మతమార్పిడులు - అంతరించిపోతున్న భారతదేశపు మూల సమాజమైన " హిందువులు " - Conversions - Society in danger

0
Conversions - Society in danger
Conversions - Society in danger 

: మతమార్పిడులు - ప్రమాదం :

జనాభా నిష్పత్తిలో మార్పు - భారత్ కు పెరుగుతున్న ప్రమాదం :
    భారతదేశంలో మతమార్పిడులు వెయ్యి సంవత్సరాలకన్నా పూర్వం నుండి జరుగుతూ వస్తున్నాయి. మొదటి ముస్లిం దండయాత్రికుడైన మహమూద్ బిన్ ఖాసిం క్రీ.శ. 712లో భారత్ వచ్చాడు. మొదటి క్రైస్తవ మిషనరీ ఫ్రాన్సిస్ జేవియర్ క్రీ.శ. 1548లో గోవాకు వచ్చాడు.

   ఇస్లాం, క్రైస్తవ మతాల ప్రతినిధులైన ఈ ఇద్దరూ కూడా హేయమైన అత్యాచారాల ద్వారా, క్రూరమైన బలప్రయోగం ద్వారా, ప్రలోభాల ద్వారా, మాయోపాయాలు, మోసాల ద్వారా హిందువులను మతం మార్చడం ప్రారంభించారు . ఈ వ్యవహారం నేటి పరకూ అడ్డు లేకుండా సాగింది. తత్సలితంగా ఊరూరా అనేకమంది హిందువులు మూకుమ్మడిగా మతం మార్చబడ్డారు. ఇది సాంస్కృతికమైన దురాక్రమణ. ఇందువల్ల మనదేశానికి మూలాధారమైన సామాజిక హిందూ జీవనానికి భారీ వినాశనం కలిగింది. దీని పర్యవసానంగా భారతదేశపు చరిత్ర, భౌగోళిక స్థితిగతులు మారిపోయాయి. 
 • ముస్లిం దురాక్రమణకారులది జీహాదీ మనస్తత్వం, వాళ్ళు ఒక చేతిలో ఖడ్గాన్ని, మరొక చేతిలో ఖురాన్ ని ధరించి “ఇస్లాంను స్వీకరించండి, లేదా చావుకు సిద్ధం కండి” అనే అమానుష పద్ధతిలో మతమార్పిడులు సాగించారు. 
 • ఇదే విధంగా గోవాలో పోర్చుగీసు వారి పాలనలో ఫ్రాన్సిస్ జేవియర్ నేతృత్వంలో క్రైస్తవ మిషనరీలు మోసపూరిత చర్యల ద్వారా, దౌర్జన్యాల ద్వారా హిందువులను క్రైస్తవ మతంలోకి మారుస్తూ వచ్చారు. 
జేవియర్ తన కాలంలోనే ఏడు లక్షల మందిని క్రైస్తవులుగా మార్చాడు. పోర్చుగీసు వైస్రాయి ఎల్బుకర్క్ మతమార్పిడులే తన పాలనా విధానంగా చేసుకున్నాడు. భారత్ లో పోర్చుగీసువారి వలసరాజ్యం సుస్థిరంగా ఉండేందుకై అతడు అధిక సంఖ్యలో హిందూ స్త్రీలను క్రైస్తవంలోకి మార్చాడు. 
   ఇప్పుడు పరిస్థితులు మారాయి. బలవంతంగా దౌర్జన్యపూర్వకంగా మతమార్పిడి చెయ్యడం ఈ కాలంలో సాధ్యంకాదు. అందుచేత ఈ రెండు విదేశీ మతాలు తమ ఎత్తుగడలలో మార్పులు చేసుకున్నాయి. క్రైస్తవ ఫాదరీలు సేవాకార్యక్రమాల ముసుగు ధరించారు. ఇప్పుడు వారు ప్రలోభాల ద్వారా, ఎరచూపడం ద్వారా సమాజంలో వెనుకబడ్డ వర్గాలను మతం మార్చే ప్రక్రియను సాగిస్తున్నారు. ఈ కులాల బలహీనతను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం ద్వారా క్రైస్తవీకరణ వేగంగా సాగిపోతోంది.

దారుల్ ఇస్లాం అనే స్వప్నం :
   మతఛాందస ముస్లిం నేతలు తమవారి జనసంఖ్య పెరుగుదలను ఆయుధంగా చేసుకున్నారు. తద్వారా ప్రపంచమంతటినీ దారుల్ ఇస్లాంగా మార్చేయాలని కలలుగంటున్నారు. అంటే ముస్లింలు 1) అధిక సంతానాన్ని కనడం ద్వారా, 2) బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ వలస దారుల ద్వారా ఈ దేశంలో తమ జనసంఖ్యను పెంచుకునే కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు.
    ప్రభుత్వపు గణాంకాలను బట్టి సుమారు మూడుకోట్ల మంది బంగ్లాదేశీ ముస్లింలు భారతదేశం లోకి అక్రమంగా వలస వచ్చి ఉన్నారు. సరిహద్దులలో అడ్డులేకపోవడం వల్ల ఈ వలసదారులు ఇంకా నిరంతరాయంగా వస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మతచాందస ముస్లిం యువకులు హిందూ యువతులను అపహరించడం కూడా జరుగుతోంది. ప్రతి ఏటా సుమారు రెండు లక్షల మంది హిందూ యువతులు ముస్లింల బారిన పడుతున్నారు.

    ఆలోచించవలసిన విషయం ఏమిటంటే తమ సంఖ్యాబలాన్ని విపరీతంగా వృద్ధి చేసుకొని ఇతరులను అణగద్రొక్కెయ్యాలనే ఈ మనస్తత్వం యావద్దేశంలోను ప్రబలంగా కృషి సాగిస్తోంది. ఈ కుత్సిత సంకల్పాన్ని భారతీయులందరూ అర్ధం చేసుకోవలసి ఉంది. ముందుగా వేసుకున్న పథకాల ప్రకారమే ముస్లింలు, క్రైస్తవులు దేశంలోని కొన్ని భాగాలలో హిందువులను అల్పసంఖ్యాకులుగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ఇటువంటి భూభాగాలు ముందుముందు ఇంకా అధికమైపోగల పరిస్థితి కళ్ళముందు కనిపిస్తోంది. మతమార్పిడులు హైందవేతరుల జనాభావృద్ధి కారణంగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ఏర్పాటు సాధ్యమైందన్న
విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి. “వివిధ మతాల నిష్పత్తి దేశసౌభాగ్యాన్ని మార్చివేస్తుంది భౌగోళిక స్థితిని మార్చివేస్తుంది. ఆర్థిక వ్యవస్థను కూల్చివేస్తుంది, దేశ భద్రతను కష్టతరం చేస్తుంది” అన్న మాటలు సత్యదూరం కావు. కనుక హిందువులు నిద్రనుండి మేల్కొనవలసిన అవసరం ఉంది. ఈ విషయం యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించకపోతే అది సామాజిక నేరేమేకాక దేశద్రోహం కూడా అవుతుంది. కనుక అనుభవజ్ఞులైన విశ్లేషకులు చెప్పినట్లు రాబోతూన్న ప్రమాదాన్ని గుర్తించనట్లుగా సమాజంలోని ప్రజలు నాటకమాడితే రాబోయే తరాలకు చేటు కలుగుతుంది. 

    గ్రహించవలసిన విషయమేమిటంటే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే భారతదేశపు మూల సమాజమైన హిందువులు తమ మాతృభూమిపై తమ అధికారాన్ని పోగొట్టుకుని మిగులుతారు. జానాభా ఈవిధంగా మారుతూపోతే హిందూ దేశంలో హిందువులే అల్పసంఖ్యాకులయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ఈ విషయాన్ని క్రింద ఇవ్వబడిన పట్టిక స్పష్టం
చేస్తుంది.
 ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ జనాభా వృద్ధి శాతం
జనాభా లెక్కల సం||ర అస్సాం అరుణాచల్  నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ
1991 3.32 10.29 87.47 34.12 85.73 1.69 64.58
2001 3.7 18.7 90.00 34.00 87.00 3.2 70.3
    
  పై వాస్తవాలను పరిశీలిస్తే ఈశాన్య భారతంలో కొన్ని రాష్ట్రాలు క్రైస్తవ రాజ్యాలు అయిపోయాయని, మరికొన్ని అవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఈ రాష్ట్రాలన్నిటిలోను మతచాందస క్రైస్తవుల ద్వారా పెంచి పోషించబడుతున్న ఉగ్రవాద సంస్థలు మతమార్పిడులను, ఉగ్రవాద చర్యలను ఉధృతంగా సాగిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకూ దేశ విచ్చిన్నకర శక్తులకు బలం చేకూర్చడంలో మన పాలకులు వహించిన పాత్ర చాలా ఉంది.

    సేవా కార్యక్రమాల పేరుమీద మతమార్పిడులు సాగించడానికి క్రైస్తవులు చేస్తూన్న ప్రయత్నం ఎంత కుటిలమైనదో, ఎంత నీచమైనదో దేశనాయకులు అర్ధం చేసుకోవలసి ఉంది. దీనిని అడ్డుకొని తీరాలి. అడ్డుకొనకపోతే మతవర్గాల జనాభా నిష్పత్తిలో ప్రమాదకరమైన మార్పులు వచ్చేస్తాయి. తత్ఫలితంగా ఆరాజకం ఏర్పడుతుంది. మతం ఆధారంగా జనాభా నిష్పత్తిలో అసంతులనం ఏర్పడితే అందువల్ల మనదేశం తన మూల సంస్కృతికి దూరమైపోతుంది. ఉగ్రవాదం పెచ్చుమీరుతుంది. ఉగ్రవాదాన్నిపెనుసవాలుగా గుర్తిస్తున్న దేశనాయకులు దాని ప్రధాన తత్వాలలో ఒకటైన “మతమార్పిడుల"ను ఆడ్డుకోవడానికి సకారాత్మకమైన, వేగవంతమైన చర్యలపై దృష్టి పెట్టడం అవసరం.

మతమార్పిడుల ద్వారా తలెత్తే సమస్యలు :
 1. మతమార్పిడులు జరిగినచోట మతం మారిన వారి సామాజిక స్థితిలో మార్పులు వస్తాయి.
 2. ప్రారంభంలో స్థానిక సమాజం వారిని అసహ్యంగా చూస్తుంది. 
 3. వారితో కలిసి మెలిసి ఉండడానికి ఇష్టపడరు. 
 4. పరస్పర ఉద్రిక్తతలు, నిరంతర ఘర్షణలు చోటు చేసుకుంటాయి. 
 5. మతం మారిన వ్యక్తి మొదట్లో కొత్త మతం యొక్క ఆచార సంప్రదాయాలను అత్యుత్సాహంతో ఆచరిస్తాడు. 
 6. పూర్వకాలపు తన హిందూ సంప్రదాయాలను తిరస్కార దృష్టిలో చూడడం, అవమానించడం కూడా చేస్తాడు. కనుక సమాజంలో అశాంతి చోటుచేసుకుటుంది. 
 7. మతం మారడం వల్ల వివాహ సంబంధాలు, సహపంక్షిభోజన సంబంధాలు తెగిపోతాయి.
 8. ఈర్వ్యాద్వేషాలు జనిస్తాయి. వాటివల్ల హానికరమైన పరిణామాలు సంభవిస్తాయి.
 9. మతం మారిన వ్యక్తి, ఆ కొత్త మతానికి చెందిన తన ఆచార వ్యవహారాలను విశ్వాసాలను, వేషభాషలను స్వీకరిస్తాడు. అతడి ఆలోచనలలో మార్పు వస్తుంది. దీర్ఘకాలం ఆ వాతావరణంలోనే ఉండడం వల్ల అందులోనే తాదాత్యం చెందుతాడు. జాతీయతా భావనకు దూరమైపోతాడు. దేశాన్ని అవమానించే మనస్తత్వాన్ని అలవరచుకుంటాడు. 
 10. "మతం మార్చుకోవడమంటే జాతీయతను మార్చుకోవడమే” అని స్వామి వివేకానంద అనేవారు.
అక్కున చేర్చుకోవలసిన సమయం వచ్చింది:
   ఈ భయానక సమస్యను జాగరూకమైన హిందూ సమాజం మాత్రమే ఎదుర్కొనగలడు. హిందూ సమాజం పెద్దమనసుతో ఆలోచించాలి. మన సోదరులు ఏ కాలంలోనో అసాధారణ పరిస్థితుల వల్ల మన నుండి దూరమై పోయారు. బలవంతంగా మన నుండి వేరు చెయ్యబడ్డారు. మనం వారిని రక్షించుకోవాలని ఉన్నాకూడా రక్షించుకోలేకపోయాం. ఇప్పుడు వారిని అక్కున చేర్చుకునే సమయం వచ్చింది. అక్కున చేర్చుకోవలసి ఉన్నది. వారు తమ సొంత ఇంటికి (హైందవలోకే) తిరిగి రావడానికి ద్వారాలను తెరవవలసి ఉంది. వారిని ప్రేమపూర్వకంగా మనలో కలుపుకోవాలి. తమదైన గౌరవ స్థానాన్ని వారికి తిరిగి ఇవ్వాలి.

పరిష్కారం దిశగా వినయపూర్వకమైన విజ్ఞప్తి:
    పూర్వకాలంలో ఏవో కారణాల వల్ల తప్పని పరిస్థితిలో మతం మారవలసి వచ్చిన ముస్లిం, క్రైస్తవ సోదరులకు మేము చేస్తున్న వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే "మీ పూర్వీకులతో గల రక్త సంబంధాన్ని మరిచిపోవద్దు. మీ బంధువులైన హిందువుల ఆహ్వానాన్ని మన్నించి నిస్సంకోచంగా మీ సొంత ఇంటికి తిరిగి రండి, ఎవరి మోసంలోనూ పడవద్దు. మనం భారతమాత ప్రాంగణంలో కలిసి ఆనందం పంచుకుందాం, గతకాలపు బాధాకర గాధలు మరిచిపోదాం. ఉదార హృదయాలతో సగర్వంగా ఇలా అనండి - " మేము మీ వారమే, మాది మీ రక్తమే, మన పూర్వీకులు ఒక్కరే, మేము కూడా భారతమాత సంతానమే".
🖉 రామస్వరూప్ అగర్వాల్ 

|| భారత్ మాతాకీ జై || 

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top