సామాజిక రూపశిల్పి దాక్టర్ హెడ్గేవార్ జీ - Dr. K.B. Hedgewar ji

Vishwa Bhaarath
Dr. K.B. Hedgewar ji 
సామాజిక రూపశిల్పి
భారతదేశంలో జాతీయభావాలు ప్రతి ఒక్కరిలో జాగృతం అవుతున్నాయి. అదే సమయంలో జాతి వ్యతిరేక శక్తుల స్వరం కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయతకు ప్రతిరూపం "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కనుకనే కొన్ని శక్తులు సంఘాన్ని కూడా విమర్శిస్తున్నాయి. సంఘానికి మూలం దాక్టర్ హెగ్డేవార్ , ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా సంఘాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.

డాక్టర్ హెడ్గేవార్ ప్రఖరమైన దేశభక్తులు. శ్రేష్టమైన సంఘటనకర్త. ఒక ద్రష్ట (Visionary) సాధారణ వ్యక్తి. కానీ అసాధారణ ప్రతిభాపాటవాలు ఆయన సొంతం. He was deeply rooted in the philosophy culture and history of Bharat and simultaneously had a farsighted vision for future. కనుకనే ఆయన ఒక ద్రష్ట అని చెప్పవచ్చు.
      ఆంగ్ల సామ్రాజ్యం పట్ల ఆయన మనసులో ఎలాంటి వ్యతిరేకభావాలు ఉన్నాయో తెలిపేందుకు ఆయన బాల్యంలో అనేక సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. స్వాతంత్ర సముపార్జన కోసం జరుగుతోన్న అహింసాయుత సత్యాగ్రహం మొదలు, సాయుధ విప్లవవీరుల పోరాటం వరకు. అన్ని కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలంగా పనిచేశారు. దానితో పాటు స్వాతంత్య్ర సాధన కోసం అవసరమైన మానసిక సంసిద్ధత, ధార్మిక, సామాజిక రంగాల్లో ప్రజలను జాగృతం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా డాక్టర్టీకి బాగా తెలుసు. కనుకనే ఆయన స్వాతంత్య్ర సముపార్థన కోసం సంపూర్ణ సమాజాన్ని ఐక్య పరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1921లో జరిగిన ప్రథమ సత్యాగ్రహంలో పాల్గొంటూ "జైలుకు వెళ్లడం మాత్రమే దేశభక్తి కాదు. వెలుపల ఉంటూ సమాజాన్ని జాగృతం చేయడం కూడా కారాగారవాసంతో సమానమైన కార్యం" అని అన్నారు. అప్పుడు డాక్టర్జీ వయసు 31 ఏండ్లు మాత్రమే.
ఏ దేశ రాజకీయ స్వాతంత్రయ్యానికైనా ప్రారంభంలో తప్పనిసరిగా ఆ దేశానికి చెందిన మనసు, ఆత్మను మేల్కొలపాలి. అందుకే స్వాతంత్ర్యోద్యమం బలోపేతమై, విజయం సాధించేందుకు డాక్టర్ హెడ్డేవార్ ఈ దేశ ఆత్మను, మనసును మేల్కొలిపే కార్యక్రమాన్ని సమాజాన్ని ఐక్యం చేసే పనిని మొదలుపెట్టారు.
        స్వామి వివేకానంద రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. కర్వాత 1893లో అమెరికా, యూరోప్ దేశాలు పర్యటించారు. నాలుగు సంవత్సరాల అనంతరం 1897లో పశ్చిమదేశాల పర్యటన పూర్తి చేసి, భారతదేశంలో అడుగుపెట్టారు. 
వివేకానందుడు
ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తూ మనం ఐకమత్యంగా ఎలా మెలగాలో పశ్చిమదేశాల నుండి నేర్చుకోవాలి. అలాగే వ్యక్తులను నిర్మాణం చేయడానికి ఒక పద్దతి, ప్రక్రియను అవలంబించేందుకు ఏదో ఒక విధానం అమలు పర్చాలి.

భారతీయులందరూ రాబోవు కొన్ని సంవత్సరాల పాటు తాము ఆరాధించే దేవీదేవతలను పక్కన పెట్టి, కేవలం ఒకే ఒక దేవతను పూజించాలి. 'అమె భారతమాత అని అన్నారు. ఈ మూడు అంశాలకు ప్రతిరూపమే 'సంఘ శాఖ', 'సంఘపని'. కులభేదాలు - నిర్మూలన పుస్తకంలో దాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజకీయ విప్లవం ఎల్లప్పుడు సామాజిక, ధార్మిక జాగృతి తర్వాతే జరిగినట్లు చరిత్ర చెబుతోందని స్పష్టంగా రాసారు. 
   లూథర్ ద్వారా ప్రారంభమైన 'మత ప్రక్షాళన' ఉద్యమం యూరోప్ ప్రజలు సాధించిన రాజకీయ స్వాతంత్య్రానికి పునాది వంటిది. Purtanism (తమదే శుద్ధమైన సిద్ధాంతమని చెప్పడం ఇంగ్లాడ్, అమెరికా దేశాల స్వాతంత్ర్యానికి మూలాధారమైంది. ముస్లిం సామ్రాజ్యానికి కూడా అదే కారణమైంది. అరబ్బుల చేతికి రాజ్యాధికారం రావడం కంటే ముందు హజరత్ మహమ్మద్ ద్వారా జరిగిన ధార్మిక ఉద్యమ మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది. 

➧ భారత్లో చరిత్ర ఇదే సత్యాన్ని నిరూపిస్తోంది. చంద్రగుప్తని ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ ఉద్యమం కంటే ముందే బుద్ధుని ద్వారా ధార్మిక - సామజిక ఉద్యమం జరిగింది. 
➧ మహారాష్ట్రలో కూడా సాధువురుషుల ధార్మిక, సామాజిక ఉద్యమాల ఫలితంగానే శివాణీ నేతృత్వంలో అక్కడ రాజకీయ స్థిరత్వం సాధ్యమైంది.
➧ గురునానక్ దేవ్ ధార్మిక - సామజిక తర్వాతనే సిక్కుల రాజ్యాధికార ఉద్యమం రూపు దాల్చింది. ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు ప్రస్తావించవలసిన అవసరం లేదు. 
➧ ఏ దేశానికి సంబంధించిన రాజకీయ స్వాతంత్ర్యానికైనా ప్రారంభంలో తప్పనిసరిగా ఆ దేశానికి చెందిన మనసు, ఆత్మను మేల్కొలపవలసిన అవసరం ఉంటుంది. 
అందుకే స్వాతంత్య్ర ఉద్యమం బలోపేతమై విజయం సాధించేందుకు డాక్టర్ హెడ్డేవార్ ఈ దేశ ఆత్మను, మనసును మేల్కొలిపే కార్యక్రమాన్ని, సమాజాన్ని ఐక్యం చేసే పనిని మొదలుపెట్టారు.

రవీంద్రనాథ్ టాగూర్ 'స్వదేశీ - సమాజం' అనే పుస్తకం రాసారు. అందులో సంక్షేమ రాష్ట్రం (Welfare State) భారతీయ పరంపర కాదు అన్నారు. 

➧ భారతదేశంలో సమాజానికి సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. కొన్ని విభాగాలు మాత్రమే ప్రభుత్వ కనుసన్నలలో ఉంటాయి, భోజనం, మంచినీరు, ఆరోగ్యం, విద్యా తదితర అంశాలు సమాజమే నిర్వహించేది.
➧ ఉదాహరణకు మనదేశంలో పందిరి వేయడం గమనించే ఉంటారు. అయితే ఎక్కడా కూడా ఒకే స్తంభంపై వెదురు బొంగులు పేర్చి పందిరి వేయరు.
➧ ఆ స్తంభం కూలితే పందిరి మొత్తం పడిపోతుంది. అలా కాకుండా నాలుగు స్తంభాలతో పందిరి వేసినట్లయితే ఒక స్తంభం కూలినా మిగిలినవి దాన్ని నిలిపి ఉంచుతాయి. క్రమంగా మరమ్మత్తులు చేయడం కూడా సులువు అవుతుంది. 
➧ మహమ్మదీయులు, క్రైస్తవులు ఎక్కడెక్కడైతే పాలించారో ఆయా దేశాల్లో ఈ విభాగాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచారు. ఫలితంగా అక్కడ ఇస్లాం, క్రైస్తవంలోకి మతమార్పిడిలు విపరీతంగా జరిగాయి.
    కానీ భారత్ లో 850 ఏళ్లు ముస్లిం రాజులు, 150 ఏళ్లు క్రైస్తవ పాలకులు పరిపాలించినప్పటికి 15శాతం. ముస్లింలుగా, 3శాతం క్రైస్తవులుగా మాత్రమే బలవంతంగా మతం మార్చుకొన్నారు. ఇది భారత్ కు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ఇక్కడ సమాజ నిర్మాణం ఒకే స్తంభంపై నిలబడి లేదు. ప్రభుత్వాల ఆధీనంలోనూ లేదు. పలు అంశాలని స్వతంత్రంగా సమాజమే నిర్వహించే స్థాయిలో ఉండేది.  "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" ఇదే రకంగా రూపుదిద్దుకుంది.

సంఘకార్యం కూడా సంపూర్ణ స్వావలంబనతో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలపై ఆధారపడి పనిచేసేది కాదు.  స్వయంసేవకులు ఒక లక్షా ముప్పైవేలకు పైగా సేవాకార్యక్రమాలను సమాజంలోని వివిధ రంగాల్లో నిర్వహిస్తున్నారు అందులో తొంభైశాతం సేవాకార్యక్రమాలకు ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయసహకారాలు ఆశించకుండా జరుగుతున్నాయి.
   నేను గుజరాత్ ప్రాంత ప్రచారక్ గా ఉన్న సమయంలో కేశూభాయ్ప టేల్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం (బీజేపీ-BJP) అధికారంలో ఉంది. ఆ సమయంలో గిరిజన తెగల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని భాజపా నేతలు భావించారు. వనవాసీ కల్యాణాశ్రమం గిరిజన తెగల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ ఆశ్రమ కార్యకర్తలు ప్రభుత్వం నుండి నిధులు స్వీకరించడానికి నిరాకరించారు. 

కొన్నేళ్ల కిందట ఒక సంఘకార్యకర్త కల్యాణాశ్రమం ప్రభుత్వ సహకారం ఎందుకు తీసుకోవడం లేదని నన్ను ప్రశ్నించారు. నేను అతనికి వినాబా భావే శైలిలో సమాధానం చెప్పాను. “ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి? సమాజమే పన్ను రూపంలో చెల్లిస్తోంది. అంటే ప్రభుత్వం ఉద్యోగి, సమాజం యజమాని అనే కదా అర్థం. అట్లాయితే మనం ఉద్యోగులను యాచించడం దేనికి? మనం నేరుగా యజమానులను అడుగుతున్నాం'. వాళ్లు ఆనందంగా ఇస్తున్నారు.
   ది స్టార్ ఫిష్ అండ్ స్పైడర్ అనే పుస్తకంలో సంస్థ లేదా సమాజ పాలనా వ్యవస్థ రూపురేఖలు ఎలా ఉంటాయో వివరించారు. ఇందులో రెండు ఉదాహరణలు ప్రస్తావించారు. ఒకటి స్పైడర్ (సాలె పురుగు), ఈ కీటకానికి అనేక కాళ్లు ఉంటాయి. ఒకటి, రెండు విరిగిపోయినా దాని ప్రాణాలకు ఢోకా లేదు. సాలెపురుగు జీవనశక్తి దాని చిన్న తలపై కేంద్రీకృతమై ఉంటుంది. తల నష్టపోతే ఆ పురుగు చనిపోతుంది.
   రెండవది స్టార్ ఫిష్, ఇది విచిత్రమైన చేప. దాని జీవనాడి ఒక్కచోట కేంద్రీకృతమై ఉండదు శరీరంలోని అన్ని భాగాల్లో విస్తరించి ఉంటుంది. కనుక ఈ చేపను ఏదో ఒక అవయవంపై దాడి చేసి చంపడం సాధ్యం కాదు. (It is very difficult to kill a starfish). దాన్ని రెండు ముక్కలుగా నరికినట్లయితే అది రెండు స్టార్ ఫిష్లుగా రూపొందుతుంది.  ఈ విషయం గురించి అవగాహన కల్పించేందుకు రచయిత ఈ పుస్తకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. లాటిన్ అమెరికా చరిత్రకారులలో ప్రత్యేకంగా చెప్పుకోతగిన ఆచార్య నేవిన్ తన పుస్తకంలో ఒక సంఘటన పరిణామక్రమాన్నితెలిపారు. 

16వ శతాబ్దంలో యూరోప్, స్పెయిన్ నుండి అనేకమంది తమ సైన్యాన్ని వెంట తీసుకోని ధనవంతులు అయ్యేందుకు, దోపిడీలు చేయడానికి బంగారం నిక్షేపాలు అన్వేషించేందుకు నౌకల్లో బయలుదేరారు. ఈ ప్రయాణానికి “ సి ఎక్స్పిడిషన్" అనే పేరు ఉన్నట్లు జ్ఞాపకం. అదే విధంగా స్పెయిన్ నుండి మరో సైనికుల బృందం నావను తీసుకోని లాటిన్ అమెరికా భూభాగం వైపు వెళ్లింది. ఎక్కడ ఖాళీ భూభాగం కనిపిస్తే అక్కడ ఆక్రమణ చేయడమే వారి లక్ష్యం. 
    1519లో స్పానిష్ సైనిక బృందం ఒకటి అజ్ టెక్ అనే గిరిజన రాజ్యంలోకి ప్రవేశించింది. అక్కడి రాజ్యాధినేత తలపై తుపాకి గురిపెట్టి “మొత్తం సైన్యాన్ని అప్పగించు. లేదా చంపేస్తాం" అని బెదిరించారు. ఆ రాజ్యాధినేత ఇలాంటి దోపిడి దారులను ఎదుర్కోవలసి వస్తుందని బహుశా కలలో కూడా ఊహించి ఉండడు. అతను సహజంగానే తన ప్రాణాలు రక్షించుకొనే క్రమంలో మొత్తం సైన్యాన్ని వాళ్లకు అప్పగించారు. వాళ్లు సైన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నప్పటికి మాటపై నిలబడకుండా రాజ్యాధినేతను కాల్చి చంపేశారు. రెండు సంవత్సరాల్లో, 1521 వరకు మొత్తం అజ్టెక్ రాజ్యం స్పానిష్ జాతి ఆధీనంలోకి వచ్చేసింది. 1534లో ఇలాంటి మరో సైనిక బృందం లాటిన్ అమెరికాలోని 'ఇన్ కా' పేరుతో పిలిచే గిరిజన రాజ్యంలోకి వెళ్లింది అక్కడ కూడా ఇలాంటి చరిత్ర పునరావృతం అయింది. రెండుసంవత్సరాల్లోనే అంటే 1536 వరకు ఇన్ కా రాజ్యం స్పానిష్ సైనికుల చేతిల్లో చిక్కింది. ఇదే విధంగా ఒకదాని తర్వాత మరొక గిరిజన రాజ్యాలన్నిటిని స్పెయిన్ కబళించింది.
    కానీ 1618లో అనూహ్యంగా ఒక సంఘటన జరిగింది. స్పెయిన్ నుండి ఒక సైనిక బృందం 8లో 'అపేచీ' అనే గిరిజన రాజ్యానికి చేరుకుంది. అక్కడ కూడా ఆ రాజ్యాధినేతను చంపేశారు ఆ తెగల వద్ద దోచుకునే స్థాయిలో పెద్దగా ధనసంపదలు లేవు. అందువల్ల స్పానిష్ ప్రజలు వాళ్లను మతాంతరీకరణ చేసి పంట పొలాల్లో పని చేయించడం ప్రారంభించారు. కానీ నెమ్మది నెమ్మదిగా వారికి అర్ధమైందేమంటే అక్కడి రాజ్యాధినేతను చంపినప్పట నుండి స్థానిక సమాజంలో వ్యతిరేకత నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మిగతా రాజ్యాలు రెండు, మూడు ఏళ్లలోనే వాళ్ల వశమయ్యేవి. కానీ అపేచీలో అలాంటి పరిస్థితి లేదు.  200 ఏళ్లు సంఘర్షణ జరిగింది చివరకు స్పానిష్ సైన్యం అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయింది.

    ఈ వృత్తాంతం వివరిస్తూ ఆచార్య నేవిన్ ఇలా రాసారు, అజ్టెక్, ఇన్ కా ఈ రెండు రాజ్యాలతో పోలిస్తే అపేచీ వద్ద ఉన్న సైన్యం బలమైందేమి కాదు అలాగే రెండు రాజ్యాలను ఆక్రమించిన సైన్యాలతో పోలిస్తే ఈ స్పానిష్ సైన్యం కూడా బలహీనమైందేమి కాదు. కానీ ఇది ఎలా జరిగింది? అని ప్రశ్నిస్తూ ఆయన ఇంకా ఇలా అన్నారు. 
      ఈ గిరిజన సమాజ నిర్మాణం రాజ్యం ఆధారంగా జరగలేదు (They were differently organised) ఆక్కడి సామాజిక శక్తులన్నీ ఒక రాజ్యాధినేత నియంత్రణలో లేవు సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక వ్యవస్థ ఉంది అది రాజ్యాధికారం పరిధిలో కాకుండా స్వతంత్రంగా నిర్వహించుకునేవి, అందువల్లే రాజులు పరాజయం పాలైనప్పటికి సమాజం ఓటమిని అంగీకరించలేదు. పైగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ విధమైన సమాజ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అవసరం.
     కనుకనే డాక్టర్ అంబేడ్కర్ "ఏదైనా రాజకీయ విప్లవం కంటే ముందు ఆ దేశ మనస్సు, ఆత్మలను మేల్కోల్బడం అవసరం" అని అన్నారు.  స్వామి వివేకానంద "మనమంతా ఒకే దేశవాసులుగా ఐక్యంకావాలని” పిలుపునిచ్చారనేది గుర్తించుకోవాలి.

సమాజాధిపతి, సమాజ నాయకుని ద్వారా స్వదేశీ సమాజ నిర్మాణం చేయాలి. దాన్ని కొనసాగించాలి.  ఇది ఎంతో మహత్తరమైన (Vitally Important) మౌలిక కార్యంగా భావించాలి. స్వాతంత్య్ర సాధన కోసం ఇలాంటి కార్యక్రమం అవసరమని, అది తప్పనిసరి అని భావించడం వల్లనే డాక్టర్ హెడ్డేవార్ సమస్త సమాజాన్ని ఒకే దేశవాసులుగా జాగృతం చేసేందుకు, క్రియాశీలం చేసేందుకు, సంపూర్ణ సమాజంలో ఐకమత్యం తీసుకోచ్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ప్రారంభించడాన్ని గొప్ప విషయంగా అర్థం చేసుకోవాలి. కనుకనే డాక్టర్ హెడ్డేవార్ ఒక మహాద్రష్ట, నైపుణ్యం కలిగిన సమాజ నిర్మాతగా అందరికి చిరపరిచితులు.

వ్యాసకర్త : ఆర్ఎస్ఎస్ సహసర్ కార్యవాహ - డా. మన్మోహన్ వైద్య
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top