కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి - RSS Seva

సేవాకార్యంలో కార్యకర్త
సేవాకార్యంలో కార్యకర్త 

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
  సేవాకార్యం చేసేటప్పుడు అహంకారం కాదు, వినమ్రత ఉండాలి. ప్రథమ విశ్వహిందూ సమ్మేళనంలో అప్పటి పూరీ శంకరాచార్యులు అలిగి వెళ్ళిపోతే ప.పూ.గురూజీ  వినమ్రతతో వారి మనసు గెలిచి తీర్మానాల్ని ఆమోదించే సమయంలో వారిని వేదికమీదికి తీసుకువచ్చి కూర్చోబెట్ట గలిగారు. నేను శ్రేష్ఠుడను, వీరందరూ అల్పులు, తక్కువవారు అనే మనోప్రవృత్తి, గర్వము మంచిదికాదు. పేదవారివైపు నుండి కూడా ప్రేరణ లభించవచ్చు. 
  మీనాక్షిపురంలో చాలా కుటుంబాలు ముస్లింలుగా మారాయి. రంజాన్ మరునాడు చాలా దూరస్థలాల నుంచి ఇతర ముస్లింలు వస్త్రాలు, ధనాన్ని వారికి కానుకలుగా తెచ్చి పంచుతున్నారు. దూరంగా చిరిగిన దుస్తులతో నిలబడివున్న ఒక వృద్ధ స్త్రీని గమనించిన మన కార్యకర్తలు ఆమెతో అమ్మా మీకు ఏమి దొరకలేదా? అని అడిగారు.
నాకు ఎందుకు ఇస్తారు? నేను ముస్లింగా మారలేదు కదా! అన్నదామె.
   ఎందుకు మారలేదు! ముస్లిం అయితే మంచి చీర,డబ్బు లభించేవి గదా! అనడంతో ఇది విన్న ముసలమ్మ ముఖము ఎర్రబడింది. 'చూడండి ఎదురుగా అక్కడ కాళికాదేవి మందిరం ఉంది. ఆ దేవి పేరుతోనే నాకు 'కాళి' పేరుపెటాడు. నాకు లక్ష రూపాయలు ఇచ్చినా నేను ముస్లింగా మారను. అని ఆమె మన కార్యకర్తలతో అన్నది. పేదవారిలో కూడా ఇంతగొప్ప స్వాభిమానం కనబడుతుంది. అందువల్ల సేవచేసేటప్పుడు మన మనసులలో శ్రేష్టమైన పనిచేస్తున్నామన్న భావన కలగాలే తప్ప జాలికాదు. నరసేవే నారాయణ సేవ. ఇది ఈశ్వరీయ కార్యము, ఈ పనికొరకు నేను ఒక మంచి సాధనముగా ఉండాలి అనే మనోభావనతోనే కార్యకర్త పనిచెయ్యాలి.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
ఎనిమిదవ భాగం: సంఘ సేవా భావన నిర్మాణం

∷ ∷  ∷ 
{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top