"భవిష్య భారతం: వేర్వేరు ఆలోచనలలోనూ సమానత్వం చూసే దృష్టి": డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం - Bhavishya Bharatham

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్  డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్  డా. మోహన్ భాగవత్ జీ
" వేర్వేరుఆలోచనలలోనూ సమానత్వం చూసే దృష్టి "
అదృష్టంకొద్దీ ఈ విధమైన ఆలోచన, అన్వేషణ మనదేశంలో పరంపరానుగతంగా సాగుతూవచ్చింది. నేను ఆలోచన అంటున్నానంటే, విలువల గురించి మాట్లాడుతున్నానని అర్థం. ఆలోచన విలువల నుండే పుట్టుకొస్తుంది. దాని ఆధారం మీదే కొత్త సూత్రీకరణలు (Formulation) జరుగుతుంది. అవి వేర్వేరుగా ఉంటాయి. పరస్పర వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. అయితే మనదేశంలో మొత్తం ఎన్ని ఆలోచనలున్నాయో అవన్నీ మనదేశపు మట్టినుండి పుట్టుకొచ్చినవే. వాటిని చూసే అవి ఒకదానితో ఒకటి వేర్వేరు అని, పరస్పర వ్యతిరేకమూ అని తెలిసిపోతుంది. అయితే ఎక్కడ మొదలవుతుందో దాన్ని 'ప్రస్థాన బిందువు’ అని, వాటి పరిణతి జరిగేదాన్ని 'ప్రత్యక్ష ఉపదేశం' అంటారు. వాటిలో ఏ తేడా లేదు. ప్రస్థాన బిందువు అనేది మూలంలో ఒకటే. పండితులైనవారు దానిని వేర్వేరు దృష్టితో చూస్తారు. అందువల్ల వాటిని వేర్వేరుగా వర్ణిస్తారు. అయితే అవన్నీ ఒకటే. ఒకే వస్తువుకు వేర్వేరు వర్ణన లన్నమాట. 'ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి'..
   వైవిధ్యాలకు భయపడాల్సిందేమీ లేదు. వైవిధ్యాలను అంగీకరించండి. వైవిధ్యాలన్నీ సత్యమే. వైవిధ్యాలను ఘనంగా చాటిచెప్పండి, ఉత్సవాలు నిర్వహించండి. మీమీ వైవిధ్యం మీద గట్టిగా ఉండండి, విశిష్టతమీద గట్టిగా ఉండండి. అన్ని వైవిధ్యాలను గౌరవించండి. కలసిమెలసి ముందుకు సాగండి. ఇది రెండవ సమన్వయపు విలువ అది మన పరంపర. అందరితో కలిసి నడవాలంటే మనమీద ఒక బంధం ఉండాల్ని ఉంటుంది. తినవలసిన వాడిని నేనొక్కడినే అయితే ఉన్నదంతా తింటాను. అలాగాక తినవలసినవారు ఇంకా పదిమంది ఉంటే వారందరికీ లభించిందా లేదా అని నేను చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంయమనం అనేది మూడవవిలువ. అలాంటి జీవితం గడపాలంటే వదిలి వేసే (త్యాగంచేసే) అలవాటు ఉండాలి. అన్నీ కావాల్సిందే అంటే కుదరదు. అన్నీ కావాలి అనేదాంట్లో, కావాలనేది (కోరిక) ఎప్పటికీ ముగిసిపోదు ఇది అందరూ చెప్పినమాటే. కోరిక అనేది ఎప్పటికీ పూర్తిగా అంతం కాదు, మనమే అంతమవుతాం, కోరిక మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అంటే త్యాగమయంగా జీవించాల్సి ఉంటుంది. మన అవసరాలను తగ్గించుకుంటూపోవాలి. ఏ వస్తువు అవసరం లేదంటే, అలాంటి జీవితం చాలా గొప్ప జీవితం; సన్యస్త జీవితమది 
   సంపూర్ణ అస్తిత్వంలో నీవు ఒక భాగం. నీ మనుగడ ఆ సంపూర్ణ అస్తిత్వపు సహకారంపై ఆధారపడి ఉంది. ఇది మన అనుభవం. శరీరం అనేది నాకు తల్లిదండ్రుల కారణంగా లభించింది. సంస్కారం అనేది కుటుంబం కారణంగా, సమాజం కారణంగా పాఠశాల కారణంగా, గురువుల కారణంగా లభించింది. బట్టలు ధరిస్తున్నానంటే ఎక్కడో బట్టలమిల్లు నడుస్తుంది, ఎక్కడో ఎవరో కుట్టి ఇస్తున్నారు, రైతులు వ్యవసాయం చేస్తారు, అందువల్ల ప్రత్తి పండుతుంది. తిండి పదార్ధాలు కూడా అలాగే లభిస్తాయి.
నేను ఒంటరిగా ఉండేటట్లయితే బ్రతకడం కూడా కష్టమే. మనిషి ఒంటరిగా జీవించలేడు; మనిషి జీవించాలంటే అందరి సహకారం ఉండాలి. మనం ఈ సృష్టిలో విడదీయరాని అవయవాలం; కాబట్టి దానికి నీవంతు సహకారమివ్వాలి. దానిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది అయిదవ విలువ. ఈ అయిదు విలువలు భారతదేశంనుండి వెలువడిన అన్ని ఆలోచనలలో సర్వత్రా లభిస్తాయి.
   'ఏకం' అని చెప్పిన ఆ 'ఒకటి' ఏమిటి? దాని దర్శనం జరిగినపుడు కొందరు దానిని జడమని గుర్తిసతారు, ఇంకొందరు చైతన్యం అని, మరికొందరు దానిని భగవంతుడు అని, ఇంకొందరు దానిని ఇంకేదిగానో గుర్తిస్తారు. పరస్పర వ్యతిరేకత కూడా ఉంది. వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఒకరినొకరు అంతం చేయలేక పోయారు. ప్రజలందరూ కలిసే సాగారు. శాస్త్రార్థం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా అన్నిరకాల ఆలోచనలూ చేశాక కూడా ఆచరణ గురించిన ఉపదేశం మాత్రం అందరిదీ ఒకటే. మీరు బ్రతకండి, అందరినీ బ్రతకనీయండి. తథాగతుడు 'కుసలస్య ఉపసంపదా' (నైపుణ్యంతోకూడిన బ్రతుకు తెరవు) అన్నాడు  నైపుణ్యం అంటే ఏమిటి? ఇతరుల జీవితానికి దెబ్బ తగలకుండా జీవించడం.

సబ్బ పాపస్య అకరణమ్ కుసలస్య ఉపసంపదా |
సచిత్త పరియోదపనమ్ ఏతె బుద్ధానుసాసనమ్
అన్నిచోట్లా ఇది దొరుకుతుంది. పాపం చేయరాదులోని పాపం అంటే ఏమిటి? 
పరహిత సరిస ధర్మ నహీ భాయీ
పరపీడా సమ నహీ అథిమాఈ

    ఇతరులకు కష్టం కల్గించడం పాపం. పాపం చేయకండి. పాపం చేయకుండా మిమ్మల్ని మీరు సరిగా ఉంచుకోవడమే నైపుణ్యం (కుసలస్య ఉపసంపదా). అయితే ఇదంతా చేస్తున్నపుడు ముఖ్యమైన పని ఏమిటి? 'సచిత్త పరియోదపనమ్' చిత్రాన్ని శుద్ధంగా ఉంచుకోండి. చిత్తం నుండి వికారాలను బయటకు పంపేలా చేసుకోండి. మెల్లమెల్లగా నేర్చుకోండి. పవిత్రమైన అంతఃక రణమున్న వాళ్ళుగా తయారవ్వండి. అందరిపట్ల సద్భావన కల్గిన వారిగా తయారవ్వండి; అందరినీ రక్షించేవారిగా తయారవ్వండి. విస్తృతంగా వర్ణించాలంటే అన్నిచోట్లా సత్యం, అహింస, అస్తేయం అపరిగ్రహం, బ్రహ్మచర్యం లభిస్తాయి. అన్నిచోట్లా సంతోషం, స్వాధ్యాయం, తపస్సు
ఈశ్వర ప్రణిధానం లభిస్తుంది. ఇది మనలను కలిపిఉంచే విషయం మరియు తరతరాలుగా ఇక్కడున్న కుటుంబాలలో నేర్పబడిన వ్యవహారం, సంస్కారాల ద్వారా ఏర్పడిన మన సంస్కృతి, ఆ సంస్కృతి ఆచరణం అలాంటది, అది ఎవరి ఇల్లు అయినా కావచ్చు. భారతదేశానికి బయటినుండి వచ్చిన మతాలు (ఇస్లాం, క్రైస్తవాలు) మరియు వాటి అనుయాయులు నేడు భారతీయ ప్రజలే. వాళ్ళు భారతీయులే గనుక అయితే వారి ఇళ్ళలోనూ ఈ సంస్కారాలు కొనసాగడం నేటికీ చూడవచ్చునని నేను చెబుతున్నాను.

మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్  డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక  {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top