![]() |
| World's tallest 108-tread Durga statue in Mauritius |
ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవి విగ్రహం మారిషస్ లో ఉంది. గలాతలావ్ ఒడ్డున ఉన్న 108 అడుగుల పొడువైన అద్భుతమైన విగ్రహాన్ని స్థానిక భారతీయులు 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, 400 టన్నుల ఇనుముతో నిర్మించారు. గంగాతలావ్ ప్రాంతం సముద్రమట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక క్రేటర్ సరస్సు. ఇది మారిషస్ లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశం.
గ్రాండ్ బాసిన్ అని కూడా పిలువబడే గంగా తలావ్ మనదేశంలోని పవిత్రమైన గంగానదిని పోలి ఉంటుంది. శివరాత్రి సమయంలో మారిషస్ లోని చాలామంది హిందువులు తమ ఇంటి నుండి ఈ సరస్సు వరకు పవిత్ర యాత్రను చెప్పులు లేకుండా చేస్తారు. ఆఫ్రికాలోని హిందువుల మెజారిటీగా ఉన్న ఏకైక దేశం మారిషస్. ఇక్కడ అనేక హిందూ దేవాలయాలున్నాయి. నవరాత్రి చాలా బాగా జరుగుతుంది. అందుకే ఇక్కడ దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పారు. 108 అడుగుల ఎత్తు, 33 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. ఇది భారతదేశంలోని కోల్ కతాలోని దేశ్ ప్రియ పార్క్ దుర్గోత్సవ్ విగ్రహం ఎత్తును అధిగమించింది.
ఈ అద్భుతమైన విగ్రహ నిర్మాణాన్ని భారతీయ కార్మికులు, స్థానిక శిల్పులు, ఇంజనీర్లు కలిసి హిందూ గ్రంథాలకు అగునంగా నిర్మించారు. దీని నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఇది కట్టడానికి అవసరమైన ధనం అంతా కూడా ప్రజలు ఇచ్చిందే...ప్రభుత్వం నుండి ఎలాంటిసహాయం తీసుకోలేదు. ఈ దుర్గామత విగ్రహం పక్కనే భగవాన్ శివుని మూర్తి కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఆరు సంవత్సరాల కృషి, దాని నిర్మాణంలో సుమారు 2,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు మరియు 400 టన్నుల ఇనుము ఉపయోగించబడ్డాయి. బలం, రక్షణ , మాతృత్వం యొక్క స్వరూపిగా గౌరవించబడే దుర్గాదేవి, తన సాంప్రదాయ రూపంలో, తన దివ్య ఆయుధాలను పట్టుకుని, సింహంపై ఉన్నట్లుగా ఈ విగ్రహం చిత్రీకరించబడింది.
ఈ స్మారక చిహ్నం ద్వీపం యొక్క లోతైన హిందూ వారసత్వానికి , ప్రజల అచంచల విశ్వాసానికి ఒక ప్రకాశవంతమైన నిదర్శనం. ఈ విగ్రహం గంగా తలావ్ను అసమానమైన ఆధ్యాత్మిక శక్తి మరియు సామరస్యం కలిగిన ప్రదేశంగా మారుస్తుంది అనడంలో ఎలాంటిసందేహం అక్కర్లేదు.

