![]() |
| 522 religious attacks on Hindus, 61 murders... Bangladesh violence |
బంగ్లాదేశ్ లో ముస్లిం ఛాందసులు మైనారిటీలైన హిందువులు, ఇతరులపై చేస్తున్న హింస వెర్రితలలు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది హిందువులను పొట్టనపెట్టుకున్నారు. ఇది ఇలాగే కొనసాగుతున్నా... అక్కడి ప్రభుత్వం కిమ్మనడం లేదు. అయితే.. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యతా మండలి కీలకమైన సమాచారాన్ని బయటపెట్టింది.
గత యేడాది కాలంలో...
బంగ్లాదేశ్ లో గతయేడాది కాలంలో 522 మత హింస ఘటనలు జరిగాయని, అందులో 61 హత్యలు జరిగినట్లు వెల్లడించింది. 522 సంఘటనలో 61 హత్యలు, 28 అత్యాచారాలు, 28 సామూహిక అత్యాచారాలు జరిగాయని, మహిళలపై రకరకాల హింస కూడా జరిగిందన్నారు. వీటితో పాటు మతపరమైన ప్రదేశాలపై దాడులు, విగ్రహాలను అపవిత్రం చేసే విషయంలో 95 సంఘటనలు నమోదయ్యాయని వెల్లడించింది.
అలాగే 21 సంఘటనలు భూ ఆక్రమణలు కాగా, 102 సంఘటనల్లో మైనారిటీల ఇళ్లు, వ్యాపార సంస్థల ధ్వంసం జరిగిందని, అలాగే 47 హత్యా బెదిరింపులు, హింస వుందని కూడా వారు విడుదలచేశారు. బంగ్లాదేశ్ మానవ హక్కుల కమిషన్ జూన్ 2025 మరియు జనవరి 2026 మధ్య మూక హత్యలు సహా మైనారిటీల హత్యలను నిర్ధారిస్తూ ప్రకటన కూడా విడుదల చేశారన్నారు.
జూలై, ఆగస్టు 2024 లో జరిగిన నిరసనల సందర్భంగా 650 మందికి పైగా మరణించారని, ఆ తర్వాత ఆ లెక్క 1,500 కి చేరుకుందని యూఎన్ నివేదిక కూడా పేర్కొందన్నారు. అలాగే జనవరి 26 వ తేదీన నర్సింగ్డి జిల్లాలో కనీసం 12 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులపై దోపిడీదారులు, ఉగ్రవాదుల బృందం దాడి చేసి, గాయపరిచిందని కూడా గుర్తు చేశారు.
మైనారిటీలు సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యతా మండలి కోరింది. అలాగే ఎన్నికల ప్రచారంలో మతం గురించి ప్రస్తావన లేకుండా నిషేధించాలని, నియమాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

