విద్వేషపూరిత వీడియోను ప్రచారం చేసినందుకు ట్విట్టర్ తోపాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసిన యోగి సర్కార్ - Yogi Sarkar lodges FIR against Twitter and 8 others

0
విద్వేషపూరిత వీడియోను ప్రచారం చేసినందుకు ట్విట్టర్ తోపాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసిన యోగి సర్కార్ - As Yogi Sarkar lodges FIR against Twitter and 8 others
త్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక నేరం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ట్వీట్లను తొలగించకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ పై చర్యలు ప్రారంభించిందని టైమ్స్ నౌ నివేదించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. " జై శ్రీరామ్ " అని జపించడానికి నిరాకరించినందుకు తమని కొట్టారని నటిస్తూ కొందరు వ్యక్తులు మతపరమైన రంగుపులుముతు సోషల్ మీడియా లో ఓక వీడియోని పోస్టుచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన ఈ మీడియాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహించిన యోగి సర్కార్ ట్విట్టర్ పై కేసు నమోదు చేసింది. దీనికి కారణమైన మరో ౮ (8) మందిపై కూడా కేసు నమోదైంది.

కేసు నమోదైన వార్త తెలుసుకున్న ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ఈ విషయానికి సంబంధించి తాను పోస్ట్ చేసిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించారు.
ఘజియాబాద్ పోలీసులు, ఈ విషయంపై దర్యాప్తు చేసిన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే ఉద్దేశ్యంతో వ్యాప్తి చెందిన కాల్పనిక కథనాన్ని సామాజిక వేదికల నుంచి తొలగించారు. 
    ఘజియాబాద్ పోలీసులుకు 'బాధితుడు' అబ్దుల్ సమద్ సైఫీ తెలిపిన వివరప్రకారం తనకు తెలిసిన వ్యక్తులు కొట్టారని, వారిలో ఒకరి కోసం తాను సిద్ధం చేసిన క్షుద్ర తాయెత్తు వారికి పనిచేయలేదని అందుకే వారు కొట్టారని చెప్పాడు.  ఈ వీడియో నాటకమాడిన నిందితుల్లో ఇప్పటివరకు పర్వేష్ గుజ్జర్, ఆదిల్ మరియు కల్లులను సోమవారం అరెస్టు చేశారు.

ఈ విషయమై విద్వేషపూరిత కథనాన్ని ప్రచారం చేసిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ తో పాటు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో ముందున్నారని, రాష్ట్ర ప్రజలను అవమానించడమే పనిగా వీరు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని యుపి సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.

Source: Opindia

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top