డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:రిజర్వేషన్లు:
ప్రశ్న: రిజర్వేషన పట్ల సంఘం అభిప్రాయం ఏమిటి 7 రిజర్వేషన్లు ఎప్పటి వరికు అగ్జిక పరిస్థితి ఆధారిత రిజర్వేషన్లను సంఘం గౌరవిస్తుందా?
రిజర్వేషన్ కారణంగా సమాజంలో ఏర్పడుతున్న సంఘర్షణకు వరిష్కారమేమిటి?
క్రీమిలేయర్ కు రిజర్వేషన్లు లభించాలా?
అల్ప సంఖ్యాకులకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చునా ?
జవాబు : సామాజిక వైషమ్యాన్ని తొలగించి సమాజంలోని అందరికీ ఆవకాశాలు సమాన స్థాయిలో లభించాలనే ఉద్దేశ్యంతో వెనుకబాటుతనం ఆధారంగా అరక్షణలు (రిజర్వేషన్లు) కల్పించటం రాజ్యాంగం ద్వారా జరిగింది. రాజ్యాంగం సమ్మతించిన అన్నిరకాల రిజర్వేషన్లను సంఘం సంపూర్ణంగా సమర్ధిస్తుంది. మధ్యమధ్యలో ప్రకటనలు వెలువడుతుంటాయి, వాటినుండి ఆర్థాలు తీస్తుంటారు. ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి-సామాజిక వైషమ్యాన్ని దూరం చేయడం కొరకు రాజ్యాంగంలో ఎక్కడ ఏ మేరకు రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయో, వాటికి సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది.అది కొనసాగుతుంది కూడా. రిజర్వేషన్లు ఎప్పటివరకు ఉండాలి అనేది ఎవరికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయో, వారే నిర్ణయించాలి. తమకు రిజర్వేషన్లు, అవసరం లేదు అని వారికిఅన్సించినపుడు చూద్దాం. అయితే అప్పటివరకూ అది అమలు జరగాల్సిందే ఆనేది సంఘంలో చాలా కాలంక్రితమే బాగా ఆలోచించి రూపాందించుకున్న అభిప్రాయం. దానిలో మార్చేమీ లేదు.
ఇక క్రిమిలేయర్ ను ఏం చేయాలి? రాజ్యాంగంలో రిజర్వేషన్లదేవి సామాజిక వెనుకలాటు ఆధారంగా ఉన్నాయి, మతాల ఆధారంగా లేవు. ఎందుకంటే మతాలన్ని సమాజంలోని అగ్రకులాలు, వర్గాలలో ఉన్నాయి. అలాంటపుడు వారికి రజర్వేషన్లతో పనేముంది 7 అయితే నేడు మరికొన్ని కులాలు రిజర్వేషన్లను కోరుతున్నాయి. వాటినేం చేయాలి ? దీన్ని ఆలోచించడానికి రాజ్యాంగం పీఠాలను, ఫోరంలను ఏర్పరచింది. అవి అలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. రిజర్వేషన్లు సమస్య కాదు. రిజర్వేషన్ల చుట్టూ తిరిగే రాజకీయాలు సమస్య, చారిత్రక సామాజిక కారణాలతో మన సమాజంలో ఒక భాగం వెనుకబడింది. శరీరంలోని అన్ని అవయవాలు ఒకేసారి ముందుకెళ్తే, అప్పుడు శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పవచ్చు. " నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, చేతులు ముందుకు ఊగుతున్నాయి కానీ కాళ్ళు వెనుకకు పోతుంటే, అపుడు నన్ను పక్షవాతరోగంతో బాధపడుతున్నాడని అంటారు. కాబట్టి అవయవాలన్నింటినీ ఒకే వైపుకు సమానంగా కదిలేలా చేయాల్సిన అవసరముంది ".
సమాజంలో ఈ సమానత్వం ఎప్పుడు వస్తుంది ? పైన ఉన్నవారు క్రిందికి వంగాలి. క్రింది ఉన్నవారు తమ కాళ్ళ మడమలను పైకెత్తాలి. గోతిలో పడిపోయినవారిని, చేతితో చేతిని అందుకొని పైకిలాగి తీసుకురావాల్సివస్తుంది. సమాజంలో రిజర్వేషన్ల గురించి ఈ మనఃస్థితితో ఆలోచించాల్సి ఉంటుంది. ఇపుడు మనకు దొరుకుతోందా, దొరకడం లేదా అనే ఆలోచన చేయరాదు. సామాజిక కారణాల వల్ల వేలాది సంవత్సరాలుగా దాదాపు ఇదే స్థితి ఉంది. మన సమాజంలో ఒక భాగాన్ని మనం సంపూర్ణంగా బలహీనులుగా మార్చేశాము, దాన్ని సరిచేయడం అవసరం.
వేలాది సంవత్సరాలుగా ఉన్న రోగాన్ని నయం చేయడంలో నూరు లేదా నూటా యాభై ఏళ్ళు మనం వంగి ఉండాల్సి వస్తే అది భారీ మూల్యమేమీ కాదు. ఇది మన కర్తవ్యం. అలా ఆలోచించి దీనిగురించి ముందుకు నడిస్తే ఈ ప్రశ్నలిన్నింటికీ సమాధానం లభిస్తుంది. అయితే ఈ ప్రశ్నలను పట్టుకుని రాజకీయం చేయరాదు. ఇది సమాజపు ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్న. దీని విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో నడవాలనేది సంఘం అభిప్రాయం.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..