మావోయిజంపై పోరులో భాగంగా గడ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ ఓ కీలక విజయం సాధించింది. ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో మావోయిస్ట్ ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. అలాగే, భూమిలో పాతిపెట్టిన భారీ మొత్తంలో ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను నాశనం చేశారు. దీంతో నక్సల్స్ నెట్ వర్క్స్ కి మరో గట్టి దెబ్బ తగిలింది.
కొద్ది నెలల క్రిందటే డ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ సమన్వయంతో, మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలోని బల్బేడ అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసిన మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని, భూమిలో పాతిపెట్టిన భారీ ఆయుధ నిల్వను విజయవంతంగా కనుగొని ధ్వంసం చేశారు.
భద్రతా దళాలపై దాడులకు ఉపయోగించే ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు ఇతర సామగ్రిని తయారు చేయడానికి, నిల్వ చేయడానికి మావోయిస్టులు ఒక రహస్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూన్ 27, 2026న ఈ ఆపరేషన్ చేపట్టారు.గడ్చిరోలి జిల్లా నుండి మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ఇది మరో కీలక అడుగు అని అధికారులు పేర్కొన్నారు.
పోలీసు వర్గాల ప్రకారం గడ్చిరోలీలో మావోయిస్టులను సమర్థవంతంగా అణచివేశామని పేర్కొంటున్నారు. అలాగే మావోయిస్టు ఉద్యమం ఆ జిల్లాలో చివరి దశలో వుందని ప్రకటించారు. అయితే.. దశాబ్దాల పాటు మావోయిస్టులు మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్ఖ వెంబడి వున్న దట్టమైన అడవులను ఆయుధాలు తయారు చేయడానికి, పేలుడు పరికరాలను తయారు చేయడానికి, ఆయుధాలను దాచుకోవడానికి ఉపయోగించుకున్నారు.
భద్రతా సిబ్బందిపై దాడులు చేయడానికి లేదా విధ్వంసక చర్యలకు పాల్పడటానికి, మావోయిస్టులు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వీటిని వెలికి తీసేవారు. రహస్యంగా దాచిపెట్టిన ఆయుధాలను అప్పుడు మాత్రమే వినియోగించేవారు. గడ్చిరోలీలో కొన ఊపిరిలో వున్న నక్సలైట్లు ఏమాత్రం తిరిగి కోలోకోవద్దంటే, దాచిపెట్టిన ఆయుధాలను ధ్వంసం చేయాల్సిందే అన్న లక్ష్యంతో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి.
అయితే.. ఈ ఆపరేషన్ మే మాసం చివరి రోజుల్లో జరిగింది. అప్పుడు కూడా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగానే తాజా ఆపరేషన్. గడ్చిరోలి పోలీసులు ఎస్పీ ఎం. రమేష్ పర్యవేక్షణలో జూన్ 26, 2026న మరో సమన్వయంతో కూడిన సోదా కార్యకలాపాన్ని చేపట్టారు.గడ్చిరోలి మరియు ప్రాణహిత స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ల నుంచి ఆరు బృందాలు, ఒక బాంబు గుర్తింపు మరియు నిర్వీర్య దళం (BDDS) మరియు ఒక CRPF బృందంతో కూడిన సంయుక్త దళం 2026 జూన్ 26న బల్బేడా అటవీ ప్రాంతానికి వెళ్లింది.
మావోయిస్టుల భూగర్భ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించి, దట్టమైన అటవీ ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా సంబంధిత సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు బృందాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.జూన్ 27న, అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత BDDS సిబ్బంది విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు అటవీ నేల కింద దాచి ఉంచారని భావిస్తున్న భారీ మొత్తంలో పరికరాలు మరియు ఆయుధాల తయారీ సామగ్రిని ఆ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నవి ఇవీ..
1. సుమారు 5-6 టన్నుల బరువున్న భారీ లేత్ యంత్రం
2. 150 క్లేమోర్ మైన్లు, బారెల్ గ్రెనైడ్ లాంఛర్ పైపులు
3. 220-12 బోర్ తుపాకీ బారెల్స్, పైపులు
4. 20 రైఫిల్ రాడ్లు, లోహపు పట్టీలు
5. మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రి

