సంపూర్ణ సమాజపు స్వభావంలో మార్పు రావాలి - There must be a change in the nature of the whole society

0
సంపూర్ణ సమాజపు స్వభావంలో మార్పు రావాలి - There must be a change in the nature of the whole society
మా భారతి

: సంపూర్ణ సమాజపు స్వభావంలో మార్పు రావాలి :
న హిందూ సమాజంయొక్క చరిత్ర చాలా పెద్దది. ఈ చరిత్రలో సమాజమంతా సామాజికమైన ఆధారంతో అనుకూలము, ఉపయోగకరమూనైన స్వభావాన్ని, వ్యవహారాన్ని తమ తేజాన్ని ప్రకటించిన చిన్న-పెద్ద కాలఖండాలు అనేకం ఉన్నవి. కాగా, ఈనాడు ఎప్పటి వరకైతే మన సంపూర్ణ సమాజంయొక్క స్వభావంలో మార్పు సంభవించదో, అంతవరకు మనముందు మరో కార్యమేదీ ఉండబోదు. 
   సమాజంలో సామాన్య మనుష్యులలో తగిన స్వభావాన్ని ఉత్పన్నం చేయటంద్వారానే సమాజంలో సామర్థ్యం నిర్మాణమవుతుంది. ఈ సామర్థ్యాన్ని మేల్కొలిపినప్పుడే సమాజంయొక్క అభీష్టాలు నెరవేరగలవు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వారానే ఎప్పటికీ ఈ సమాజం శక్తిశాలిగా ఉండాలన్నది సంఘంయొక్క ఆలోచనకాదు. సమాజంలో అవసరమైన మార్పు తీసికొని రావటానికి జరుగుతున్న ఒక ప్రయాస, ప్రయత్నం - రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. మిగిలిన విషయాలనుకూడా గమనించుకొంటూనే ఇప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక్క పని ఇది ఒక్కటే. మరి ఏ ఇతరపనికీ ఇది సమయంకాదు. మనం శక్తిని పెంచుకోవాలి, తద్వారా ప్రభావవంతమైన
అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. తాత్కాలిక సమస్యలన్నింటికీ ఇదే సమాధానమవుతుంది. ఈ సమాజం మన ఊహించిన దానికంటే ఎక్కువగా దిగజారిపోయింది. అందువల్లనే మనకు తగినంతగా ప్రతిస్పందన లభించటంలేదు. ఎంత శక్తి నిర్మాణంకావాలో ఆంతశక్తి ఇప్పటివరకు నిర్మాణం కాలేదు. కార్యకర్తలు ఎంతశక్తిని వినియోగించాలో అంతశక్తిని వినియోగించలేకున్నారు. ఈ మూడు కారణాలమూలంగానే విపరీత (వ్యతిరేక) పరిస్థితులు ఉత్పన్నమౌతున్నవి.

♣️ ♣️ ♣️

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top