ఛత్తీస్ గఢ్ లోని పండారియా ప్రాంతంలో గిరిజన వర్గానికి చెందిన 200 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అందులో ఓ పాస్టర్ కూడా వున్నాడు.ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు సంప్రదాయ, ఆచార క్రతువుల ద్వారా వారందర్నీ తిరిగి సనాతన ధర్మంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి పాదాలను కడిగి, సంప్రదాయ క్రతువులు చేసి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. స్థానికుల సహకారంతో పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో ఘర్ వాపసీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని హిందూ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. కొన్ని నెలలుగా ఈ ఘర్ వాపసీ కొనసాగుతూనే వుందని, ఇప్పటి వరకు వందలాది మంది తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 700 నుండి 750 మంది గిరిజనులు తమ మూల విశ్వాసానికి తిరిగి వచ్చారని పేర్కొంటున్నారు. న్యూర్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల నుండి 115 మంది, కుయ్-కుక్దుర్ ప్రాంతం నుండి 70 మంది, దమ్గఢ్ గ్రామం నుండి 50 మంది మరియు కుల్హిడోంగ్రి గ్రామం నుండి 140 మంది ఇప్పటికే హిందూ ధర్మాన్ని తిరిగి వచ్చారు.
#WATCH | BJP MLA Bhawna Bohra says, "A major drive is ongoing in Pandariya Assembly constituency with the help of locals. Since the birthday of PM Modi, we started the 'ghar wapasi' of people. We are happy that this has continued. Today, yet again, 150-200 people returned to… https://t.co/F8H2KPmTxg pic.twitter.com/VZooicH0Tc
— ANI (@ANI) May 21, 2026
ఈ ఘర్ వాపసీ ఉద్యమం అనేది ఓ సాంస్కృతిక ఉద్యమంగా కొనసాగుతోందని హిందువులు పేర్కొంటున్నారు. మరో వైపు తమను క్రైస్తవ మిషనరీలు అనేక ప్రలోభాలకు గురి చేశాయని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ప్రలోభాలకు గురి చేశారని వారు పేర్కొంటున్నారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత హిందూ ధర్మం గొప్పతనం తెలిసి, తిరిగి వచ్చేశామని, ఇప్పుడు పండగలన్నీ జరుపుకోవచ్చని, హిందువులందరితోనూ కలిసి మెలిసి వుండొచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

