సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాధించ దలచినాము? - RSS Seva

Vishwa Bhaarath
ఆర్ఎస్ఎస్: సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాధించ దలచినాము? - RSS Seva
ఆర్ఎస్ఎస్: సేవా కార్యక్రమాలు

మార్గదర్శనం:
కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాధించ దలచినాము?
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మొత్తం సమాజాన్ని సంఘటితం చేసేసంస్థ. ఏదో ఒక వర్గానికి, కులానికి చెందినది కాదు. సంఘ ప్రార్థనలో మనం 'వయం హిందు రాష్ట్రాంగ భూతా:' అని, ప్రతిజ్ఞలో 'సమాజం యొక్క సర్వాంగీణ ఉన్నతి' అని చెప్తుంటాము. అంటే సమాజంలోని వివిధ వర్గాలు, కులాల ప్రజలందరిని అభివృద్ధి పరచడమే మన ఉద్దేశ్యం.
  మనపనిలో కొన్ని వర్గాలు ఉపేక్షించబడినవి. సమాజంలోని బలహీన వర్గాలోకి ప్రారంభంలో శాఖల ద్వారా ఏ మేరకు చేరుకోవాలో అంతగా మనం చేరుకోలేకపోయాము. ప.పూ. డాక్టర్ జీ జన్మశతాబ్ది సందర్భంగా ఈ బలహీనమైన క్షేత్రం గురించి ఆలోచించి విస్తృతమైన ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం కూడా ఆలోచించాల్సి ఉంది. ఇప్పటివరకు సంఘం అంటే అగ్రవర్ణాలవారు, వైశ్యులు లేదా అక్కడక్కడ బ్రాహ్మణుల సంస్థగా భావిస్తున్నారు. అయితే వాస్తవ స్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మనం సంస్థలో కులం గురించి ఆలోచించం. 1934 సంవత్సరం మహాత్మాగాంధీ వార్ధాలో సంఘ శిబిరాన్ని చూడాలని వచ్చారు. శిబిరములో అస్పృశ్యులు ఎంతమంది వున్నారో తెలుసుకోవాలని అడిగారు. వారికి లభించిన సమాధానం 'ఇక్కడ అందరూ హిందువులమే'. అయితే గాంధీజీ స్వయంసేవకుల నుండి స్వయంగా అడిగి తెలుసుకున్న వివరాల ప్రకారం ఎంతోమంది అస్పృశ్యులు ఆ శిబిరంలో పాల్గొన్నట్టు కనిపించింది. అయినా కూడా ఈ వర్గం ఇప్పటివరకు మనకు దూరంగానే ఉన్నది. అక్కడ మన ప్రభావం లేదు.

   సంఘ కార్యక్రమాలలో పూర్తి గణవేషతో దండ పట్టుకొని పథసంచలన్, శారీరక కార్యక్రమాలు మొదలైనవి జరుగుతుంటాయి. వార్తాపత్రికలలో ఇలాంటి ఫోటోలే వస్తుంటాయి. ఇది మనకు గర్వకారణమే. గాంధీజీ హిందువులను పిరికివారని చ్చెప్పగా, స్వామివివేకానందుడు భయపడేవాడు హిందువు అని అన్నారు. మనం హిందూ సమాజంలో స్వాభిమానాన్ని మేల్కొల్పినాము. వారిలో పౌరుషము, ధైర్యము లాంటి సంస్కారములనిచ్చి సంఘం గురించి మరొక విషయం చర్చనీయాంశంగా నిలబెట్టినాము. అందుకని మనవెంట దండ ఉండటం
అలవాటు అయింది. దురదృష్టవశాత్తు చెడుబుద్ధితో మనమీద ఒక మిలటరీ నంస్థగా ముద్రవేయబడినది, కానీ అనేకరకాలుగా నమాజంలోని బలహీన వర్గాలలో సేవచేయగల సేవావ్రతులు కూడా సంఘంలో ఉన్నారు. ఇలాంటి భావన కూడా ప్రజల మనసులో నాటుకొనేట్లు చేయడం అవసరం. అందువల్ల సేవాకార్యక్రమాల విస్తరణ మరియు వేగము పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

నేటి పరిస్థితి:
మన దేశానికి స్వాతంత్ర్రం వచ్చిన తర్వాత మన రాజకీయనాయకులు కుల, వర్గ రహిత సమాజ నిర్మాణం గురించి గొప్పగొప్ప ప్రకటనలు చేశారు. అస్పృశ్యతను తొలగించడానికి ఒక చట్టాన్నే చేశారు. కానీ కాలము గడుస్తున్న కొలది రాజకీయనాయకులు ఈ బలహీన వర్గాలను తమ వ్యక్తిగత స్వార్థమునకు సాధనాలుగా వాడుకుంటున్నారు. అధికారప్రాప్తి కొరకు వారిని కేవలం తమ ఓటు బ్యాంక్ గా భావించారు. వారి ఓట్లను కొల్లగొట్టడానికి వారిలో వేర్పాటు వాదం మరియు భేదభావాలనే విషబీజాలు నాటారు. చెడు భావనలను ప్రోత్సహించారు. మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ కులాల ఆధారంగా చేసిన ప్రకటనలు సామాజిక ఆర్ధిక దృష్టితో వెనుకబడిన వర్గాల వారికి ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ దీనితో పరస్పరం సంఘర్షణలు, పగ, విరోధము మొదలగునవి పెరిగి ముగింపులేని కులపోరాటాలు, ద్వేషపూరిత విభజనలు ఉత్పన్నమైనాయి. ఇది సమాజంలోని విభిన్న వర్గాల మధ్య దూరాన్ని ఇంకా ఎక్కువ చేసింది. హిందూ సమాజం యొక్క ఐక్యత ఛిన్నాభిన్నం అవుతూ వస్తున్నది. కులరహిత సమాజమనే ఆదర్శం స్థానంలో కుల వివక్ష బలం పుంజుకొంటున్నది.
    మరొక విచిత్రమైన, బాధాకరమైన విషయమేమిటంటే వ్యక్తిగత లాభము పొందడానికి వెనుకబడిన వర్గంలోచేరేందుకు పరుగు మరియు పోటీ మొదలైంది. (There is a race to become backward) కొన్నిరోజుల క్రితం కోయంబత్తూరులో (తమిళనాడు) బ్రాహ్మణుల సభజరిగింది. అందులో తమను కూడా వెనకబడిన కులాల జాబితాలో చేర్చాలనే తీర్మానం చేయబడినది.
కళాశాల విద్యార్థుల సమావేశంలో ఒక వింత అనుభవం కలిగినది. మనకు మతం మార్చుకొనే హక్కు ఉంది. ఒకవేళ మనం రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇస్లాంను స్వీకరించవచ్చు. అలాంటప్పుడు మనకు కులము మార్చుకునే అధికారం ఎందుకు లేదు? అది కూడా ఉండాలి అని ఒక విద్యార్థి అడిగాడు. ప్రశ్నించే వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అని అడిగితే, నేను హరిజనుడను కావాలనుకుంటున్నాను అని అన్నాడు. 
   గత 70 సంవత్సరాల ప్రభుత్వ విధానాల వల్ల సమాజంయొక్క ఆలోచనా ధోరణి ఎటువైపు వెళ్తున్నదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కొంత రాజకీయ అధికారము, మరికొన్ని ఆర్థిక సౌకర్యాలు పొందడానికై మనం అనుసరిస్తున్న చెడు విధానాల కారణంగా యుగయుగాలుగా వస్తున్న హిందూసమాజం ఐక్యత సంకటంలో పడింది. ప్రభుత్వ ప్రణాళికలు ఈ వ్యక్తిగత స్వార్థాన్ని మేల్కొల్పాయి. కొందరు రాజకీయనాయకులు తమ స్వార్థం కొరకు ఈ వర్గాలలో వైషమ్యాలను, భేదభావాలను నిర్మాణం చేశారు. కాన్నీరామ్......మొదలైనవారు 'హరిజనులు ముస్లింలు భాయీ భాయీ (అన్నదమ్ములు) హిందువు ఎవరు? ఎక్కడినుంచి వచ్చాడు?' అని నినాదాలు ఇస్తూ హిందూ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top