సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు - Rss Seva (Service activities and determination)

Vishwa Bhaarath
సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు
సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు

:: సేవ - అమృత వాక్కులు :: 
నారాయణ స్వరూపుడైన మానవుని పూజిస్తాను దయచూపే అధికారం భగవంతునికి తప్ప మనకు లేదు మనకు కేవలం పూజ చేసే అధికారం మాత్రమే వుంది.
__రామకృష్ణ పరమహంస

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సంఘం సేవాకార్యము - లక్ష్యము
సేవాకార్యము సంఘకార్యమే :
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకలాపాలు ప్రారంభంనుండి కూడా సేవాకార్యములతో కూడికొనియున్నవి. శారీరిక్, బౌద్ధిక్ విభాగములు మరియు వ్యవస్థ విభాగముల మాదిరిగానే సేవావిభాగము కూడా సంఘ కార్యంలో అంతర్లీనమై ఉన్నది. సంఘ నియమావళిలో కూడా ఈ విషయం పేర్కొనబడింది. నియమావళిలోని అధికరణం 7లో శాఖ మరియు 8లో కార్యక్రమాల వివరణ ఉన్నది. అందులో శారీరక, బౌద్ధిక మరియు మానసిక సంస్కార ములనందించే కార్యక్రమాల తోపాటు బలహీన వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచగల సేవాకార్యక్రమాల గురించి కూడా తెలుపబడినది. శారీరిక, బౌద్ధిక కార్యక్రమాలగురించి అనేక సంవత్సరాలుగా ఆలోచిస్తూ, చాలా రోజులుగా కార్యాచరణ చేస్తున్న కారణంగా వాటి ప్రాధాన్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగాం. కానీ సేవాకార్యము ఇంకా మన మనసులలో స్థిరపడలేదు.
    మనం చాలా ముందునుంచే సేవాకార్యము చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో (1977) తుఫాను సమయంలో, గుజరాత్ లో మోర్వీ ఆనకట్ట తెగిపోయినప్పుడు వచ్చిన భయంకర వరదల సమయంలో మనం (సంఘం) ఎనలేని సేవాకార్యక్రమాలు చేసి చూపించాము. భారత్-పాక్
యుద్ధ సమయంలో మనం (సంఘం) సందర్భోచితంగా సైనికులకు సహాయ పడడం, రక్తదానం చేయడం మొదలగు అనేక సేవా కార్యక్రమాలు చేశాము. కర్ణాటకలో 'హిందూ సేవాప్రతిష్టాన్' దిల్లీలో 'సేవాభారతి' ద్వారా దాదాపు 30 సంవత్సరాల ముందునుంచే సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వనవాసీ క్షేత్రములో 1952 సంవత్సరం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పరమపూజనీయ గురూజీ ఈ పనికోసం ప్రప్రథమంగా శ్రీ బాలాసాహెబ్ దేశ్ పాండే గారిని పంపించారు.

   పరమపూజనీయ డాక్టర్ హెడేవార్ గారి జన్మశతాబ్ది  (1989 ఏప్రిల్ నుంచి 1990 ఏప్రిల్ వరకు) నిర్వహించిన సందర్భంగా సేవా కార్యక్రమాలను చాలా విస్తృతంగా మరియు సేవా విభాగాన్ని వ్యవస్థితంగా చేయాలని నిర్ణయం జరిగింది. అప్పటినుంచి శాఖలలో సేవాకార్యంగురించి విశేష ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. 'సంఘకార్యంలో పనివేగాన్ని పెంచే ప్రణాళిక' అను పుస్తకంలో కార్యకర్తలందరిని వారంలో ఒకరోజు తమ శాఖద్వారా సేవాబస్తీలలో సేవాకార్యక్రమం నడపాలని కోరబడింది. అందువల్ల సేవాకార్యము సంఘ కార్యమే. సంఘకార్యములో సేవావిభాగమును వ్యవస్థితము చేయబడుచున్నది. అందుకని అఖిలభారత సేవా ప్రముఖ్, క్షేత్ర, ప్రాంత స్థాయిలతో పాటు జిల్లా ఖండ స్థాయిల్లో కూడా సేవాప్రముఖ్'లను  నియమించే ఏర్పాట్లు జరిగినవి.
***
ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం


{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top