ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర : మోప్లా జిహాద్ - Real History of the Khilafat Movement: Moplah Jihad

Vishwa Bhaarath
Moplah Jihad
Moplah Jihad


— డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఆందోళన కాలంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1919-1922ల మధ్య కాలంలో ఎన్నో ఖిలాఫత్ ముస్లిం అల్లర్లు జరిగినా, చిన్న జాబితా మాత్రమే మనకు లభ్యమవుతోంది (Gandhi and Anarchy, Sir C. Sankaran Nair, Tagore & Co. Madras, 1922, pp. 250, 251). నెల్లూరు (22 సెప్టెంబర్ 1919), ముత్తుపేట, తంజావూరు(మే 1920), మద్రాస్  (మే 1920), సుక్కూర్, సింద్ (29 మే 1920), కచాగడి,NWFP (8 జూలై 1920), కసూర్, పంజాబ్ (25 ఆగస్ట్ 1920), పిలిబిత్, యు.పి. (23 సెప్టెంబర్ 1920), కొలాబా, బొంబాయి (9 జనవరి 1921), నయిహటి, బెంగాల్(4-5 ఫిబ్రవరి1921), కరాచి (1ఆగస్ట్ 1921), మద్రాసు (5 అక్టోబర్ 1921), కలకత్తా (24 అక్టోబర్ 1921), హౌరా (4 నవంబర్ 1921), కూర్గ్ (17 నవంబర్ 1921), కన్ననూర్ (4 డిసెంబర్ 1921), జముమాముఖ్, అస్సాం (15 ఫిబ్రవరి 1922), సిల్హెట్ (16 ఫిబ్రవరి 1922).

అయితే 1921-22 కాలంలోని మోప్లా జిహాద్ పరిమాణంలో, స్థాయిలో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అతి కిరాతకంగా క్రూరంగా సాగిoది. ఈ  మోప్లా జిహాద్ పలురకాలుగా అభివర్ణించబడింది; బ్రిటిషు పాలన, వారి హిందూ మద్దతుదారులకి వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమoగా, లేక హిందూ జమీందారులకి వ్యతిరేకంగా జరిగిన ముస్లిం రైతాంగ పోరాటంగా వర్ణించారు. “`జన్మి’(భూమిపై ఏకైక హక్కుదారులు) లపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా, ఎర్నాడ్-వల్లువనాడ్ తాలూకాలలో మొట్టమొదట జరిగిన పోరాటంగా, వెనకబడిన నిరక్షరాస్యులైన మోప్లాలకు ఈ ఖ్యాతి దక్కుతుంది” అని కమ్యునిస్టు నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ అభిప్రాయపడ్డారు. ( A Short History of Peasant Movement in Kerala, E.M.S. Namboodiripad, People’s Publishing House, Bombay, 1943. p.1) భారతప్రభుత్వ గృహ మంత్రిత్వ కార్యాలయంలో `స్వతంత్రతా సేనానుల సహాయనిధి’ కూడా ‘మోప్లా తిరుగుబాటు’ను, ఖిలాఫత్ ఉద్యమకారులను స్వాతంత్ర సేనానులుగా గుర్తించి గౌరవిస్తుంది. ఎటువంటి పక్షపాతం లేకుండా, 1921లో అప్పటి కాలికట్ డిప్యూటీ కలెక్టర్ దివాన్ బహదూర్ శ్రీ గోపాలన్ నాయర్ వ్రాసిన `మోప్లా తిరుగుబాటు’ పుస్తకంలో వివరించిన సంఘటనలు చూద్దాము (Norman Printing Bureau, 1923). ఈ పుస్తకం అప్పటి పత్రికలు `మద్రాస్ మెయిల్’ `వెస్ట్ కోస్ట్ స్పెక్టేటర్’ రెండు సంవత్సరాలు ప్రచురించిన వార్తల ఆధారంగా రచించబడింది.    rosp

భూమి, ప్రజలు:
మలబార్ తీరప్రాంతమంతా నివసించే మలయాళ ముస్లిములనుద్దేశిoచి `మాప్పిల్లా’ (అసలు అర్ధం `అల్లుడు’, ఇంగ్లీషులో `మోప్లా’) అనే పదం వాడతారు.  1921నాటికి, మలబార్ లో ముస్లిములు అధికసంఖ్యాకులే కాక వేగంగా పెరుగుతున్న జనాభా కూడా, పదిలక్షల జనాభా అనగా 32% ఉన్నవీరు దక్షిణ మలబార్ ప్రాంతంలో మరింత ఎక్కువ. జిహాద్ కి కేంద్రమైన `ఎర్నాడ్’ తాలుకాలో వీరి జనాభా 60శాతానికి పైగా ఉన్నది. (The Mappilla Rebellion, 1921: Peasant Revolt in Malabar, Robert L. Hardgrave, Jr., Modern Asian Studies, Vol. 11, No. 1, 1977, p. 58).

పది తాలూకాలున్న మలబార్ జిల్లాలో, దక్షిణ మలబార్లో ఎర్నాడ్, వల్లువనాడ్, పొన్నాని, కాలికట్ తాలూకాలు, ఉత్తర మలబార్లో కురుమ్బ్రనాడ్, వైనాడ్ తాలూకాలలో `సైనిక పాలన’ విధించారు. అల్లర్లు చెలరేగిన మొదటి నాలుగు తాలూకాలలో మతపరంగా జనాభా ఈవిధంగా ఉండేది (Nair, ibid, pp.1, 2):

తాలూకాలువిస్తీర్ణం(చదరపుమైళ్ళు)ప్రభావిత/మొత్తం గ్రామాలుహిందువులుముస్లిములుక్రిస్టియన్లు
ఎర్నాడ్96694/94163,328237,402  371
కాలికట్37923/65196,435   88,3935763
వల్లువనాడ్88068/118259,979133,919   619
పొన్నాని42635/121281,155229,016      23,081
మలబార్ ప్రాంతంలో వాణిజ్యంలో ముస్లిములు పట్టు సాధించారు. వారి ప్రోద్బలంతో, `చేర’ రాజు `చేరమాన్ పెరుమాల్’ ఇస్లాంమతం తీసుకున్నాడు. సా.శ. 825 ఆగస్టులో, చేరమాన్ మక్కాకి సముద్ర ప్రయాణం చేసి, అక్కడ ఆరబ్ మతప్రచారకులను మలబార్కి ఆహ్వానించాడు. మాలిక్-ఇబ్న్-దీనార్ నాయకత్వoలో 15మంది ప్రచారకులు కొడున్గల్లుర్ చేరుకున్నారు. పాలకులనుంచి అనుమతి పొంది, మలబార్, దక్షిణ కానరా జిల్లాలలో 10 మసీదులు కట్టి, యధేచ్చగా మతప్రచారం, మతమార్పిడిలు చేయసాగారు, దాని ఫలితమే ఈ `మోప్లా’ జాతి.
   కాలికట్ జామోరిన్ (రాజు) అరబ్ ఓడల మీద పనిచేయాలనే నెపంతో, మతమార్పిడిలు విపరీతంగా ప్రోత్సహిస్తూ, మత్స్యకారుల కుటుంబాలలో, ఒక ఇంట్లో ఒకమగవాడినైనా ముస్లిముగా పెంచాలని ఆదేశాలు జారీ చేసాడు(జిల్లా గజెట్).  ఆగస్ట్1789లో టిపు సుల్తాన్ ఆక్రమణలో బలవంతపు మతమార్పిడిలు విపరీతoగా జరిగాయి.  (Nair, ibid, pp.3, 4).
    ఉత్తర మలబార్లో, ఉన్నతకులాలలోని ధనవంతులు మతం మారితే, దక్షిణ మలబార్లో నిమ్న కులాలైన తియ్యా, చెరుమాన్, ముక్కువాన్ కులాలనుంచి ఎక్కువగా ప్రజలు మతం మారారు.  (Hardgrave, ibid, p. 59).rrrR


గతంలోని మోప్లా దౌర్జన్యాలు
1742నుంచి మోప్లా దురాక్రమణలు, దురాగతాలు నమోదైయాయి. మార్చ్1764లో తలస్సేరి సమీపంలో దర్మపటం(ధర్మదాం)కోటలోని పోర్చ్ గీస్ చర్చ్ పైన ఇద్దరు మోప్లాలు దాడి చేసారు. మరికొన్ని పాత 16వ శతాబ్దపు ఉదంతాలు, `జైయ్న్-అల్-దిన్-అల్ మాబరి’ అరబిక్ లో 1580లో వ్రాసిన `తుహ్ఫాట్ అల్-ముజాహిదీన్ ఫిబాదహవలాల్ పుర్తుకలియ్యిన్’ (మతయోద్ధులకు బహుమానం) పుస్తకంలో పొందుపరచబడ్డాయి.  పోర్చ్ గీస్ లపై దాడులను ప్రోత్సహించడానికి ఈ పుస్తకం వ్రాయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంమత స్థాపనకై, 16వ శతాబ్దoలోనే మోప్లాలు అత్జేనీస్ ముస్లిములతో కలిసి ఇండోనేసియాలో కూడా పోర్చ్ గీస్ వారిపై దాడిచేశారు. (The Islamic Frontier in Southwest India: The Shahīd as a Cultural Ideal among the Mappillas of Malabar, Stephen F. Dale, Modern Asian Studies, Vol. 11, No. 1, 1977, pp. 42-43, 48, 52).
     1836 నుంచి 1920 మధ్యకాలంలో మలాబార్ జిల్లాలో 33సార్లు మోప్లా అరాచక దౌర్జన్యాలు జరిగాయని స్టీఫెన్ డేల్ వ్రాసారు. (The Mappilla Outbreaks: Ideology and Social Conflict in Nineteenth-Century Kerala, The Journal of Asian Studies Vol. 35, No. 1, Nov. 1975, pp. 85-97).  ఒకటి రెండు తప్ప ఈ దౌర్జన్యాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో జరిగాయి, ఒక్కటి తప్ప మిగతా అన్ని దాడులు, కాలికట్ మరియు దానికి 35మైళ్ళ దూరంలో ఉన్న పొన్నాని అనే ఊళ్ళ మధ్య జరిగాయి. మూడు దురాగతాలు తప్ప, మిగతావన్నీ, మోప్లాలు హిందువులపై జరిపిన జిహాదీ దాడులు.  ఇవి చాలావరకు చిన్న చెదురుమదురు సంఘటనలుగా జరిగాయి, మూడుసార్లు మాత్రం ముప్ఫైమంది పైగా మోప్లాలు దాడులలో పాల్గొన్నారు. కొన్ని దాడులను మినహాయిస్తే, మిగతా అన్నిటిలోనూ, మతయుద్ధాలలో `షహీద్’ అనగా `అమరులు’ అనిపించుకోవాలని  మోప్లా జిహాదీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.  (1921-22లో పూర్తిస్థాయి మోప్లా జిహాద్ జరిగిoది). ప్రత్యక్ష దాడులలో పాల్గొన్న 350 మోప్లాలలో 322మంది చనిపోగా, 28మంది పట్టుబడ్డారు. ఆత్మాహుతి దాడులకు, కొన్ని వారాల ముందుగానే, ప్రణాళికకు అనుగుణంగా మతపరమైన తంతులు జరిగేవి.


33 సంఘటనలలో 9దౌర్జన్యాలు, గ్రామీణ వర్గపోరాటాలలో భాగంగా పాదుచేసి, పెంపొందించబడ్డాయి. మూడు వ్యవసాయ సంబంధిత గొడవలుగా జరిగాయి. వ్యవసాయ కలహాలకు సంబంధం లేకుండా, 13 ఇతర దౌర్జన్యాలు జరిగాయి; వాటిల్లో నాలుగు వ్యక్తిగత గొడవలైతే, రెండు బ్రిటిషు కలెక్టర్లపై దాడులు- ముస్లిం మతపెద్ద బహిష్కరణ కారణంగా ఒక దాడి జరిగితే, రెండవది- బలవంతపు మతమార్పిడినుంచి ఒక  హిందూ యువకుడిని కాపాడినందుకు జరిగింది. మూడు ఘటనలలో, ఇస్లాంకి `మతద్రోహం’ చేసిన కారణంగా, ఆయా హిందువుల కుటుంబాల హత్యలు జరిగాయి. ఎనిమిది కేసుల్లో, దాడులకు కారణం తెలియలేదు. మోప్లా దౌర్జన్యాలకి, జిహాద్ బోధించే `సయ్యద్ ఫాజి’ (1820-1901)వంటి మతప్రచారకులు ప్రధాన కారణాలు. ఈ మతబోధకులు రెండు రకాలు- `తంగల్’- సాధారణంగా వీరు అరేబియావారు, వీరు పెద్ద మసీదుల్లో ఉండే  `కాజీ/లేక ఇమాం’లు; మరియు `ముస్సలియార్స్’ అనగా తక్కువ చదువుకున్న `కురాన్’ బోధకులైన `ముల్లా’లు .
    పాత మోప్లా అల్లర్లను కేవలం ఆర్థిక కారణాలు ప్రభావితం చేసాయి అనలేము. గ్రామీణ వ్యవసాయ తగాదాలు, భూములనుంచి వెళ్ళగొట్టబడటం ఒక కారణం. 1862-1880కాలంలో ఇదే విధంగా వాళ్ళ భూములనుంచి వెళ్ళగొట్టబడినవారు మూడింట-రెండొంతులమంది హిందూ వ్యవసాయకులాలైనా, చాలాకాలంపాటు  ఉండుండి రాజుకునే గ్రామీణ హింస కొనసాగలేదు. అదీగాక, ఇటువంటి `జప్తు ఆదేశాలు’ జారీ అవుతున్న కొద్దీ మోప్ల్లా అల్లర్లు పెరగలేదు, అది ప్రధాన కారణం అని చెప్పలేము. నిజానికి ఈ వాదనకి విరుద్ధంగా,  1862-1880మధ్య పద్దెనిమిది సంవత్సరాల కాలంలో, విపరీతంగా `జప్తు డిక్రీలు’ 1891 నుంచి 8335 దాకా జారీఅయిన కాలంలో, మూడు అల్లర్ల సంఘటనలు మాత్రమే జరిగాయి. చివరిగా, మోప్లాలు జిల్లా అంతా ఉన్నా, ఒక్కటి తప్ప, మిగతా అన్ని అల్లర్లు దక్షిణప్రాంతాన ఉన్న తాలుకాల్లో మాత్రమే జరిగాయి.  in which kingd
     పైన చెప్పబడిన మోప్లా అల్లర్లకు, 1921-22జిహాద్ కి మధ్య, ప్రధాన వ్యత్యాసం ఖిలాఫత్ ఉద్యమం అందించిన కీలకమైన  సైద్ధాంతిక మరియు సంస్థాగత బలం. అంతకుముందునుంచి జరుగుతున్న మతపరమైన తీవ్రవాద అల్లర్లకు, సాంఘిక ఘర్షణలకు ఇది ఊతమిచ్చింది.


మోప్లా జిహాద్ బీజాలు
ఎర్నాడ్ తాలూకాలోని మంజేరిలో 28 ఏప్రిల్ 1920న జరిగిన `మలబార్ జిల్లా సమావేశం’లో జారీ అయిన తీర్మానంతో లాంఛనంగా ఖిలాఫత్ ఉద్యమం మలబార్ జిల్లాలో ప్రవేశపెట్టబడింది. 1000మంది పైగా ప్రతినిధులు, వారిలో అధికశాతం మోప్లాలు, హాజరైన ఈ సమావేశం, `టర్కిష్ దేశం’ నుంచి రేకెత్తిన ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం పరిష్కారం జరపించాలని కోరింది. అలా ప్రభుత్వం నిర్ణయం చేయని పక్షంలో “మౌలానా షౌకత్ అలీ అధ్యక్షతన అంతకు ముందు మద్రాసులో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో తీర్మానించినట్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయనిరాకరణ విధానం ప్రారంభించాలని ప్రజలను కోరుతున్నామని” ప్రకటించారు. (Nair, ibid, p. 8).
   గాంధీగారు, షౌకత్ అలీ కలిసి  18ఆగస్ట్ 1920న కాలికట్ సందర్శించి, ఖిలాఫత్ మరియు సహాయనిరాకరణ గురించి ప్రసంగించారు, ఆ తరువాత మలాబార్ ప్రాంతమంతా ఖిలాఫత్ కమిటీలు ఏర్పాటు చేసారు. పూర్తిస్థాయిలో జిహాద్ అల్లర్లు ప్రారంభమైన కాలానికి కొంచెం ముందుగా, కొన్ని నెలలపాటు అన్ని మోప్లా కేంద్రాలలో భారీ ఎత్తున ఖిలాఫత్ సమావేశాలు నిర్వహించారు. (Nair, ibid, pp. 8-10).
    15 ఫిబ్రవరి1921న, మద్రాసు ఖిలాఫత్ నాయకుడు యాకుబ్ హసన్, కాలికట్లోఖిలాఫత్ మరియు సహయనిరాకరణ సమావేశాలలో ప్రసంగించడానికి రాగా, అతనిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్య మోప్లాలకు ఆగ్రహం కలిగించింది  (Nair, ibid, pp. 12, 15-16). మతబోధకులు గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణించి ఖిలాఫత్ ప్రచారం చేస్తూ ఉండేవారు, అఫ్ఘాన్లు రాబోతున్నారు అనే గాలివార్తలు అన్ని దిక్కులా పాకించారు. స్వంత రాజ్యం రాబోతోంది అనే యోచన ప్రచారం చేస్తూ, ఖిలాఫత్ నాయకులు పేద మోప్లాలకి భూములు కూడా కేటాయించారని వినికిడి, ఎప్పుడు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందో, అప్పుడేవారు భూములను పూర్తిగా స్వంతం చేసుకోగలరు అని నమ్మారు.  మౌలానా మహమ్మద్ అలీ మద్రాసు ప్రసంగ కరపత్రాలు మలబార్లో ముద్రించగా జిల్లా అధికారగణం దాన్ని నిషేధించింది (Hardgrave, ibid, p. 71).


జిహాద్ కి అనుకూలమైన వ్యవస్థాగత అంశాలు
అన్ని మోప్లా కేంద్రాలలోనూ ఒక ఖిలాఫత్ సంస్థాగత వ్యవస్థ ఉండేది, దానికొక అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతర సభ్యులు కల పూర్తి కేంద్రాలుగా ఇవి పనిచేసేవి. ఈ ఖిలాఫత్ కేంద్రాల సంఖ్య ఖచ్చితంగా తెలియదుగానీ, కేవలం ఎర్నాడ్ పొన్నాని తాలుకాల్లోనే 100కు పైగా కేంద్రాలు పనిచేసేవని అంచనా (Nair, ibid, p. 16, 18).  ప్రతి గ్రామంలోనూ ఖిలాఫత్ కేంద్రాలుండేవి, అలాగే అన్ని గ్రామాలమధ్య సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండేది, అన్ని గ్రామాల పురుషుల్ని ఒక  దగ్గర చేర్చాలంటే నిమిషాలలో ఆ పని జరిగిపోయేది. మసీదులు సామూహిక ప్రార్థనా కేంద్రాలుగా పనిచేస్తాయి కాబట్టి, కేంద్రీకృతమైన ముస్లిం స్థావరాలుగా ఇవి పనిచేసేవి. మలాబార్లో హిందువులు దీనికి భిన్నంగా అక్కడక్కడా చెల్లాచెదురుగానే ఉండేవారు. (Hardgrave, ibid, p. 72).
      అప్పటి జిల్లా బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ ఆర్.హెచ్ హిట్చకాక్, “ఖిలాఫత్ ఉద్యమ వ్యవస్థకన్నాకూడా, మాప్పిల్లాలలో (ముస్లింలు) ఉన్న సమాచారవ్యవస్థ చాలా బలమైనది. హిందువులకి ముస్లిములకి ఇదే ముఖ్యమైన వ్యత్యాసం. చాలా బజార్లు పూర్తిగా మాప్పిల్లాలతో నిండిఉంటాయి, పైగా వారు ప్రతి శుక్రవారం, ఇంకా వారంలో చాలాసార్లు కూడా, మసీదుల్లో భారీసంఖ్యలో గుమిగూడతారు.  కాబట్టి వారికి వారి సొంత ప్రయోజనాల కోసం అక్కడ ప్రజాభిప్రాయం కూడగట్టడం కష్టం కాదు, అందునా అది మసీదుల్లో మతం ముసుగులో జరిగే వ్యవహారం కాబట్టి, బ్రిటిషువారికి గాని, హిందువులకి గానీ తెలిసే అవకాశం లేదు. ఎప్పుడో ఒక పండుగ అప్పుడు తప్ప హిందువులు కలుసుకోరు” (A History of the Malabar Rebellion, R.H. Hitchcock, Government Press, Madras, 1921, p.3).

రకరకాల ఆయుధాలతో మోప్లాలు సాయుధులుగా తయారయారు. కొమ్ముల్లాగా మెలితిరిగి, మొనదేలిన, రెండువైపులా పదునున్న రెండడుగుల పొడవున్న కత్తులు; ఒకటిన్నర అడుగుల వేట కత్తులు, మోప్లా చాకులు, మూడడుగుల ఈటెలు, బల్లేలు, లాఠీలు, గొడ్డళ్ళు మొదలైనవన్నీ సమకూర్చుకునారు.  (The Mapilla Rebellion 1921-1922, G.R.F. Tottenham, Government Press, Madras, 1922, p. 36).


మలబార్ ప్రాంతమంతా చుట్టూరా, అంతర్భాగం కూడా  కొండలు గుట్టలతో నిండిఉంటుంది, అందువల్ల జిహాదీలను పట్టుకోవడం చాలా కష్టం. జిహాదీలు గుంపులుగా విడిపోయి, గెరిల్లా పద్ధతుల్లో జిహాద్ జరుపుతూ ఉండడంతో, వారిని పట్టుకోవడం దుర్లభమైపోయింది (Tottenham, ibid, p. 38).
   స్థానిక పోలీసులు కూడా చాలామంది మోప్లాలు అవడంతో, పరిస్థితిని అదుపులోకి తేలేకపోయారు. జిహాదీలు పోలీసు స్టేషన్లపై దాడి చేసి, పోలీసులనుంచి ఎటువంటి ఎదురుదాడి లేకపోవడంతో, అక్కడినుంచి ఆయుధాలు ఎత్తుకెళ్ళిపోయేవారు (Nair, ibid, p. 71; also Tottenham, ibid, p. 7).
   చివరిగా, అతిముఖ్యంగా, హిందూ-ముస్లిం ఐక్యత అనే శుష్క నినాదాలతో, హిందువులు స్తబ్దుగా నిద్రాణంగా ఉండేవారు. టోట్నహాంమ్ వ్రాస్తూ, “మహాత్మాగాంధీ అహింస అనే ఒరలో, ఇస్లాం హింసాత్మక ఖడ్గం ఖణఖణమని వినిపించేలా మ్రోగింది.  మాపిల్లాలు నిదానంగా ఇళ్ళకెళ్ళి తమ నాగళ్ల మొనలను ఇస్లామియా కత్తిలోకి, రంపాలను యుద్ధ-చాకులలోనికి ఎలా జొప్పించాలో ఆలోచించేవారు. అల్లర్లు చెలరేగగానే, అహింస అనే ముసుగు తొలగిపోయేది. అయితే ఈ మాపిల్లాల మనస్తత్వం అర్థం చేసుకోలేని హిందూ యువకులు మాత్రం ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఉద్యమం కొనసాగిస్తూ ఉండేవారు (Tottenham, ibid, p. 3).


జిహాదీల మూకుమ్మడి అకృత్యాలు
ముందుగా కొన్ని గణాంకాలు! 20ఆగస్ట్ 1921న జిహాద్ అల్లర్లు ప్రారంభమైనాయి. 26ఆగస్ట్ న సైనిక శాసనం విధించి, తిరిగి 25పిబ్రవరి 1922న దానిని ఎత్తివేశారు. చివరి మోప్లా నాయకుడు n which kingdఅబూబక్ర్ ముసలియార్ పట్టుబడడంతో, 30జూన్ 1922న ఎట్టకేలకు జిహాద్ ముగిసిందని చెప్పవచ్చు. సెప్టెంబర్-డిసెంబర్ 1921మధ్యకాలంలో జిహాద్ తీవ్రంగా సాగింది. కేంద్ర శాసనసభ చర్చల్లో, అప్పటి హోం సెక్రెటరి `సర్ విలియం విన్సెంట్’ సమాధానమిస్తూ “మద్రాసు ప్రభుత్వ నివేదిక ప్రకారం, బలవంతపు మతమార్పిడిలు కొన్నివేలల్లో జరిగాయని తెలుస్తోంది, అయితే అందరికీ విదితమైన కొన్ని కారణాల వల్ల, ఖచ్చితమైన సంఖ్య ఎప్పటికీ తెలియదు” అన్నారు ”(Pakistan or the Partition of India, B.R. Ambedkar, Thacker and Company Limited, 1945, p. 148).
      మొత్తం 20,800హిందువులు హత్యచేయబడ్డారు, 4000మందిని కత్తులతో భయపెట్టి ముస్లిములుగా మతమార్పిడి చేయడం జరిగింది.  లక్షలాదిమంది హిందువులు ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.  2,339 మోప్లాలు చంపబడగా,  1,652మంది బ్రిటిషు తూటాలకు గాయపడ్డారు. 39,338 జిహాదీలపై కేసులు నమోదు చేయబడగా, 24,167 జిహాదీలపై విచారణలు జరిగాయి. (Maharashtra Hindusabhechyakaryacha itihas, Marathi, S.R. Date, Pune, 1975, pp.21, 22).  1000కి పైగా దేవాలయాలు పూర్తిగా ధ్వంసం లేక అపవిత్రం చేయబడ్డాయి (Nair, ibid, p.88). జీహాదీ అల్లర్ల ప్రారంభంలో కాలికట్, మలాప్పురంలో సాయుధ దళాల సంఖ్య 210 ఉండగా, ప్రభుత్వం జిల్లాలో `మలాబార్ ప్రత్యేక పోలీస్’దళాలను ఏర్పాటు చేయడంతో, ఆ సంఖ్య 600 చేరుకుంది (Nair, ibid, p. 39). జిహాదీ అల్లర్లలో  సైనిక మరియు మలాబార్ ప్రత్యేక పోలీసుల మృతుల సంఖ్య 43, మరో 126 గాయపడ్డారు; అదనంగా జల్లా పోలీసు, రిజర్వ్ పోలీసుల మృతుల సంఖ్య మరో 24, గాయపడ్డవారు 29 (Tottenham, ibid, p. 48, 53, 414, 425).

మోప్లా జిహాద్ అల్లర్ల లక్షణాలు చిరపరిచితమైనవే ( జామోరిన్ మహారాజు కాలికట్ సమావేశాలు- Proceedings of the Conference at Calicut, రచన Sir C. Sankaran Nair, ibid, p. 138)
 1. స్త్రీలను క్రూరంగా అవమానించడం
 2. మనుషులను కాల్చి, చర్మం ఒలచడం
 3. ఆడవారు, మగవారు, పిల్లలను మూకుమ్మడిగా ఊచకోత కోయడం
 4. మొత్తం కుటుంబాలనే సజీవంగా కాల్చడం
 5. వేలాదిమంది బలవంతపు మతమార్పిడిలు, వద్దని మొండికేసినవారిని నరకడం
 6. మనుషుల్ని సగం చంపి, బావుల్లో పడేస్తే, వారు కొన్ని గంటలపాటు తప్పించుకోడానికి పోరాడి, చివరికి యాతనతో బలైపోయేవారు.
 7. చాలామందిని సజీవంగా కాల్చి చంపేవారు. అల్లర్ల ప్రాంతాల్లో, హిందూ క్రిస్టియన్ ఇళ్ళను దోచుకునేవారు, ఈ దౌర్జన్యాలలో మోప్లా స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొనేవారు. హిందూ మహిళల వస్త్రాలు కూడా ఊడదీసేవారు, ఒక్కమాటలో చెప్పాలంటే, మొత్తం ముస్లిమేతర జనాభాను నిస్సహాయులుగా అనాధలుగా చేసేవారు.
 8. హిందువుల మతవిశ్వాసాలపై ఘోరంగా దాడిచేసి క్రూరంగా అవమానించేవారు; హిందూ దేవాలయాలను ధ్వంసంచేసి, అపవిత్రం చేసి, ఆ దేవాలయాలలోనే గోవధ చేసి, గోవుల రక్తమాంసాలను దేవుడి విగ్రహాలపై కప్పేవారు, పుర్రెలను గోడలకి పైకప్పులకి వేళ్ళాడేసేవారు.
చాలామంది ముస్లిం నాయకులు తమను తాము ఖిలాఫత్ రాజులుగా, గవర్నర్లుగా ప్రకటించుకుని, హిందువుల ఊచకోతను నిర్దేశించి నిర్వహిస్తుండేవారు. అలీ ముసలియార్, వరియన్కున్నత్ కున్హంమ్మద్ హాజిరాజా, సి.ఐ.కోయతంగల్ వీరిలో ముఖ్యులు. కోయతంగల్ ఏటవాలుగా ఉన్న కొండగుట్టల్లో, చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చే  4,000మంది అనుచరులతో సభ జరిపించేవాడు. ఒకసారి సైన్యానికి సాయపడుతున్నారనే నెపంతో, చేతులు వెనక్కి కట్టేసిన 40మంది హిందువులను పట్టుకురాగా, వారిలో 38మందికి తంగల్ `మరణశిక్ష’ విధించి, స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అమలుచేసాడు. అతని అనుచరులు నిస్సహాయులైన వారి గొంతులు తెగ్గోసి, వారి విగత శరీరాలను బావిలో పడేసారు  (Nair, ibid, pp. 76-80).  సా.శకం 627 `ట్రెంచ్ యుద్ధం’లో, `మహమ్మద్ ప్రవక్త’ నాయకత్వం వహిస్తున్న ఇస్లామియా సైన్యo, `బాను కురయ్జా’ అనే యూదు తెగవారిని, ఇదేవిధంగా మట్టుపెట్టిందనేది గమనార్హం.


లౌకికవాద మాయాజాలం
మోప్లా జిహాద్ బలాత్కారాలు, హత్యలు, ఇతర ఆకృత్యాలను, వాటికి లేని లక్షణాలు ఉద్దేశాలు ఆపాదించి, ఏదోవిధంగా సమర్ధించడానికి లౌకికవాదమనే భ్రమ కల్పించి అల్లబడిన కుహనా `లౌకిక’ కధనాలను, నిశితంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది.  ప్రభుత్వం చాలాముందుగానే 1852లో, మోప్లా దౌర్జన్యాలు అల్లర్ల అసలు కారణాలు గుర్తించడానికి,  `టి.ఎల్. స్ట్రేంజ్’ని మలబార్ `ప్రత్యేక కమిషనర్’గా నియమించింది. ఆయన తన నివేదికలో ఇలా వ్రాసారు, “కౌలుదార్లకు ఇబ్బందులు ఎదురయే సందర్భాలు ఎన్నో రావచ్చు, వచ్చాయి కూడా; అయితే హిందూ భూస్వాములు వారి కౌలుదార్లతో, వారు హిందువులైనా లేక మోప్లాలైనా, ఎంతో సఖ్యంగా, ఓర్పుతో, న్యాయసమ్మతంగా ఉంటారని నేను గమనించాను, అదే నమ్ముతున్నాను. దక్షిణ మలబార్ తాలూకాల్లో, ఎక్కడైతే అల్లర్లు సర్వ సాధారణంగా జరుగుతున్నాయో, అక్కడ మోప్లా కౌలుదార్లు,  వారి బాధ్యతలు గాలికొదిలేసి, తప్పుడు కేసులతో తప్పించుకుంటునట్టు తెలుస్తోంది. బాగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో, హిందూ యజమానులు ఎంత భయాందోళనల్లో జీవిస్తున్నారంటే, మోప్లాలు కౌలు కట్టరు, వీరు కట్టమని కూడా అడగరు, కౌలుదార్లుగా తొలగిస్తే ఏమి ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆ పని కూడా చేయలేరు” (Nair, ibid, p.6).
     పూర్తి జిహాద్ గా రూపాంతరం చెందేముందు కూడా, మోప్లాలు నిమ్నకులమైన `తియ్యా’లపై దాడి చేసిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ముస్లిం భావజాలానికి అనుగుణంగా, మోప్లాలు తియ్యాలు నడిపే స్థానిక `కల్లు’ దుకాణాలపై దాడి చేసారు (Hardgrave, ibid, pp. 70, 71).


లౌకికవాద మాయాజాలం ఎన్నో దశాబ్దాలుగా చెప్తున్న కుహానా కధనం ప్రకారం మోప్లా జిహాద్ నిజంగానే బ్రిటిష్ వలసపాలనకి వ్యతిరేకంగానో లేక శ్రామికవర్గాల పోరాటమో అయితే, హిందువుల బలవంతపు మతమార్పిడిలు, దేవాలయాల విధ్వంసం ఎందుకు జరిగాయి? మసీదులు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి! అయితే హంతకులు మాత్రం ఎక్కడా వారి జిహాదీ చర్యలకు లౌకికవాద ముసుగు ఎప్పుడూ వెయ్యలేదు. ఇద్దరు మహానాయకులు వారి వారి ధోరణిలో మోప్లాల చర్యలకు, ఇస్లామియా ప్రేరణే కారణం అని చెప్పడం విశేషం. వారిది లౌకికవాదమని వారివురూ అనలేదు. గాంధీగారు “మోప్లాలకు దేవునియందున్న భయభక్తుల కారణంగానే వారు తమ మతం కోసం ఈ చర్యలకు పాల్పడ్డారు, వారు దేనినైతే మతపరమైన యుద్ధం అని భావించారో అదే చేసారు” అన్నారు. డా. అంబేద్కర్ “బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామియా రాజ్యం స్థాపించడమే వారి ధ్యేయం” అని అభిప్రాయపడ్డారు (Ambedkar, ibid, pp. 148, 153).
    సైద్ధాంతిక నిరంకుశత్వానికి మొదటగా బలైపోయేది సత్యమే. మోప్లా తిరుగుబాటు కాదు, విప్లవం కాదు, పోరాటం కాదు, కేవలం నిఖార్సయిన జిహాద్!

ఇదీ చదవండి - తొమ్మిదో భాగం :వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు  

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

ప్రకటన : “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
 1. మొదటి భాగం: ఖిలాఫత్ ఉద్యమం: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?
 2. రెండవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు
 3. మూడవ భాగం: ఖిలాఫత్ ఉద్యమానికి ముందు వందేళ్లు
 4. నాల్గవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?
 5. ఐదవ భాగం: మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు
 6. ఆరవ భాగం: బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం (1857-1919)
 7. ఏడవ భాగం: విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై)
 8. ఎనిమిదవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: బెదిరింపులు.. మారణకాండ
 9. తొమ్మిదో భాగం : వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు  
మూలము: విశ్వ సంవాద కేంద్రము
{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top