" మహిళలు - సంఘ దృష్టికోణం ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు; Women (Mahila) - Sangh Perspective

Vishwa Bhaarath
" మహిళలు - సంఘ దృష్టికోణం ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు; Women (Mahila) - Sangh Perspective
డా. మోహన్ భాగవత్ జీ
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:మహిళలు - సంఘ దృష్టికోణం:
ప్రశ్న : బాలికలు లేదా మహిళల రక్షణ గురించి సంఘ దృష్టికోణం ఏమిటి ? ఈ దిశలో సంఘం ఏమైనా చేసిందా ?
నేరస్తులలో చట్టంపట్ల ఎందుకు భయం లేకుండా పోయింది ? 
జవాబు : బాలికల లేదా మహిళల రక్షణ - దీని నిర్ణయించడానికి రెండు మూడు విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో మహిళలు ఇంట్లోనే ఉండటంవల్ల వారి బాధ్యత ఆ కుటుంబంమీదే ఉండేది. నేడు మహిళలు కూడా పురుషులతో సమానంగా బయటకొచ్చి పనిచేస్తున్నారు. తమ కర్తృత్వాన్ని నిరూపించుకుంటున్నారు, నిరూపించుకోవాలి కూడా. దాంతోపాటు తమ రక్షణ విషయంలో జాగ్రత్తతో ఉండటం మరియు శక్తిమంతం కావాల్సి  ఉంటుంది. కాబట్టి బాల్యవయసులోని బాలురకు, మరియు బాలికలకూ, ఇద్దరికీ శిక్షణ ఇవ్వాలి. కిశోరీ వికాస్, కిశోర వికాస్ ఈ పని సంఘ స్వయంసేవకులు చేస్తున్నారు. ఎందుకంటే పురుషుడు ఒక స్త్రీ వైపు చూసే చూపులో తేడా వచ్చినపుడే ఆ మహిళకు ఇబ్బందులు కలుగుతాయి.
    సుప్రీంకోర్టు ద్వారా అత్యాచారాలకు పాల్పడిన వారికి తీవ్రమైన శిక్షలుపడినప్పుడు ఈ విషయమై టి.వి.లలో చర్చ జరుగుతోంది. నేను దాన్ని చూస్తుండగా ఒక మహిళా విలేకరి, కేవలం అపరాధులకు శిక్ష విధించడం ద్వారా మాత్రమే పని పూర్తవదు అన్నది పురుషుడు మహిళను చూసే దృష్టికోణంలో మార్పురావాలి ఇదీ మూల సమస్య అని చెప్పింది. 'మాతృవత్ పరదారేషు...' అంటూ ఈ దృష్టికోణం మన పరంపరలో ఉంది.
    బార్య మినహా మిగతా స్త్రీలందరినీ తల్లి రూపంలో చూడాలి. ఇది మన ఆదర్శం. ఇలాంటి సంస్కారాలను పురుషులలోనూ జాగృతం చేయవలసి ఉంటుంది. అందుకోసమే కిశోర మరియు కిశోరి వికాస కార్యక్రమాలను నిర్వహించాలి. అలాగే మహిళలకు స్వీయరక్షణ చేసుకోగల్గిన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలను వృద్ధిపరచాలి, ఈ దిశలో కూడా స్వయంసేవకులు పని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల, కళాశాల విద్యార్థినులకు ఈ శిక్షణనివ్వడం, పోటీలు నిర్వహించడం లాంటివి గత సంవత్సరం నుండి ఫ్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలలో ఇవి మొదలవుతాయి. సంఘం స్వయంసేవకులు ఈ పని చేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం శాఖలు నడుపుతుంది తప్ప మరింకేమీ చేయదు. కానీ సంఘ స్వయంసేవక్'లు ఈ పని చేస్తారు.
     విద్యార్థి పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమై, పెద్దపెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశిక్షణ నిస్తున్నారు. వీటిని దేశమంతటా ప్రారంభిస్తారు కూడా. చట్టంపట్ల భయం అనేది నేరస్తులలో తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చట్టమనేది కొంతవరకే అమలు అవుతుంది. సమాజపు ప్రభావము, గౌరవ ప్రతిష్టలు కోల్పోరాదనే వెరపు మరియు సంస్కారాల ప్రభావ పరిణామం ఎక్కువగా ఉంటుంది. చట్టం విజయవంతమవడమనేది సమాజపు మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగే నియమం, దాన్ని అతిక్రమించని సమాజం ఉంటేనే పాటించబడుతుంది. కాబట్టి చట్టాలను కఠినంగా తయారుచేయడమే గాక, వాటిని సక్రమంగా అమలుచేసి నేరస్తులకు సరైన శిక్షపడేలా చూడాలి. ఇందులో రెండో మాటకు తావుండకూడదు. 
      అయితే దాంతోపాటు నమాజం కూడా దీనివట్ల దృష్టి పెట్టాలి. చూసేవారు నాగురించి ఏమనుకుంటారన్న భయమూ, సిగ్గూ ఉండాలి. సమాజం నేరస్తులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఇది మన బాధ్యత. ఈ దృష్టితో ఆ సంస్కారం జాగృతమవడం కూడా .ఈ విషయంలో అంతే ప్రాముఖ్యం కల్గినదవుతుంది. కొన్నిచోట్ల సాయంత్రం అయిదు లేదా అయిదున్నర గంటల తర్వాత మహిళలు ఇంటి నుండి బయటకు వెళ్ళరు. అలాగే దేశంలో మరికొన్నిచోట్ల రాత్రివేళలోకూడా మహిళలు అన్ని ఆభరణాలు ధరించి మహిళలలు ఎక్కడికైనా వెళ్ళి వస్తుంటారు. అది కూడా ఒంటరిగా ఎలాంటి భయమూ లేకుండా వెళ్ళి వస్తుంటారు. ఇది మనం చూస్తున్నాం. ఇది చట్టం ద్వారా ఏర్పడిన పరిణామం కాదు, అది అక్కడి వాతావరణంవల్ల ఏర్పడినది. అలాంటి వాతావరణాన్ని ప్రయత్నపూర్వకంగా మనం ఏర్పరచాలి. మనమందరం దీనికోసం ఈ పని చేయాలి, చేసి తీరాలి.

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.

మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top