తల్లి హిందూ అయినందున తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నిరాకరించిన క్రిస్టియన్ కొడుకు - Christian convert son refuses to cremate Hindu mother

Vishwa Bhaarath
0
మతం మార్చుకున్న క్రిస్టియన్ కొడుకు హిందూ తల్లిని దహనం చేయడానికి నిరాకరించడంతో  1100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి చివరి కర్మలు నిర్వహించిన మనుమరాలు.

తన తల్లి హిందూ అన్న నెపంతో, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఒక వ్యక్తి తన తల్లి యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి నిరాకరించాడు. తల్లి హిందువయి ఉండగా, ఆమె కుమారుడు క్రైస్తవమతంలోకి మారాడు, అందువల్ల అతను హిందూ ఆచారాల ప్రకారం తన తల్లిని దహనం చేయడానికి నిరాకరించడంతో పాటు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఆమెను ఖననం చేయాలని పట్టుబట్టాడు.
  వివరాలలోకి వెళితే , సరోజ్ దేవిగా పిలువబడే గ్వాలియర్ కు చెందిన ఒక వృద్ధ మహిళ ఇటీవల అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. సరోజ్ దేవి కుమారుడు ధరమ్ ప్రతాప్ సింగ్ ఇటీవల  క్రైస్తవమతంలోకి మారి డేవిడ్ గా తన పేరును మార్చుకున్నాడు, జూన్ ౨ (2) న ఆమె నివాసానికి వచ్చి, చనిపోయిన హిందూ అయిన తన తల్లిని క్రైస్తవ ఆచారాలకు ఖననం చేయాలని డిమాండ్ చేశాడు.
డేవిడ్ అలియాస్ ధరమ్ ప్రతాప్ సింగ్ దుర్మార్గపు ఆలోచనను బంధువుల ద్వారా తెలుసుకున్న, సరోజ్ దేవి మనవరాలు (కుమార్తె కుమార్తె) శ్వేతా సుమన్ జార్ఖండ్ నుండి ౧౧౦౦ (1100) కిలోమీటర్లు ప్రయాణించి తన అమ్మమ్మ మృతదేహం స్వాధీనం చేసుకుంది.

శ్వేతా సుమన్ తన మామయ్య డిమాండ్లను వ్యతిరేకించదాంతోపాటు తన అమ్మమ్మ సరోజ్ దేవ్ మృతదేహానికి తానే హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేయాలని నొక్కి చెప్పింది, ఎందుకంటే ఆమె అమ్మమ్మ చివరి శ్వాస వరకు హిందువుగా ఉంది, క్రైస్తవురాలు కావడానికి పలుమార్లు నిరాకరించింది. ఆమె మేనమామ అంతిమ సంస్కారాలు చేయడానికి నిరాకరించడంతో, సుమన్ తన అమ్మమ్మ అంతిమ సంస్కారాలు చేసే బాధ్యతను తీసుకుంది. 
  ఈ విషయంలో సుమన్ కలెక్టర్ కు పిటిషన్ దాఖలు చేసిన తరువాత 'హిందూ జాగరణ్ మంచ్' సహాయం కోరారు. తరువాత గ్వాలియర్ లోని లక్ష్మీగంజ్ ముక్తిధామ్ లో శుక్రవారం హిందూ ఆచారాల ప్రకారం ఆమె తన అమ్మమ్మకు  దహన సంస్కారాలు నిర్వహించారు.

సుమన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మామ డేవిడ్ తన అమ్మమ్మను క్రైస్తవమతంలోకి మారమని ఒత్తిడి చేస్తుండేవాడిని. తన మామయ్య డేవిడ్ తన తల్లిని ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించేవాడు కాదని ఆమె తెలిపింది.
  తన అమ్మమ్మ మరణం పై అనుమానాలు ఉన్నాయని, ఆమె అమ్మమ్మను క్రిస్టియన్గా మారాలని ఒత్తిడి చేయడానికి చేసిన ప్రయత్నాలపై విచారణ ప్రారంభించాలని సుమన్ పోలీసు సూపరింటెండెంట్ ను అభ్యర్థించారు. ఫిర్యాదు అందుకున్న ఎస్పీ అమిత్ సంఘీ దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top