" డాక్టర్జీ సర్వతోముఖ సంపర్కం - సంబంధాలు " 'భవిష్య భారతం' డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం!

డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
: డాక్టర్జీ సర్వతోముఖ సంపర్కం - సంబంధాలు :
ది నేనెందుకు చెబుతున్నానంటే, డాక్టర్ హెడ్గేవార్ సంపూర్ణంగా దేశ సార్వజనిక జీవనంలో సక్రియంగా ఉన్నారు. అంతేగాక ఎప్పుడో ఒకప్పుడు దేశంలోని ప్రముఖ ఆలోచనా పరులతో ఏదో ఒక పనిద్వారా పరిచయం, సంబంధం కల్గి ఉండేవారు. విప్లవకారులతో కలిసి ఆయన పనిచేశారు. ఆయన ఆ సమయంలోని స్వాతంత్ర ఉద్యమాలలోనూ భాగస్వామి అయ్యారు. సమాజ సంస్కరణ కార్యం కూడా ఆయన చేశారు. 
   దేశాన్ని మేల్కొల్పడం కోసం దేవాలయం, కథ, ప్రవచనాల ఆధారంగా సమావేశాలు నిర్వహించారు. దేశాన్ని జాగృతం చేయడమే ఆయన ఏకైక లక్ష్యం ఒకసారి ఆయనలోని ఈ పట్టుదలను చూసి ఆయన స్నేహితులు ఆయనతో, దేశం విషయం ప్రస్తావనకు రానటువంటి అంశంమీద ఉపన్యాసం ఇప్పించాలని నిర్ణయించారు. అందుకోసం ఒక చిన్న అధ్యయన బృందానికి (Study Circle) ఆహ్వానించి, 'నిద్ర' అనే అంశంపై ఉపన్యాసమివ్వండని కోరారు. ఈ విషయంలో దేశంగురించి ఎవరైనా ఏం మాట్లాడతారు? అని వారు అనుకున్నారు. అయితే డా|॥ హెడ్గేవార్ ఆ బృందం ఎదుట మాట్లాడుతూ, మీరంతా వైద్యులే. నిద్ర అనేది చాలా ప్రాముఖ్యం గల విషయమని మీకు తెలిసిందే. అది లేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదు. మంచినిద్ర తప్పనిసరి ఎందుకంటే నేడు దేశంలో ఆరోగ్యవంతులైన యువకుల అవసరముంది అంటూ దేశ పరిస్థితులు, యువకుల కర్తవ్యం గురించి చెప్పారు. ఇలా నిరంతరం దేశంగురించి ఆలోచించడంలోనే నిమగ్నమయ్యేవారు. అందువల్ల అందరితోనూ ఆయన చర్చలు జరుపుతుండేవారు. అందరి ఆలోచనల సారాంశం ఆయనకు అందేది. అన్ని రకాల ఆలోచనలలో ఆయన పాలుపంచుకునేవారు.

    గాంధీజీ యరవాడ జైలులో బంధించబడ్డారు. బహుశా మార్చి 28వ తేది అనుకుంటాను, నాగపూర్ కాంగ్రెస్ కమిటీ ప్రతినెల 28వ తేదిన గాంధీజీని, ఆయన ఆలోచనలను స్మరించుకోవాలని నిర్ణయం చేసింది. 1922 ఏప్రిల్ 28న జరిగిన మొదటి సమావేశంలో కాంగ్రెస్ కమిటీ, డా|| హెడ్గేవార్ ను వక్తగా ఆహ్వానించింది. ఆ నమావేశంలో డా|| హెడ్గేవార్ మాట్లాడుతూ, కేవలం గాంధీజీని స్మరించుకోవడం ద్వారా మాత్రమే పని జరగదు. ఆయన జీవితంలోని ఉన్నతస్థాయి త్యాగం మరియు సంపూర్ణ నిస్వార్థ భావనతో దేశంకోసం, సమాజంకోసం పనిచేయాలనే తీవ్రమైన ఆకాంక్ష ఏదైతేఉందో, దాన్ని మనమందరమూ అనుకరించాల్సి ఉంది అన్నారు. ఆయన సుభాష్ చంద్రబోసును కలిశారు, వీరసావర్కర్ ను కలిశారు. విప్లవకారులతో ఆయనకు ముందు నుండే సంబంధాలుండేవి. 
   రాజగురు అజ్ఞాతంలో ఉన్నపుడు నాగపూర్లో, విదర్బ ప్రాంతంలో ఆయన ఉండడంకోసం వ్యవస్థనంతా డా॥| హెడ్డేవార్ గారే చేశారు. ఈ విధంగా అనేక మందితో ఆయన చర్చలు చేస్తుండేవారు. తద్వారా అందరిలోనూ తాము చేపట్టిన కార్యక్రమం ద్వారా ఎప్పటికో ఒకప్పటికి విజయం లభిస్తుంది అనే భావన ఉందని ఆయనకు అన్నించింది. అయితే మళ్ళీ మళ్ళీ ఈ పని చేయాల్సిన అవసరం మన సమాజంలో రాకూడదు. ఎవరికి వారు లేచి నిలబడాలి. ఆరోగ్యకరమైన సమాజంలో సమాజం కోసం ఏది అవసరమో, అది దానంతట అదే జరిగిపోవాలి; ఎవరో పనిగట్టుకొని వచ్చి చేయాల్సిన అవసరం ఏర్పడరాదు. అయితే మళ్ళీ మళ్ళీ అవసరం ఏర్పడుతూ ఉండడానికి కారణం మన సమాజంలోని కొన్ని లోటుపాట్లు. వాటిని సరిదిద్దుకుని
నమాజాన్ని లేచి నిలబడేలా చేయకపోతే మనందరి ప్రయత్నం, పని అసంపూర్ణమవుతుంది. లేదా లభించే విజయం తాత్కాలిక మైనదే అవుతుంది. లేదా పూర్తిగా అసఫలమవుతుంది అనే ఆలోచన అందరి మనసుల్లో ఉందనేది ఆయన దృష్టికి వచ్చింది

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top