భూ భూతం !

Vishwa Bhaarath
0
భూ భూతం - The ghost of the indian earth
The ghost of the india land

"భూ భూతం"

ఈ క్రింది వాటిల్లో అన్నిటికి ఉన్న ఒక కామన్ లింక్ చెప్పుకోండి చూద్దాం?

  • ఢిల్లీ విమానాశ్రయం
  • ఢిల్లీలో 77%
  • తాజ్ మహల్
  • ముంబైలో అంబానీ ఇల్లు
  • ద్వారక 
  • చార్మినార్
  • హైదరాబాద్‌లో 42%
  • ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్
  • విప్రో హైదరాబాద్ కార్యాలయం
  • హైదరాబాద్ హోటల్ మారియట్
మీకు తెలియలేదు కదా! ఈ భూములన్నీ/ఆస్తులన్ని WAQF బోర్డు యాజమాన్యంలో ఉన్నాయి లేదా వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేయబడ్డాయి!

WAQF: భారతదేశపు అతిపెద్ద భూ కుంభకోణం.

దాని చరిత్ర తెలుసుకోండి.
   WAQF" అనే పదం ఖురాన్‌లో లేదు.  రాజ్యాంగంలో కూడా కనిపించదు. ఖురాన్ తరువాతి వచ్చిన హదీసులలో మాత్రమే దీని ప్రస్తావన ఉంది.

హిందూ గ్రంధాలలో దీపావళి టపాకాయలు గురించి చెప్పబడలేదు అనే ఆరోపణతో వాటిని నిషేధించే మిలార్డ్‌లను మనం తప్పక ఈ ప్రశ్న అడగాలి: వారు అదే ప్రాతిపదికన అంటే వారి మత గ్రంధాలలో లేని WAQF ని కూడా నిషేధిస్తారా అని??

ఈ WAQF గురించిన తొలి పురావస్తు సూచన 10వ శతాబ్దంలో మాత్రమే కనిపిస్తుంది. అంతకు ముందు WAQFకు సంబంధించి నమోదు చేయబడిన యే రుజువు లేదు. అయితే, అప్పుడు ఉన్న WAQF  ప్రస్తుతం ఉన్న WAQF బోర్డుల నుండి పూర్తిగా భిన్నమైనది. వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి, అసలు WAQF అంటే అప్పుడు మరియు ఇప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.

పూర్వ రోజుల్లో, WAQF ప్రాథమికంగా ఇస్లామిక్ ఎండోమెంట్, ఇది మతపరమైన మరియు స్వచ్ఛంద ప్రయోజనాల కోసం స్థాపించబడింది.   అయితే, మిగతా ఇండోమెంట్స్ కి దీనికి మధ్య ఒక భారీ వ్యత్యాసం ఉంది.  ఏదైనా WAQF (ఎండోమెంట్) ఒకసారి అమలు చేయబడితే రద్దు అది చేయబడదు. అంటే, అది ఇక చేతులు మారదు. "ఒకసారి WAQF, ఎల్లప్పుడూ WAQF".
అనేదే ఆ సూత్రం.

ఆచరణాత్మకంగా, దీని అర్థం ఏమిటంటే  ఆ కాలంలో WAQF ఎల్లప్పుడూ ప్రభుత్వ (ముస్లిం పాలకుడు) నియంత్రణలో ఉంటుంది. 'వాకీఫ్' అంటే (జారీ చేసినవారు) మరియు 'ముతవల్లి'  అంటే (సంరక్షకుడు)కి దానిపై ప్రైవేట్ హక్కులు లేవు. అప్పట్లో "WAQF బోర్డు" లాంటిదేమీ లేదు.
నేటి WAQF బోర్డు (సెంట్రల్ WAQF కౌన్సిల్) 1964లో నెహ్రూచే స్థాపించబడింది. నేడు, WAQF బోర్డు హిందూ భూములను ఒక క్రమపద్ధతిలో లాక్కొని భారతదేశంలో రక్షణ మరియు రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద భూ యజమానిగా అవతరించింది.

ఉదాహరణకు 'చౌరాసి ఖంబా'  విషయాన్నే పరిగణించండి. ఇది 12వ శతాబ్దంలో ఘోరిడి లచే నాశనం చేయబడిన హిందూ కృష్ణ దేవాలయం. అయితే, ఆక్రమణదారులు పూర్తిగా ధ్వంసం చేయలేదు. నేటికీ విష్ణువు యొక్క అవతారాలను వర్ణించే శిల్పాలు స్తంభాలపై కనిపిస్తాయి. హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చడమే వారి అసలు ఉద్దేశం. విధ్వంసం తరువాత, ఇది వాస్తవంగా వదిలివేయబడింది. వందల సంవత్సరాలుగా జుమ్మా నమాజ్ /శుక్రవారం ఆరాధన లేదు.

అయితే, ఇది ఇప్పుడు మసీదుగా అయిపోయింది. ఎలా అంటే,  దానిలో ప్రార్థనలు జరిగాయి అని చెప్పి 20వ శతాబ్దంలో, WAQF బోర్డు ఎక్కడా లేని విధంగా ఈ నిర్మాణాన్ని తనదిగా క్లెయిమ్ చేసింది, వారి అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది.  ఇది ఇప్పుడు WAQF ఆస్తి. ఆ విధంగా, ప్రభుత్వాలు కేవలం ఇస్లామిక్ ఆక్రమణదారుల గత విజయాల ఆధారంగా కూడా WAQF బోర్డు భూములను ఆక్రమించుకునేలా చేయడం ద్వారా విదేశీ జిహాదీ దండయాత్రలను ధృవీకరించాయి.
  • ఇటీవల కాలంలో, 1500 సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా తమిళనాడులోని కనీసం 6 హిందూ మెజారిటీ గ్రామాలపై WAQF బోర్డు యాజమాన్య హక్కులు ప్రకటించింది!
  • WAQF బోర్డు ఈ గ్రామాలపై హక్కును ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేసింది?
  • ఎలా అంటే, ఈ గ్రామాలు ఒకప్పుడు జలాలుద్దీన్ అహ్సాన్ ఖాన్ అనే విదేశీ ఆక్రమణదారుడి వ్యక్తిగత దండయాత్రలో స్వాధీనం చేసుకోబడ్డాయి.
  • అందువల్ల ఒకప్పుడు ఏదైనా ఇస్లామిక్ ఆక్రమణదారు ఆక్రమించిన ఏ భూమి అయినా ఇప్పుడు WAQF బోర్డు ద్వారా తీసుకోబడుతోంది.  ప్రభుత్వాలు వారికి ఆ అధికారం ఇచ్చాయి.
  • WAQF బోర్డు ఇంత దారుణంగా భూములను ఎలా దోచుకోగలుగుతోంది?
  • భారతదేశంలోని WAQF బోర్డు న్యాయవ్యవస్థకు  సరి సమానమైన ప్రశ్నించలేని అధికారాన్ని కలిగి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
  • వారు కావాలంటే  మీ ఆస్తిపై హక్కును ప్రకటిస్తే  మీ స్వంత ఇంటి నుండి మిమ్మల్ని బయటకు పంపే అధికారం కలిగి ఉంటుంది.

బోడుప్పల్ (హైదరాబాద్)లోని  5000 కుటుంబాల విషయమే తీసుకోండి. 

బోడుప్పల్ (హైదరాబాద్)లోని  5000 కుటుంబాల విషయమే తీసుకోండి.
బోడుప్పల్ (హైదరాబాద్)
హైదరాబాద్‌లో అధిక ధర పలికే అక్కడ భూములకు వీళ్ళు రిజిస్టర్డ్ యజమానులు. అయితే,  WAQF బోర్డు ఆ భూమి తమది అని ప్రకటించడం తో తమ సొంత భూములపై ​​తమ యాజమాన్య హక్కును తొలగించినందుకు వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

ఈ కుటుంబాలు వారి భూములకు రిజిస్టర్డ్ యజమానులు. వారు నిజంగా భూమి యజమానులని సూచిస్తూ ప్రభుత్వ పట్టా కలిగి ఉన్నారు? మరి వారు దానిని ఎలా కోల్పోయారు? ఎలాగంటే,  ఈ నివాసితులకు మనలో చాలా మందిలాగే ఈ వక్ఫ్ విషయంలో అవగాహన లేదు, సమాచారం లేదు మరియు అజాగ్రత్తగా ఉన్నారు. దాని వల్ల ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. క్రింద న్యూస్ పేపర్ కటింగ్ చదవండి.

ఈ బొడుప్పల్ నివాసితులు తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుండి తీసుకున్నారు, ఆ బ్రోకర్ దానిని 50-70 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం వ్యక్తి నుండి తీసుకున్నాడు. 1989లో, WAQF బోర్డు ఈ భూములు ఒకప్పుడు ముస్లిం పవిత్ర వ్యక్తికి చెందినవని తమకు ఆధీనం చేయాలి అని పేర్కొంది.

మొత్తానికి ఈ 294 ఎకరాల భూమిపై WAQF క్లెయిమ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవల, WAQF బోర్డు కొంతమంది నివాసితులను వారి స్వంత ఆస్తుల నుండి తొలగించింది. దీంతో వారు మేల్కొని కోర్టును ఆశ్రయించారు.

"ఈ 30 ఏళ్ల బట్టి మీరు ఏం చేస్తున్నారు?" అని కోర్టు తిరిగి నివాసితులనే ప్రశ్నించి కేసులు కొట్టేసింది. "ఒకసారి WAQF, ఎల్లప్పుడూ WAQF" అనేది WAQF బోర్డు యొక్క మంత్రం. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. అంటే గతంలో ఒక ఆస్తి ఎప్పుడైనా ఒక ముస్లిం వ్యక్తి/సెయింట్‌కు చెందినదని నమ్మడానికి కారణాలు ఉన్నాయి అని WAQF బోర్డు "నమ్మితే"  మీ భూమిని అది స్వాధీనం చేసుకోవచ్చు/దోచుకోవచ్చని దీని అర్థం.

పై పేరాలో "నమ్మకం" అనే పదాన్ని గమనించండి. WAQF చట్టం 1995 ప్రకారం,  WAQF బోర్డు 'ఫలానా ఆస్తి మాది అని కేవలం నమ్మితే' చాలు.  అంటే మీ భూమి ఒక ముస్లిం కి చెందినదని నమ్మాలి. అది చాలు. కానీ అది వక్ఫ్ ది 'కాదు' అని రుజువు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఒక వేళ రుజువు ఉంటే దానిని మీరు ఎక్కడ ఇవ్వాలి? మీరు కోర్టుకు వెళ్లకూడదు. మీరు మళ్ళీ WAQF ట్రిబ్యునల్‌ కే వెళ్లాలి, ఈ చట్టం యొక్క అపహాస్యం ఏమిటంటే, ఎవరైతే మీ భూమిపై తన దౌర్జన్యపూరిత దృష్టిని పెట్టారో వారి బోర్డు ముందే మీ రుజువులు చూపించి మీ కేసును వాదించవలసి ఉంటుంది.

ఈ చట్టంలోని అత్యంత క్రూరమైన అంశం ఏమిటంటే, WAQF బోర్డు (ఈ బోర్డు లో కేవలం ముస్లింలను మాత్రమే ఉంటారు) నిర్ణయమే అంతిమమైనది మరియు దానికి కట్టుబడి ఉండాలి.
"WAQF ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమమైనది" అంటే సుప్రీంకోర్టు కూడా WAQF బోర్డు నిర్ణయాన్ని సవాలు చేయలేదు.

అయినప్పటికీ, WAQF నిర్ణయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రెండు సందర్భాలలో (క్రింద చూడండి) మార్చింది. కానీ ఇలా సుప్రీంకోర్టు కి పోగలిగే వారు చాలా శక్తివంతమైన వ్యక్తులు/సంస్థలు. కానీ మరి సామాన్యుల సంగతేంటి?

"ఒకసారి WAQF, ఎల్లప్పుడూ WAQF" అనే నినాదం  WAQF బోర్డు వారి వెబ్‌సైట్‌లో ముందుగా కనిపిస్తుంది. అయితే, ఇది పేరుకు  సిద్ధాంతం మాత్రమే. ఆచరణాత్మకంగా, WAQF భూమి తరచుగా అవినీతి WAQF సభ్యుల చే విక్రయించబడుతోంది. ఇటువంటి కేసులోనే ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ని గత వారం ఈడీ అరెస్ట్ చేసింది.

సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఎవరైనా అబ్దుల్ నుండి  భూమి కొనుగోలు చేస్తే అది ఎప్పుడైనా WAQF భూమిగా ప్రకటించబడే అవకాశం ఉంది అని అందరూ గమనించాలి. 

భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ విషయం లో సరిగ్గా ఇదే జరిగింది.
అంబానీ ఇల్లు 'యాంటిలియా' ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విస్తృతమైన ప్రైవేట్ గృహాలలో ఒకటి. 27 అంతస్తులు, 173 మీటర్లు ఎత్తు, 37,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం గలది.  WAQF బోర్డు అతని ఇంటిపై దావా వేసింది.
WAQF బోర్డు అంబానీ ఇంటిని ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేస్తోంది?
అంబానీ ఇల్లు

WAQF బోర్డు అంబానీ ఇంటిని ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేస్తోంది?

2005లో అంబానీ కొనుగోలు చేసిన భూమి ముస్లిం అనాథాశ్రమానికి చెందినదని, అందువల్ల ఈ విక్రయం చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఈ భూమిని ఎవరు అమ్మారు? WAQF ముస్లిం లబ్ధిదారులు! మరి "ఒకసారి wakf..ఎప్పుడూ wakf" అనే సూత్రం ఏమైంది? అంటే దీనిని ఆస్తి ఇతరుల నుండి గుంజుకోవడానికి ఉపయోగిస్తున్నారు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉపయోగించడం లేదు అన్న మాట.

WAQF చట్టం 1995ను రూపొందించింది ఎవరు? ఇంకెవరు? పీవీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వమే.
దశాబ్దాలుగా, లౌకిక ప్రభుత్వాలు WAQF బోర్డుకు అధికారం కల్పిస్తూ వివిధ చట్టాలను ఆమోదించాయి, భారతదేశంలోని అత్యంత ధనవంతుడు కూడా దీని వల్ల సురక్షితంగా లేడు అని అంబానీ కేసులో రుజువు అయింది.

అధికారికంగా ఇస్లామిక్ దేశాలలో కూడా ఇటువంటి చట్టాలు లేవు.

గత రెండు రోజుల్లో ముందు రెండు భాగాలు చదివాము కదా! ఇదిగో మూడో భాగం చదవండి.
హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. అలాగే, మైక్రోసాఫ్ట్ మరియు విప్రో క్యాంపస్‌లను  WAQF భూమిలో నిర్మించారని WAQF బోర్డు పిటిషన్‌ వేసింది.

 మైక్రోసాఫ్ట్/ఐఎస్‌బీ/విప్రో క్యాంపస్‌ ల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్నారు. కానీ, మణికొండ మొత్తం కలిపి ఈ 1654 ఎకరాల భూమిని WAQF అని WAQF బోర్డు పేర్కొంది. ఎందుకు? ఎలా? ఎలా అంటే? ఇది ఒకప్పుడు హుస్సేన్ షా వాలి అనే ముస్లిం కి చెందినదని WAQF పేర్కొంది.

భయాందోళనకు గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నుండి బయట పడటానికి కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. అదృష్టవశాత్తూ, సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇలా #WAQF నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రద్దు చేయడం చాలా అరుదైన కేసుగా చెప్పవచ్చు.

మనం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్న:

సుప్రీంకోర్టు ని సంప్రదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత శక్తి మరియు వనరులు ఉన్నాయి. అయితే మరి సామాన్యుడి సంగతేంటి? ఒక వైపు wakf నుండి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ WAQF బోర్డుకు  న్యాయపరమైన అధికారాలు కల్పిస్తామని  హామీ ఇచ్చారు.

అంటే, మరో మాటలో చెప్పాలి అంటే వీరు వారికి న్యాయపరమైన అధికారాలు ఇచ్చి హిందువులపై ఒక భస్మాసుర హస్తం ఏర్పాటు చేస్తారు అన్న మాట. అయితే అదే భస్మాసురుడి నుండి ఇబ్బంది ఎదురయినప్పుడు మాత్రం వాళ్ళని వారు రక్షించుకోవడానికి సుప్రీం కోర్టుకు పరుగులు పెడతారు. దానిపై యుద్ధం చేసి తప్పించుకునే శక్తి వీరికుంది. కానీ వీరు సామాన్యులను మాత్రం వక్ఫ్ దయకి వదిలేసారు.
  • ఇటువంటి మోసగాళ్ళు మనం నెత్తిన పెట్టుకుంటున్న మన సెక్యులర్ రాజకీయ నాయకులు
  • నిజానికి, మొదట్లో WAQF భారతదేశంలో దాదాపు 52,000 ఆస్తులను కలిగి ఉంది.
  • 2009 నాటికి, 4 లక్షల ఎకరాల్లో 300,000 రిజిస్టర్డ్ WAQF ఆస్తులు ఉన్నాయి.
  • 2022 నాటికి, 8 లక్షల ఎకరాల భూమిలో 8,65,646 రిజిస్టర్డ్ WAQF ఆస్తులు ఉన్నాయి.
  • అంటే, WAQF భూమి కేవలం 13 ఏళ్లలో రెట్టింపు అయింది! 

ఎలా? భూమి విస్తరిస్తుందా? భూమి పెరుగుతుందా? మరి WAQF భూములు ఎలా రెట్టింపు అయ్యాయి?

సమాధానం ఏమిటంటే, WAQF బోర్డు ప్రైవేట్ హిందూ మరియు పబ్లిక్ స్టేట్ ఆస్తులపై దావా వేస్తోంది మరియు వివిధ రెవెన్యూ శాఖలు మరియు సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు WAQF క్లెయిమ్‌లను ఆమోదిస్తున్నాయి అంతే! నేడు, భారతదేశంలోని WAQF ఆస్తుల విలువ 12 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో భారతదేశంలోని WAQF బోర్డు అత్యంత ధనిక ప్రభుత్వేతర ల్యాండ్ హోల్డింగ్ బాడీగా చేసింది.

ఇది ఇంకా ప్రారంభమే అనుకుంటే? భవిష్యత్తు లో?
  • WAQF బోర్డు ప్రకారం, ఢిల్లీలో 77% WAQFకి చెందినది. 
  • ఇది WAQF బోర్డు యొక్క కార్యనిర్వహణ విధానం:
  • ఒక ఆస్తి గతంలో ముస్లిం ఆస్తి అయి ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా, WAQF బోర్డు ఒక ఆస్తిని పరిశీలిస్తుంది, 
  • WAQF బోర్డు ఆ తమ ఆస్తి అని "నమ్మడానికి" తగిన కారణాలు ఉంటే చాలు, వక్ఫ్ క్లెయిమ్ చేసిన తేదీ ముందు చేపట్టిన అన్ని లావాదేవీలు పనికిరానివి అయిపోతాయి.
  • ఎందుకంటే "ఒకసారి WAQF, ఎల్లప్పుడూ WAQF" WAQF భూమిని విక్రయించలేరు. WAQF భూమిని విక్రయించే వారు WAQF బోర్డులో సభ్యులుగా ఉన్నప్పటికీ అది చట్టవిరుద్ధం.
  • కానీ, ఈ WAQF బోర్డు ఒక స్కామ్. ముందుగా భూములపై ​​క్లెయిమ్ చేస్తారు. ఆ తర్వాత భూములను ఆక్రమించుకుంటారు. అప్పుడు ఆ భూములను "అక్రమంగా" విక్రయిస్తారు. ఈ నాటకంలో అందరినీ మోసం చేసి దోచుకుంటున్నారు. WAQF బోర్డు అవినీతిలో కూరుకుపోయింది.
  • 2012లో కర్ణాటక WAQF బోర్డులో 2 లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు బయటపడింది. WAQF లబ్ధిదారులు మరియు మధ్య దళారులు తమ సొంత నిబంధన అయిన "ఒకసారి WAQF.. ఎల్లప్పుడూ WAQF" అనే సూత్రాన్ని ఉల్లంఘించి, ఆ భూములను విక్రయిస్తున్నారు.

రెహ్మాన్ నివేదిక ప్రకారం, ప్రముఖ ఆక్రమణదారులు

  1. ఇమామ్ బుఖారీ: జామా మసీదు షాహీ ఇమామ్
  2. మౌలానా ఇమామ్: షాహీ మసీదు యొక్క నాయబ్ ఇమామ్.
దేవాలయాలు, ప్రభుత్వ భూములు హిందూ ప్రైవేట్ భూములే కాదు WAQF బోర్డు టార్గెట్ చేస్తోంది. హిందూ ప్రైవేట్ సంస్థలు ఆయిన RSS ఆధీనంలో ఉన్న భూమిని కూడా WAQF తన భూమి అని పేర్కొంది. ఈ భూమిని ఆర్‌ఎస్‌ఎస్ మామూలుగాకొనుగోలు చేసింది. అయితే, ఆ భూమి ఒకప్పుడు ముస్లిం స్మశాన వాటికగా ఉందని WAQF బోర్డు చెబుతోంది.

తాజాగా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 'మారియట్' హోటల్ అంటే గతంలో వైస్రాయ్ హోటల్స్ సముదాయం గల భూమి మాది అనే వక్ఫ్ పిటిషన్ ని తెలంగాణ హై కోర్ట్ గత వారం కొట్టేసింది. 
ఈ సమాచారం మొత్తం 'ట్రూ ఇండలజీ' అనే ట్విట్టర్ హేండిల్ వారు సేకరించి పంచుకున్నారు. 

ఇది నా సమాచారం:

ఇంకో దారుణమైన విషయం మీకు తెలుసా?

ఢిల్లీలో వేల కోట్ల విలువ చేసే 123 ఆస్తులు పై వక్ఫ్ క్లెయిమ్ చేస్తే, కుదరదు, అవి ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి 1984లో ఢిల్లీ హై కోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఆ కోర్ట్ ఆదేశాలను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా చెలామణీ అయి పలు మార్పులకు నోచుకున్నాయి. అయితే, విచిత్రంగా, ఢిల్లీ హై కోర్ట్ 1984 ఉత్తర్వులు అలా అమలులో ఉండగానే వాటిని పట్టించుకోకుండా,  సరిగ్గా 2014 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు అంటే మార్చ్ 14న మన్మోహన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ 123 ఆస్తులను వక్ఫ్ కి ధారాదత్తం చేసేసింది.

2023 జనవరి నెలలో కొందరు ఢిల్లీ లాయర్లు ఈ విషయంపై మళ్లీ ఢిల్లీ హై కోర్ట్ తలుపులు తట్టారు. దాంతో ఢిల్లీ హై కోర్ట్ మేం జూన్ 1, 1984 న ఆ ఆస్తులు అన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండాలి అని తీర్పు చెప్పినప్పటికీ వక్ఫ్ కి ఆ ఆస్తులు ఎలా అప్పచెప్పారు అని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డ్ కి నోటీసులు జారీ చేసి ఆగస్టు నెలలో ఆ ఆస్తులు అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ దారుణమైన వక్ఫ్ చట్టం చూస్తూ ఉంటే ఒక నాడు ఈ దేశంలో కొన్ని ప్రాంతాలు ముస్లిం రాజులు పాలించారు కాబట్టి వారు పాలించిన ప్రదేశాలలో ఉన్న ఆస్తులు అన్ని wakf కి చెందుతాయి అని భవిష్యత్ లో క్లయిం చేసినా ఆశ్చర్య పడక్కర లేదు.

మోడీ ప్రభుత్వం వచ్చి 10 సం. లు అయింది. వీటిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కొందరు అడుగుతున్నారు. ఏదైనా ఇచ్చేయడం చాలా సులువు, అదే వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. తెలుగులో ఒక సామెత ఉంది "వేసినప్పుడు వేపకొమ్మ- తీద్దామంటే ఆశిరమ్మ" అని. ఆర్టికల్ 370 చూశాం కదా? ఏడు దశాబ్దాలు పట్టింది. 60 సం. ల సెక్యులర్ కాంగ్రెస్ పాలన ఈ దేశానికి అంటించిన వైరస్ లు ఒకటి రెండు కావు.. వీటన్నింటినీ మళ్ళీ ఒక్కొక్కటిగా వదిలించుకోడానికి మళ్ళీ కొన్ని దశాబ్దాలు పడుతుంది.


.....చాడా శాస్త్రి - ఈ సమాచారం మొత్తం 'ట్రూ ఇండలజీ' అనే ట్విట్టర్ హేండిల్ వారు సేకరించి పంచుకున్నారు. 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top