4 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు సంఘటనలు - 4 August 1947: Incident's 15 days before partition

Vishwa Bhaarath
దేశ విభజన
దేశ విభజన

– ప్రశాంత్ పోల్     
రోజు ఆగష్టు 4, 1947, సోమవారం. డిల్లీ లో వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ రోజూ కంటే తొందరగా తన పని మొదలు పెట్టారు. బాగా ఉక్కపోతగా ఉంది, ఆకాశం కూడా మబ్బు పట్టింది. చినుకు చుక్క రాలలేదు. వాతావరణం ఎంతో నిరాశాజనకంగా, చికాకుగా ఉంది. అన్ని బాధ్యత లు ముగించుకుని విశ్రాంతి తీసుకోవాలంటే మౌంట్ బాటన్ ఇంకా పదకొండు రోజులు ఆగాలి. 15 ఆగస్ట్ తరువాత ఆయన భారతదేశంలోనే మొదటి గవర్నర్ జనరల్ గా వున్నా బాధ్యతలు మాత్రం వుండవు. బాధ్యతలు అన్నీ భారతీయ నాయకులు చూసుకుంటారు. ఆయనకు వున్న సమస్య ఈ పదకొండు రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలే. తన నిర్ణయాల మంచి చెడు ఏదైనా జీవితాంతం తనను వెంటాడుతాయి. పైపెచ్చు బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రను కూడా ప్రభావితం చేస్తాయి. ఇదే ఆయనకు చాలా ఆందోళన కలిగించే అంశం.
   ఈ రోజు మొదటి సమావేశం “ బలూచిస్తాన్ “ గురించి. బలూచిస్తాన్ ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోనే వుంది.  ఇరాన్ సరిహద్దుగా వున్న ప్రాంతం, పైగా ముస్లిం జనాభా అధికంగా వున్న ప్రాంతం. కనుక స్వభావసిద్దంగా వారు పాకిస్తాన్ లో కలుస్తారు అని అందరి అభిప్రాయం. కానీ అక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది. వారి జీవన విధానం, సంస్కృతి, పాకిస్తాన్ వైపు పంజాబీ, సింధి  ముస్లింల కంటే భిన్నంగా వుండేది. పైగా వారి భాష కూడా పూర్తి భిన్నమైన బలూచ్ భాష.  ఇరాన్ ప్రాంతంలోని “ ఆవస్థ “ అనే పేరు గల భాష ప్రభావం బలూచ్ భాష పై ఎక్కువ గా వుండేది. కొద్దో గొప్పో సంస్కృత భాషను పోలి వుండేది. అందుకే బలూచి ప్రజలు పాకిస్తాన్ లో చేరిపోవాలని ఎప్పుడు ఆలోచించలేదు.  అలా అని చేరకూడదని  కూడా నిర్ణయించుకోలేదు.

బలూచ్ ప్రజలు రెండు వర్గాలుగా చీలినట్టుగా అనిపిస్తుంది. ఒక వర్గం ఇరాన్ లో కలుద్దామా అని ఆలోచన చేశారు. ఇరాన్ లో షియా ముస్లింల రాజ్యం నడుస్తూ వుండటం వల్ల, బలూచిలు సున్నీలు కావటంవల్ల ఆదిలోనే ఆ ఆలోచన వదిలేయ్యాల్సి వచ్చింది. ఎక్కువమంది వున్న రెండవ వర్గం భారత దేశంలో కలవాలన్న ఆలోచననే బలపరిచేవారు. ఎక్కువ మంది నాయకుల ఆలోచన కూడా భారత దేశం వైపే వుంది. కానీ భౌగోళికమైన ఇబ్బందు లువల్ల యీ ఆలోచన మొగ్గలోనే తుంచెయ్యాల్సి వచ్చింది. బలూచిస్తాన్ కి భారత దేశ భూభాగానికి మధ్య పంజాబ్ సింధ్ ప్రాంతం అడ్డుగా వుంది. చివరికి రెండే అవకాశాలు, ఒకటి పాకిస్తాన్ లో కలవటం లేదా ఒక స్వతంత్ర దేశంగా అవతరించటం. మౌంట్ బాటన్ ఈ రోజు ఈ విషయం పైననే చర్చించాలి.
  ఈ ముఖ్యమైన  సమావేశంలో బలూచిస్తాన్ కి చెందిన కలాత ఖాన్ బిరుదుగల మీర్ అహ్మెద్యార్ ఖాన్ అనే నాయకుడు, మహమ్మద్ అలీ జిన్నా పాల్గొనాల్సి వుంది. జిన్నా ఆగష్టు 7 న కరాచీ వెళ్లవలిసి వుంది అందుకని ఆయన సౌకర్యార్ధం ఈరోజు ఇలా ప్రొద్దున్నే సమావేశం నిర్ణయించారు.  
   ఈ సమావేశంలో మీర్ అహ్మెద్యార్ ఖాన్ భవిష్యత్ లో ఏర్పడే పాకిస్తాన్ విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ వున్నా మౌంట్ బాటన్ కు మాత్రం బలుచిస్థాన్ పాకిస్తాన్ లో కలిస్తేనే బాగుంటుందని అనిపించింది. చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు  ఏర్పడితే అధికారాలు అప్పగించడం చాలా కష్టమైన పని. అందుకని ఆయన తెలిసి తెలిసి అనేక వ్యర్థ వాగ్దానాలు చేస్తున్నాడు. అర చేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న జిన్నా మాటలతో ఏకీభావం తెలుపుతూ వున్నాడు. చివర్లో పాకిస్తాన్ లో విలీనం అయ్యేట్టు మీర్ అహ్మెద్యార్ ఖాన్ మొగ్గు చూపించినట్టు అనిపించినా, సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయింది.
……
అక్కడ దూరంగా పంజాబ్ ప్రాంతం లోని లాయలాపూర్ జిల్లాలో ముస్లిం తీవ్రవాదం పడగలెత్తటం మొదలైంది. లాయలాపూర్ ప్రాంతం బాగా సారవంతమైన ప్రాంతం. గోధుమలు, కాటన్, చెరుకు పంటలు ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వచ్చేది. జిల్లా మొత్తం సంపన్నమైన ప్రాంతం. ఎన్నో కాటన్ మిల్లులు, గోధుమ మిల్లులతో అలరారుతూ వుండేది. లాయలాపూర్, గోజ్రా, జార్న్ వాలా, తందేవాలా లాంటి నగరాలలో బట్టల మిల్లులు, కార్ఖానాలు వుండటం వల్ల పెద్ద పెద్ద బజారులు కూడా వున్నాయి. ఈ పెద్ద పెద్ద మిల్లులు, కార్ఖానాలు ఎక్కువగా హిందువులు, సిక్కుల యాజమాన్యంలో వుండేవి. 60 పెద్ద పెద్ద మిల్లులు హిందువులు సిక్కుల యాజమాన్యంలో వుంటే కేవలం 2 మిల్లు లు ముస్లింల యాజమాన్యంలో వుండేవి. సముచే జిల్లాలో 75 శాతం పొలాలు సిక్కు చేతిలో వుండేవి. పోయిన సంవత్సరం 1946 లో లాయలాపూర్ జిల్లాలో హిందువులు, సిక్కులు కలిసి 61 లక్షల 90 వేల రూపాయల శిస్తు కడితే ముస్లిమ్ లు కట్టిన శిస్తు కేవలం 5 లక్షల 30 వేల రుపాయలు.
  లాయలాపూర్ జిల్లా పాకిస్తాన్ లో కలుపుతారు అన్న వార్త రావటం, అక్కడక్కడా ముస్లిం లీగ్ పోస్టర్లు కనిపించినా హిందూ, సిక్కు వ్యాపారులు ఇదొక సమస్యగా తీసుకోలేదు. జిల్లా డిప్యూటీ కమిషనర్ హమీద్ ముస్లిం అయినా, నిష్పక్షపాతమైన అతని వ్యవహారం వల్ల హిందువులు, సిక్కులు తాము సురక్షితమేనని భ్రమ పడ్డారు.

ఈరోజు 04 ఆగస్టు 1947, లాయలాపూర్ జిల్లాలో జరన్ వాలాలో ముస్లిం నేషనల్ గార్డ్ ల సమావేశం జరుగుతుంది. 15 ఆగస్టు లోపే హిందువులు సిక్కుల వ్యాపారులని, రైతులని ఎలా తన్ని తరిమేయ్యాలి? వారి ఆస్తులను, సంపదను, ఎలా దోచుకొని నరికి చంపాలి అనే విషయమై తీవ్రమైన చర్చ జరుగుతోంది. లాహోర్ నుంచి వచ్చిన పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు. హిందూ సిక్కుల యువతులను వదిలి మిగతా అందరినీ నరికి చంపాలని. ముఠాలు ముఠాలుగా దాడి జరపాలని అర్ధరాత్రి సమయంలో మిల్లు యజమానుల ఇళ్లపై దాడి చేయాలని నిర్ణయం జరిగింది.
   ఈ రోజు రాత్రి అనగా 04 ఆగస్టు 1949 రాత్రి ఎవరైనా హిందూ సిక్కులు ‘ వచ్చే వారం పది రోజుల్లో ఇల్లు ఆస్తులు అన్ని వదిలేసి ప్రాణ భయముతో పారిపోయి శరణార్థి శిబిరాలలో రొట్టెల కోసం అడుక్కుని తినవలసి వస్తుందని, వేల మంది హిందూ యువతులు సగానికి పైగా నరికి చంపి వేయబడతారు అని చెప్తే ‘ వారిని పిచ్చి వాళ్ల క్రింద జమ కట్టిఉండేవారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సంఘటనలు అన్నీ నిజంగానే జరిగాయి.
——-
ఇక్కడ ఢిల్లీ 17 యార్క్ రోడ్డులో నెహ్రూ నివాసం హడావిడిగా వుంది. స్వతంత్ర భారతదేశంలో మొట్ట మొదటి మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించిన హడావిడి. బాబూ రాజేంద్ర ప్రసాద్ కి మంత్రి వర్గం నిర్ణయానికి సంబంధించిన నియామక పత్రం అందజేయాలని హడావిడి. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారికి సంబందిత పత్రాలు పంపించడం జరిగింది.
——–
ఇక్కడ శ్రీ నగర్ లో గాంధీజీగారి రోజూవారీ కార్యక్రమం ప్రారంభమైంది. గత మూడు రోజులు కిశోరీ లాల్ సేఠ్ ఇంట్లో చాలా విశ్రాంతిగా గడిచాయి. ఈరోజు జమ్మూ బయలుదేరి వెళ్లటానికి సిద్ధమవుతున్నారు. జమ్మూలో ఎక్కువ రోజులు వుండే ఆలోచన లేదు, తొందరలో పంజాబ్ ప్రాంతానికి వెళ్లాలి. ఈ ఆలోచనలతొ ఈ రోజు ఉదయం అల్పాహారం ముగించి కూర్చుని వుండగా, షేక్ అబ్దుల్లా భార్య బేగం అక్బర్ జహాన్, తన కూతురితొ కలిసి గాంధీ గారికి వీడ్కోలు పలకటానికి వచ్చారు. ఆవిడ మనసులోని కోరిక ఏమిటీ అంటే, గాంధీజీ తన పూర్తి పరపతి ఉపయోగించి  షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చెయ్యాలి అని. అదే విషయాన్ని ఆవిడ పదే పదే గాంధీజీ తో ప్రస్తావించేది, ఆయన తన బోసి నవ్వుతో తల ఊపుతూ వున్నారు. ( అప్పుడు ఆవిడకి తెలియని విషయం ఏమిటీ అంటే షేక్ అబ్దుల్లా శిక్షా కాలం ముగిసే లోపలే, అంటే నెలన్నర లోపే, విడుదల అవబోతున్నాడని)....ఇంటి బయట హడావిడిగా ఉంది. ఇంటి యజమాని కిశోరీ లాల్ సేథీ స్వయంగా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వాహనాలు వరుసగా నిలబడి వున్నాయి, మహారాజా హరిసింగ్ తరుపున ప్రతినిధి గాంధీజీకి వీడ్కోలు పలకటాని కి వచ్చారు. సరిగ్గా ఉదయం పది గంటలకు గాంధీజీ తన మొట్టమొదటి కాశ్మీర్ పర్యటన ముగించుకొని జమ్మూ బయలుదేరారు.
——
సయ్యద్ హాసన్ జిన్నావీరభక్తుడు, పంతొమ్మిది యేళ్ళ కుర్రాడు. కరాచీలోనే పుట్టాడు. అక్కడే పెరిగాడు. కాలేజీలో “ ముస్లిం నేషనల్ గార్డ్స్” చే ప్రభావితుడై మూఢభక్తిగల కార్యకర్తగా రూపాంతరం చెందాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కరాచీలోని క్లిఫ్టోన్ అనే పేరుగల సంపన్నులు వుండే ప్రాంతంలో ఒక మసీదులో అతను ముస్లిం యువకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం ముఖ్య అంశం , కరాచీలోని హిందువులని ఎలా తన్ని తరిమెయ్యాలి అని.  వివిధ రకాల ప్రణాళికలు ఆలోచిస్తున్నారు.
   ఆగష్టు 7 వ తారీకు సాక్షాత్తు జిన్నా మహాశయుడు లాహోర్ విచ్చేయ్యబోతున్నాడు, ఆయన స్వాగత సత్కారాలు కూడా ఈ సమావేశంలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి. ముస్లిం నేషనల్ గార్డ్ సభ్యులు అందరూ చాలా ఉద్వేగం తో గంతులు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరుగుతోంది, ఒక కార్యకర్త  ఆర్ ఎస్ ఎస్ శిక్షణ కార్యక్రమమే బాగుందని అంటే అందుకు అందరూ ఏకీభవించారు. అందుకే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు , లేదా కొంతమంది సిక్కులు తప్పితే మిగితా ఎవ్వరూ తమ దమనకాండను అడ్డుకోలేరు అన్నదిమాత్రం అంతా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందువుల పై దాడికి ప్రణాళికను రచించాలి అని నిర్ణయించారు.
—–
ఉదయం వైస్ రాయ్ హౌజ్ లో బలూచిస్తాన్ విషయమై సమావేశం ముగించుకుని బారిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా 10 ఔరంగజేబ్ రోడ్ లో వున్న తన బంగాళాకు వచ్చాడు. డిల్లీలోని లూటియన్ ప్రాంతంలోని ఈ బంగళా 1938 లోనే ఆయన కొన్నారు. అదొక విశాలమైన భవంతి. గత నాలుగైదు సంవత్సరాలలో  ఎన్నో చారిత్రక రాజకీయ  సమావేశాలకు అది మౌన సాక్షి. అయితే జిన్నాకి తను చేస్తున్న పనులపై పూర్తి అవగాహన వుంది. తనకు డిల్లీతో ఋణం తీరబోతున్నదని,  పెట్టె బేడ సర్దుకుని వెళ్ళాలని కొన్ని నెలల క్రితమే తెలుసు. అందుకే గత నెలలోనే తన బంగళా ప్రసిద్ద వ్యాపారవేత్త రామకృష్ణ దాల్మియాకి అమ్మేశారు.
  ఇక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఈ బంగాళాలో ఉండలేనని, ఖాళీ చెయ్యాల్సిన రోజు దగ్గరలో ఉందని జిన్నాకి స్పష్టంగా తెలుసు.  అందుకే సామాను సర్దటం మొదలైంది. వచ్చే గురువారం 7 ఆగష్టు మధ్యాహ్నం మౌంట్ బాటన్ ఏర్పాటు చేసిన డకోటా విమానంలో కరాచీ, అంటే పాకిస్తాన్, అంటే తను కలలు కన్నదేశానికి  ప్రయాణం కాబోతున్నారు.
   ఆయన తన హడావిడిలో తాను ఉంటే హైదరాబాద్ నవాబ్ ప్రతినిధి బృందం ఆయన కోసం బయట వేచి వుంది. హైదరాబాద్ నవాబ్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయకూడదని, వీలైతే పాకిస్తాన్ లో కలపాలని ఉవ్విళ్లూరుతూ వున్నాడు, కానీ భౌగోళిక సమస్యల వల్ల అది సాధ్యం కాదు. అందుకని నైజాం స్వతంత్ర రాజ్యంగా వుండాలని ఆశపడుతున్నాడు, అయితే మిగతా ప్రపంచ దేశాలతో వ్యాపారం జరుపుకోవాలి అంటే తన రాజ్యానికి ఒక ఓడరేవు కావాలి, హైదరాబాద్ రాజ్యంలో సముద్రమే లేదు. ఇక ఓడరేవు ఎక్కడిది. పైగా ఆ ప్రాంతం భారత దేశానికి సరిగ్గా మధ్యలో ఉంది. అందుకే మౌంట్ బాటన్ తో చెప్పి భారతదేశంలోంచి ఒక సురక్షితమైన ఓడరేవుకి వెళ్ళే మార్గాన్ని చూపించమని వినతి పత్రం సమర్పించడానికి, మహమ్మద్ అలీ జిన్నా తన స్వహస్తాలతో మౌంట్ బాటన్ కి ఒక ఉత్తరం వ్రాయమని చెప్పటానికి వారు వచ్చారు. వచ్చిన ప్రతినిధి బృంధానికి జిన్నా అన్ని మర్యాదలు చేశాడు. ధనవంతుడు, భూస్వామి అయిన నిజామ్ రాజుని బాధ పెట్టడం ఇష్టంలేని జిన్నా వారు అడిగిన విధంగా వైస్ రాయ్ కి ఉత్తరం రాస్తానని తెలిపి వారిని సాగనంపాడు. సాయంత్రమైంది. గోధూళి వేళ ఆకాశం ఇంకా మేఘావృతమై వుంది. అదే నిరుత్సాహమైన వాతావరణం. ఇంత నిరుత్సాహమైన పరిస్తితులో కూడా జిన్నా తను కలలు కన్న దేశం గురించి ఆలోచిస్తూ ఉత్సాహపడటానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు.
——-
అక్కడ దూరంగా ముంబైలోని లేమింగ్టోన్ రోడ్ లో నాజ్ కినేమా పక్కన వున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం . కార్యాలయం చిన్నదేకానీ ఈ రోజు పరిసరాలు అన్నీ అతి చైతన్యవంతంగా వున్నాయి. చాలామంది స్వయం సేవకులు కార్యాలయం వైపు వెళుతూ కనిపించారు. చీకటి పడింది దీపాల వేళ అయింది. ఈ రోజు కార్యాలయం లో సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ వున్నారు.
  ముంబై అధికారులతో జరిగిన  సమావేశం అప్పుడే సమాప్తం అయింది, సంఘ్ ప్రార్ధన కూడా ఆలపించారు. వరుసల్లో స్వయంసేవకులు బయటికి వస్తున్నారు. అందరికీ శ్రీ గురూజీని కలవాలని కోరిక. ఆయన్ని ఇలా ప్రత్యక్షంగా కలవటం వల్ల వారు చాలా నేర్చుకోగలుగుతారు.
  కానీ ఈ రోజు కుతూహలంతో పాటు దిగులు కూడా అందరి మనసుల్లో వుంది. జూన్ 3న  తీసుకున్న నిర్ణయం ప్రకారం గురూజీ సింధ్ ప్రాంతానికి నాలుగు రోజుల పర్యటనకు బయదేరుతున్నారు. అయితే ఆ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ లో కలవబోతున్నాయి. కరాచీ, హైదరాబాద్, నవాబ్ షాహ్ లాంటి సముద్ర ప్రాంతంలోని నగరాలు పాకిస్తాన్ చేతిలో చిక్కబోతున్నాయి. ఈ సింధ్ ప్రాంతంలో అప్పుడే గొడవలు మొదలైనాయి. అదే అందరి మనస్సులో దిగులు.  
   ముస్లిం లీగ్ కు చెందిన ముస్లిం నేషనల్ గార్డ్స్ 15 ఆగష్టు లోపే సింధ్ ప్రాంతంలోని అంధరు హిందువులని తుడిచి పెట్టేయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. జిన్నా నివసించబోతున్నాడు కాబట్టి కరాచీని ఏర్పడబోయే పాకిస్తాన్ కి అప్రకటిత రాజధానిగా నిర్ణయించేశారు. దీనివల్ల కరాచీలో సైన్యం పోలీసు నిఘా ఎక్కువగా ఉంది. ఆ కారణంగా కరాచీ నగరంలో హిందువుల పై అత్యాచారాలు దాష్టీకాలు తక్కువగా జరిగాయి. కానీ హైదరాబాద్ , నవాబ్ షాహీ లాంటి నగరాలలో, అలాగే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం హిందువులపై, సిక్కులపై అంతులేని అరాచకాలు, హిందూ యువతుల అపహరణలు, అత్యాచారాలు. ఇళ్ళువాకిళ్ళు. వ్యాపారాలు, ఫ్యాక్టరీలపై దాడులు లెక్క లేనంతగా జరిగాయి. హిందువులు విడిగా కనిపిస్తే చాలు అడ్డంగా నరికి పారెయ్యటంలాంటి సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి విపరీతమైన పరిస్తితుల్లో గురూజీ భద్రత విషయం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
   సింధ్ ప్రాంతం తగలబడి పోతోంది, హిందూ ఆడపిల్లలని ఎత్తుకు పోవటం ముస్లిం గుండాలకి ఒక దినచర్యగా మారి పోయింది. పోలీసులు తక్కువగా వున్న ప్రాంతాలలో, పోలీసులు కూడా ఈ అరాచక శక్తులకి సహాయం అందించారు. ఇలాంటి కఠిన పరిస్తితుల్లో స్వయంసేవకులు తమ శక్తిమేరా హిందువులను కాపాడుతూ వారిని భారతదేశం చేర్చే మార్గం చూస్తున్నారు. ఈ ధైర్యవంతులైన స్వయంసేవకులను కలవటానికి, దిశానిర్దేశం చేయటానికి గురూజీ, డాక్టర్ ఆబాజీ ధత్తే కలిసి పర్యటన చెయ్యబోతున్నారు.
——-
రాత్రి 11 గంటల సమయం , ఆగష్టు నెలలో ఇది చలి ఎక్కువగా ఉంది.  సింధ్, బలూచిస్తాన్, బంగాల్ లాంటి ప్రాంతాలలో హిందువులు సిక్కుల ఇళ్ళల్లో రాత్రి జాగారం తప్పని సరైంది, భయానకమైన యీ వాతావరణంలో ఎవ్వరికీ నిద్ర పట్టడం లేదు కూడా. కంటి మీద కునుకు లేదు, ఇంటి బయట యువకులు గస్తీ తిరుగుతున్నారు వాళ్ళ భధ్రత విషయంలో ఇంటిలోని వృద్దులకు , స్త్రీలకు దిగులు. దేశాన్ని అధికారికంగా చీల్చటానికి ఇంకా పది రోజుల సమయమే వుంది.
   లాయల్ పూర్ జిల్లాలో జరన్వాలా సంపన్నమైన గ్రామం, ఒక నగరంలో ఉండే సంపద ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో హిందువులు, సిక్కులు అధిక సంఖ్యలో వున్నారు, ఆ ధైర్యంతో ముస్లింలు ఈ గ్రామంపై దాడి చేసే ధైర్యం చెయ్యరు అనే పిచ్చి నమ్మకంతో అంతా వున్నారు. కానీ గ్రామంలో అన్ని వైపుల నుంచి యాభై యాభై మంది ఉన్న ముస్లిం గుంపులు వచ్చిపడ్డాయ్. అందరూ ముస్లిం నేషనల్ గార్డ్ కు చెందిన వారే.  కత్తులు, బాకులు , బరిసేలు తీసుకొని “ అల్లాహో అక్బర్ “ అని అరుచుకుంటూ మొదటగా సర్దార్ కర్తార్ సింగ్ ఇంటిపై దాడి ప్రారంభించారు. సర్దార్ కర్తార్ సింగ్ ఇల్లు మామూలు ఇల్లు కాదు. అది ఒక పటిష్ట మైనకోట . ఆ మహల్ లో 18 మంది కుటుంబ సభ్యులు. వారు కూడా తమ కృపాణాలు, కత్తులు తీసుకుని తయారుగానే వున్నారు. ఇంటి స్త్రీలు కూడా లాఠీలు, చాకులు లాంటి ఆత్మ రక్షణ ఆయుధాలతో సిద్దం గానే వున్నారు, కోపంతో ఎర్రబడ్డ కర్తార్ సింగ్ కళ్ళు నెత్తురు చిమ్ముతున్నాయి.
   బయటి నుంచి కిరోసిన్ లో తడిపిన గుడ్డల బంతులు ఎగిరి పడటం ప్రారంభమైంది. వసారా తలుపులు తగల పడటం మొదలైంది, మండుతున్న గుడ్డ బంతుల వర్షం మొదలైంది. ఇల్లు తగలపడిపోతోంది.  ఇంట్లో వున్న వారు బయటకు రావటం తప్ప గత్యంతరంలేని పరిస్తితి. “ జో బోలె సొ నిహాల్ , సత్ శ్రీ అకాల్ “ అంటూ కర్తార్ సింగ్, కుటుంబంలోని 11 మంది పురుషులు నిప్పులుకక్కుతూ కత్తులు దూసి బయటకు వచ్చారు, అంత పెద్ద ముస్లిం మూకను ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు. దాదాపు అరగంట సేపు పోరాటం చేశారు. కానీ దురదృస్టవశాత్తు తొమ్మిదిమంది అక్కడే నరికి చంపబడ్డారు. గ్రామంలోని మిగతా హిందువులు వీరిని కాపాడటానికి రావటంవల్ల ఇద్దరు మాత్రం రక్షించబడ్డారు. ఇంట్లో మిగిలిన ఏడుగురు స్త్రీలలో నలుగురు వృద్దులను ముస్లిం నేషనల్ గార్డ్ కార్య కర్తలు మంటలల్లో తోసి చంపేశారు. ఇద్దరు సిక్కు యువతులని ఎత్తుకుని పారిపో3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?యారు. కర్తార్ సింగ్ భార్య ఏమైందో ఎవరికి తెలియలేదు. 
   ముస్లింల దమనకాండ ఇలా విస్తరించడంతో 4 ఆగష్టు అర్ధరాత్రికి అనేక ప్రదేశాలలో వేలల్లో హిందువుల, సిక్కుల కుటుంబాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, ఆస్తిపాస్తులను వదులుకొని హిందూస్థాన్ కు తరలిపోవాలనే నిర్ణయానికి వచ్చాయి.  

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top