" హిందు ఎందుకు? " - - 'భవిష్య భారతం' డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం: Why a Hindu

Vishwa Bhaarath
డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
హిందు ఎందుకు?
    సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ ను ఆ రోజుల్లో స్థాపించడం జరిగింది. ఈ 'హిందు' అనేది ఎక్కడినుండి వచ్చింది? ఈ పెద్ద ప్రశ్న సమాజంనుండి వచ్చింది. నేటికీ వస్తూఉంది. అయితే సంఘ స్థాపనలోనున్న మౌలిక ఆలోచనలో మూడు అంశాలున్నాయి. ఒకటి, నేను చెప్పేశాను. సమాజంలో మార్పు రావడంద్వారా అన్ని వ్యవస్థలూ విజయవంతమవుతాయి. వ్యవస్థలు మంచిగా ఉండి, వ్యక్తి చెడిపోతే, వ్యవస్థ అంతా కూలిపోతుంది. వ్యక్తి బాగా ఉండి, వ్యవస్థ చెడిపోయి ఉంటే వ్యక్తిని చెడగొట్టుతుంది. రెండూ మంచిగా ఉండాలి మరియు ప్రారంభమనేది సమాజం నుండి జరగాలి. ఎందుకంటే వ్యవస్థలను మార్చే వాళ్ళు వ్యవస్థకు బయట ఎక్కడో ఉండరు, వారు వ్యవస్థలో అంతర్భాగంగా  ఉంటారు. వాళ్ళు మారితే అది ప్రమాదంలో పడినట్టే. సమాజపు ఒత్తిడే వ్యవస్థలను మార్చుతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చూడండి. వ్యక్తినిర్మాణంతోనే సమాజం యొక్క తీరుతెన్నులలో మార్పు వస్తుంది. 
  నేడు మన సమాజాన్ని సంఘటితం చేయడంలో ఒక ముఖ్య అడ్డంకి ఏమిటంటే భాష, మన సమాజం ఒకే ఒక భాషను మాట్లాడే సమాజం కాదు. అందులో వేర్వేరు భాషలున్నాయి. ఒకరి భాష మరొకరికి అర్థం కాని స్థితి కూడా ఉంది. హిందీలోనే అనేక మాండలికాలలో మాట్లాడతారు. 
   మొదటిసారిగా నేను బీహార్ కు పంపబడినపుడు అక్కన తాలూకాస్థాయి వరకూ అన్ని జిల్లాల్లో పర్యటించి వచ్చాను. ఒకసారి ముజఫర్ పూర్ వెళ్ళాను. పూర్ణియా వైపు నుండి సుదీర్ఘ పర్యటన చేసి అక్కడికి చేరాను. ఆ రోజుల్లో రహదారులు సరైన స్థితిలో లేని కారణంగా బస్సులు ఉదయం బయల్దేరితే సాయంత్రానికి గమ్యం చేరేవి. బాగా అలిసిపోయాను. బట్టలు బాగా మాసిపోయాయి. అక్కడున్న మా ప్రచారక్ ఒకరు, నాతో 'మీ పైజమాను లాగేయనా?' అన్నాడు. నేను భయపడిపోయాను, మొదటిసారిగా వెళ్ళాను, పరిచయం కూడా లేదు, అయినా ఇలా మాట్లాడుతున్నాడేమిటి? నా తప్పేమైనా ఉందా? అనుకున్నాను. ఉతకడాన్ని అక్కడ ఫీంచనా అంటారని, కొద్దిపాటి తేడాతో అది వాడుకలో భీంచనా అయ్యిందని నాకు తర్వాత అర్థమైంది. అలా ఉతకడం అన్నది లాగడం అయిపోయిం దన్నమాట. అప్పటికి హిందీ మాట్లాడటం నాకూ వచ్చు, ఆయనకు కూడా వచ్చు. అయినా ఇంత తేడా ఉంటుంది.
    భాషలోనే ఇంత వైవిధ్యం ఉంటే, ఇక దేవీదేవతల విషయం చెప్పేదేముంది? 33 కోట్ల మంది మొదటే ఉన్నారు. కొత్తకొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. భగవంతుడిని నమ్మని వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు. ఎంత విస్తృతమైన వైవిధ్యముందో! బోధించే తత్వాలలోనూ తేడాలున్నాయి.
   ఈ సమాజాన్ని కలపడమెలా? ఆహార, విహరాలు, ఆచార వ్యవహారాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్నిచోట్ల కేవలం రొట్టె తింటారు. మరికొన్ని చోట్ల కేవలం అన్నం తింటారు. కొన్నిచోట్ల ఒకానొక నిర్దిష్టమైన కూర ఇష్టంగా తింటే, మరొక చోట కారం ఎక్కువగా, మరికొన్ని చోట్ల బెల్లం ఎక్కువగా తింటారు. ఏ విషయంలోనూ ఒకే రకమైన సమానత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. అయితే మన దౌర్భాగ్యంకొద్దీ కొన్ని వైవిధ్యాలను ఆధారం చేసుకుని ఎపుడో మనలోని తేడాలను ఎత్తిచూపడం జరిగింది. ఒకరిని మరొకరితో దూరంచేశారు. అగ్ర వర్గాలు, నిమ్నవర్గాలు అనే తేడా ఏర్పరిచారు. ఆ తర్వాత విదేశీయులు కూడా దీని నుండి లాభంపొందారు. పగుళ్ళను చీలికలనూ మరింత పెద్దవిగా చేశారు. మరి ఇలాంటి వారిని ఎలా జోడించాలి?. జోడించే సూత్రమేదైనా ఉందా? అంటే అన్నిరకాల పూజా పద్దతులు, దేవతలను గౌరవించడం, ఉపాసించడంతోపాటు అందరినీ గౌరవించడం, అన్నిటినీ సత్యమైనవిగా  గుర్తించడం, ఒక భాషను మాత్రమే గొప్పదిగా అనుకోకుండా, అన్ని భాషలను స్వీకరించడం, ఆహార పద్దతులలో, జీవనశైలిలో వైవిద్యలన్నింటిని ఇముడ్చుగోగల ఆలోచనా ధోరణి ఏదైనావుందా?.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top