" సామాజిక చైతన్యపు నాలుగు ప్రవాహాలు " - 'భవిష్య భారతం' డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం: The four streams of social consciousness

డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
: సామాజిక చైతన్యపు నాలుగు ప్రవాహాలు :
1857లో దేశాన్ని స్వతంత్రం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం భారతదేశంలో జరిగింది, అయితే అది విఫలం అయింది. విఫలమయ్యాక మనదేశపు ప్రముఖ వ్యక్తుల మనసుల్లో ఆలోచన మొదలైంది. ఇంత విశాలమైన మనదేశం, పెద్ద సంఖ్యలో  ఉన్న మన జనాభా, మన సైన్యం, రాజులు, మహారాజులూ ఉండగా ఆంగ్లేయులు పిడికెడంతమంది మాత్రమే ఉన్నారు. అదీగాక వారు బయటినుండి వచ్చినవారు. ఇక్కడి వాతావరణం కారణంగా వారికి అన్నీ ప్రతికూల పరిస్థితులే. అయినాకూడా వారు గెలిచారు, మనం ఓడిపోయాం. ఇదేలా సాధ్యమైంది? ఇలాంటి ఆలోచనామథనం తర్వాత సామాజిక చైతన్యం కొరకు ప్రయత్నం ప్రారంభమైంది. దానిలో సాధారణంగా నాలుగు ముఖ్య ప్రవాహాలు కన్పడుతున్నాయి.
   ఒక ప్రవాహం ఏం చెబుతుందంటే, ఒక ప్రయత్నం విఫలమవుతే ఏమవుతుంది. అదే మార్గంలో అంటే సాయుధ సంఘర్షణ మార్గంలోనే ముందుకు సాగాలని. దానినుండి తర్వాత విప్లవకారుల మార్గం ప్రారంభమైంది, గదర్ ప్రయత్నం జరిగింది. మళ్ళీ' విప్లవకారుల చిన్నచిన్న జట్లు ఏర్పడ్డాయి. అవి కొంత శ్రమించాయి. 1945లో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి గురియై కనబడకుండా పోయేవరకూ ఈ ప్రవాహం సాగింది. ఆ ప్రవాహం దేశంకోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అనేకమంది మహాపురుషులను మనకు అందించింది. నేటికి కూడా మనం వారిని
స్మరించుకుంటున్నాం మరియు వారి జీవితాలనుండి ప్రేరణ పొందుతున్నాం. నేడు మనదేశం స్వతంత్రమైంది కనుక వాటి అవసరం ఇప్పుడు లేదు.
   రెండవ ప్రవాహం ప్రకారం మనదేశ ప్రజలలో రాజకీయ చైతన్యం తక్కువగా ఉంది. అధికారం ఎవరిది, దాని ప్రాముఖ్యం ఏమిటి అనేది తక్కువ మంది ప్రజలకు మాత్రమే తెలుసు. మనదేశ ప్రజలలో రాజకీయ చైతన్యం తేవాలి. అందుకోసం కాంగ్రెస్ రూపంలో దేశవ్యాప్తమైన ఒక పెద్ద ఉద్యమం రూపుదిద్దుకొంది. అందులోనూ అనేకమంది సర్వస్వార్పణ చేసిన మహాపురుషులు పాల్గొన్నారు. వారిద్వారా మన జీవితాలకు నేటికీ ప్రేరణ లభిస్తోంది. దేశంలోని సర్వసాధారణ వ్యక్తిని కూడా స్వతంత్రం కోసం వీధుల్లోకి తెచ్చిన ఘనత ఈ ప్రవాహానిదే. మన స్వాతంత్య్ర ప్రాప్తిలో  ఈ ప్రవాహపుపాత్ర ఎంతో ఉంది. దేశ జీవనం ముందుకు సాగుతూపోయేకొద్దీ రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. అలా నేడు కూడా రాజకీయాలు నడుస్తున్నవి. అయితే నేడు దేశమంతటికీ ఒకే రాజకీయ పంథా లేదు. అనేక రాజకీయ పార్టీలున్నాయి, అనేక కూటములున్నాయి. అయితే నేడు వాటి స్థితి ఎలా ఉంది? ఈ విషయమై నేనేమీ మాట్లాడను. మీరే అర్థం చేసుకోండి, ఏది ఎలా ఉందో, మీరు చూస్తూనే ఉన్నారు గదా.
    మన సమాజంలో సంస్కరణలు తేవాల్సిన అవసరముంది అని చెప్పేది మూడవ ప్రవాహం. స్వార్ధబుద్ధి ప్రబలింది. భేదభావాలు పెరిగాయి. శీలం విషయంలో వ్యక్తులు దిగజారి పోయారు. వారిమధ్య భాష, ప్రాంతం, కులం, ఉపకులం వంటి అనేక భేదాలున్నాయి; సమాజంలో నిరక్షరత ఉంది, సమాజంలో దారిద్యముంది.  వీటినన్నింటిని తొలగించుకుంటేగానీ ఆంగ్లేయులముందు నిలబడి పోరాడలేము. కాబట్టి సమాజ సంస్కరణలోనూ ఇలాంటి అనేకమంది ప్రాతః స్మరణీయ మహాపురుషులు ముందునిలిచారు, వారి పేర్లను నేటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. వారి ఆదర్శాన్ని మన జీవితాల్లో అలవరచుకోవడానికి మనముందుంచుకుంటాం. ఈ ప్రవాహం నేటికీ కొంతకొంతగా కొనసాగుతూనే ఉంది. అయితే దాని స్థితి సముద్రంలో ద్వీపంలా మారిపోయింది. ఎవరైతే సమాజ సంస్కరణ కోసం పనిచేశారో వారు కొంతమేరకు సమాజంలో మార్పు తెచ్చి చూపారు. అయితే, అది అంతవరకే పరిమితమైంది. మొత్తం సమాజం స్వభావంలోగాని, ఆచరణలోగాని ఆ పరివర్తన రాలేదు. వారి స్వప్నాలు నేటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి
    నాల్గవ ప్రవాహం మనం మన మూలాలలోకి తిరిగి వెళ్ళాలని చెబుతుంది. ఆర్య సమాజ సంస్థాపకులు స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస శిష్యులు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు మన మూలాలమీద దృఢంగా నిలబడి సమాజంలో నుండి దారిద్ర్యం మరియు అజ్ఞానాలను తొలగించడంకోసం సేవచేయాలని సందేశమిచ్చారు. ఆ దారిలో మనం ఎంతోకొంత నేటికీ ముందుకు సాగుతూనే ఉన్నాం. అయితే మన దేశంలోని సమాజంలో రావలసినంతగా గుణాత్మకమైన మారపురాలేదు. స్వాతంత్య్రానికి ముందురాలేదు, స్వాతంత్య్యం వచ్చాక ఈనాడు మనం కూర్చొని మనదేశాన్ని గమనించినా మనందరికీ దాని అవసరమేమిటో అనుభవంలోకీ వస్తుంది. ఆరోజుల్లో పనిచేసిన వారు మరియు ఈ రోజుల్లో అలాంటి పనినే చేస్తున్నవారు. ఈ విషయమై చెప్పిన అంశాలు, వ్రాసిన అంశాలు మనకు లభిస్తున్నవి.
     శ్రీ రవీంద్రనాథ ఠాగూరు తమ 'స్వదేశీ సమాజ్' అనే పెద్ద వ్యాసంలో ఏకాత్మత తప్పనిసరిగా కావాలని చెప్పారు, ఎందుకంటే, స్వల్పకారణాలతో కొట్లాడుకుంటూ ఉండడం ప్రయోజనకరం కాదు.మనమధ్య ఎన్ని వైవిధ్యాలున్నా అందరమూ ఒకటిగా కలిసి నడిచే ఆలోచన పరంపరాగతంగా ఉంది; సంస్కృతి ఉంది. అయితే ఈ మార్పు రాజకీయాలలో వచ్చినందున సమాజంలోనూ వచ్చిందనుకోరాదు. సమాజంలోనూ మార్పు రావాలి. సమాజంలో మార్పు జరిగితే సమాజ జీవనంలోని అన్ని కార్యకలాపాలు తమంతటతాము మార్పు చెందుతాయి. అక్కడి నుండి ప్రారంభమై ఇక్కడికి చేరుకోలేము. ఇక్కడ నుండి మెదలుపెట్టి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనిని కొనసాగిస్తూ ఆయన దీనికొరకు ఒక నాయకుడు అవసరమవుతాడని తెలిపారు. ఆ నాయకుడు విశుద్ధశీలం కలవాడై ఉండి, సమాజంలోని వ్యక్తులందరిపట్ల ఆత్మీయభావన ప్రదర్శించాలి మరియు సమాజపు మనసులో ఆయనపట్ల పూర్తి విశ్వాసమూ ఉండాలి. అలాంటి నాయకుడిని తయారుచేసుకోవాల్సి ఉంది. ఆయన ఒక చోట వైవిధ్యాలతో నిండిన మనదేశంలో, ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి నాయకుని అవసరం ఉంది, అలాంటి వారివల్ల సమాజపు ఆచరణ మరియు వాతావరణం మారుతుంది' అన్నారు.
   సర్ మానవేంద్రనాథ్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. తర్వాత ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ అయ్యాడు. తన జీవితాన్ని ఒక దస్తావేజు రూపంలో 'ది రాడికల్ హ్యూమనిజం' పేరిట రచించాడు. దాన్ని మీరు చూసి ఉంటారు కూడా, లేకపోతే తప్పక చూడండి. దానిలోని చివరి అధ్యాయాలలో దాని నిర్ధారణను వివరించారాయన. సమాజాన్ని మార్చకుండా పైపైన మార్పులు తీసుకువచ్చి, దేశంలో మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తే, అది సాధ్యమమయ్యేదికాదు అన్నారాయన. 
   మనం సమాజంలోని సాధారణ వ్యక్తులవద్దకు చేరుకుని, వారి గుణంలోనూ, ఆలోచనలోనూ మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ దారి చాలా సుదీర్ఘమైనదిగా కనబడుతుంది, అయితే ఈ దారి మాత్రమే ఏకైక మార్గమైనప్పుడు ఇదే అన్నింటికన్నా దగ్గరిదారి అవుతుంది. ఇతర దగ్గరదారులు వెతికితే 'Shortcut will cut you short (కురచదారులకోసం పోతే నీవే కురచ అయిపోతావు) అని హెచ్చరించారు.
    మన మాజీ రాష్ట్రపతి డా|| అబ్దుల్ కలాం అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్ళినపుడు, తమ ఉపన్యాసంలో మూడు విషయాలను పేర్కొన్నారు. మనదేశ ప్రజలలో తమపట్ల, తమ దేశంపట్ల, సమాజంపట్ల విశ్వాసాన్ని మేల్కొల్పాల్సిన అవసరముంది. ఈ పని మనందరమూ చేయగలము మరియు ఇది చేయాలంటే మొదట మనం ప్రజాశక్తిని మేల్కొల్పాల్సి ఉంది. ఆ తర్వాత ప్రజాశక్తి మేల్కొల్పుట కోసం మనం మన ప్రాచీన సంస్కృతీ సంస్కారాలను పునరుజ్జీవింప జేయాల్సి ఉంది అని చెప్పారాయన. ఆయన అరుణాచల్ ప్రదేశ్ లో ఇచ్చిన ఉపన్యాసం దొరుకుతోంది, దాన్ని మీరు చూడవచ్చు. ఆయన పుస్తకాలన్నింటిలో ఎక్కడో ఒక చోట ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటాయి.
    అమూల్ సంస్థ నిర్మాత, ఈ మధ్యనే స్వర్గస్థులైన డా॥ వర్షీస్ కురియన్ తమ జీవితచరిత్ర అయిన ' too had a dream' లో 'కేవలం అధికార వ్యవస్థలపై ఆధారపడి సాధారణ సమాజాన్ని పట్టించుకోకుండా పోయే పద్ధతి ఇలాగే కొనసాగుతూ పోతే ఈ దేశంలో గొప్పకార్యమేదీ సంభవించడం సాధ్యం కాదు. మనం సమాజానికి శిక్షణనిచ్చి, దాన్ని పైకి తీసుకురావాల్సి ఉంటుంది. దాని బలం మీదే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి' అని వ్రాశారు.

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top