అందరికీ ఆత్మీయుడు, స్నేహశీలి దత్తోపంత్ జీ - Dattopant ji

అందరికీ ఆత్మీయుడు, స్నేహశీలి దత్తోపంత్ జీ - Dattopant ji
దత్తోపంత్ జీ - Dattopant ji
సంఘం అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి, కార్మికరంగంలో ఉన్న సాధక బాధకాలు తెలుసుకొనేందుకు ఆయన ఐఎన్టీయూసీలో చేరి అనుభవం సాధించి భారతీయ మజ్దూర్ సంఘ్ అనే కార్మిక సంస్థను ప్రారంభించారు. రష్యా పర్యటన సమయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు హిరేన్ ముఖర్జీ దత్తోపంత్ జీతో మాట్లాడుతూ మీకు అధికారమిస్తే అంతా ధనవంతుల చేతుల్లో పెడతారు అని అన్నారు. అప్పుడు ఠేంగ్డీజీ హిందుధర్మం ఏమి చెబుతుందో మీరు సరిగా అర్థం చేసుకోలేదు అంటూ ఈ విధంగా ఉదహరించార:- 

(తన శరీర రక్షణకు, పోషణకు ఎంత అవసరమో అంతవరకే సంపాదించడానికి మనిషికి అధికారం ఉంది. అంతకంటే అధికంగా ఎవరు గడిస్తారో వారు దొంగలు, శిక్షార్హులు.)
   భారతీయ మజ్దూర్ సంఘ్ నిబంధనాళిలో (బై-లాస్ లో) ఈ శ్లోకాన్ని గురూజీ పెట్టించారని ఆయనతో చెప్పారు. అప్పుడు హిరేన్ ముఖర్జీ 'నేను గురూజీ విషయంలో నా అభిప్రాయాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సి ఉంది' అని అన్నారు. అలా ఓక భ్రమలో ఉన్న వ్యక్తికి సంఘ సిద్ధాంతం అర్థం అయ్యేట్లు చేశారు. ఆ తర్వాత హంగేరి నుండి హిరేన్ ముఖర్జీ లండన్ కు, ఠేంగ్డీజీ కైరో వెళ్లడానికి సిద్ధం అవుతున్న సమయంలో మీ స్థానం ప్రపంచంలో నిర్ణయం అయిపోయిందని స్వయంగా ఆయనే దత్తోపంత్జీతో అన్నారు.

వామపక్ష వాది గొంతు నుండి వందేమాతరం:
ఎవరైతే బీఎంఎస్ ఆలోచనను వ్యతిరేకిస్తూ వచ్చారో వారితోనే 'వందేమాతరం, భారత్ మాతాకీ జై' అనిపించిన ఘనత ఠేంగ్డీజీకి దక్కుతుంది.  ప్రారంభంలో కార్మిక సంస్థలను నడపడం మీకు చేతకాదంటూ వాళ్లు హేళన చేశారు. హిందుత్వ వాదులకు కార్మికుల ఆకలి, ఆవేదన తెలియదు అంటూ హేళనగా మాట్లాడారు. ఆ వ్యక్తులు చూస్తూ ఉండగానే దేశమంతా బీఎంఎస్ కార్యకలాపాలు విస్తరించాయి. అంతేకాకుండా దేశంలోనే కార్మిక రంగంలో ప్రథమస్థానాన్ని సాధించింది. 2011లో కార్మిక సంస్థల ఉమ్మడి నిరసన సభ ఢిల్లీలో జరిగింది. ఆ సభలో ఎఐటీయూసీ వామపక్షనేత గురుదాస్ గుప్త చేత (రాజ్యసభ సభ్యుడు) 'వందేమాతరం, భారత మాతాకీ జై' అని నినాదం చేయించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. నిత్యం వ్యతిరేకించే వ్యక్తులతో కూడా సంస్థ శక్తి ద్వారా మన ఆలోచన విధానం దేశీయమైంది, నత్యమైంది అని అంగీకరింపచేశారు.

తరతమ భేదంలేని ప్రేమమూర్తి:
ఠేంగ్డీజీ సంఘ స్వయంసేవకులకు, అనుబంధ సంస్థల కార్యకర్తలకు, ప్రచారకులకు తల్లిలాంటి ప్రేమను అందించారు. ప్రచారక్ జీవనానికి ఒక సజీవ మార్గాన్ని చూపించారు. అలాగే వివిధ సిదాంత నేపథ్యాలు కలిగిన వ్యక్తులతో, సంస్థలతో తన నిష్కళంకమైన ప్రేమ ద్వారా అనేకమంది హృదయాలను జయించారు. సామ్యవాదులు, అంబేడ్కర్ వాదులు, వామపక్షవాదులను ఆకట్టుకోన్నారు. తన సహజమైన, స్నేహభావంతో అందరి చేత ప్రశంసలు పొందారు. స్వయంసేవకుల కుటుంబాలతోనూ ఆత్మీయమైన బంధాన్ని ఏర్పరచుకొన్నారు.

మంత్రముగ్ధులను చేసే వ్యక్తిత్వం-ఆకర్శణీయ నాయకత్వం:
    దత్తోపంత్జీ చేయి ఎవరి వీపుపైన పడుతుందో  ఆ వ్యక్తి సమాజ కార్యానికి అంకితం అయిపోతారు. విలక్షణమైన ఆకర్షణ ఆయనలో ఉండేది. అద్భుతమైన నాయకత్వ లక్షణం, మాతృహృదయం, కరుణభావన ఉన్న వ్యక్తి ఠేంగ్డీ. కార్యకర్తల హృదయాల్లో ప్రఖరమైన దేశభక్తి భావనను రగిలించేవారు. దానివల్ల ఎంతో మంది కార్యకర్తలు కుటుంబాన్ని మరిచిపోయి బిఎంఎస్ జెండాను ఉన్నతస్థానంలో ఎగరేసేందుకు అహోరాత్రులు శ్రమించారు. కార్యకర్త లక్షణం తోటి కార్యకర్తలను పనిలో భాగస్వాములను చేయడం, ఒకే వ్యక్తి అన్ని పనులు చేయడం కార్యకర్త లక్షణం కాదు.

నిరంతర ప్రేరణ:
సాధారణ జీవన శైలి ఆయనది. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ తాను కూడా ఒక సామాన్య కార్యకర్తగా జీవించారు. 1994 డిసెంబరు 18, 19న బెంగాల్లో జరిగిన అఖిల భారతీయ నమ్మేళనంలో ఆయన వ్యవహరించిన తీరు, కార్యక్రమాలు నిర్వహించిన విధానం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. ఠేంగ్డీజీ అందరు ప్రతినిధుల వలె 17న రైల్వే స్టేషన్ నుండి సమ్మేళన స్థలానికి వాహనంలో వెళ్తున్నారు. దారిలో రాత్రి చీకటివేళ నినాదాలు చేస్తూ, నడిచి వెళ్తున్న కొంతమంది ప్రతినిధులు కనిపించారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకున్నారు. ఒక ఫర్లాంగు దూరం వెళ్లిన తరువాత వాహనం ఆపి, తానుకూడా దిగి అందరితో కలిసి నడుస్తూ సమ్మేళన స్థలానికి చేరుకున్నారు. స్థానిక కార్యకర్తలు వాహనంలో రమ్మని చెప్పినప్పటికీ మూడు కిలోమీటర్ల దూరం వరకు అందరితో కలిసి నడిచారు. ఆ విధంగా నిరంతరం తన సహజ స్వభావంతో కార్యకర్తలతో కలసిమెలసి ఉండేవారు. 
    ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు కార్యకర్తలు ఎలా ఉండాలో, పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో ఒక దివ్యమైన మార్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి రేంగ్జీజీ, ఒక సందర్భరంలో కార్యకర్తను చూసి కార్యక్షేత్రాన్ని, కార్యక్షేత్రాన్ని చూసి కార్యకర్తను అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. కార్యకర్త "అత్యధీపోభావమ్" లాగా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడకూడదు. తనకు తానే ప్రేరణ పొందాలి. సమాజంలో మచ్చలేని వ్యక్తిగా జీవించినప్పుడు ఆ ప్రభావం ఇతరులపై చూపుతుందని చెప్పారు.
     కార్మీకోద్యమాల్లో హిందూత్వ భావనను మేల్కొల్పడంలో రేంగ్డీజీ నిర్వహించిన తీరు విలక్షణమైంది. బహుముఖ ప్రజ్ఞావంతుడిగా సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్యమైన కృషి సాగించి ధన్యులైన రేంగ్డీజీ జీవితం నేటి తరాలకు ఆదర్శం ఆ మహనీయుని శత జయంతిని పురస్కరించుకొని ఆయనను స్మరించడం మనందరి బాధ్యత. 

వ్యాసకర్త : తెలంగాణ ప్రాంత ప్రచారక్, భాగ్యనగర్
మూలము: జాగృతి
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top