'47,000 ఎకరాల హిందూ ఆలయ భూములు ఏమయ్యాయి?' తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు - ‘What happened to 47,000 acres of temple land?’, Madras HC asks Tamil Nadu govt

0
'47,000 ఎకరాల హిందూ ఆలయ భూములు ఏమయ్యాయి?' తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు - ‘What happened to 47,000 acres of temple land?’, Madras HC asks Tamil Nadu govt
తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్ని౦చిన మద్రాస్ హైకోర్టు

రాష్ట్రంలో ప్రభుత్వ రికార్డుల నుంచి మాయమైన 47,000 ఎకరాల ఆలయ భూములు ఇప్పుడు ఎక్కడఉన్నాయో తెలపాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

నివేదికల ప్రకారం, 
  సూలూర్ లోని అరుల్మిగు అవినాషియాపర్ మరియు అరుల్మిగు సుబ్రమణిసామి దేవాలయాలకు చెందిన రికార్డులలో కనిపించకుండాపోయిన భూములు ఇప్పుడు ఏమయ్యాయో కనుగొనాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఎన్ కిరుబకరన్ మరియు జస్టిస్ టీవీ తమిల్సెల్వితో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.

1984-85 పాలసీ నోట్ లో ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు చెందిన 5.25 లక్షల ఎకరాల భూమికి రికార్డులు ఉన్నాయని, అయితే 2019-20 నోటు కేవలం 4.78 లక్షల ఎకరాల మాత్రమే భూములు ఉన్నట్టు సూచించిందని విచారణ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.  ౩౫ (35) సంవత్సరాల వ్యవధిలో రెండు పాలసీ నోట్లలో అందించిన గణాంకాలతో పోలిస్తే 47,000 ఎకరాల ఆలయ భూమి రికార్డుల నుంచి మాయమైనట్లు ప్రాథమికంగా కనిపింస్తోందని కోర్టు అభిప్రాయపడింది.

హిందూ మత, దాతృత్వ ఎండోమెంట్స్ విభాగం తరఫున నోటీసు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఈ విషయమై పై జూలై ౫(5) లోగా స్పందించాలని ఆదేశించింది. 1984-85 పాలసీ నోట్ లో పేర్కొన్న భూముల నిర్దిష్ట వివరాలు, సర్వే నంబర్లతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ప్రభుత్వ రికార్డుల నుంచి ఏ భూములను మినహాయించామో తెలుసుకోవడానికి తాజా పాలసీ నోట్ లో పేర్కొన్న వాటిని కూడా కలిపి దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top