ఆరెస్సెస్ నా ఆత్మ- శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి - RSS is my soul - Shri Atal Bihari Vajpayee

Vishwa Bhaarath
0
శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి
శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి
నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. అప్పట్లో గ్వాలియర్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ భాగం కాని సంస్థానం. నేను పటిష్టమైన సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడిని. కానీ నేను ఆర్య కుమార సభ సత్సంగ్ కి వారం వారం హాజరయ్యేవాడిని. ఒకసారి ఆర్య కుమార సభలో సీనియర్ కార్యకర్త, గొప్ప చింతకుడు, మంచి కార్యనిర్వాహకుడు అయినా శ్రీ భూదేవ్ శాస్త్రి   మమ్మల్ని ‘సాయంత్రాలు మీరు ఏం చేస్తుంటారు?’ అని అడిగారు. ఆర్య కుమార సభ ప్రతి ఆదివారం ఉదయం సమావేశమయ్యేది కనుక మేము ‘ఏమీ చెయ్యము అని జవాబిచ్చాము. అప్పుడు ఆయన మేము శాఖకి వెళ్లాలని సూచించారు. అలా నేను గ్వాలియర్లో శాఖకి వెళ్లడం ప్రారంభించాను. అది ఆరెస్సెస్ తో నా మొదటి అనుబంధం. ఆ సమయంలో గ్వాలియర్ శాఖ అప్పుడే ప్రారంభమయింది. శాఖలో కేవలం మహారాష్ట్ర బాలురు ఉండేవారు. సహజంగానే స్వయంసేవకులందరూ మరాఠీలో మాత్రమే మాట్లాడేవారు. నేను శాఖకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడిని. అక్కడ ఆడే ఆటలు, వారంలో ఒకసారి జరిగే బౌధ్ధిక్ లు (మేధోమథనాలు) నాకు బాగా నచ్చేవి.

నాగపూర్ నుంచి శ్రీ నారాయణరావు తార్తే అనే ప్రచారక్ శాఖ ప్రారంభించేందుకు వచ్చారు. ఆయన చాలా అద్భుతమైన మనిషి. ఎంతో సాదాసీదాగా ఉండే గొప్ప మేధావి, మంచి నిర్వాహకుడు. నేను ఈనాడు ఎటువంటి వ్యక్తినో అది కేవలం శ్రీ తార్తేగారి ప్రభావమే. ఆ తర్వాత నేను దీనదయాళ్ ఉపాధ్యాయ, భావురావు దేవరస్ నుంచి స్ఫూర్తి పొందాను. గ్వాలియర్ అప్పట్లో భావురావుజీ అధీనంలో లేదు. అయితే ఆయన అప్పటి బౌధ్ధిక్ ప్రముఖ్ శ్రీ బాలాసాహెబ్ ఆప్టేతో కలిసి ఒకసారి గ్వాలియర్ కి వచ్చారు. ఆప్టేజీ ఎంతో సున్నితమైన మనిషి. మేము ఆయన పట్ల త్వరగానే ఆకర్షితులయ్యాం. నేను ఆయనతో కొన్ని నిముషాలపాటు మాత్రమే మాట్లాడాను. అయితే, అదే సంవత్సరం (1940)  మొదటి ఏడాది ఆఫీసర్స్ ట్రైనింగ్ కాంప్ (OTC) చూసేందుకు వెళ్ళినప్పుడు, ఆయనతో సన్నిహిత పరిచయం ఏర్పడింది. నేను అక్కడకి వెళ్ళింది శిక్షణకు కాదు, కేవలం ముగింపు కార్యక్రమానికి హాజరయ్యేందుకు. అక్కడకి డాక్టర్ హెడ్గేవార్ కూడా కొంచెం సమయంపాటు వచ్చారు. ఆయనను నేను మొదటిసారి అక్కడే చూశాను. డాక్టర్ జీ అస్వస్థులుగా ఉన్నప్పుడు నేను ఆయనని చూడడానికి వెళ్లాను. 1941లో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నా మొదటి సంవత్సరం OTC చేశాను. ఇంటర్మీడియట్ తరగతిలో ఉండగా, 1942లో, నేను నా రెండో ఏడాది OTC చేసి, 1944లో నా బీఏ చేస్తున్నప్పుడు మూడో ఏడాది శిక్షణ పూర్తిచేశాను.
   నేను ‘హిందూ తన్-మన్ హిందూ జీవని’ రాసినప్పుడు పదో తరగతి విద్యార్థిని. గ్వాలియర్లో నా బీఏ పూర్తి చేసిన తర్వాత నేను, గ్వాలియర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ లేదు కనుక కాన్పూర్ లోని DAV కళాశాలలో  ఎమ్.ఏ  చదివాను. అప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ కూడా లభించింది. దేశ విభజన కారణంగా నేను నా న్యాయవిద్యాభ్యాసం పూర్తి చేయలేకపోయాను. ఇంక 1947లో,  చదువు విడిచిపెట్టి  ఆరెస్సెస్  లో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. 1947 వరకు నేను శాఖ స్థాయిలో  ఆరెస్సెస్  పని చేస్తూ, నా చదువు కొనసాగించాను. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని నేను 1942లో జైలుకు కూడా వెళ్లాను. అప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షా కోసం చదువుకుంటున్న రోజులు. ఆగ్రా జిల్లాలోని నా స్వగ్రామం భటేశ్వర్  నుంచి నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు నా వయసు 16.

మా నాన్నగారికి  ఆరెస్సెస్ తో సంబంధం లేదు కానీ, మా అన్నయ్యకి ఉండేది. ఆయన శాఖకు వెళ్లేవారు. ఒకసారి శీతాకాలం క్యాంపుకి వెళ్లి ఆయన ఒక సమస్య సృష్టించారు. “నేను ఇతర స్వయంసేవకులతో కలిసి భోజనం చేయలేను. నా ఆహారం నేనే వండుకుంటాను,” అన్నారు ఆయన. ఆ సమస్యని  ఆరెస్సెస్  ఎంత చక్కగా పరిష్కరించిందో చూడండి. క్యాంపు ‘సర్వాధికారి'(సూపరింటెండెంట్)   సరే అని చెప్పి, ఆయన వంటకి కావాల్సినవి అన్నీ ఇప్పించారు. మా అన్నయ్య స్నానం చేసి, జంధ్యం సరి చేసుకోవడం మొదలైన పనులన్నీ చేసి, వంట మొదలుపెట్టారు. మొదటిరోజు తన ఆహారం తనే వండుకున్నారు. కానీ, రెండో రోజు ఇంక ఆయన వల్ల కాలేదు. భోజనం కోసం మిగిలిన స్వయంసేవకులందరితో కలిసి లైన్లో నిలబడ్డారు. కేవలం 44 గంటల సమయంలో మా అన్నయ్య అలా మారిపోయారు.
    ఆరెస్సెస్  వ్యక్తులనే కాదు. సామూహిక ఆలోచనా ధోరణిని మారుస్తుంది. అదీ ఆరెస్సెస్ సంస్కృతిలో అందం. మన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి సాధించవచ్చు. సరైన ‘సాధన’ చేస్తే, ఆత్మసాక్షాత్కారం కూడా సాధ్యం. నిర్వాణం కూడా సాధించవచ్చు. కానీ సమాజం సంగతి ఏమిటి? సాధారణంగా ఎవరూ సమాజం పట్ల తమ బాధ్యత గురించి ఆలోచించారు. మొదటిసారిగా ఆరెస్సెస్  ఈ విషయం ఆలోచించి, వ్యక్తులను మారిస్తే, సమాజం మారుతుందని నిశ్చయించింది. క్యాంపులో సర్వాధికారి మా అన్నయ్యని కోప్పడి ఉంటే, వంట చేసుకోనివ్వకుండా ఉంటే, ఆయన ఆధ్యాత్మిక పెరుగుదల కుంటుపడేది. కానీ ఆరెస్సెస్  లో ఆయన 44 గంటల్లో మారిపోయారు. ఇదీ  ఆరెస్సెస్  అనుసరించే ‘రహస్య పధ్ధతి’. ఇలాగే సమాజం మారుతుంది. నిజమే, ఇది సుదీర్ఘ ప్రక్రియ. కానీ అది జరగాల్సిందే. అడ్డదారులు వేరే లేవు.
ఆరెస్సెస్  లో అస్పృశ్యత లేదని గాంధీజీ ప్రశంసించారు. ఆరెస్సెస్  మాత్రమే సమాజాన్ని ఏకం చేస్తుంది. మిగిలిన సంస్థలన్నీ ‘వేరే గుర్తింపు’, విభిన్న ‘ఆభిరుచులూ’, ‘ప్రత్యేక హోదా’ అంటూ సమాజాన్ని విభజిస్తాయి.  అస్పృశ్యులనే వాళ్లకి మళ్లీమళ్లీ  వాళ్ళ ‘వేరుతనం’ గురించి గుర్తు చేస్తూ అస్పృశ్యతను ప్రోత్సహిస్తాయి. “మిమ్మల్ని అవమానిస్తున్నారు. మీకు సమాజంలో స్థానం లేదు.”  అంటూ గోలచేస్తాయి.
ఆరెస్సెస్ ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, పటిష్టమైన హిందూ సమాజం నిర్మించడం; కులం, ఇతర కృత్రిమ విభేదాలకు అతీతంగా, సమగ్రతతో కూడిన సమాజం నిర్మించడం. కొన్ని భేదాలు ఉంటాయి కానీ మంచిదే. వైవిధ్యంలో ఆకర్షణ ఉంది. ఉదాహరణకి, మనకి భాషల్లో తేడాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని నాశనం చేయాలనీ మనం అనుకోవడం లేదు. రెండోది, హిందూయేతరులు – అంటే ముస్లింలు, క్రైస్తవుల వంటివారిని ప్రధాన జన జీవన స్రవంతిలో కలపడం. తాము విశ్వసించే మతాన్ని వారు అనుసరించవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. మనం చెట్లు, జంతువులూ, రాళ్లు…ఇంకెన్నింటినో పూజిస్తాం. మనకి దేవుడిని కొలిచేందుకు వందలాది మార్గాలు ఉన్నాయి. వారు తమకి నచ్చిన ఏ ప్రదేశానికైనా వెళ్ళచ్చు. కానీ ఈ దేశాన్ని వారు మాతృభూమిగా చూడాలి. వారికి ఈ భూమి పట్ల దేశభక్తి ఉండాలి.  అయితే, ప్రపంచాన్ని ‘దారుల్ హరాబ్’  ‘దారుల్ ఇస్లాం’ అని విభజించే ఇస్లాం పధ్ధతి అడ్డొస్తుంది. ముస్లింలు అల్పసంఖ్యాకవర్గంగా ఉన్న దేశంలో బతకడం, అభివృద్ధి చెందడం అనే కళని ఇస్లాం ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. భారతదేశం మొత్తాన్ని వారు ఇస్లాం మతంలోకి మార్చలేరు. వాళ్ళు కూడా ఇక్కడ బతకాలి కదా? అందుకని ఈ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ముస్లిం దేశాల్లో ఇది ఎంతో ఆందోళన, ఆలోచన కలిగించే విషయమైంది. ఎందుకంటే, ఖురాన్ వారికి ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శనం చేయదు. కాఫిర్లు, నాస్తికులను చంపేయాలి, లేదా వారిని ఇస్లాం మతంలోకి మార్చాలి అని మాత్రమే ఖురాన్ చెప్తుంది. కానీ అన్ని చోట్ల, అన్ని సార్లు వాళ్ళు ఆ పని చేయలేరు. అల్పసంఖ్యాక వర్గంగా ఉన్న చోట వారు ఆ పని ఎలా చేస్తారు? చేయడానికి ప్రయత్నిస్తే, పెద్ద ఘర్షణ తలెత్తుతుంది, అల్పసంఖ్యాక వర్గాలవారే ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోతారు. ఈ పరిస్థితిని మార్చవలసింది ముస్లిములే. మనం వారి కోసం ఈ మార్పు తీసుకునిరాలేం.

ఆరెస్సెస్ పతాకానికి వందనం చేస్తున్న ఎల్ కే  అద్వానీ, అటల్ బీహారీ వాజపేయి, కే ఎస్ సుదర్శన్
ఆరెస్సెస్ పతాకానికి వందనం చేస్తున్న ఎల్ కే  అద్వానీ, అటల్ బీహారీ వాజపేయి, కే ఎస్ సుదర్శన్
కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంది. అందుకే తమ బుజ్జగింపు విధానాన్ని అలాగే కొనసాగిస్తుంది. కానీ దీని పర్యవసానం ఏమిటి? ఈ దేశంలో ముస్లింలతో మనం మూడు విధాలుగా వ్యవహరించవచ్చు. ఒకటి ‘తిరస్కార్’ – అంటే వారంతట వారు మారకపోతే, వారిని వదిలిపెట్టేసి, సహపౌరులుగా గుర్తించకపోవడం. రెండోది ‘పురస్కార్’ – వారిని అనువుగా ప్రవర్తించేలా బుజ్జగించడం, లంచం ఇవ్వడం – ఇది కాంగ్రెస్, అలాంటి ఇతర పార్టీలు చేస్తున్న పని. మూడో పధ్ధతి ‘పరిష్కార్’ – అంటే వారిని మార్చడం, వారికి సంస్కారాలను, పద్ధతులని నేర్పించి వారిని జనజీవన స్రవంతిలో చేర్చడం. వారి సరైన పద్ధతులు నేర్పడం ద్వారా వారిని మారుస్తామని చెప్పడం. వారి మతాన్ని మార్చము. వారి మతం వారు అనుసరించవచ్చు. . మక్కా ముస్లింలకు పవిత్రం కావచ్చు కానీ భారత్ వారికి అత్యంత పవిత్రం కావాలి. మసీదుకి వెళ్లి నమాజ్ చేయవచ్చు, రోజా ఉపవాస దీక్ష చేయవచ్చు, మాకు సమస్య లేదు. కానీ మీరు మక్కా, ఇస్లాం మతం లేదా భారత్ ని ఎంచుకోవాలి అంటే మాత్రం మీరు భారత్ నే ఎంచుకోవాలి. ముస్లింలు అందరికీ ‘మేము ఈ దేశం కోసం జీవిస్తాం, ఈ దేశం కోసం మరణిస్తాం’ అనే భావన ఉండాలి.

ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ కే సూర్యనారాయణ రావుతో అటల్ బీహారీ వాజపేయి
ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ కే సూర్యనారాయణ రావుతో అటల్ బీహారీ వాజపేయి
     నేను పదో తరగతిలో ఉండగా “హిందూ తన్-మన్ హిందూ జీవన్’ రాశాను. అందులో నేను ‘ఎవరన్నా చెప్పండి, కాబుల్ కి వెళ్లి ఎన్ని మసీదులు ముక్కలు చేశారో’ అని రాశాను. ఇప్పటికీ నేను అదే మాటకి కట్టుబడి ఉన్నాను. కానీ మనం (హిందువులం) అయోధ్యలో కట్టడాన్ని కూల్చివేశాం. నిజానికి అది ముస్లిం వోట్ బ్యాంకుకి ఒక ప్రతిస్పందన. ఈ సమస్యను చర్చల ద్వారా, చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని మనం భావించాం. అయితే చెడు పనులకి బహుమతి ఏమి ఉండదు. కానీ మనం చెడును పరిష్కారం ద్వారా మారుస్తాం. ఇప్పుడు ఆరెస్సెస్ ప్రాధమిక కార్యమైన హిందూ సమాజ పునరుద్ధరణ జరిగిందని నేను భావిస్తున్నాను. అంతకు ముందు హిందువులు దాడులకు లొంగిపోయేవారు. ఇప్పుడు కాదు. హిందూ సమాజంలో మార్పు స్వాగతించదగింది. కొత్తగా మన గుర్తింపును స్వీయప్రకటన చేసే అవకాశంతో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. ఇది స్వీయ రక్షణకు సంబంధించిన విషయం. హిందూ సమాజం విస్తరించకపోతే, మన మనుగడ సంక్షోభంలో పడవచ్చు. మనని మనం విస్తరించుకోవాలి. ఇతరులను కూడా మనతో తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు యాదవులు, ‘హరిజనులు’ అని పిలిచే వాళ్ళు కూడా మనతో వస్తారు. మనం అందరం హిందువులుగా జీవించాలి. ఒకసారి ఒక యాదవ నాయకుడు నా వద్దకి వచ్చి ఇలా అన్నాడు “యాదవులందరినీ తప్పుపట్టకండి. యాదవులందరు ములాయం సింగ్ తోనూ, లాలూ ప్రసాద్ తోనూ లేరు. సంస్కారవంతుడైన, ఒక సంస్కృతి కల యాదవుడు వారిని ఇష్టపడడు. రాజ్ పుట్, కూర్మి, గుజ్జర్ ముస్లింలు ఉంటారు కానీ మీకు ఎక్కడా యాదవ ముస్లిం కనిపించాడు. యాదవులు ఏనాడు ఇస్లాంని ఆమోదించలేదు. ఈ ‘యాదవ-ముస్లిం’ మైత్రి – ముస్లిం-యాదవ  కార్డు – ఓట్ల కోసం చేసే ఒక డొల్ల నినాదం మాత్రమే’ అన్నాడు అతను.

ఆరెస్సెస్ తో సుదీర్ఘ అనుబంధానికి కారణం నాకు సంఘ్ అంటే చాలా ఇష్టం. సంఘ్ భావజాలం నాకు ఇష్టం. అన్నింటికంటే మించి నాకు ఆరెస్సెస్ లో మాత్రమే కనిపించే ఒక వైఖరి… ప్రజల పట్ల ఆరెస్సెస్ వైఖరి, ఒకరి పట్ల ఒకరికి ఉన్న వైఖరి ఇష్టం. నేను లక్నోలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తోంది. సామ్యవాద ఉద్యమం అప్పుడు తారాస్థాయిలో ఉంది. హఠాత్తుగా, ఒక సీనియర్ సామ్యవాద ఉద్యమకర్త అస్వస్థత పాలయ్యారు. ఆయన ఒక్కరే ఇంట్లో పడి ఉన్నారు, ఎవరూ ఆయనను పలకరించేందుకు వెళ్ళలేదు. ఆచార్య నరేంద్రదేవ్ కి ఈ విషయం తెలిసింది. ఆయన వెంటనే వారి ఇంటికి వెళ్లారు. “ఇదేం సోషలిస్ట్ పార్టీ? ఎవరూ నిన్ను చూడడానికే రాలేదు. ఇలాంటిది ఆరెస్సెస్ లో ఎప్పటికీ జరగదు. స్వయంసేవకులెవరైనా ఒక్క రోజు శాఖకి రాకపోయినా, అదే రోజు అతని మిత్రులు అతని ఇంటికి వెళ్లి, కులాసాగా ఉన్నదీ లేనిది కనుక్కుంటారు,” అన్నారుట ఆచార్య నరేంద్ర దేవ్.
  • ఎమర్జెన్సీ సమయంలో నేను జబ్బుగా ఉన్నప్పుడు, నా కుటుంబ సభ్యులు నన్ను చూడడానికి రాలేదు. వస్తే అరెస్ట్ అవుతామని వారు భయపడ్డారు.
  • ఆరెస్సెస్  కార్యకర్తలే నాకు సహాయపడ్డారు. చూశారా, ​ఆరెస్సెస్ లో ఎంత సజీవ అనుబంధం, సౌభ్రాతృత్వం ఉందో ! నిజానికి, సంఘ్ మన కుటుంబం. మనమందరం ఒకటి.
ఆరంభంలో, తగు సంఖ్యలో కార్యకర్తలు లేక, సమాజంలో అన్ని వర్గాలతో మనం పని చేయలేకపోయాము. “మానవ వనరుల సృష్టి’ ఆరెస్సెస్  ప్రధమ లక్ష్యం. ఇప్పుడు మనకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు కనుక, అన్ని రంగాల్లో, సమాజంలో అన్ని వర్గాల వారికోసం పని చేయగలుగుతున్నాం. అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. అయినా మానవ వనరుల కల్పన ఆగకూడదు, అది కొనసాగాలి. తప్పనిసరిగా కొనసాగాలి.  ఆరెస్సెస్  ఉద్యమం అంటే అదే.

__విశ్వ సంవాద కేంద్రము {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top