![]() |
| What is the nature of the patriotism of Indian Communist journalists? |
భారత కమ్యూనిస్టు పత్రికా విలేకరుల దేశభక్తి ఎలా ఉంటుంది తాతా?
చాలా విచిత్రంగా ఉంటుంది మనవడా?
చైనా వాళ్ళు అమెరికా లేదా ఏ పాశ్చాత్య దేశాల మీడియా అంటే BBC, న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా సంస్థల్లో పని చేస్తున్నా, వారి చైనా దేశానికి నష్టం కలిగించే వార్తలు, వ్యాసాలు రాయరు. అవకాశం వస్తే తమ చైనా దేశం గురించి సానుకూల వార్తలు రాసుకుంటారు. చైనా గురించి ఏమైనా వ్యతిరేక వార్తలు వచ్చినా డిఫెండ్ చేసుకుంటారు.
పాక్ దేశీయులు ముఖ్యంగా ముస్లిం పాత్రికేయులు, మేధావులు వంటి వారు కూడా చాలా వరకు పాక్ దేశానికి అనుకూలంగా పాశ్చాత్య మీడియాలో రాసుకుంటారు. భారత్ లో ఉండే ముస్లిం పాత్రికేయులు కూడా విదేశ మీడియాలో పాక్ కి మద్దత్తు గా , భారత్ కి వ్యతిరేకంగా వచ్చే వార్తలకు పై దేశాలలోనూ మరియు మన దేశం లోనూ విపరీతమైన ప్రచారం కల్పిస్తారు.
ఇక మన దేశంలో సోషల్ మీడియా రాక ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా 90% కమ్యూనిస్ట్ ల చేతుల్లోనే ఉండేది. పేరుకు పెట్టుబడి దారీ చేతిలో మీడియా వ్యవస్థ అని తిట్టుకుంటూ ఎడిటోరియల్ బోర్డ్స్ నుండి గ్రామాల్లో వార్తలు సేకరించే వారి వరకు పూర్తి గా కమ్యూనిస్టు భావజాలం గల వారి చేతుల్లో ఉండేది.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, వీరు భారత ప్రభుత్వానికి పాశ్చాత్య దేశ మీడియాలో ఏమైనా వ్యతిరేక వార్తలు వస్తే ఈ దేశంలో వైరల్ చేసేది వీళ్లే.
బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత అది ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి. పాశ్చాత్య మీడియాలో పనిచేసే భారతీయ కమ్యూనిస్టు లు, భారత్ అభివృద్ధి గురించి కానీ సంస్కరణలు గురించి గానీ చైనా, పాక్ మీడియా వాళ్ళ లాగా ఏమీ గొప్పగా ప్రచారం చేయరు. కానీ పాశ్చాత్య మీడియా లో భారత్ పై వ్యతిరేక వార్తలు వస్తే, వాటిని విదేశాల్లోనూ మరియు దేశంలోనూ విపరీతంగా ప్రచారం చేసే వాళ్లలో వీళ్లే ముందు వరుసలో ఉంటారు.
కొందరు అయితే ఇక్కడ అంబానీ, ఆదాని, పెట్టుబడి దారీ వ్యవస్థ అంటూ తిడుతూ అదే పాశ్చాత్య పెట్టుబడి దారీ దేశాలు అయిన అమెరికాలో స్థిరపడి, భారత్ కి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూ భారత్ లో అమెరికా ప్రయోజనాలు కాపాడుతూ ఉంటారు.
అందుకే అంటారు.
చైనా కమ్యూనిస్ట్ లకు తమ చైనాపై దేశభక్తి. వారి దేశ ప్రయోజనాల కోసం పాటు పడతారు. వారి దేశ పారిశ్రామిక వేత్తలను విదేశాలకు బలిపెట్టరు.
పాక్ వారికి పాక్ దేశం పై దేశభక్తి, ఆ దేశ ప్రయోజనాల కోసం పాటు పడతారు. వారి వ్యాపార పారిశ్రామిక వేత్తలను వారు రోడ్డున పడయ్యరు.
కానీ అదేం దురదృష్టమో!
భారతీయ కమ్యూనిస్ట్ పాత్రికేయులకు భారత్ ప్రయోజనాల కంటే చైనా ప్రయోజనాలు, పాక్ ప్రయోజనాలు ఇంకా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా భారత దేశం బలహీన పడేలా ప్రవర్తిస్తూ వుంటారు.
ఎందుకంటే చూడండి భారత్ ప్రభుత్వ అధికార ప్రకటనలు, మిలిటరీ వారి అధికార మాటల మీద విశ్వాసం కంటే అమెరికా, చైనా మరియు పాక్ మీడియా మరియు వారి రాజకీయ నాయకుల మాటలకు వీళ్ళు విలువ ఇచ్చి భారతదేశ ప్రయోజనాలకు నష్టం కలిగేలా భారీగా ప్రచారం చేస్తారు.
ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం చూడండి.
మోడీ ప్రభుత్వం ఎవరి చర్యలు ఖండించడం లేదు నేరుగా మద్దత్తు లేదు. జస్ట్ యుద్ధం మంచిది కాదు చర్చలు ద్వారా సమస్య పరిష్కారం చేసుకోండి అని డిప్లోమేటిక్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మౌనంగా ఉంటోంది.
కానీ, అదే సమయంలో ప్రభుత్వం తన శక్తి యుక్తులను అన్నింటిని భారత్ దేశానికి తీవ్ర ఆయిల్ గాస్ సంక్షోభం రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంటే అన్ని దేశాలతో మంచి సంబంధాలు మెంటయిన్ చేస్తూ వేరే దేశాల నుండి క్రూడ్ గాస్ దిగుమతులు చేసుకోవడం. ఒకరికొకరు బద్ద శత్రువులు అయిన రష్యా నుండి ఆయిల్, అమెరికా నుండి LPG ఒకేసారి దిగుమతి చేసుకుంటోంది. కొత్తగా ఇరాన్ నుండి కూడా క్రూడ్ దిగుమతులు మొదలు పెట్టింది. దాదాపుగా నెల రోజులు గా యుద్ధం జరుగుతున్నా ఈ చర్యలు వలనే దేశం లో పెట్రోల్ డీజిల్ కి భారీ కొరత లేదు. LPG కూడా తీవ్ర సంక్షోభం లేకుండా చూస్తున్నారు.
తక్కువ జనాభా ఎక్కువ వనరులు ఉన్న చాలా ధనిక దేశాలు కంటే ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంత భారీ జనాభా, భారీ ఆయిల్ వినియోగం గల భారత్ లో ఆయిల్ సంక్షోభాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తోంది.
కానీ మీడియా దేనిని హై లైట్ చేస్తోందో చూడండి అమెరికా-ఇరాన్ మధ్య మన దేశం మధ్యవర్తిత్వం చేయడం లేదు, పాక్ ని అమెరికా నమ్మింది భారత్ కి చేత కాలేదు. మోడీ ఫెయిల్ అంటూ వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా 5రోజులు పాజ్ ప్రకటించే ముందే ట్రంప్ మోడీకి కాల్ చేసి మాట్లాడాడు. మాట నిలకడ లేని ట్రంప్ ని నమ్మి మధ్యవర్తిత్వం వహిస్తే చివరకు ఏం జరుగుతుందో మోడీకి తెలియక కాదు. బహుశా ట్రంప్ అడిగినా మోడీ సున్నితంగా తిరస్కరించడానికే అవకాశాలు ఎక్కువ. కానీ, అమెరికా కోరితే పాక్ ఎగిరి గెంతేసి ఆ అవకాశం అందిపుచ్చుకుంటుంది. ఆ దేశ పరిస్థితి అలా ఉంది. ఇంతకీ మన మీడియా ప్రచారం చేస్తున్నట్లు పాక్ మధ్యవర్తిత్వం ఏమీ వహించడం లేదు కేవలం అమెరికా సందేశాలను కొరియర్ లాగా ఇరాన్ కి అందిస్తోంది అంతే. ఇదే మాట పాక్ అంబాసిడర్ చెప్పారు. అందుకే మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఘాటుగా చెప్పారు 'భారత్ దలాల్' దేశం లాగా పని చేయలేదు అని.
కరోనా సమయంలో కూడా ఈ దేశాన్ని హేళన చేయడానికి విదేశీ మీడియాకు ఈ దేశ మీడియా వాళ్ళే అవకాశం ఇచ్చారు.
....చాడా శాస్త్రి


