విజయదశమి ఉత్సవం -వైశిష్ట్యం - Vijayadasami

Vishwa Bhaarath
0
 సరస్వతీ పూజ
విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే, మన ఆత్మ వ్యక్తీకరించిన భావం అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుంది.

(భారతీయ సంస్కృతి కోశము,  సంపుటం 4, పేజి 319, 320)
  • ➣ శ్రీరాముడు విజయదశమిన రావణుడిని సంహరించి విజేతగా నిలిచిన రోజుగా పరిగణిస్తారు.
  • ➣ దసరా పండుగ విజయానికి సాహసానికి ప్రతీక, రాజులకు ఇతరులకు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పబడింది. అజ్ఞ్యాత వాసానికి ముందు అర్జునుడు తన ఆయుధాలను శమీ వృక్షంలో దాచి ఉంచాడు. విరాటరాజు గోవులను కౌరవులు మళ్లిస్తుండగా అర్జునడు ఆయుధాలను తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించాడు. విజయదశమి రోజున తమ ఆయుధాలను కాపాడినందుకు పాండవులు శమీపూజను, దుర్గాదేవి పూజను నిర్వహించారు, అప్పటినుంచి దసరా నాడు శమీపూజ, ఆయుధపుజ ఆచారం కొనసాగుతూ వస్తోంది.
  • ➣ పురాతన కాలంలో, వర్షాకాలం మొదటి పంట తరువాత రైతులు విజయదశమిని వ్యవసాయ ఉత్సవoగా జరుపుకునేవారు. ఇప్పటికి పలు ప్రాంతాల్లో, ఘటస్థాపన (కుండ) చేసి, నవధాన్యాలు మొలకలెత్తించి, దసరా నాడు వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంటి ద్వారబంధాలను ధాన్యంతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమితో వ్యవసాయ రుతువు ప్రారంభించి తల్లి భూదేవిని మంచి పంట, శాంతి సంపదలకోసం ప్రార్థిస్తారు.
(భారతీయ సంస్కృతి కోశము,  సంపుటం 4, పేజి 319, 320)
మధ్వాచార్యులు మరియు విజయదశమి
ఆశ్వయుజమాసం విజయదశమి రోజు దక్షిణ కనరా జిల్లా ఉడిపికి సమీపాన ఉన్న గ్రామంలో 1238సం. లో మధ్వాచార్యులు జన్మించారు. ఈయన తండ్రి భాగవత పోరాణిక సంప్రదాయ వంశంవాడైన సద్బ్రాహ్మణడు. 
  • ➣ వేలు నచియార్ మరియు కుయిలి:1857ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి 85సం ముందే బ్రటిషు వారిని ఎదిరించి పోరాడిన వీరవనిత.
  • ➣ ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా 1925విజయదశమి రోజే డా. హెడ్గెవార్ స్థాపించారు. వీరసావర్కర్ కి శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎనలేని భక్తి. వారిరువురూ సైన్యాధికారులేకాక, ఈ దేశానికి గొప్ప నాయకులని ఆయన అనేవారు. 1909లో విజయదశమి పండుగ లండన్లో జరుపుకుంటూ `శ్రీ రాముడు తండ్రి మాటను నిలబెట్టడమే కాక, రాక్షసులను సంహరించాడు. శ్రీ రాముడు అంతిమ యుద్ధంలో, ధర్మానుసారం రావణుడిపై విజయం సాధించిన ఘట్టం అత్యుత్తమమైనది’ అన్నారు.
( ‘ఉత్తరభారతంలో  హిందూ మహాసభ1915-1930: దేశ నిర్మాణం’ గ్రంథం – ప్రభు బాపు)
  • ➣ 23 అక్టోబర్ 1931 దసరా పర్వదినాన, ఏ.బి. శెట్టి నేతృత్వంలో కొందరు రైతులు కలిసి `విజయా బాంక్’ స్థాపించారు. విజయదశమి రోజు స్థాపన కాబట్టి విజయా బాంక్ అనే పేరు పెట్టారు.
  • ➣ 14 అక్టోబర్1956 విజయదశమి రోజున, మహారాష్ట్ర నాగపూర్దీక్షాభూమిలో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు.
సరస్వతీ పూజ - విద్యారభం
భారతదేశములో, ముఖ్యంగా కేరళ కర్ణాటకలలో విజయదశమి రోజున సరస్వతీ పూజ చేసి విద్యారంభానికి నాంది పలుకుతారు. పిల్లలకు భాష, సంగీతo, నృత్యం ఇతర కళలు నేర్పించడానికి నాందిగా బియ్యంలో లేక ఇసుకలో. తండ్రి లేక కుటుంబ పెద్ద మంత్రం వ్రాసి ప్రారంభిస్తారు.
ధాకేశ్వరి ఆలయం- బాంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ధాకాలో `ధాకేశ్వరి’ ఆలయం మరియు రామకృష్ణ మిషన్లో  ఐదు రోజులపాటు విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు.
UNESCO-విజయదశమి
UNESCO సంస్థ విజయదశమి ఉత్సవాన్ని `మానవాళి సాంస్కృతిక వారసత్వo’గా 2008లో ప్రకటించి వ్రాయించి నమోదు చేసింది.
ఆయుధ పూజ - అస్త్రపూజ ప్రాధాన్యత
తొమ్మిదో రోజైన నవమి రోజున, అమ్మవారి అనుగ్రహం కోసం అస్త్ర- శాస్త్రాల పూజ నిర్వహించి  విజయదశమి రోజున ఉపయోగిస్తారు. దేశమంతా ఈ పూజ నిర్విహిస్తారు, ముఖ్యంగా రాజకుటుంబాలు, కలరిపయట్టు వంటి యుద్ధశాస్త్రం బోధించే పాఠశాలలు, అస్త్రాలను ఉపయోగించే సైన్యాలు, భద్రతా దళాలు, పోలీసు శాఖ ఘనంగా ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఆవిర్భావo సమయం నుంచి భారత సైన్యం ఆయుధపూజ నిర్వహిస్తూనే ఉంది.
ఆయుధ పూజ – వివిధ సంప్రదాయాలు
విజయదశమి పర్వ దినం ఎన్నో సంప్రదాయాలతో మమేకమై ఉంది. మహిషాసుర మర్దన జరిపిన శ్రీ దుర్గాదేవి, రావణుడిని సంహరించిన శ్రీ రాముడు మనకు తెలుసు. అలాగే అర్జునుడు శమీ వృక్షం నుంచి ఆయుధాలను తీసుకుని కౌరవులతో యుద్ధం చేసి అజ్ఞ్యాత వాసాన్ని ముగిస్తాడు. ఈ మహాభారత ఘటనని పురస్కరించుకుని మైసూరు మహారాజు అంబారీ ఏనుగులమీద నగరంలో ప్రయాణించి బన్నిమండంపం (శమీ) వెళ్లి ప్రపంచ ప్రఖ్యాతమైన మైసూరు విజయోత్సవం నిర్వహిస్తారు.
    సిక్ఖులకి కూడా దసరా అతిముఖ్యమైన పండుగ. గురు గోబింద్ సింగ్ `శస్త్ర పూజ/కత్తి పూజ’ తో సహా  `చండీ-ది-వార్’ పఠీoచడంపై శ్రద్ధ చూపించారు.  సిక్ఖుల పవిత్ర గ్రంథం `దశమ గ్రంథం, ఐదవ అధ్యాయంలో `చండీ పూజ’ ఉంటుంది. పరమ శక్తివంతమైన `దేవీ మహాత్మ్యం’ ఉన్న సంస్కృత మార్కండేయ పురాణంలో ఇంద్రాది దేవతలు, శుంబ నిశుంభుల మధ్య జరిగే యుద్ధంలో, జగన్మాత అస్త్ర యుద్ధం చేస్తూ కనిపిస్తారు. `చండీ-ది-వార్’ శక్తివంతమైన చండీ, భగవతీ స్తోత్రాలతో ఉండి, వీర యోధులైన `నిహంగ్ సిక్ఖులకి’ పవిత్రమైనది.

గురు గోబింద్ సింగ్ 
    కొందరు వామపక్ష ప్రొఫెస్సర్లు పనిగట్టుకుని `ఆర్య’ దుర్గాదేవి, `ద్రవిడ’ మహిషాసురుడిని చంపిందని, కాబట్టి `ఆయుధ పూజ’- `ఆర్యుల దౌష్ట్యం’ అని చెప్పి అనవసరమైన దౌర్భాగ్య రాద్ధాంతాన్ని సృష్టించారు. అయితే సంగమ సాహిత్యంలోని `కొట్రవై’ యుద్ధ దేవత, శుంబ-నిశుంభులను సంహరించిన `చండీదేవి’ని, `నిశుంభసూదిని’ గా తమిళనాడు అంతా పూజిస్తారు, కుంబకోణం వద్ద `విజయాలయ చోళ’ చక్రవర్తి `నిశుంభసూదిని’ ఆలయాన్ని నిర్మించాడు.తమిళనాడులో `మురుగన్’ కూడా యుద్ధ-దేవుడే, జనవరి-ఫెబ్రవరిలో వచ్చే `పూసం’ ఉత్సవం, పార్వతీదేవి తన తనయుడు కుమారస్వామికి, తన శక్తీని ధారపోసి `బల్లెం’ అస్త్రాన్ని సృష్టించి ఇస్తుంది, దానితో అసురులను చంపి, దేవగణాలకు విజయం చేకూర్చాలని కోరుతుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచమంతా తమిళులు ఉత్సాహంగా జరుపుకుంటారు. మురుగన్ `బల్లెం’, శ్రీ మహావిష్ణువు `సుదర్శన చక్రా’లను దేవతా మూర్తులుగా పూజించే సంప్రదాయం మనకు ఉంది.
బాలస్కందుడు
  • `ఆయుధ పూజ’ సంప్రదాయం, హిందూ మతం గురించి ఏమి తెలియచేస్తుంది? ఇది ముఖ్యంగా సనాతన హిందూ సంప్రదాయానికి, పశ్చిమ `అబ్రాహాము’ మతాలకి భేదం స్పష్టంగా చూపిస్తుంది. మరీ ముఖ్యంగా, హిందూ మతంలో హింస-అహింసల విధానం సూచిస్తుంది. హిందూ మతం యుద్ధ దేవతలను, అస్త్రాలను ఆరాధించి వారినుంచి స్ఫూర్తి పొందుతుంది; అలాగే యోగ సాధకులకు స్ఫురించే పరమార్థం కూడా ఇందులో ఉంది, దేవాసురుల యుద్ధం-మహిషాసుర సంహారం, మానవుడు తనలోని తామసగుణాలను నిర్మూలించే మార్గంగా బోధిస్తుంది. పార్వతీదేవినుంచి `బల్లెం’ అస్త్రంగా పొందిన `మురుగన్’ అద్వైతానికి ప్రతీకగా నిలుస్తాడు, ఆయన మహాశివుడికే `ఓం’ పరమార్ధాన్ని బోధించి `స్వామినాధుడు’ అవుతాడు.
  • ‘అబ్రాహాము’ మతాలలాగా కాకుండా, హిందూ మతం, భగవంతుడి సృష్టి అయిన సమస్త జీవరాశిలో `దైవత్వాన్ని’ చూస్తుంది. కాబట్టి మన దైనందిన అన్ని కార్యాలలోనూ దైవత్వం గోచరిస్తుంది, ప్రతి `పని’ దైవానికి ప్రతిరూపమే, అలాగే ఆయుధపూజ కూడా పనికి `కర్మయొగా’నికీ ప్రతీక. ఆయుధం అంటే అస్త్రాలు మాత్రమే కాదు, మనం పనికి ఉపయోగించే అన్ని పనిముట్లు మనకు ఆరాధనీయాలే. రైతుకు నాగలి, సంగీతకారులకి తమ సంగీత వాయిద్యాలు, విద్యార్థులకి పుస్తాకాలు, కార్మికులకి యంత్రాలు, సైనికులకి ఆయుధాలు అన్నీ మనకు ముఖ్యమే.
  • ఆయుధ పూజ సంప్రాదయం కలిగిన హిందూ మతం యుద్ధాన్ని హింస-అహింసలను ఏ విధంగా చూస్తుంది? ధర్మ-అర్థ-కామ-మోక్షాలు `పురుషార్థాలు’ అనగా లక్ష్యాలుగా ఉన్న హిందూ మతం, ధర్మమార్గంలో మాత్రమే మిగతా అన్నీ లక్ష్యాలు పొందవచ్చని బోధిస్తుంది.  అవసరమైతే యుద్ధం చేయడం సైనికుని ధర్మం, అలాగే పాలకులు సమాజ సంక్షేమం కోసం ధర్మాన్ని నెలకొల్పాలి. ఈ రకమైన దైవం-ధర్మం విజ్ఞ్యత, మనకు అస్త్ర-శస్త్ర వినియోగంలోనూ కనిపిస్తుంది, యుద్ధాలు ధర్మ మార్గంలోనే జరిగేవి, సైన్యo యుద్ధం చేసేది కాని, సమాజంలోని మిగతా వర్గాల ప్రజలు కాదు.
  • 4వ శతాబ్దం BCEలోనే, గ్రీకు రాయబారి `మెగస్తనీస్’ చంద్రగుప్త్ర మౌర్యుని కాలంలో, మౌర్య సైన్యం శిక్షణ, క్రమశిక్షణ గురించి పొగుడుతూ వ్రాసాడు; `సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఓక దిశలో యుద్ధం చేస్తుండవచ్చు, అయినా పూర్తి భద్రతతో అదే ప్రాంతంలో రైతులు పొలం దున్నుతూ ఉంటారు. యుద్ధం సైనికుల ధర్మం, వ్యవసాయం రైతుల ధర్మం’ అని వ్రాసాడు.
  • 9వ శతాబ్దంలో  అరబ్ వ్యాపారి `సులేమాన్’ భారత్ గురించి వ్రాస్తూ, `ఒక రాజ్యం ప్రజలు ఇంకొక రాజుకు ఎపుడూ దాసోహం అనరు, యుద్ధంలో విజేత అయిన రాజు, పరాజితుడైన రాజపరివారంలోని వ్యక్తినే రాజుగా నియమిస్తాడు, విజేత పేరుమీద అతను రాజ్యం చేస్తాడు, అంతే కాని రాజ్యంలోని ప్రజలు ఎపుడూ యుద్ధంలో బాధితులు కారు’.
  • 1000సంవత్సరాల పైన అంతరం ఉన్న ఈ ఇద్దరి వ్యాఖ్యలను ఆధునిక దృష్టి, పరిజ్ఞ్యానాలతో గమనిస్తే, వాటిలోని ఆదర్శం, ఆధునిక భావాలు మనం చూడవచ్చు. 20వ శతాబ్దపు `జెనీవా యుద్ధ ఒడంబడిక-ఆచరణీయాలు’ మనకు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో కనిపిస్తాయి.  `సంపూర్ణ యుద్ధం’ పేరుతో మన దేశంలో జరిగిన ఇస్లామిక్ మారణహోమానికి, నగరాల దేవాలయాల విధ్వంసానికి, మానభంగాలు, మతమార్పిడులకి, హిందూ సంప్రదాయాలకి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఆయుధాలలో దైవత్వాన్ని చూడగలిగే మన సంప్రదాయం అహింస పరమ ధర్మమని చాటి చెప్పింది. మహాత్మా గాంధి సత్యాగ్రహానికి పునాది అహింస, అయితే హిందూ మతం అన్ని పరిస్థితులలోనూ అహింసే పరమావధి అని చెప్పలేదు. రాజకీయ ఉద్యామానికి - సన్యాసాస్రమ ధర్మమైన అహింసకి ముడిపెట్టడం గాంధీగారి మేధోశక్తికి నిదర్శనం. 
    యుద్ధ సంప్రదాయంలో కాని, భగవద్గీతలో గాని, యుద్ధం ఎదురైనపుడు  అహింస పేరుతో వెనుకంజ వేయడం, అధర్మానికి దారి తీస్తుందని చెప్పబడింది. ఋగ్వేదములోని 6వ మండలం,75వ శ్లోకం, యోధుల `రథా’న్ని ధర్మాన్ని రక్షించే రథంగా కీర్తించిన అమోఘమైన శ్లోకం. రాజనీతి వివరించిన చాణక్యుడి అద్భుత గ్రంథo `అర్ధశాస్త్రం’, ఇతర రాజ్యాలతో దౌత్య సంబంధాల వ్యవహారంలో `సామ, దాన, భేద, దండ’ నీతి పాటించాలని వివరించింది. యుద్ధం చిట్టచివరి మార్గం, అనివార్యమైనపుడు మాత్రమే యుద్ధం జరగాలని సూచించింది. చాణక్యుడు `పరాజితుడైన రాజు తప్పులను ఒప్పుల ద్వారా మార్చాలని, సరియైన విధానాలను రెట్టింపు చేయాలని, సర్వ వేళల రాజు ధర్మమార్గంలో ఉండాలని’ బోధించాడు. ఇటువంటి సమన్వయo, ధర్మాధర్మ విచక్షణ కలిగిన భారత జాతి మనది, ఆయుధపూజ సందర్భంగా `అహింస’ పై మహాభారతంలో చెప్పబడిన అద్భుత పద్యాలను గుర్తు చేసుకుందాము.

अहिंसापरमोधर्मस्तथाहिंसापरोदमः
अहिंसापरमंदानमहिंसापरमंतपः
अहिंसापरमोयज्ञस्तथाहिंसापरंबलम्
अहिंसापरमंमित्रमहिंसापरमंसुखम्
अहिंसापरमंसत्यमहिंसापरमंश्रुतम्
सर्वयज्ञेषुवादानंसर्वतीर्थेषुचाप्लुतम्
सर्वदानफलंवापिनैतत्तुल्यम्अहिंसया
अहिंस्रस्यतपोऽक्षय्यम्अहिंस्रोयजतेसदा
अहिंस्रःसर्वभूतानांयथामातायथापिता
एतत्फलम्अहिंसायाभूयश्चकुरुपुंगव
नहिशक्यागुणावक्तुम्इहवर्षशतैरपि
~ महाभारतम्
(अनुशासनपर्व, अध्याय११७, श्लोक३७ – ४१)

అహింస పరమ ధర్మం, అహింస ఉత్తమ స్వయం-నియంత్రణ
అహింస పరమ ఉదారత, అహింస ఉత్తమ తపస్సు
అహింస పరమ యజ్ఞ్యం, అహింస గొప్ప శక్తి
అహింస ఉత్తమ స్నేహం, అహింస గొప్ప ఆనందం
అహింస పరమ సత్యం, అహింస ఉత్తమ శృతి
యజ్ఞయాగాదులలోని దానాలు, పవిత్ర నదీ స్నానాలు
పవిత్ర గ్రంథాలలోని దానధర్మాలు, ఇవన్నీ కూడా అహింసకి సాటిరావు
అహింస పాటించే మానవుడి తపస్సు అవ్యయం, త్యాగం నిరుపమానం
అహింస పాటించే మానవులు, సమస్త సృష్టికి తల్లిదండ్రులు
అహింస అమూల్యం, దాని గుణగణాలను వర్ణించడానికి నూరు సంవత్సరాలు కూడా సరిపోవు.
భీష్ముడు, అనుశాసన పర్వం, మహాభారతo

రచన: Swami Venkataraman and Rakesh Vaidyanathan
అనువాదం: ప్రదక్షిణ









Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top