భారత్‌ను ముక్కలు చేయాలంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన ఆస్ట్రియా ఆర్థికవేత్త గుంటర్ ఫేలింగర్-యాన్పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత్‌లో ఆయన ఎక్స్ అకౌంట్‌పై నిషేధం విధించింది. ఫేలింగర్ అభ్యంతకర పోస్టు గురించి హోమ్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు ఎక్స్ దృష్టికి తీసుకెళ్లాయి. భారత్‌లో ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అభ్యర్థించాయి.
భారత్‌ను ముక్కలు చేసి ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలంటూ గుంటర్ అంతకుముందు పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. భారత ప్రధానిని రష్యా మనిషి అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనాలు నెట్టింట మండిపడ్డారు. ఉక్రెయిన్, కొసోవో, బోస్నియా, ఆస్ట్రియా దేశాల నాటో సభ్యత్వ పరిశీలనకు ఉద్దేశించిన ఓ కమిటీకి ఫేలింగర్ అధ్యక్షుడిగా ఉన్నారు. బాల్కన్ దేశాల ఆర్థిక రంగ ఏకీకరణకు ఉద్దేశించిన మరో యాక్షన్ గ్రూప్‌లో బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు.
గుంటర్ ఫేలింగర్ 1968 లో లింజ్ లో జన్మించారు. ఆయమన ఆస్ట్రియా ఆర్థికవేత్త. ప్రస్తుతం ఉక్రెయిన్, కొసావో, బోస్నియా మరియు ఆస్ట్రియా దేశాల నాటో సభ్యత్వం కోసం ఆస్ట్రియన్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే తరుచూ వివాదాలకు కేంద్రంగా నిలుస్తారు. యూరోపియన్ యూనియన్, నాటో విస్తరణకు కూడా మద్దతిచ్చారు.వియన్నా యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్‌లో చదివిన ఫెహ్లింగర్-జాన్ కూడా రష్యా విచ్ఛిన్నానికి పిలుపునిచ్చారు. చైనా, భారతదేశం మరియు ఇరాన్‌లపై కఠినమైన వైఖరికి పేరుగాంచిన ఫెహ్లింగర్-జాన్ ఒకప్పుడు "బ్రెజిల్‌ను కూల్చివేయాలని" కూడా పిలుపునిచ్చారు.

