డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:భాషా సంబంధితమైనవి:
ప్రశువ : ఆంగ్లభాష అధికారం చలాయించడం చూస్తున్నాం. భారతీయ భావలు మరియు పొందీపట్ల సంఘ ఆలోచన ఏమిటి ? సంస్కృత విద్యాలయాలు కూడా తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా వాటికి ప్రాముఖ్యం కూడా ఇవ్వడం లేదు, ఈ పరిస్థితిని సంఘం ఏ దృష్టితో చూస్తుంది ? హిందీ మొత్తం చేశానికి చెందిన భాష ఎప్పుడవుతుంది సంస్కృతానికి హిందీకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదా ?
జవాబు : ఆంగ్లభాష అధికారం విషయానికొస్తే, దానిపట్ల వ్యామోహం మన మనసులో ఉంది. భారతదేశంలోని మేధావి వర్గం భారతీయ భాషల్లో మాట్లాడగల్గుతుంది, ఇరువురూ హింది తెలిసినవారైనా, అవకాశం దొరికినపుడు ఆంగ్లంలో మాట్లాడుతుంటారు. మన మన మాతృభాషలకు గౌరవమివ్వడం మొదలుపెట్టాలి.
భాష అనేది భావానికి వాహకంలాంటిది. సంస్కృతికీ వాహకం అవుతుంది. కాబట్టి మానవ జాతి వికాసంకోసం భాషల అస్తిత్వం అనివార్య విషయం. మన భాష గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటే, ఏ భాషతోనూ శత్రుత్వం కల్గి ఉండాల్సిన అవసరం లేదు, రాదు. ఆంగ్లభాషను తొలగించడం కాదు: ఆంగ్లాన్ని ఉంచండి, యథోచితస్థానంలో ఉంచండి. ఆంగ్లం గురించి మన మనసులో ఉన్న భావనను తొలగించుకోవాల్సి ఉంది. ఆంగ్లభాషను మనం అంతర్జాతీయ భాష అంటుంటాం. అయితే వాస్తవంగా చూస్తే ఐరోపా దేశాలలో ఇద్దరు భారతీయులు కలిసినపుడు ఆంగ్లభాషలో మాట్లాడితే ఇద్దరికీ అర్థం కాదు. వాళ్ళు భారతీయ భాషలనే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంగ్లేయులు అధికారం చెలాయించిన దేశాలలో మాత్రమే ఆంగ్లభాషకు ఒక స్థానమేర్పడింది.
అమెరికాలో కూడా ఆంగ్లం మాట్లాడతారు కానీ వాళ్ళు, బ్రిటిష్ ఇంగ్లీషుతో పోలిస్తే మా ఇంగ్లీష్ వేరు అంటారు. ఆఖరుకు పదాలుపలికే ప్దతి కూడా వేర్వేరు. ప్రాన్స్ లో ఫ్రెంచిభాషకే ప్రాధాన్యం. ఇజ్రాయిల్ లో చదువు కోవాలనుకుంటే హిబ్రూ నేర్చుకుని వెళ్ళాల్సి ఉంటుంది. రష్యాకు పోవాలనుకుంటే రష్యన్ భాష నేర్చుకోవాలి. చైనా, జపాన్ లో అన్ని విషయాలలోను తమ తమ భాషలనే వాడతాయి. అవన్నీ ప్రయత్నపూర్వకంగా అలా చేశాయి. మనం కూడా ఈ ప్రయత్నం చేయాల్సివస్తుంది. వీలైనంతవరకూ మనం మన సొంతభాషలో పనులు చక్కబెట్టుకోవాలి. అన్నింటికన్నా సమృద్ధమైన భాషలు మనవద్ద ఉన్నాయి. ఈ పని మనం చేయగలం. మనం చేయడం ప్రారంభిస్తే అది జరిగి తీరుతుంది. ఆంగ్లభాషపట్ల మనకేమీ శత్రుత్వం లేదు. మంచి ఆంగ్లభాషలో మాట్లాడేవారు కావాలి. అపుడే ప్రపంచంలో మనదైన ముద్ర వేయగల్గుతాం. భాషపరంగా మనం ఏ భాషపట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించం కానీ దేశ అభివృద్ధి విషయంలో మన మాతృభాషలో విద్య ఉండాలి. దాని అవసరం ఉంది.
అయితే మనకు అనేక భాషలున్నాయి కదా ! మనమంతా ఒకే భాషను ఎందుకు వాడుకలోకి తెచ్చుకోలేకపోతున్నాం ? మరొక భారతీయ భాషను మనం నేర్చుకోవాలనే మనస్తత్వం మనలో ఏర్పడాల్సిన అవసరముంది. హిందీ విషయానికొస్తే అది స్వాభావిక రూపంలో అమలవుతోంది. చాలా కాలంనుండి అది అమలులో ఉంది. ఎక్కువమంది పొందీ మాట్లాడతారు కాబట్టి అది నడిచిపోతోంది. అయితే దీనిగురించి మనసు సిద్దమన్వాలి, చట్టం చేస్తే ఆరగదు. ఆరోపణల ద్వారా జరిగేది కాదు. ఒక భాష గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం దేశాన్ని కలపాల్సి ఉంది. ఒక భాష విషయంలో దేశంలో వ్యతిరేకత ఎదురవుతోందంటే, పరస్పరం కలినత్వం పెరుగుతుందంటే మనం మన మనసులను ఎలా తయారుచేసుకోవాలో ఆలోచించుకోవాలి. నా అనుభవం ఏమిటంటే, హిందీ భాష అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాక దేశంలోని ఎక్కువ ప్రాంతాలలో హిందీ భాషతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాలలోని చాలా మంది హిందీ నేర్చుకుంటున్నారు, నేర్పుతున్నారు.
కాగా హిందీ ప్రాంతాల ప్రజల పని హిందీ ద్వారా జరిగిపోతోంది. కాబట్టి వాళ్ళు మరో భాషను నేర్చుకోరు. హిందీ మాట్లాడేవాళ్ళు కూడా, ఏదైనా మరొక ప్రాంతానికి చెందిన భాషను ఎందుకు నేర్చుకోరాదు? దీనివల్ల మనసులు త్వరగా కలుస్తాయి. మనకు ఒకే జాతీయభాష ఉంటే తద్వారా మన మొత్తం పనవుతుంది. అదికూడా త్వరగా పూర్తవుతుంది. ఈ పని జరగాల్సిన అవసరముంది. సంస్కృత పాఠశాలలు తగ్గిపోతున్నాయంటే దానికి కారణం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడమే. ఎవరివ్వడం లేదు? ప్రజలు ప్రాముఖ్యత నివ్వకపోతే, ప్రభుత్వమూ ఇవ్వదూ మేము సంస్కృతం నేర్చుకుంటాం, మా పిల్లలూ నేర్చుకుంటారు అనే భావన ఉండాలి రావాలి.
కనీసం సంభాషించడం వరకైనా నేర్చుకోవాలి; ఎందుకంటే మన పరంపరకు చెందిన సాహిత్యమంతా దాదాపుగా సంస్కృతంలో ఉంది. ఈ దిశలో స్వయంసేవకులు కృషిచేస్తున్నారు. సంస్కృతం ప్రచారం, వ్యాప్తి కొరకు రెండు మూడు రకాల పనులు జరుగుతున్నాయి. మంచి ఫలితాలూ లభిస్తున్నాయి. మరే ఇతర భాషలకన్నా సంస్కృతం శ్రేష్ఠమైన భాష అని, కంప్యూటర్ కొరకు అత్యుత్తమమైన భాష సంస్కృతమేనని అంటున్నారు. మనం మనసు పెట్టి పనిచేస్తే. మన పరంపర గురించి అధ్యయనం సరిగా జరుగుతుంది. దాంతో గర్వమూ, గౌరవమూ కల్గుతాయి. తద్వారా సమాజంలో దానిపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగితే పాఠశాలలు మళ్ళీ ప్రారంభమవుతాయి, భాష నేర్పే వాళ్ళు దొరుకుతారు. ప్రభుత్వ విధానాలను సమాజపు మానసిక సంసిద్ధత ప్రభావితం చేస్తుంది. ఈ పని చేయడం చాలా అవసరం. మనమేమీ చేయకుండా ఇతరులెవరో చేయాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఇది ఎప్పటికీ జరిగే వనికాదు.
మళ్ళీ ప్రాధాన్యం అనే ప్రశ్న వస్తుంది. నిజానికి ఈ ప్రాధాన్యం అనేది తప్పుడు పదం. భారతదేశంలోని భాషలన్నీ నావే, నేనెక్కడుంటే, అక్కడి భాషను మాట్లాడుతాను అనే భావన పెరగాలి. మనకు మన మాతృభాష సంపూర్ణంగా రావాలి. నేనెక్కడుంటే అక్కడి భాషను మనస్ఫూర్తిగా నేర్చుకోవాలనే భావన ఉండాలి. తద్వారా భారతదేశమంతటా ఒకే భాష ఉండేలా చూడగలం. అదేదో గొప్పదని కాదు, ప్రస్తుత సమయంలో అది అన్నింటికన్నా ఉపయోగకరమైనది కాబట్టి అలా చేయడం జరగాల్సి ఉంది. మీకు ఇష్టముంటే, అవసరముంటే ఏదైనా మరొక విదేశీ భాషను కూడా నేర్చుకోవచ్చని మనం ఇతరులకు చెప్పాలి. ఆయా భాషల్లో మీరు ఆ విదేశీ ప్రజలకన్నా నైపుణ్యం సాధించండి. అందులో భారతదేశపు గౌరవం ఉంటుంది.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..