Mohan Bhagawath ji |
రైతు కష్టపడితేనే పంటలు పండుతాయి, అలాగే అందరూ కృషి చేస్తేనే దేశం ముందుకు వెళ్తుంది. భారతదేశం పురోగమిస్తే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని RSS-ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డా|| మోహన్ భాగవత్ అన్నారు.
గోరఖ్ పూర్ సూర్యకుండ్లోని సరస్వతీ శిశుమందిర్లో జరిగిన 1వ గణతంత్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాగవత్ జీ జాతీయపతాకంలోని మూడు రంగుల విశేషాలు వివరించారు.
ఈ మూడు రంగులు జ్ఞానం కర్మ, భక్తిలను తెలియజేస్తాయని ఆయన అన్నారు.
- 🝒 కాషాయ రంగు త్యాగానికి,
- 🝒 తెలుపు పవిత్రతకు ,
- 🝒 ఆకుపచ్చ సంపదను సూచిస్తాయన్నారు.
కాషాయ రంగు చూసినప్పుడు మనసులో ఒక గౌరవభావం కలుగుతోందని తెలిపారు. మానవ జీవనం స్వార్థం కోసం కాకుండా పరోపకారం కోసమని ఆ రంగు తెలియజేస్తోందని వివరించారు. దీనులు దుః:ఖితులకు సహాయం చేయడం కోసం మనం సంపాదించాలని చెపుతుందని ఆయన పేర్కొన్నారు ఎంతగా ఇవ్వడానికైనా సిద్దంగా ఉండాలి. సర్వం ఇచ్చివేసిన తరువాత కూడా ఇంకా సమర్పించాలనే ఆలోచన మిగలాలని ఆయన అన్నారు.
జ్ఞానం, ధనం, బలం అనేవాటిని సదుపయోగం చేయడానికి జీవితంలో పవిత్రత, శుద్ధత అవసరం. జ్ఞానం రావణాసురిడికి కూడా ఉంది. కానీ మనస్సు శుద్ధంగా లేదు. మానసిక శుద్దత ఉంటే జ్ఞానం విద్యాదానానికి, ధనం సేవాకార్యానికి, బలం దుర్బలులను రక్షించడానికి ఉపయోగించాలని భాగవత్ పిలుపునిచ్చారు.
ఆకుపచ్చ సంపదకు నమృద్ధికి ప్రతీక. భారతదేశం త్యాగానికి ప్రాధాన్యమిచ్చింది. దాని అర్థం ఇక్కడ సంపద ఉండదని, దారిద్ర్రయం తాండవిస్తుందని కాదని తెలియజేశారు. సంపద అవసరమే. కానీ అదిమనలో అహంకారాన్ని పెంచిపోషించడానికి కాదు. ప్రపంచంలో దుఃఖాన్ని, దీనత్వాన్ని తొలగించడం కోసం ఉపయోగపడాలని తెలిపారు.
దేశ రాజ్యాంగం పౌరులందరి హక్కులు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొందని అన్నారు. అయితే ఈ హక్కులు, బాధ్యతలు ఒక నియమం, కట్టుబాటుకు లోబడి ఉన్నప్పుడే దేశ స్వాతంత్ర్యం సాకారమవుతాయన్నారు. అప్పుడే స్వాతంత్య్ర సమరయోధుల కోరుకున్న భావ్యభారతం నిజమవుతుందని మోహన్ భాగవత్ ఆశాభామవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూలము: జాగృతి