బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి – Muslim mob attacks Dalit basti in Bihar

0
బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి – ఒకరి మృతి : VHP demands action on Purnia Jihadis & justice for victimized Maha-Dalits
బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి 

నెల 19వ తేదీ రాత్రి బీహార్లోని పూర్ణియా జిల్లా బైసి పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝ్వా గ్రామంలోని మహా దళిత కాలనీపై ముస్లిం మూక దాడి చేసి వారి ఇళ్ళను అగ్నికి ఆహుతి చేసింది. ఈ దాడిలో సుమారు డజను గృహాలు పూర్తిగా తగలబడిపోయాయి. ఈ దాడిలో మారణాయుధాలు ధరించిన సుమారు 200 మంది ముస్లింలు పాల్గొని ఉంటారని అంచనా. ఆ కాలనీలో 60 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి.
  • అడ్డుకోవడానికి యత్నించిన స్థానిక దళితులపై చాలా తీవ్రంగా దాడులకు దిగడమే కాకుండా, ఇళ్ళలోని వారిని కూడా బయటకు లాగి వారిపై మారణాయుధాలతో క్రూరంగా దాడి చేశారు.
  • ఈ దాడిలో వాచ్ మన్ గా పనిచేసే 70 సంవత్సరాల మేవాలాల్ రాయ్ అనే వృద్ధుడు మరణించాడు. లక్ష్మీ అనే గర్భిణిపై కూడా దుండగులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాల మధ్య ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
  • ఈ ప్రాంతం బైసి అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ కి చెందిన AIMIM పార్టీకి చెందిన సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ ప్రజలు ఐదుగురు MLA లను AIMIM పార్టీ నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపారు.
మూడు సంవత్సరాల బాలుడు మాయం
ఈ ఘటన తర్వాత ప్రతాప్ రాయ్ కుమారుడు, మూడు సంవత్సరాల వయసున్న దివాన్ రాయ్ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. దాడికి వచ్చిన మూకే ఆ బాలుడ్ని హతమార్చి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వచ్చిన మూక ” అల్లాహు అక్బర్” అంటూ నినదిస్తూ గృహాలను నలువైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేయడం గమనార్హం.
  ఆ ప్రాంతంలో నివసిస్తున్న దళితులపై అక్కడి ముస్లిమ్స్ కి గల ద్వేషమే దాడులకు కారణమని భావిస్తున్నారు. దళితులు నివాసముంటున్న స్థలం తమదిగా వాదిస్తున్న ముస్లింలు గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని దళితుల్ని బెదిరిస్తూ ఉన్నారు. కానీ దళితులు మాత్రం తాము ఇళ్లు నిర్మించుకున్న ప్రదేశం ప్రభుత్వానిదని వాదిస్తున్నారు.

దుండగుల పై చర్యలకు VHP డిమాండ్
విషయం తెలుసుకున్న VHP ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన ఘటనపై వి హెచ్ పి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.

ఘటన జరిగిన సమయంలో స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడాన్ని VHP తీవ్రంగా దుయ్యబట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముస్లిములు దళితులపై తరచుగా ఇలాంటి దాడులకు తెగబడుతూ ఉండడంపై తాము తీవ్రంగా దృష్టి సారించామని VHP ప్రకటించింది. VHP అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే…. స్థానిక అధికారుల మద్దతుతోనే ముస్లిములు దళితులపై తరచుగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత దళిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని VHP డిమాండ్ చేసింది.

మీమ్ – భీమ్ (ముస్లిములు – దళితులు) నినాదాలు చేసి హిందూ సమాజంలో చీలికలు తేవడానికి యత్నించే కొందరు అజ్ఞాత వ్యక్తులే ఇప్పుడు ఈ దాడులకు కూడా కారణమని వి హెచ్ పి ఆరోపించింది.
బాధిత దళితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, రక్షణ కల్పించాలని VHP కోరింది.

నిందితులకు 50 లక్షల రూపాయల నిధులు?
బైసి నియోజకవర్గ పరిధిలోని మొబయా పంచాయతీ సర్పంచ్ ఇస్లాం ముఖియా మరియు అతని సోదరుడు జకీర్ లు దాడిలో పాల్గొన్న నిందితులకు తమ సొంత ఇంట్లోనే ఆశ్రయం కల్పించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి దాడుల కోసం సదరు ముస్లిం మూకకు సుమారు 50 లక్షల రూపాయల నిధి కూడా అందిందని బాధితులు భావిస్తున్నారు.

దాడులకు పాల్పడిన ముస్లిములకు స్థానిక మజ్లిస్ MLA సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ మద్దతు
వి హెచ్ పి నాయకుడు వివేక్ మాట్లాడుతూ….. స్థానిక AIMIM ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ మద్దతుతోనే ముస్లిం మూకలు దళితులపై దాడులకు తెగబడ్డాయని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని ఏప్రిల్ 24న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని వివేక్ తెలిపారు. ఆరోజు రెండు దళిత గృహాలు అగ్నికి ఆహుతయ్యాయని ఆయన తెలిపారు. ఆ ఘటనపై అప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ ఎమ్మెల్యే ప్రమేయంతో నిందితులు కేసు నుంచి తప్పించుకోగలిగారని, పైగా మహా దళితులపైనే తిరిగి తప్పుడు కేసులు బనాయించారని వివేక్ పేర్కొన్నారు.

SP కి నోటీసులు జారీ చేసిన NCPCR
మూడేళ్ల బాలుడు మాయమవడంపై వెంటనే దర్యాప్తు జరిపి తమకు నివేదిక అందజేయవలసినదిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ NCPCR పుర్నియా పోలీసు సూపరింటెండెంట్ కు నోటీసులు జారీ చేసింది. NCPCR చైర్మన్ ప్రియాంక్ కనూంగో మా ప్రతినిధితో మాట్లాడుతూ జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా తాము స్థానిక పోలీసు అధికారులను ఆదేశించామని తెలిపారు.

దళితులపై దాడులు ఇక్కడ సర్వసాధారణం
ముస్లిం మూకలు దళితులపై దాడులు జరపడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. 2015 లో కూడా ఇక్కడి మహా దళిత కాలనీపై ముస్లిం మూకలు దాడికి తెగబడ్డాయి. ఆ క్రమంలో ఆ గ్రామం వెలుపల అనేక రోజులపాటు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయవలసి వచ్చింది. గత సంవత్సరం 18న బీహార్లోని వరిసలిగంజ్ ప్రాంతంలోని మహా దళిత కాలనీపై కూడా ఇలాగే దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితులు ముర్షిద్ ఖాన్, టిప్పు ఖాన్, ఇర్షాద్ ఖాన్, సోనా ఖాన్, నదీమ్ కురేషి, గోలూ ఖాన్, ఆరిఫ్ ఖాన్ మరియు అజార్ ఖాన్లను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు.

Source : Organiser - విశ్వ సంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top