కరోనా సోకిన ఆదివాసీలను ఐసోలేషన్ సెంటర్ నుండి బహిష్కరించిన చర్చి - Church expels corona-infected adivasis from isolation center

0
కరోనా సోకిన ఆదివాసీలను ఐసోలేషన్ సెంటర్ నుండి బహిష్కరించిన చర్చి  - Church expels corona-infected adivasis from isolation center
కరోనా సోకిన ఆదివాసీలను ఐసోలేషన్ సెంటర్ నుండి బహిష్కరించిన చర్చి !

క‌రోనా వైర‌స్ బారినప‌డి చ‌ర్చిలో ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ కేంద్రంలో చికిత్స పొందుతున్న గిరిజనులను బయటకు గెంటివేసిన అమాన‌వీయ ఘ‌ట‌న తెలంగాణలో జిల్లాలోని చోటుచేసుకుంది.

న్యూ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం..  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట మండ‌లం మ‌ద్దుల‌మడ గ్రామానికి చెందిన 19 మంది గిరిజన గ్రామస్థులకు జూన్ 4వ తేదీన కోవిద్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. గ్రామంలోనే ఉంటె ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించిన గిరిజనులు, ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లే స్థోమత లేక ఊరికి దూరంగా నిర్మాణాల్లో ఉన్న స్మశాన వాటికలో తలదాచుకుంటున్నారు. వారి పరిస్థితిని గమనించిన స్థానిక రెవెన్యూ, వైద్య అధికారులు జూన్ 9 వ తేదీన ఆ గ్రామానికి సమీపంలోనే ఓ చ‌ర్చిలో ఏర్పాటైన కోవిడ్ ఐసోలేష‌న్ కేంద్రానికి వారిని తరలించారు. ఓ రెండు రోజుల తరువాత చర్చి అధికారులు వారిని బలవంతంగా బయటకు పంపివేయడంతో దిక్కుతోచని స్థితిలో తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు.  ఈ విష‌యంపై వైద్యాధికారుల‌ను వివ‌ర‌ణ కోర‌గా ఆదివాసీలను మరో కేంద్రానికి మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్ప‌టికైతే వారికి స‌రైన మందులు అంద‌జేశామ‌ని చెప్పి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ఘటనపై స్పందించిన లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోరం ఆదివాసీల ప‌ట్ల వివ‌క్ష చూపి వారి ఆరోగ్యం ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన చర్చి అధికారులపై తీసుకోవాల‌ని జాతీయ ఎస్టీ క‌మిష‌న్ చైర్మెన్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసింది. బాధిత‌ నిరుపేద ఆదివాసీలకు సరైన ఆరోగ్య సంరక్షణ  సహాయం అందించడానికి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని కోరింది. అలాగే ఎస్సీ ,ఎస్టీ అత్యాచారాల (నివారణ) చట్టం కింద సంబంధిత చర్చి అధికారులపై కేసు నమోదు చేయాలని సంబంధిత జిల్లా పోలీసు అధికారులను ఆదేశించాల‌ని ఎల్‌.ఆర్‌.పి.ఎఫ్ కోరింది.
___విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top