ఆర్ఎస్ఎస్'లో పరస్పరం అత్యంత స్నేహ సంబంధాలు - Mutually friendly relations in RSS

0
ఆర్ఎస్ఎస్'లో పరస్పరం అత్యంత స్నేహ సంబంధాలు - Mutually friendly relations in RSS
ఆర్ఎస్ఎస్'లో పరస్పరం అత్యంత స్నేహ సంబంధాలు !

: పరస్పరం అత్యంత స్నేహ సంబంధాలు :
    ఇప్పుడు ఎన్నెన్నిరకాల క్రొత్త క్రొత్త పనులు జరుగుతున్నవో, ఆ పనులలో భాగంగా జరిగే కార్యకలాపాలలో ఎంతో కొంత దోషం ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ మంచి ఉన్నట్లుగానే కొంత చెడుకూడా ఉంటుంది. అగ్ని ఉన్నచోట కొంత పొగకూడా ఉన్నట్లుగా నన్నమాట! మంచి మంచి టానిక్ లుగా చెప్పబడేవాటిలో 90శాతం మంచిగుణాలున్నప్పటికీ ఒక ఐదు శాతమైనా దోషముంటుంది. అదేవిధంగా వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్నపుడు వాటిలోని కొన్ని భాగాలలో దోషాలు ఉండవచ్చు. 
    రాజకీయక్షేత్రంలో పనిచేస్తున్నవారికి వ్యక్తిగతంగా అహంభావం ముందుకు వస్తుంది. గుర్తింపు పొందాలన్న కోరిక ఉదయిస్తుంది. లక్షల రూపాయల నిధులున్న సంస్థలో పనిచేస్తున్నపుడు, పదిమందికో ఇరవైమందికో దీనినుండి ఏమైనా ఉపకారం చేయగలమా? అన్న ఆలోచనవస్తుంది.(స్వంతానికి ఉపయోగించుకుందామన్న ఆలోచన వస్తుందని చెప్పటం లేదు) స్వాభావికమైన ఈ ఆలోచనలను అమలు చేయాలన్న ఉత్సుకతలో నుండి ఆ సంస్థకు అధ్యక్షుడినైతే బాగుండును కదా అని చాలామందికి అనిపించుతుంది. కాగా ఏదో ఒక అనాథాశ్రమం నడిపించటం, దానికోసం చందాలు సేకరించటం, పేదలు, అనాథలు అయినవారికి అవసరమైన వ్యవస్థలు చేయటంవంటివి ఎవరూమెచ్చని పనులు (Thanless Job) చేయడానికి మనుషులు దొరకటం కష్టమవుతుంది.

    రకరకాలుగా ఉండే కొన్ని కార్యాలలో కొన్ని అంతర్గత దోషాలు చోటుచేసుకొంటాయి. వాటి కారణంగాకూడా అహంకారం పెరుగుతుంది. అభిప్రాయభేదాలు పెరుగుతాయి గొడవలు, వివాదాలూ మొదలవుతాయి. సిద్దాంతపరమైన విభేదాలు కాకపోయినా, తాను చేస్తున్న పనులను తోటివారు మెచ్చకపోయినా, లేక నలుగురితో సంప్రదించకుండా తనదారిన తాను పనిచేసుకొంటూ ముందుకు పోవాలనిపించినా, ఒంటెత్తుపోకడ పోతూ దానికి సిద్దాంతపరమైన ముసుగు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. విభిన్న క్షేత్రాలలో పనిచేసినపుడు డాక్టర్టీకి ఇవన్నీ అనుభవంలోకిపచ్చాయి. ఈ కారణంగానే వారు వ్యక్తిశః ప్రేమను, ఆత్మీయతనూ పెంపొందించుకోవటంపట్ల శ్రద్ధ వహించారు. దీనిని నేర్పే ప్రయత్నం చేశారు. 
    స్వయంసేవకులు తమతోటి స్వయంసేవకుల ఇండ్లతో పరిచయం కలిగి ఉండాలని చెప్పారు. ఇప్పుడు మన కార్యం పెరిగి పెద్దదయింది. స్వయంసేవకులు 'రోటీన్ మైండెడ్' అయిన కారణంగా అదంతా ఇప్పుడు అవసరమా అన్న ఆలోచన పొడసూపుతూ ఉండవచ్చు. మనం గనక మన ఆత్మీయమైన పరస్పరసంబంధాలపట్ల శ్రద్ధవహించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, చిన్నచిన్న కారణాలతోనే ఏవేవో సమస్యలు తలఎత్తినపుడు వాటిని అదుపు చేయటం సాధ్యంకాకపోవచ్చు. కాబట్టే మనకార్యపద్ధతిలో గటపద్దతిని ఏర్పరచటం జరిగింది. గటలోని ప్రతి ఒక స్వయంసేవకుడూ తన గటలోని ఇతర స్వయంసేవకుల కుటుంబాలతో మైత్రి కలిగి ఉండాలి. సంఘ ప్రారంభ దినాలలో ఆ విధంగా అలవాటు చేశారు. ఎంతో పట్టుదలగా ఈ ప్రయత్నం జరిగింది. ఈ పరంపరను మిగిలిన వారందరినీ కలుపుకొనడానికి కొనసాగించవలసిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top