పొంచివున్న రోహింగ్యాల ప్రమాదం - The Rohingya

Vishwa Bhaarath
రోహింగ్యాలు
రోహింగ్యాలు
యన్మార్ దేశంలో రఖాయిన్(అరాఖన్ అని కూడా అంటారు) రాష్ట్రo లో వీరు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉత్తర టౌన్ షిప్ లపైన మాంగ్ డౌ, భూతిడౌంగ్, రథేడౌంగ్ లలో వీరు ఎక్కువగా నివసిస్తారు. కొన్ని తరాల ముందు తాము పర్షియా, అరేబియాల నుండి వ్యాపార నిమిత్తమై ఇక్కడకు వచ్చి ఇక్కడే స్థిరపడి పోయాము అని చెప్పుకుంటారు. ఫ్రెంచ్ స్కాలర్ జాక్వస్ లైడర్ ప్రకారం రఖాయినా రాష్ట్రంలోని ముస్లింలందరు బెంగాల్ నుండి వలస వచ్చిన వారే. 1990 వరకు వీళ్లు బెంగాలీ ముస్లింలుగానే గుర్తింప బడేవారు. బ్రిటిష్ పరిపాలనలో వీరిని చిట్టాగోనియన్స్(చిట్టాగాంగియులు)  గా పిలిచేవారు. వీరు జాతి పరంగా దక్షిణ బంగ్లాదేశ్ లోని బెంగాలీ ముస్లింలకు సంబందించిన వారని ఒక అధ్యయనం తెలుపుతోంది. అంత్రోపోలజిస్ట్ క్రిస్టియన్ ఫ్రింక్ ప్రకారం రోహింగ్యా అన్నపదం రాజకీయంగా ఏర్పడ్డది కానీ జాతిపరంగా కాదు అని తేల్చారు.
  చిట్టగాంగ్ బెంగాలి యాసలో ఉండే వీరి భాష వీరిని స్థానిక రాఖయిన ప్రజలతో వేరు చేస్తోంది. మయన్మార్ ప్రభుత్వం వీరిని బెంగాలీ ముస్లిం చొరబాటుదారులుగా గుర్తిస్తోంది. మయాన్మార్ ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ  ప్రకారం ఆ దేశంలో 135 తెగలు ఉoటే, అందులో రోహింగ్యా అన్న తెగ లేదు. 1982 లో జరిపిన లెక్కల ప్రకారం వీరి జనాభా 750000 గా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిని స్టేట్ లెస్ పీపుల్ అయిన ముస్లిం లుగా గుర్తించబడ్డారు. ప్రస్తుతం వీరి జనాభా 11 లక్షలుగా యునైటెడ్ నేషన్స్ సంస్థ గుర్తిస్తోంది. రఖాయినా రాష్ట్రంలోని  మొత్తం జనాభా 33 లక్షలు కాగా వీరు 33 శాతo అన్న మాట.
ప్రస్తుత పరిస్థితి
2017 ఆగస్ట్ 25 తెల్లవారితే శుక్రవారం అనగా రాత్రి ఒంటి గంట ప్రాంతంలో 150 మంది సాయుధ తీవ్రవాదులు మాంగ్ డౌ లోని పోలీస్ ఇన్ ఫ్యాంటరి  బేస్ 552 పై దాడి చేశారు.  కొద్ది సమయం తరువాత అనగా సుమారు ఉదయం 3 గంటల ప్రాంతంలో టౌన్ బజార్ లోని పోలీసు స్టేషన్ పై మరో 150 మంది సాయుదులు దాడి చేశారు. ఇలా ఒకే రోజు రాత్రి 30 పోలీసు మరియు మిలిటరీ బేస్ ల పై ఏక కాలంలో దాడి చేశారు.   ఈ దాడిలో 11 మంది పోలీసులు, ఒక సైనికుడు చనిపోయారు. ఈ దాడిలో కొంత మంది స్థానికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఎదురు కాల్పులలో 59 మంది చొరబాటు దారులు చనిపోయినట్లు సమాచారం.
  అంతటితో ఆగకుండా ఈ చొరబాటుదారులు స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడినారు. గ్రామాలను తగులబెట్టారు. ప్రతిసారి వీరు చేసే దాడులలో ఒకరిద్దరు హిందువులు కూడా చనిపోతుండేవారు, కానీ ఈ సారి వీరి దాడి ఏకంగా హిందువులనే లక్ష్యంగా చేస్తూ సాగింది. అత్యంత కిరాతకంగా 130 మంది హిందువులను ఊచకోత కోశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా పొట్టన బెట్టుకున్నారు. స్థానికంగా నివసించే వారు ఇలాంటి దాడులకు భయపడి చాలామంది బౌద్ధులు, హిందువులు తమ ఇండ్లను వదిలి గ్రామాలను ఖాళీ చేసి సమీపంలో ఉన్న బౌద్ద ఆరామాలలో తలదాచుకుo టున్నారు. భయబ్రాంతులకు గురైన హిందువులు తమ ఇల్లు వదిలి రాష్ట్ర రాజధాని అయిన సిత్త్వే చేరారు. ప్రస్తుతం రెండు దేవాలయాలలో సుమారు 1000 మంది పైగా తమ ప్రాణాలను కాపడుకోవడానికి తలదాచుకుంటున్నారు.
  అరఖానా రాష్ట్ర అసెంబ్లీ లీడర్ సిత్త్వే నగరంలో దేవాలయాలలో తలదాచుకున్న మైనారిటీలైన హిందువులను పరామర్శించడానికి వెళ్ళినపుడు వర్ణనాతీతమైన వారి బాధలను తెలుసుకున్నారు.  రోహింగ్యా ముస్లింలు ఎంత క్రూరంగా ప్రవర్తించి గ్రామాలను తగలబెట్టి ప్రజలను చిత్రహింసల పాలుచేసి చంపింది తెలుసుకుని నివ్వెరపోయారు.  
   ఇప్పటి వరకు ప్రపంచానికి రోహింగ్యా ముస్లింలు చేస్తున్న అకృత్యాలు తెలియవు. అందుకే 6 వీడియోలను యుట్యూబ్ లో పెట్టారు. స్థానికుల కథనం ప్రకారం సాయుదులైన రోహింగ్యా ముస్లింలు ఆగస్ట్ 24 సాయింత్రం  4 గంటల ప్రాంతంలో  మాంగ్ డౌ  టౌన్ షిప్ (టౌన్ షిప్ అనగా నగరంతో పాటు గ్రామాలు కలిసి ఉంటాయి) లోని దగ్గరలోని  న్గాంఖ్యా గ్రామంలోకి చొరబడ్డారు. ఈ గ్రామము బంగ్లాదేశ్ బోర్డర్ కు  కేవలం 3 మైళ్ళ దూరముంటుంది. వందల మంది సాయుదులు ముఖాలకు నల్లగుడ్డలు ధరించి తుపాకులు,గొడ్డళ్ళు, తాళ్వార్లతో గ్రామాన్ని చుట్టుముట్టి హిందువులందరిని ఒకచోట చేరమన్నారు. పనికై బయటకు వెళ్లినవారు పోను 56 మంది ఆ సమయంలో ఉన్నారు. వారి సెల్ ఫోన్ లను లాక్కొని అందరిని దూరంగా తీసుకెల్లి, చుట్టు ముట్టి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. కల్వని అనే హిందుమహిళ అప్పుడే పనికై గ్రామం దాటి వెళ్లి తిరిగివస్తూ ఈ అకృత్యాన్నిచూసి భయబ్రాంతులకు గురై ప్రక్క గ్రామమైన టౌన్గ్వాకు పరిగెత్తింది. తన కుటుంబంలోని 6 గురు సభ్యులలో 4 గురు చనిపోవడం చూసింది. కొడుకు పని కై బంగ్లాదేశ్ కు వెళ్ళిన కారణంగా బ్రతికాడు. కల్వని, టౌన్గ్వా గ్రామ వాసులకు తమ గ్రామంలో జరిగిన విషయాన్ని చెప్పడంతో భయంతోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. గ్రామంలో ఉండటం మంచిది కాదని అక్కడి నుండి పారిపోదామనుకున్నారు. చుట్టూ ముస్లిం గ్రామాల ఉన్న కారణంగా రాత్రి వెళ్ళటం శ్రేయస్కరం కాదని ప్రొద్దున పోవాలి అని నిర్నయిన్చుకున్నారు . దురదృష్ఠం వారినీ వెంటాడింది.
   ఆ రాత్రి 30 పోలీస్ ఔటపోస్టుల పైన దాడి జరిగింది. 25 ఉదయం 8 గంటలకే ముఖానికి నల్లని మాస్కులు, వంటి నిండా నల్లని దుస్తులు ధరించి సాయుదులైన రోహింగ్యా ముస్లిం తీవ్రవాదులు టౌన్గ్వా(పిన్కోడ్ 197820) గ్రామాన్ని చుట్టు ముట్టారు. గ్రామస్తులందరిని ఒక చోటకు రమ్మన్నారు. కల్వనితో కలిపి 55 మంది ఉన్నారు. అందరిని త్రాళ్లతో బంధించారు. అల్లా-హో-అక్బర్ అని నినాదాలు చేస్తూ మీరు ఇక్కడి నాగరికులా? దేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చా? మయన్మార్ మిలిటరీ మిమ్మల్ని రక్షిస్తుందా? “రమ్మను మీ మిలీటరీని” అంటూ ఒక్కొక్కరినే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. 
  భయనికిలోనై మతం మారడానికి ఒప్పుకున్న 8 మంది అందమైన మహిళలను, వారు ప్రాధేయపడగా వారి పిల్లలు 10 మందిని బంగ్లాదేశ్ కు తరలించుకు పోయారు. ఈ ఘటనలను ప్రపంచానికి చెప్పడానికి వారే మిగిలారు. బోర్డర్ దాటుతూనే ముసుగులు తొలగించుకున్న వీరిని చూసి అవాక్కయ్యారు. తమ ప్రక్క గ్రామస్తులు అందులో అనేక మంది కనిపించారు. రఖాయిన్లో ఏభవ్క్యా,టౌన్గ్వా గ్రామాలలోని హిందువులను రాఖయినే బౌద్ధులు చంపారని, తమ గ్రామాలు తగులబెట్టారని వీరితో స్థానిక పత్రికలలోఇంటర్వ్యూ ఇప్పించారు. 
  బంగ్లాదేశ్ టి వి లలో పెద్ద ఎత్తున ప్రచారం అవడంతో బాంగ్లాదేశ్ లో ఉండే టౌన్గ్వా గ్రామస్తుల బంధువులు వీరిని వేదకడం ప్రారంభించారు. శరణార్థి శిబిరాలలో ఎక్కడ కనపడలేదు. తీవ్ర ప్రయత్నం చేయగా చివరకు వీరిని ఒక గదిలో నిర్బంధించారు అని తెలుసుకున్నారు. పోలీసుల సహాయంతో రైడ్ చేసి వారిని రక్షించటం జరిగింది. ఆ యువతులు కుతుపాలంగ్రె శరణార్ధి క్యాంప్ నుండి బయటకు వస్తున్నప్పుడు అత్యంత భయబ్రాంతులకు గురైయ్యారు. తమ వారందరిని చంపి తమని నిర్బంధించిన వారంతా అక్కడే శరణార్ధుల్లా తిరుగుతున్నారు. దోపిడీ చేసి తమ భర్తల బట్టలను వారు ధరించి వీరి చుట్టూ తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయారు.

ఇంకా ప్రపంచానికి తెలియని ఇటువంటి సంఘటనలు ఎన్నో?.
అరాఖన్  రోహింగ్య సాల్వేషన్ ఆర్మీ  (ARSA) శుక్రవారం ఇచ్చిన స్టేటుమెంట్ లో తమ దాడులను అంగీకరిస్తూ ఇక ముందు కూడా ఇటువంటి పోరాటాలు చేస్తామన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ అధ్యక్షులు శ్రీ కోఫీ అన్నన్ గారితో  అంగ్ సాన్ సుకి రోహింగ్యాల సమస్యపై దీర్ఘకాలిక యోజన గురించి చర్చించిన మరుసటి రోజే ఈ దాడులు జరగటం గమనార్హం. 
  ఆగస్ట్ 17 న స్థానిక బౌద్ద మహిళపై రోహింగ్యా ముస్లింలు సామూహికంగా బలాత్కరించి చంపిన కారణంగా జరిగిన అల్లర్లలో 10 మంది రోహింగ్యాలు చనిపోయారు. ఈ సందర్బంగా చెలరేగిన మత ఘర్షణలలో ఇరువైపులా 80 మంది చనిపోయి వందల ఇళ్ళు తగుల బడ్డాయి. రోహింగ్యాల కొరకు సేవా నిమిత్తమై వచ్చిన యు ఎన్ ఉద్యోగస్తులు కూడా అల్లర్లకు కారణమని సాక్ష్యాలు దొరకడంతో  ముగ్గురు ఉద్యోగులను మయన్మార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చరిత్ర ఏమి చెపుతోంది
1948 లో మయన్మార్ కు బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్లోనే రోహింగ్యాలుగా చెప్పుకునే బంగ్లా ముస్లింలు చొరబాటుదారులు రఖాయినా రాష్ట్రంలోని తాము అధిక జనాభా కలిగిన ఈ భాగాలను అనగా మాంగ్ డౌ, భూతిడౌంగ్ ప్రదేశాలను తూర్పు పాకిస్తాన్ లో కలపాలని ఉద్యమాలు చేశారు. కొంత మంది ముస్లిం లీడర్లు 1946 మే నెలలో మహ్మద్ అలీ జిన్నాను సైతం కలిసి తమ ప్రదేశాలను తూర్పు పాకిస్తాన్ తో కలుపుకోమని కోరారు. ఆ దిశలో జులై నెలలో నార్త్ అరఖాన్ ముస్లింలీగ్ను కూడా ప్రారంభించారు. బర్మా స్వంత విషయాలలో జోక్యం చేసుకోనని జిన్నా చెప్పడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తదుపరి వీరే ఆ రెండు ప్రదేశాలను తూర్పు పాకిస్తాన్ కు ఇవ్వవల్సిందిగా కొత్తగా ఏర్పడ్డ బర్మా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా అక్కడి పార్లమెంట్ దాన్ని తోసిపుచ్చింది.
  1947లొనే మీర్ ఖాసిం ఆధ్వర్యంలో ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ ప్రారంభమై బర్మా సైనికులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు. తమ జనాభా అధికంగా ఉండే ప్రదేశాలలోని స్థానిక రాఖయినే ప్రజలను తరమటం  ప్రారంభించారు. ఈ కారణంగా స్థానికులనేకులు ఇతర ప్రదేశాలకు వలసపోయారు. ఆ సమయంలోనే తూర్పు పాకిస్తాన్ లోని చిట్టా గాంగ్ నుండి ముస్లింలు బర్మాలోకి ప్రవేశించారు. బర్మా ప్రభుత్వం1948 నవెంబర్లో ‘మార్షల్ లా’ విధించి తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమము చేపట్టి జూన్ 1949 నాటికి ముజాహిదీన్లను పూర్తిగా అడవులలోకి తరిమేసింది. అప్పుడు రాఖయినే లో ఉన్న ముస్లింల పై దాడులు ఆపాలని 1950 లో పాకిస్తాన్ ప్రభుత్వం బర్మా ప్రభుత్వాన్ని బెదిరించింది కూడా. అప్పటి బర్మా ప్రధాని ఊను ఒక ముస్లిం దూతను పాకిస్తాన్ కు పంపి ముజాహిదీన్లకు సహకారo అందించవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారు. 1954 లో మీర్ ఖాసిం ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 1954 లో అబ్దుల్లా లతీఫ్ నాయకత్వంలో ముజాహిదీన్లు మళ్ళీ తిరుగుబాటు ప్రారంభించారు.  బర్మా ప్రభుత్వం  ఆపరేషన్ మానసూన్ ను ప్రారంభించింది. దాంతో 1961 నాటికి పూర్తిగా జనాదరణ కోల్పోయి వీరి అనుచరులు మయన్మార్ ప్రభుత్వానికి లొంగిపోయారు.
  లొంగిపోగా మిగిలిన కొందరు ముజాహిదీన్లు జాఫర్ ఖవాల్ నేతృత్వంలో మరి కొందరు అబ్దుల్లా లతీఫ్  నేతృత్వంలో ఇంకొందరు అన్నుల్ జౌళి నేతృత్వంలో ఉండిపోయారు. ఈ మూడు సంస్థలు విభిన్న దృక్పధాలు ఏర్పరచుకొని జనాదరణకోల్పోయి చివరకు బియ్యపు స్మగ్లర్లుగా మిగిలిపోయారు.
  1972 జులై 15 న జాఫర్ ఖవాల్ అనే పూర్వపు ముజాహిదీన్ నాయకుడు  రోహింగ్యా లిబరేషన్ పార్టీ (RLP) ప్రారంభించి 500 మంది తీవ్రవాదులను తయారు చేసుకున్నాడు. మయన్మార్ తలో తీవ్రమైన సైనిక చర్య కారణంగా ఈ సంస్థ బలహీనపడింది. RLP లో సెక్రటరీగా పని చేసిన మొహమ్మద్  జాఫర్ హబీబ్ రోహింగ్యా పాట్రయటిక్ ఫ్రంట్ ప్రారంభించాడు. ఈ సంస్థకు అల్-ఖైద తో సంబంధాలుండేవి. 1972లో బాంగ్లాదేశ్  ఏర్పడటంతో వీరు ఉద్యమ తీవ్రత పెంచి స్తానిక ప్రజలతో పాటి, ప్రభుత్వ బలగాలపై దాడులు చేసేవారు . 1978లో ప్రభుత్వం తలపెట్టిన అపరేషన్ కింగ్ డ్రాగన్ తో ఈ సంస్థ అంతమైంది.
  1982 అక్టోబర్ 15 న బర్మా నాగరిక చట్టం తీసుకురాబడింది. ముస్లింలలో జాతిపరమైన విభజనను దేశంలోని ఇతర ముస్లింలు అంగీకరించని కారణంగా రోహింగ్యా ముస్లింలుగా చెప్పుకునేవారికి నాగరికత లభించలేదు. వారు బంగ్లాదేశ్ తో కలిసి ఉంటామని ఉద్యమాలు, తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న కారణమూ కావచ్చు.
  1982 లొనే రోహింగ్యా సోలీడటరీ ఆర్గనైజేషన్  ప్రారంభమై మయన్మార్ పోలీసు బలగాలపై మరియు ప్రజలపై దాడులు ప్రారంభించింది. వీరు మిలిటెంట్ క్యాంప్ లను దక్షిణ బాంగ్లాదేశ్ లోని  కాక్స్ బజార్ జిల్లాలో నిర్వహిస్తుండేవారు. తేలిక పాటి మెషిన్గన్ ఎల్.ఎం.జి,  ఏకె 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, క్లామోర్ మైన్లు,  ఇతర విస్ఫోటక పదార్థాలతో శిక్షణ పొంది వీరు దాడులు చేస్తుండేవారు. బ్రిటిష్ వారు తాయారు చేసిన తుపాకులు సైతం వీరి దగ్గర లభ్యమయ్యేటివి. ప్రముఖంగా వీరు మయాన్మార్, బాంగ్లా దేశ సరిహద్దుల్లో  1990 లోజరిగిన దాడులలో వీరు ప్రధాన పాత్ర పోషించారు.

   నారూల్ ఇస్లాం నాయకత్వంలో అరఖాన్ రోహింగ్య ఇస్లామిక్ ఫ్రంట్ 1986 లోఏర్పడిoది. 1998 లో రోహింగ్యా సోలీడటరీ ఆర్గనైజేషన్ మరియు అరఖాన్ రోహింగ్య ఇస్లామిక్ ఫ్రంట్ రెండు సంస్థలు ఏకమై అరఖిన్ రోహింగ్యా నేషనల్ ఆర్గనై జేషన్ గా ఏర్పడి అందులో భాగంగా ఒక సైనికదళాన్న రోహింగ్యానేషనల్ఆర్మీ( ఆర్ ఎన్ ఓ)  ఏర్పాటుచేశారు. అల్-ఖైదా అనే తీవ్రవాద సంస్థవీరికి ఆఫ్ఘానిస్తాన్ లో మిలిటరీ శిక్షన ఇస్తుండేది. ఈ సంస్థ కాశ్మీర్లోని హిజ్బుల్ ము జాహిదీన్, హిజ్బుల్ ఇస్లాం, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ లోని జమాతే ఇస్లామిల వంటి తీవ్రవాద సంస్థలతో సంబందాలు ఏర్పరచుకొంది. మలేషియా ముస్లిం తీవ్రవాదులతో కూడా సంబందాలు ఉన్నాయి. దాంతో మయన్మార్ మిలిటరీను దింపి తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమము చేపట్టడంతో 1992 నాటికి 250000 రోహింగ్యా ముస్లింలు తూర్పు రాఖయినాను వదలి వెళ్లిపోయారు.
కరడుగట్టిన తీవ్రవాద సంస్థలైన హర్కత్ ఉల్ ముజాహిదీన్ అల్ఇస్లామి మరియు హర్కత్ఉల్అన్సార్లు మయన్మార్ లో తమ బ్రాంచిలున్నాయని ప్రకటించుకున్నాయి.
హరకా–అల్–యాక్విన్ (నమ్మకమైనఉద్యమం) అనే ఉగ్రవాద సంస్థ 9 అక్టోబర్ 2016 న మూడు బోర్డర్ పోలీస్ ఔట పోస్టుల పై దాడి చేసింది.  తొమ్మిది మంది పోలీసులు 31 మంది మిలిటెంట్లు మరణించారు. 2001 దాడుల తరువాత ఇదే అతి పెద్ద దాడి. నవంబర్ 2016న మళ్ళీ దాడులు చేసింది. మొత్తం 134 మంది ఈ దాడుల్లో చనిపోయారు. ఈ సంస్థకు సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్తలతో సంబందాలున్నట్లు తెలిసింది. ఈ సంస్థ పూర్వపు నామము ARSA అనగా అరఖాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ.
హైదరాబాద్ లో రోహింగ్యాలు
వీరంతా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి వివిధ చోట్ల స్థిరపడ్డారు. అంధులు కొంత మంది హైదరాబాద్ లో గూడా ఉన్నారు. కొందరు గుర్తింపు కార్డులైన ఆధర్ కార్డు, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ లను అక్రమంగా సంపాదించి పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారించగా రోహింగ్యా యువకుడిని తేలడంతో పహడి షరీఫ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
  మయన్మార్ దేశపు రాఖయిన రాష్ట్రము భూతిడౌంగ్ చెందిన వాడని , ఇతని పెరు మహ్మద్ ఇస్మాయిల్ గా  గుర్తించటం జరిగింది. 2014 లో ఇతను బంగ్లాదేశ్ గుండా కొలకత్తా చేరి అక్కడి నుండి ఢిల్లీ చేరి అక్కడి నుండి కర్ణాటకలోని బెల్గాం చేరి కొంతకాలం పని చేసి పెరుమార్చుకుని హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ దుకాణాల్లో పనిచేస్తుండేవాడు.
   మయన్మార్ నుండి పారిపోయి వస్తున్న రోహింగ్యాలను భరత్ నుండి వెల్లగొట్టొద్దని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగపు అధిపతి అల్-హుస్సేన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అక్రమ వలస దారులు దేశ భద్రతకు సవాళ్లుగా మారె అవకాశం ఉండటంతో వారి పట్ల అనేక దేశాలు మాదిరిగానే భారత్ కు కూడా ఆందోళన కలుగుతోందని మన దేశ శాశ్వత ప్రతినిధి రాజీవ్ చందా తెలిపారు.
  మయన్మార్ దేశానికి శిక్ష తప్పదని, రోహింగ్యా ముస్లింలకులకు ఆర్థిక సహాయము, ఆయుధాలు, మిలిటరీ సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు విజ్ఞప్తి చేస్తూ అల్-ఖైదా అనే సంస్థ విజ్ఞప్తి జారీ చేసింది. ఇలాంటి వాటి పట్ల భారత ప్రజలు  సైతం జాగ్రత్తగా ఉంటూ స్థానికంగా ఎవరైనా కొత్త వారు వస్తే తగిన అధికారులకు సమాచారాన్ని అందించాలి.

— మయాన్మార్ లోని వీ.ఎస్.కె సభ్యులు
--- విశ్వ సంవాద కేంద్రము {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top