'భవిష్య భారతం' - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం - Bhavishya Bharatham

'భవిష్య భారతం' - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - Bhavishya Bharatham
డా. మోహన్ భాగవత్ జీ
భవిష్య భారతం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం
 మొదటి రోజు ఉపన్యాసం 
- డా|| మోహన్ రావ్ భాగవత్
వేదిక నలంకరించిన మాననీయ సంఘచాలకులారా, ఉపస్థితులైన మహానుభావులు, మాతృమూర్తులు, సోదరీ మణులారా ! ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక సంఘాన్ని అర్ధం చేసుకోవాలనే ఉద్దేశ్యo ఉంది. ఎందుకంటే సంఘం నేడు ఒక శక్తి రూపంలో ఈ దేశంలో నిలబడి ఉందనే అభిప్రాయాన్ని ప్రపంచమంతా అంగీకరిస్తోంది. స్వాభావికంగానే దానిగురించి చర్చ జరుగుతుంది, జరగాలి కూడా: అయితే అలా చర్చించడానికి వాస్తవ విషయాలు కూడా తెలిసి ఉండాలి. చర్చ ఎలా జరగాలనేది చర్చించే వారికుండే అధికారం. అయితే వాస్తవం ఏమిటి అనేది తెలిసి ఉండి చర్చ జరిగితే తద్వారా సార్థకమైన నిర్ధారణ బయటకు వస్తుంది.
  సంఘానిది ఒక విశిష్టమైన పని. ఈ పనిని పోల్చిచూసి పరిశీలించడానికి ఇలాంటి పనిచేస్తున్న మరో సంస్థ ఏదీ లేదు. అందువల్ల 'తెలిసినదానినుండి తెలియనిదానివైపుకు" అనే పద్దతి ద్వారా దీన్ని తెలుసుకునే అవకాశమేదీ లేదు. అలా తెలుసు కోవాలని ప్రయత్నం చేస్తే తప్పుడు అర్ధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘపద్ధతి విశిష్టమైనదైనందున సంఘ కార్యకర్తలు తమ పని తాము చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రచారం, కీర్తి గురించి వెంపర్లాడటం లేదు. సంఘశక్తి పెరుగుతూఉన్న కొద్దీ దాని ప్రచారం దానంతట అదే జరుగుతుంది. ప్రసార మాధ్యమాల దృష్టి దానివైపు పడుతోంది. 
   ప్రజలమధ్య సంఘం గురించి చర్చ జరుగుతోంది. అసలు ఈ సంఘం అంటే ఏమిటి? దీనిని తెలుసుకోవడానికి ప్రజలందరూ ప్రయత్నిస్తారు. ఏదైనా ఒక కార్యం పెరుగుతూపోతే, అదొక శక్తిగా రూపాన్ని దాలుస్తుంది. కాబట్టి కొందరికి ఆ శక్తిపట్ల భయం ఏర్పడుతుంది. దానిపట్ల అపప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో అసహజమైన విషయమేమీ లేదు.
    సంఘ వాస్తవస్థితి ఏమిటి ? అనేది స్పష్టమైన రీతిలో ఢిల్లీలోని ప్రభావశాలురైన వ్యక్తులకు తెలియజెప్పాలని ఢిల్లీ ప్రాంతానికి చెందిన మన కార్యకర్తలు అనుకున్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలకు కూడా సమయం ఉండాలనీ భావించారు. అటువంటి కార్య క్రమానికై ఈ మూడు రోజులు ఎంచుకున్నారు. ఆ ప్రకారంగా వాస్తవ స్థితిని నేను మీముందుంచబోతున్నాను. మీ ముందు వాస్తవస్థితిని ఉంచబోతున్న సమయంలో నా ఉద్దేశ్యం మీ అందరినీ ఒప్పించడం మాత్రం కాదు. ఒప్పుకోవడం లేదా ఒప్పుకోకపోవడం అనేది మీకున్న అధికారం. సంఘం ఎలా ఉందో దానిని నేను మీకు చెబుతాను. మీ ప్రశ్నలకు నాకున్న సమాచారం ఆధారంగా సమాధానాలిస్తాను. దానిగురించి ఆలోచించడం, పరిశోధించడం మీరు చేయగలరు, ఆ అధికారమూ మీకుంది. అయితే దాని తర్వాత మీద్వారా జరిగే చర్చ సంఘంయొక్క అధికారిక సమాచారం ఆధారంగా జరుగుతుంది. అంతమాత్రం మాకు చాలు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top