మతంమారమని కొట్టడంలాంటివి కూడా చేశేవారు.
"My brother is forcing me to become a Muslim," says Ritika Kushwaha from Prayagraj.
— Subhi Vishwakarma (@subhi_karma) August 17, 2025
In 2023, Ritika's brother, Rahul, married his friend's wife, Rubika, and changed his name to Ejaz. Since then, he has been living as a Muslim and pressuring his family and siblings to convert to… pic.twitter.com/6MR9JeEWMj
ముఖ్యంగా, ఐదుగురు తోబుట్టువులలో చిన్నది అయిన రితిక, తన చెల్లెలు రాధికను కూడా ఇలాంటి ఒత్తిడిని ప్రతిఘటించినందున, ఆమె మానసికంగా అస్థిరంగా ఉందని ముద్రవేసి, “చికిత్స” కోసం మతాధికారుల వద్దకు తీసుకెళ్లారని రితిక ఆరోపించింది. ఒక సంవత్సరం పాటు వేధింపులు భరించిన తర్వాత, రాధిక మే 29, 2024న అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది. ఇక ఆ తర్వాత రితికను కూడా వారు సతాయించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా రాహుల్ కూడా కోల్‌కతాకు చెందిన మధ్య వయస్కుడైన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవాలని రితికాపై ఒత్తిడి తెస్తున్నాడు. దాంతో రితిక రితికా జూలై 29, 2025న తన ఇంటి నుండి తప్పించుకుని, తన అక్కతో కలిసి సీనియర్ పోలీసు అధికారులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకుంది.ప్రస్తుతం తనకు అండగా తన అక్క కాంచన్ ఉంది.
“నాకూ అదే జరుగుతుందని నేను భయపడుతున్నాను. నేను హిందువుని, నేను ముస్లింగా మారాలని అనుకోను. దయచేసి నన్ను రక్షించండి” అని రితిక తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా రాహుల్ నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడని, వారి తండ్రి మరణం తర్వాత వారి తల్లిని మానసికంగా అస్థిరంగా మార్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
2021లో, దారాగంజ్‌లో జరిగిన బాంబు దాడి సంఘటనకు సంబంధించి రాహుల్‌ను అరెస్టు చేశారు అతని ముస్లిం స్నేహితుడు ఎజాజ్ అతన్ని ప్రభావితం చేశాడు. అతను జైలులో ఉన్నప్పుడు ఎజాజ్ కు రాహుల్ సహాయం చేశాడని బాదితురాలు ఆరోపించింది. ఎజాజ్ జైలులో ఉన్న తర్వాత, అతని భార్య రూబియా రాహుల్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకున్నాడు.
ఉచ్వాఘడి పరిసరాల్లోని స్థానికులు కూడా రాహుల్‌ను నేరస్థుడిగా అభివర్ణించారు, అయితే ఎవరూ రికార్డులో మాట్లాడటానికి అంగీకరించలేదు. రాహుల్ దారాగంజ్‌లో దొంగతనం, బాంబు దాడి, దోపిడీ గ్యాంగ్‌స్టర్ చట్టం అభియోగాలతో చరిత్రకారుడిగా ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు.
జూలై 29న, రితిక అధికారికంగా వేధింపులు, దుర్వినియోగం , బలవంతం కింద ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణలో నేరం చేసినట్లు రుజువయింది. ప్రస్తుతం పోలీసులు రాహుల్ కోసం వెతుకుతున్నారు. రూబియాను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ కొనసాగుతోంది.

