దశాబ్దాలుగా నక్సలిజం ప్రాబల్యంతో వున్న ఆ ప్రాంతం... ఇప్పుడు పూర్తిగా ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నక్సల్స్ లొంగుబాట్లు, వారికి పునరావాస పథకాలు, నక్సలిజం సిద్ధాంతం బలహీనపడటం... ఇవన్నింటి నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు విపరీతమైన మార్పులు వచ్చేశాయి.
నక్సల్స్ చేతిల్లోంచి బస్తర్ ప్రజలు బయటికి వచ్చి, ఊపిరులు పీల్చుకుంది. ఈ నేపథ్యంలో బస్తర్ లోని చాలా డివిజన్ లలో ఇప్పుడు గణతంత్ర దినోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయ్యాయి. మొన్న మొన్నటి వరకూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అక్కడ నిషేధం. నక్సలైట్లు అంతా అక్కడి వారిని వేధించారు. ఆధిపత్యం చెలాయించారు.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం బస్తర్ లోని దాదాపు 40 రిమోట్ గ్రామాలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 58 గ్రామాల్లో భద్రతా బలగాలు రోజు రోజుకీ అక్కడ పనులు చేయించడంతో అది సాధ్యమైంది. అలాగే రిమోట్ గ్రామాలు కాకుండా, 53 గ్రామాల్లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్ వంటి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోనూ ఈ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. అలాగే 40 గ్రామాల్లో తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
వేడుకలకు ఆతిథ్యమిచ్చే గ్రామాలలో బిజ్పూర్ జిల్లాలోని బెల్నార్, కొండపలి, ఉల్లూరు, దంతేవాడలోని పిల్లూర్, దొడిసోమర్ మరియు కమలూరు, అంజాగర్, జాటూర్, బైపేట మరియు నారాయణపూర్‌లోని కొద్నార్ మరియు పాలగూడ మరియు సుక్మాలోని నాగారం ప్రాంతాలున్నాయి. దశాబ్దాలుగా అస్థిరత, హింస, మావోయిస్టుల ప్రాబల్యం క్షీణించడం, వారిపై అక్కడి స్థానికులు తిరుగుబాటు చేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అభివృద్ధి విషయంలోనూ పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి.
వివరాల ప్రకారం, 2021 నుండి బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు వందకు పైగా భద్రతా శిబిరాలు ఏర్పాటయ్యాయి., గతంలో మావోల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో వారు తమ పట్టును బలోపేతం చేసుకోవడానికి ఇవి వీలు కల్పించాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి బాటలు పడుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతున్నాయి. అలాగే జాతీయ పండుగలు నిర్వహించడానికి గానీ, ప్రజలు పాల్గొనడానికి కానీ మావోయిస్టులు వీలు కల్పించేవారు కాదు. కానీ.. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు వచ్చారు.
గత యేడాది బస్తర్ ప్రాంతంలోని 29 గ్రామాలు స్వాతంత్ర దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నాయి. బస్తర్ లోని దాదాపు 12 గ్రామాల్లో మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అలాగే బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్ బ్యాంక్ శాఖ తన కార్యకలాపాలను కూడా ప్రారంభించింది.

