భారతీయ చరిత్రను వక్రీకరించింది ఎవరు? - Who distorted Indian history?

Vishwa Bhaarath
భారతీయ చరిత్ర
భారతీయ చరిత్ర
ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈసారి కలకత్తాలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెసు సమావేశాలు నిర్వహించారు, 2018 జనవరి 1వ తేదీనాడు జరిగిన ప్రారంభోపన్యాసంలో సంస్థ ప్రధాన అధ్యక్షుడు కె.ఎం.పరిమలీ మాట్లాడుతూ ‘‘చరిత్రను వక్రీకరించడం తప్పు’ అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన కెఎం పరిమలీ తన ప్రసంగంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశఆరు. 1.ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతం ప్రాతిపదకపై దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నది. 2.హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్నది. 3.మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నది 4.చరిత్రను వక్రీకరించి తిరిగి వ్రాయాలని ప్రయత్నిస్తున్నది. 5.కల్పిత (ఫిక్షన్) కథనాలను ప్రచారం చేస్తున్నది. 6.సంఘ పరివార్ ఆటలు సాగనీయవద్దు- ఈ విధంగా భావోద్వేగంగా కెఎం పరిమలీ ప్రసంగం కొనసాగింది.
  ఇంతకూ ఏది చరిత్ర? ఏది వక్రీకరణ అనే అంశం పరిశీలించబోయేముందు ప్రపంచవ్యాప్తంగా కొన్ని చారిత్రకాంశాలు గమనించాలి. ప్రాచీన రష్యాలో 1917లో విప్లవం వచ్చింది. అప్పుడు స్టాలిన్ లెనిన్‌లు చరిత్రను నిర్మూలించారు. 1945లో రష్యామీద హిట్లర్ దారి చేశాడు. అప్పుడు ‘‘మన సోషలిస్టు సామ్రాజ్యాన్ని రక్షించుకుందాం’ అని స్టాలిన్ పిలుపునిచ్చాడు. ఐతే ప్రజలు స్పందించలేదు. అప్పుడు మన పూర్వజుల పుణ్యభూమిని రక్షించుకుందాం’ అని మరో పిలుపునిచ్చాడు. దీనికి ప్రజలు స్పందించి యుద్ధంలో పాల్గొన్నారు. ఇది చరిత్ర. దీనిని ఎవరూ మార్చలేరు.

ఇస్లామిక్ ఉగ్రవాదులు మార్క్సిస్టు ఉగ్రవాదులు ఒక దేశం మీద దాడి చేసినప్పుడు ముందుగా తాము ఆక్రమించుకున్న దేశపు చరిత్రను సంస్కృతిని ధ్వంసం చేస్తారు. కాన్‌స్టాంటినోపుల్‌పై అరబ్బుల దండయాత్రకు ముందు అక్కడ ‘‘వైజయంతి సంస్కృతి’’ ఉండేది. దానిని ధ్వంసం చేశారు. టిమో జనచైనాను మధ్యయుగాలలో ఆక్రమించుకోగానే అక్కడి బౌద్ధ సంస్కృతిని నిర్మూలించాడు. ఇతడు మంగోలు జాతీయుడు. తర్వాతి కాలంలో ఈయనకు ఛెంగిస్‌ఖాన్ అని పిలిచారు. 1521 సెప్టెంబరులో మెక్సికోను క్రూసేడరు ఆక్రమించకముందు అక్కడ హిందూ దేవాలయాలుండేవి. వాటిని స్పానిష్ క్రిస్టియన్లు ధ్వంసం చేశారు. అమెరికాలోని స్థానిక రెడ్ ఇండియన్ల సంస్కతిని బ్రిటన్ నుంచి వచ్చిన క్రైస్తవులు నాశనం చేశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టకముందు కాబా (మక్కా)లో విగ్రహారాధన ఉండేది. దానిని ప్రవక్త నిరోధించాడు. ప్రవక్తగారి పినతండ్రి శివభక్తుడు. ఆయన ఆయాత్ అనే పేరుతో శివస్రోత్రాలు రచించాడు. ఇవ్వాళ మనకు సౌదీ అరేబియాలో వారి విడిచిన సంస్కృతి కన్పడదు. గ్రీసులో హిందూ సంస్కతి ఉండేది. ఎథీనా అంటే దుర్గాదేవి…. అంటే సూర్యదేవుడు. పాసిడాన్ అంటే పరమశివుడు. త్రిశూలధారి జటాజూటధారి అయిన పాసిడాన్ ఒరిజినల్ చిత్రాలు నావద్ద ఉన్నాయి. అక్కడ ఆర్థడాక్స్ క్రైస్తవం వ్యాపించిన తర్వాత హిందూ సంస్కృతి అంతరించిపోయింది. కాందహార్, మహాభారతంలోని గాంధారి పుట్టిల్లు. ఇవ్వాళ ఆఫ్ఘానిస్తాన్‌లో హిందూ సంస్కృతి లేదు. వందల అడుగుల ఎతె్తైన గౌతమబుద్ధుని విగ్రహాన్ని ఆమధ్య జిహాదీలు కూల్చివేశారు. నేపాల్ హిందూరాజ్యం. అక్కడ భట్టారాయ్ అనే చైనా ఏజెంటు ప్రాచీన తాళపత్ర గ్రంథాల లైబ్రరీలను ఆ మధ్య తగులబెట్టించాడు. 1959లో చైనాను ఆక్రమించుకున్నాక అక్కడి 6 లక్షల బౌద్ధ విహారాలు నేలమట్టం చేయబడ్డాయి. ఇండియాపైకి బాబర్ అక్బర్ ఔరంగజేబులు దండయాత్ర చేసినప్పుడు మధుర, కాశీ, అయోధ్య, శ్రీరంగం, తిరుమల వంటి దేవాలయాలను ధ్వంసం చేశారు. ఓరుగల్లును 1323లో ఉలుగ్‌ఖాన్ నేలమట్టం చేసి ఏకశిలానగరం పేరును సుల్తానుపూరుగా మార్డా. మాలిక్ కాఫర్ 1310లో హళిబీడు బేలూరు శిల్పాలను విధ్వంసం చేశారు. 16వ శతాబ్దంలో అళియరామరాయలు యుద్ధంలో ఓడిపోగానే విజయనగరాన్ని శత్రువులు దాదాపు ఆరునెలలపాటు నిర్మూలిస్తూనే ఉన్నారు. హంపీ క్షేత్రము అనే ఖండకావ్యంలో కొడాలివారు ‘శిలలు ద్రవించి ఏడ్చినం’ అని కవిత రచించాడు. 1948లో కాశిం రజ్వీ తెలంగాణలో జరిపిన విధ్వంసం చరిత్ర పుటలను రక్తసిక్తం చేసింది. తెలంగాణ ఆడబడుచుల బట్టలు విప్పి బతకమ్మలు ఆడించారు. 1780లో టిప్పు సుల్తాన్ మలబారు, కూర్గు ప్రాంతాలల్లో జరిపిన నరమేధం ఆయన స్వహస్తాలతో వ్రాసిన లేఖలలో నిక్షిప్తమై ఉంది. ఐతే 1947 తర్వాత నెహ్రూయుగంలో రూపొందించిన మన పాఠ్య గ్రంథాలల్లో కనపడకుండా సూడో సెక్యులరిస్టులు జాగ్రత్తపడ్డారు. ఇదిగో బ్రిటీషువారు కమ్యూనిస్టులు కలిసి రూపొందించిన దొంగ చరిత్రలు చదివి వాటిని కెఎం పరిమలీలు పాఠాలు చెప్పి విద్యార్థుల మనస్సుల్లో విషం నింపుతున్నారు. కన్నయ్య కుమార్ వంటి వారు ఈ కెయు పరిమలీల విశ్వామిత్ర సృష్టియే.

ఆర్యులు విదేశాల నుండి వచ్చారు. జీలం నదీ తీరంలో పురుషోత్తముణ్ణి అలెగ్జాండరు ఓడించాడు. విజయనగర రాజులు బల్లులు, తొండలు తినేవారు. అక్బరు, ఔరంగజేబులు సత్పురుషులు. శివాజీ చిట్టెలుక. నేతాజీ సుభాష్ చంద్రబోసు హిట్లరు బూట్లు నాకిన కుక్క – వి.డి.సావర్కార్ దుర్మార్గుడు. ఉస్మాన్ అలీఖాన్ మంచోడు. ‘‘మనది బిర్యానీ కల్చర్ – మనది షేర్వాణీ కల్చర్’’.. ఇవీ ఇప్పుడు మనం చదువుకుంటున్న పాఠాలు.
  నెహ్రూ రాజవంశంలో ఆరుగులు పాలకులు వచ్చారు. వారంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం కమ్యూనిస్టుల మద్దత్తుమీద ఆధారపడ్డారు. అందుకు సామ్యవాదులు ఒక షరతు పెట్టారు. ఈ విధంగా రాజ్యపాలన మీరు చేసుకోండి – కళాసాంస్కృతిక విద్యారంగాలు మాకు స్వాధీనం చేయండి – అని. అందుకు జె.ఎన్.యులు, సంగీత సాహిత్య నాటక అకాడమీలు పాఠ్యగ్రంథాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెసు పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలను సామ్యవాదులు స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలో మైనారిటీలు ద్వితీయశ్రేణి పౌరులుగా చూడబడుతున్నారని కెయు పరిమలీ ఆరోపించాడు. కాశిం రజ్వీ 1948లో హైదరాబాదు వదిలి పాకిస్తాన్ వెళితే అతడిని అతి హీనంగా చూశారు. ఇండియాలో ఫక్రుద్దీన్ అలీ అహమ్ద్‌లు జకీర్ హుస్సేన్‌లు అబ్దుల్ కలామ్‌లు భారత రాష్టప్రతులులైనారు. మరి పాకిస్తాన్ మాటేమిటి? అక్కడ మంత్రివర్గంలో ఒక్క హిందువైనా ఉన్నాడా? స్వాతంత్య్రం వచ్చినప్పుడు లాహోర్ వంటివి హిందూ మెజారిటీ ప్రాంతాలు. ఇప్పుడక్కడ ఒక్క హిందున్నాడా? లేడు! దీనికి సైన్సు కాంగ్రెసు అధినేతలు సమాధానం చెప్పి తీరాలి. రాణి పద్మిని అంతఃపురానికి నిప్పు అంటించుకుని ‘జోహార్’ చేయడం నిజమా? కాదా?
  బాబరు అయోధ్యమీదికి దండయాత్ర చేసి మసీదు నిర్మించడానికి ముందు అక్కడ రామాలయం ఉన్నమాట నిజమా? కాదా? షాజహాన్ తాజమహల్ నిర్మించడానికి ముందు అక్కడ శివాలయం ఉన్నమాట నిజమా? అబద్ధమా? జీససు కాశ్మీరుకు వచ్చిన నిజమా? అబద్ధమా? అబ్రహమ్ – బ్రహ్మయ్య- శాంసన్ శ్యామసూనుడు, వాటికన్-వాటిక, సెయింట్ – శాంతుడు ఇవన్నీ సంస్కృత శబ్దాలు కావా? ఓల్గా – వాలుగానది, సత్లవానా – శే్వతానన అంటే రష్యాలో ప్రాచీన కాలంలో వైదిక సంస్కృతి ఉండేది. బుద్ధిపూర్వకంగా మన ప్రబుద్ధులు ప్రపంచ చరిత్రను వక్రీకరించారు. మొగుణ్ణి కొట్టి మొగసాలు ఎక్కిందని ఓ తెలుగు సామెత ఉంది. ప్రణాళికాబద్ధంగా మార్క్సిసుటలు జిహాదీలు మెకాలేలు క్రూసేడర్లు చరిత్రను వక్రీకరించి వ్రాశారు. పరిహారం లేదు.

‘భారతం, భాగవతం, రామాయణం కల్పిత కథలు’ (ఫిక్షన్) అన్నారు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసువంటివారు. ఇక వీరికి భారతీయ చదువుపై ఎటువంటి ప్రాముఖ్యం ఉండదని తెలుస్తున్నది’’ త్రేతాయుగం నుండి నేటివరకు గల ప్రపంచ చరిత్రను అష్టాదశ పురాణాలలో కూడా ఉంది. ఐతే ఈ పురాణాలన్నీ కట్టుకథలు, పుక్కిట పురాణాలు అన్నారు. మానవ చరిత్ర 1917లోనే ప్రారంభమయిందని తీర్మానించారు. ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం చేయవలసినది ఏమిటి? ఈ బూటకపు హిస్టారికల్ కాంగ్రెసుల నిజస్వరూపాన్ని వెలికి తీయడం కోసం ఒక కమిటీని నిర్ణయించండి. పాఠ్య గ్రంధాలను సంగీతనాటక, సాహిత్య అకాడమీ కార్యవర్గాలను వెంటనే రద్దు చేయించాలి. ‘‘నిజమైన భారత దేశ చరిత్రను’’ రచింపచేయించాలి. 
   భారతదేశంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వంటి పరిశోధకులున్నారు. తెలుగులో మల్లంపల్లి సోమశేఖర శర్మ, కోట వెంకటాచలం, ఆదిరాజు వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, బిఎన్‌శాస్ర్తీ వంటి పరిశోధకులున్నారు. వీరికి నేడు ఎట్టి గుర్తింపు లేదు. చరిత్రకారులు అంటే రొమిల్లా థాసర్, ఆర్.ఎస్.శర్మ, కెయుపరిమలి, కౌశాంబి, అరుంధతీరాయ్ రాహుల్ స్వాయకృత్యాయన్. ఈ దుర్మార్గం నరేంద్రమోదీ యుగంలో కూడా జరుగవలసిందేనా?? చైనాలో నేపాల్‌లో బెంగాల్‌లో కేరళలో సాంస్కృతిక విధ్వంసం మొదలైంది. పూర్వం చైనాలో ఉగాది ఉత్సవాన్ని డ్రాగన్ ముత్యం (పెరల్స్ పండుగగా జరుపుకునేవారు ఇప్పుడు అక్కడ వారి ప్రాచీన సంస్కతి నిర్మూలించబడింది. సరిగ్గా కేరళలో అదే జరుగుతున్నది. ఒకరి పండుగపై నిషేధం విధించారు. దీపారాధనలు కొబ్బరికాయలు ‘కమ్యూనల్’ అన్నారు. ఇక్కడి పాఠ్య గ్రంథాలను భ్రష్టు పట్టించారు. కనీసం ఇది తప్పు అనేవాడు కూడా లేకుండాపోతున్నది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ - ఆంధ్రభూమి సౌజన్యం తో {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top