" దేశ జనాభా ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు - Country population

Vishwa Bhaarath
డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:జనాభా:
ప్రశ్న : దేశంలోని అనేక ప్రదేశాల్లో మారుతున్న జనాభా అంకెల స్వరూపం మరియు హిందూ జనాభా వృద్ధిరేటు తగ్గుతుండడాన్ని సంఘం ఎలా చూస్తుంది ? జనాభా నియంత్రణకొరకు చట్టం చేయాల్సిందేనా? యాభై ఏళ్ళ తర్వాత భారతదేశంలో హిందువుల స్థితి ఏమవుతుంది? జనాభా ద్వారా అభివృద్ధి ప్రభావితమవుతోందా ? సంఘం దీన్నెలా చూస్తుంది?
  జవాబు : దీని విషయంలో సంఘం ఒక తీర్మానం చేసింది. దాన్ని నేను వివరిస్తాను. జనాభా సంఖ్య పెరిగేకొద్దీ అది భారమౌతుంది. ఆహారం అందించాల్సి ఉంటుంది. ఉండడానికి స్థలం కావాలి, పర్యావరణంపై భారం అధికమౌతుంది. కానీ దీనివల్ల పనిచేసే చేతులూ పెరుగుతాయి. నేడు భారతదేశం యువతరంతో కూడి ఉంది. బహుశా 56 శాతం యువకులున్నారు. ఇది మనకు గర్వకారణం. ప్రపంచంలో అధికసంఖ్యలో యువకులున్నది భారతదేశంలోనే, 30 ఏళ్ళ తర్వాత ఈ యువకులే వృద్దులవుతారు గదా! అప్పుడు వీరికంటే ఎక్కువగా యువకుల సంఖ్య లేకపోతే భారత్ వృద్ధుల దేశం అవుతుంది.
     ఇప్పటి చైనాలా మారిపోతుంది. కాబట్టి జనాభా గురించి రెండు రకాల దృష్టితోనూ ఆలోచించాలి. తాత్కాలికంగా కాదు, యాభై ఏళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆనాటికి మనం ఎంతమందికి తిండిని అందివ్వగల శక్తి కల్గలి ఉంటామనేది ఆలోచించాలి. తిండి, గుడ్ల, ఇల్లు, ఆరోగ్యం, విద్య, అతిథి సత్కారం-ఆ ఆరు గృహస్థుకు తప్పనిసరి అవసరాలు. వాటిని తీర్చడానికి మనకెలాంటి శక్తి ఉంటుంది? ఆ సమయానికి మన పర్యావరణం మనకు ఎంతవరకు సహకరిస్తుంది? దాని సామర్థ్యాన్ని మనం ఎంతవరకు పెంచగలం. ఆనాటికి ఇవన్నీ చేయడానికి పని చేయగల చేతులు మనకు ఎన్ని కావాలి ? అనేవన్నీ ఆలోచించాలి.
     జనాభా గురించి మనమంతా చర్చిస్తున్నాము, అయితే జన్మనిచ్చే పని తల్లులు చేయాల్సి ఉంది. అలాంటపుడు మన తల్లులు ఎంత సమర్థులు, ఎంత తెలివితేటలు గలవారు? ఎంత స్వతంత్రులు, వారిని పెంచి పోషించే వ్యవస్థ వారి చేతుల్లో ఎంతవరకుంది? అనే విషయాలన్నీ ఆలోచిస్తూ జనాభా సమతుల్యత గురించి కూడా పట్టించుకోవాలి. నేడు మనం గుర్తించినా గుర్తించకపోయినా ఇది ప్రాధాన్యం కల్గిన విషయం. దీన్ని అన్నిచోట్లా గుర్తిస్తున్నారు. దీని గురించి మాట్లాడనివాళ్ళు కూడా ఉన్నారు, ఐతే వారూ దీని ప్రాధాన్యం అర్థం చేసుకుంటున్నారు. 
    
     జనాభా సమతుల్యత కూడా ఉండి తీరాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనాభా గురించి ఒక విధానం ఉండాలి. ప్రస్తుతం ఒక విధానముంది. సరాసరిన దంపతులిరువురికీ 2.1 మించి సంతానం ఉండకూడదని అది చెబుతున్నది. అయితే మరొకసారి ఈ పై  విషయాలన్ని అందులో ఆలోచించడం జరిగిందా, సరిగ్గా ఆలోచించారా, రాబోయే యాభై ఏళ్ళ వరకు ఉండాల్సిన స్థితి గురించి ఊహించారా లేదా అని సరిచూసుకుని విధానాన్ని రూపొందించాలి. ఆ విధానంలో నిర్ణయమయ్యే అంతాలన్నీ, అందరికీ సమాన రూపంలో అమలు చేయలి. దానినుండి ఎవరికీ మినహాయింపు ఉండరాదు. ఎక్కడ సమస్య ఉన్నదో మొదట అక్కడ ఉపాయాలు ప్రయోగించాలి.అంటే ఎక్కడైతే పిల్లలను పోషించగల శక్తి లేకపోయినా చాలామంది పిల్లలు కలుగుతున్నారో, వారందరి పాలనా పోషణ సరిగా లేకపోతే మంచి పౌరులు తయారుకారు: కాబట్టి అక్కడ పని మొదలవ్వాలి. సమస్యలేని  చోట కూడా దీన్ని అమలుచేయవచ్చు. అయితే ఇలాంటి చోట కాసింత ఆలస్యమైనా పర్వాలేదు. కానీ చట్టం చేసి అమలుచేయదలచినంత మాత్రాన ప్రజలు స్వీకరిస్తారనేహామీ లేదు. నేను స్వయంగా ఒక సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం చేశాను. అది కుటుంబ నియంత్రణ ఉద్యమం గురించి అత్యధికంగా ప్రచారం జరుగుతున్న సమయం. ఏ ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులమైనా సరే, మేమంతా ఈ పని చేయాల్సి వచ్చింది. అందుకు గ్రామగ్రామానికి వెళ్ళి నేను దీనిగురించి ప్రచారం చేశాను. గ్రామీణ ప్రజలు అడిగే అన్ని రకాల ప్రశ్నలూ విన్నాను. మానసికంగా వారిని సిద్దం చేయాలి. అందరి మనసులనుూ అందుకు సిద్ధంచేయాలి. ధైర్యంగా ఆలోచించడం, సరిగా ఆలోచించడం, ఆమూలాగ్రంగా ఆలోచించడం, ఆలోచించి నిర్ణయం చేయడం; నిర్ణయమైన దానిపట్ల ప్రజల మనస్సులను సిద్ధం చేయడం మరియు సమానంగా అందరికీ అమలు చేయడం- జరగాల్సింది ఇది అపుడే దానివల్ల లాభం కలుగుతుంది.
    దీంట్లో మరొక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది సంతానోత్పాదక సామర్థ్యం. నేడు ఇది హిందువులలో తగ్గిపోతోంది లేదా పెరుగుతోంది అని ఏమి చెప్పినా, దానికి బాధ్యత వహించేది విధానం కాదు. కాబట్టి ఎవరికివారు ఆలోచించుకోవాలి. సరైన ఆలోచన ఏడవుతుంది? కుటుంబంలో సంతానం ఎంతమంది ఉన్నారు? అనేది కేవలం దేశానికి సంబంధించిన ప్రశ్నకాదు. ఇది ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన ప్రశ్న. దీనికి సంబంధించి సమగ్ర ఆలోచన ఎలా చేయాలి అనే ప్రశిక్షణ సమాజానికి లభించాలి. జనాభా అసంతులనం మతమార్పిడుల అయితే మరొకటిరెండు విషయాలున్నాయి. కారణంగా కూడా అవుతుంది. అక్రమ చొరబాటు ద్వారా కూడా అవుతుంది. మతమార్పిడి గురించి నేను ఇప్పుడే చెప్పాను. అక్రమ చొరబాట్లు నేరుగా మన దేశపు సార్వభౌమత్వాన్ని సవాలు చేయగల విషయమవుతోంది. దీన్ని నిర్ధయగా కట్టడి చేయాల్సి ఉంది. 

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.

మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top