సేవకార్యంలో హిందువుగానే మన గుర్తింపు - Our identity as a Hindu in service

Vishwa Bhaarath
0
హిందువుగానే మన గుర్తింపు
హిందువుగానే మన గుర్తింపు

:: సేవాకార్య నిర్వాహకులు గుర్తించవలసిన అంశములు ::

హిందువుగానే మన గుర్తింపు
  సేవ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నామో ప్రప్రథమంగా మనం గ్రహించాలి. ఈ సందర్భంలో ప.పూ,డాక్టర్టీ మనకు ఒక అవగాహన ఇచ్చారు. మనమంతా హిందువులం అందరూ మన సోదరులే. కులాలతో మన గుర్తింపుకాదు. హిందుత్వమే మన నిజమైన గుర్తింపు. సంఘ శిబిరాలకు పూజ్యగాంధీజీ మరియు డాక్టర్ అంబేడ్కర్జీ కూడా వచ్చారు. ఆ శిబిరాలలో వేల సంఖ్యలో అన్ని కులాలకు చెందిన స్వయంసేవకు లుండడం వారికి ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడా ఎలాంటి అస్సృశ్యతలేదు. ఎందుకంటే అందరి దృష్టి ఒకటే-మనమంతా హిందువులం.
  డాక్టర్టీ మరొక మాట చెప్పారు. వ్యక్తి ధనవంతుడైనా పేదవాడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా కావచ్చు. అందరిలో దేశభక్తి, జాతీయభావన అంతర్లీనంగా దాగివున్నది. అయితే దానిని మేల్కొల్పటానికి సరియైన దిశ మరియు సంస్కారాన్ని ఇవ్వవలసిన అవసరమున్నది. ప్రతివ్యక్తి సంస్కారాలద్వారా నరుడి నుండి నారాయణుడు కాగలడు.

  సమాజంలో అంతరాలు, విభేదాలు ఉన్నాయి. మనుషులమధ్య దూరం అంతకంతకూ పెరుగుతుంది. సమాజాన్ని కలపాలనేదే మన సేవాకార్యంయొక్క లక్ష్యం అదేవిధంగా ఉన్నతులు మరియు ఉపేక్షితులు- ఈ ఇరువర్గాల వారిని మన సంబంధాలద్వారా దగ్గరికి చేర్చాలి. సేవనే చివరి గమ్యం కాదని నిర్వాహకులు తెలుసుకోవాలి. సామాజిక సమరసత, దేశభక్తి భావనను
జాగృతం చేసి సామాజిక పరివర్తన తేవడమే మన లక్ష్యం హిందువులం అంతా ఒకటే అనేభావన మనం జాగృతం చేయాలి.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top