ఆంక్షలు, అవహేళనలు హిందువులకేనా? - Why only insulting Hindus

Vishwa Bhaarath
కమీదట ప్రతి హిందువు తనకి సంతోషాన్నిచ్చే పండగలను ఎవరేమంటారోనని సిగ్గుతో చచ్చిపోతూ చేసుకోవాలి. తాజాగా అక్టోబర్ 31 వరకు ఢిల్లీలో బాణాసంచా అమ్మరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళినాడు మూడు గంటలకు మించి బాణసంచా కాల్చరాదని అక్టోబర్ 13, 2017న పంజాబ్, హర్యానా హైకోర్టులు ఆదేశాలిచ్చాయి. మన దేశంలో సమాజం పట్ల మితిమీరిన ప్రేమ ఒలకబోస్తూ, ప్రజలపట్ల, పర్యావరణం పట్ల తామే మొత్తం భారాన్ని భుజాలపై మోస్తున్నట్టు మాట్లాడేవాళ్లు వున్నారు. వీళ్లంతా స్వయం ప్రకటిత మేధావులు. నిజానికి అవకాశం వచ్చినప్పుడల్లా వీళ్లు వెళ్లగక్కేది నరనరాల్లో జీర్ణించుకుపోయిన హిందూ ద్వేషమే. హిందూ విశ్వాసాలు అనాగరికమైనవన్నట్టు, హిందువులు పండగలు చేసుకోవడమే ప్రపంచంలో చాలా సిగ్గుచేటైన విషయమన్నట్టు వీళ్లు మాట్లాడుతుంటారు. సమాజంలో ‘స్వేచ్ఛావాదులు’గా ‘లౌకిక వాదులు’గా చెలామణి అయ్యే ఈ పెద్ద మనుషులు తమ మాటలతో హిందువులకు సంబంధించిన ప్రతిదానినీ కుళ్లబొడుస్తూ అసలు హిందువులుగా జన్మించడమే ప్రపంచంలో పెద్ద అపరాధమన్నట్టు మాట్లాడుతుంటారు. అసలు హిందుత్వంపై మాట్లాడేందుకు తమకే గుత్త్ధాపత్యం ఉన్నట్టుంటుంది వీరి ధోరణి గత కొన్ని సంవత్సరాలుగా.
   హోలీ వస్తే చాలు ప్రపంచంలో నీళ్లన్నీ ఖర్చయిపోతున్నట్టు పెడబొబ్బలు పెడతారు. ఈ మేధావులు. ‘కర్వాచౌత్’ లేదా ‘వ్రత సావిత్రి‘ ఉత్తరాదిన జరుపుకునే పండగ. ఈ పండగ వచ్చిందంటే చాలు ‘స్ర్తిలపట్ల కృతయుగపు అణచివేతకి ఇది నిదర్శనం’ అంటూ ఏడ్చిపోతారు ఈ ఫెమినిస్టులు. వినాయక చవితి వస్తే చాలు ఈ అపర పర్యావరణ ప్రేమికులకు పెద్ద పండగే. వినాయక చవితి వేడుకల వల్ల పర్యావరణం కలుషితమైపోతోందంటూ అదేపనిగా పెడబొబ్బలు పెడుతుంటారు. జల కాలుష్యం గురించి పాఠాలు చెప్తారు మనకి. ఇక దేవీ నవరాత్రులలో స్ర్తి స్వరూపిణిగా జగజ్జనని అయిన అమ్మవారి పూజా వేడుకలు జరుపుకుంటుంటే ‘దుర్గాదేవి ఒక దుర్మార్గురాలిగా, మహిషాసురుడిని గొప్ప నాయకుని’గా చిత్రిస్తూ పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వ్యాసాలు కుమ్మరిస్తారు ఈ అభ్యుదయ వాదులు.


హిందువులకు చెందిన ప్రతి విశ్వాసంపైన, ప్రతి ఆచారంపైన, ప్రతి పండగపైన ‘అభిప్రాయ వ్యక్తీకరణ పేరుతో ఈ అభ్యుదయ వాదులు అత్యంత ఆటవికంగా దాడులు చేస్తున్నారు. హిందువులకు చెందిన ప్రతి సంప్రదాయంపైన ఎక్కడ లేని వెటకారాన్ని వెళ్లగక్కుతారు స్వేచ్ఛావాదులైన వీళ్లు. పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడినప్పుడల్లా హిందు పండగలను ఉదహరిస్తూ తమలోని కుళ్లునంతా ఒలకబోస్తారు ఈ మేధావులు.
  ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక చెత్త ధోరణి మొదలైంది. దీపావళి వస్తోందంటే చాలు బాణసంచా కాలిస్తే జంతువులకు హానికరమని, టపాకాయలు పేలిస్తే అవి భయపడిపోతాయనీ ఎక్కడలేని జంతుప్రేమను ఒలకబోస్తూ అడ్డమైన పోస్టులు పెడుతుంటారు. అసలు దీపావళికి బాణసంచా కాల్చడమంటే లేని గొప్పని ప్రదర్శించుకోవడమేనని ఎద్దేవా చేస్తుంటారు. హిందువులకి ఎక్కడలేని పాఠాలు చెప్పే ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులకు బక్రీదు రోజున బహిరంగంగా జరిగే పశువధ, రోడ్లపై పారే వాటి రక్తం కనబడదా? ఇరవైనాలుగు గంటలూ ఏసీ గదుల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, అంతర్జాతీయ సదస్సులకు బిజినెస్ క్లాసులో విదేశాలకు విహరించే వీళ్లా హిందువులకి నిరాడంబరత గురించి పాఠాలు చెప్పేది?
ఒక్క దీపావళి వచ్చినపుడే కాదు, హిందువుల పండగ వస్తోందంటే చాలు గంగవెర్రులెత్తిపోతారు ఈ మతిలేని మేధావులు. అసలు హిందువుల పండగలు వస్తున్నాయంటే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఓ సరరదా అయిపోయింది మనదేశంలోని కుహనా మేధావులకు.
నిజానికి హిదువులు ప్రకృతిని గౌరవిస్తారు. ఆరాధిస్తారు. హిందూ పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. మన పూర్వీకులు సంవత్సర కాలంలో వచ్చే మార్పులను గమనించి అందుకు అనుగుణంగా పండుగలు జరుపుకునే సంప్రదాయాన్ని మనకందించారు. ప్రతి పండుగలోను ప్రకృతి ఆరాధన ఇమిడి ఉంది.
  హోలీ పండుగ వసంత ఋతు ఆగమనాన్ని సూచిస్తుంది. అందుకే ఆ రోజు అందరూ రంగులు జల్లుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణపతిని పూజిస్తాం. ఇందులోని ప రమార్ధం ఏమిటంటే మన శరీరం పంచభూతాలతో రూపుదిద్దుకున్నది. ఏదో ఒకరోజు ఈ శరీరం కలసిపోవాల్సిందే. అందుకు ప్రతీకగానే నిమజ్జనంతో గణేశ్ ఆరాధనలను ముగిస్తాం. సనాతన ధర్మము ప్రకృతి ఆరాధనకు ఫ్రాధాన్యమిస్తుంది. ఆకులలో భోజనం చేయడం మన సంప్రదాయంగా వస్తోంది. దేవుని ముందు మనం వెలిగించే దీపాలకు మట్టి ప్రమిదలు వాడతాం. అలాగే మన పరిసరాలలో దొరికే పూలతో దేవుని పూజించి, స్థానికంగా దొరికే పళ్లను నైవేద్యంగా పెడతాం. అయితే మన పూజా విధానాలలో పండుగలు జరుపుకునే విధానంలో కాలానుగుణంగా మార్పులువచ్చాయి. మార్పులు రావాలి కూడా. అలాగని ఈ మార్పులేవీ సంప్రదాయాలపట్ల మన వౌలిక విశ్వాసాలని దెబ్బ తీసేవిగా వుండకూడదు.
  హిందువులు ఎలా జీవించాలో చెప్పాల్సింది తరతరాలుగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలు. అంతేకానీ స్వయం ప్రకటిత మేధావులుగా చెలామణి అవుతున్న వాళ్లు పెట్టే ఆంక్షలకు తలలూపుతూ పండగలంటేనే సిగ్గుతో కుంచించుకపోవాల్సిన ఖర్మ హిందువులకు పట్టలేదు. హిందూ ధర్మము నిత్య చైతన్యవంతమైనది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో సంస్కరణనలు హిందూ సమాజం స్వాగతించింది. నిరంతరం ప్రవహించే గంగానదిలా హిందూ సమాజం నిరంతర పరిణామశీలి. అందుకే అది శాశ్వతమైనది కూడా.

ఒకవేళ ఏమైనా మార్పులు అవసరమైతే అది హిందూ సమాజం నిర్ణయించుకోవాలి కాని, ఆ పని హిందుత్వానికి దూరంగా వుంటూ అవమానకర విమర్శలు చేసే కుహనా మేధావులది కాదు. హిందువులు తమ ధర్మ సంస్కృతులను గౌరవిస్తారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విలువల పట్ల శ్రద్ధ్భాక్తులు కలిగి వుంటారు. ఆ శ్రద్ధ్భాక్తులతోనే పండగలను తమకు వీలైన రీతిలో జరుపుకుంటారు. అంతేకాదు, హిందువుల పండగలు ఏ కొందరికో వేడుకలు మాత్రమే కాదు. మరెందరికో అవి ఉపాధి ఆధారాలు కూడా. ఏడాది పొడుగునా హిందువులు పండుగలు జరుపుకుంటున్నారంటే ఆ పండగలన్నీ కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అంటే హిందువుల పండుగలు మన సమాజ ఆర్థిక వ్యవహారాలకు ఆలంబనగా కూడా ఉంటున్నాయి. 
   ప్రతి పండుగకి అవసరమైన పూజా సామగ్రి, తదితర వస్తువులను సమకూర్చడం, అమ్మడమే జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. దీపావళి పండుగనే తీసుకోండి. ప్రతి ఇల్లు దీపాలంకరణలతో వెలిగిపోతుంటుంది. మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించడం ఒక ఆచారంగా కొనసాగిస్తున్నాం. మనదేశంలో కొన్ని లక్షలమంది మట్టి ప్రమిదల తయారీ, అమ్మకమే జీవనాధారంగా బతుకుతున్నారు. అంటే హిందువులకు పండగ వచ్చిందంటే చాలు అది జరుపుకునే వారికే కాదు, వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి కూడా అది పండగే! ప్రతి పండుగ స్థానికంగా లభ్యమయ్యే వస్తు సామగ్రితోనే జరుపుకుంటాం. ఒకరకంగా చెప్పాలంటే హిందువుల పండుగలన్నీ మన ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణకు ఆలంబనలు.
   హిందువుల సంస్కృతీ సంప్రదాయాలను నోటికొచ్చినట్టు విమర్శించడం ‘స్వేచ్ఛావాదులు’గా చెలామణి అవుతన్న వారికి ఒక ఆట అయిపోయింది. ఇప్పటికైనా హిందువులు మేల్కొని తనపై అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ మేధోపరమైన దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలి. అనాదిగా వస్తున్న ధార్మిక విశ్వాసాలపట్ల తమకు గల హక్కులను పరిరక్షించుకోవాలి.

-దుగ్గిరాల రాజకిశోర్ - ఆంధ్రభూమి సౌజన్యం తో
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top