1200 ఆవులు.. నెలకు 22 లక్షల ఖర్చుతో 'గోశాల' నిర్వహిస్తున్న జర్మన్‌ మహిళ - German woman running 'Goshala'

German woman running 'Goshala'
German woman running 'Goshala'

మధురలో.. 1200 ఆవులను సంరక్షిస్తున్న జర్మనీ మహిళ ఫ్రెడరిక్‌ ఇరీనా బ్రూనింగ్‌:
* 'సురభి గోసేవా నికేతన్‌’ పేరిట 3800 చదరపు గజాల్లో గోసంరక్షణశాలను నెలకొల్పింది.
* అనారోగ్యంతో బాధపడుతున్నవి, వృద్ధాప్యం కారణంగా పాలు ఇవ్వలేని ఆవులను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది.
* కూలీల జీతాలకు నెలకు రూ.22 లక్షల వ్యయమవుతోందని.. జర్మనీలో ఉన్న కొన్ని ఆస్తులపై వచ్చే నెలవారీ అద్దెలు, తన తల్లిదండ్రులు ఇచ్చే సాయంతో నెట్టుకొస్తున్నట్లు తెలిపారు.

'గోశాల' నిర్వహిస్తున్న జర్మన్‌ మహిళ - ఫ్రెడెరిక్‌ ఇరీనా బ్రూనింగ్‌
'గోశాల' నిర్వహిస్తున్న జర్మన్‌ మహిళ - ఫ్రెడెరిక్‌ ఇరీనా బ్రూనింగ్‌
ఏళ్లుగా సొంత ఖర్చుతో నిర్వహణ
ఎవరైనా పాలిచ్చే గోవులనే పెంచుకుంటారు. వయసుడిగాక వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటారు. యూపీలోని మధురకు దగ్గర్లోని రాధా కుంద్‌లో గల ‘సురభి గోశాల నికేతన్‌’ మాత్రం ఇందుకు భిన్నం! అక్కడన్నీ ముసలి ఆవులే ఉంటాయి. అవి కూడా 1200కు పైనే! దీన్ని ఏదో స్వచ్ఛంద సంస్థ, లేదంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థనో నిర్వహిస్తుందనుకుంటే పొరపాటే! ఈ గోశాల నిర్వాహకురాలు 59 ఏళ్ల విదేశీ మహిళ. జర్మనీకి చెందిన ఆమె పేరు ఫ్రెడెరిక్‌ ఇరీనా బ్రూనింగ్‌. గోరక్షణ అంటే ఆమెకు పంచప్రాణాలు. 
  1978 భారత్‌కు తొలిసారిగా ఓ పర్యాటకురాలిగా వచ్చారు. యూపీలోని రాధాకుంద్‌లో ఓ గురువు శిష్యరికాన్ని స్వీకరించి ఇక్కడే ఉండిపోయారు. ఓసారి పొరుగు వ్యక్తి తన ఆవును కొనమని కోరడంతో కాదనలేకపోయారు. అప్పటి నుంచి గోరక్షణే వృత్తి, ప్రవృత్తిగా జీవిస్తున్నారు. ఆమెను స్థానికులంతా ముద్దుగా ‘సుదేవీ మతాజీ’ అని పిలుచుకుంటారు. ఇప్పటిదాకా ఆవులు, దూడలు కలిపి గోశాలలో 1200దాకా ఉండగా..వాటి పోషణ, పనివాళ్ల జీతాల కోసం నెలకు రూ.22 లక్షల సొంత డబ్బునే వెచ్చిస్తున్నారు. బెర్లిన్‌లో ఉన్న కొన్ని స్థిరాస్తుల ద్వారా వచ్చే అద్దెతో ఆమె గోశాల నిర్వహిస్తున్నారు. గోశాల నిర్వహణ కష్టమవుతున్నా.. మూసివేసే ఉద్దేశం లేదని చెబుతున్నారామె.

ఆమె యొక్క 'సురభి గోసేవా నికేతన్‌’ గోశాలకు విరాళం ఇవ్వాలనుకుంటే క్రింద చూపించిన చిరునామాకు సంప్రదించండి: 
మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, దయచేసి సుదేవి మాతాజీని ఇక్కడ సంప్రదించండి:

Mobile No: 9927 668 182
Radha Surabhi Goshala
Konei Road
281504
Radha Kund
Uttar Pradesh
India

E-mail : f.brueningsudevidasi@icloud.com

*** If you wish to send donations through Western Union, you have to write Sudevi Mataji's legal name as in her passport which is: *** మీరు వెస్ట్రన్ యూనియన్ ద్వారా విరాళాలు పంపాలనుకుంటే, మీరు ఆమె పాస్‌పోర్ట్‌లో ఉన్నట్లుగా సుదేవి మాతాజీ చట్టపరమైన పేరు రాయాలి:
FRIEDERIKE IRINA BRUNING
లేదా
You may bank in your donations straight into Sudevi Mataji's account. 

Details are as follows:
State Bank of India, 
Radhakund, Govardhan Road, District Mathura, U.P.,  India

a/c number:  32859476349,     IFSC: SBIN0005944
S.W.I.S.T. :SBININBB556

script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top