ఆర్.ఎస్.ఎస్ లో సంస్థాగతంగాను, వ్యక్తిగతంగాను ఆత్మీయత - Institutional and personal warmth in the RSS

The Hindu Portal
0
ఆర్.ఎస్.ఎస్ లో సంస్థాగతంగాను, వ్యక్తిగతంగాను ఆత్మీయత - Institutional and personal warmth in the RSS
ఆర్.ఎస్.ఎస్ లో సంస్థాగతంగాను, వ్యక్తిగతంగాను ఆత్మీయత

సంస్థాగతంగాను, వ్యక్తిగతంగాను ఆత్మీయత

   ధ్యేయనిష్ఠతోపాటు మరో రెండు విషయాలగురించి సంఘంలో పట్టుదల వహించటం జరిగింది. మొదటిది సంస్థాగత ఆత్మీయత (Institutional Attachment) కాగా, రెండవది వ్యక్తిగత ఆత్మీయత (PersonalAttachment) ఈనాటి విలక్షణమైన పరిస్థితులమధ్య రకరకాల పనులను మనప్రేరణతో చేపట్టటం జరుగుతున్నది. సంఘప్రేరణతో తమతమ ఇచ్చానుసారంగా స్వయంసేపకులు అనేకపనులు నిర్వహిస్తున్నారు. వీటి కారణంగా ఇంతకుముందులేని కొన్ని సమస్యలు మనముందుకు వస్తున్నవి. చిన్న పయస్సులో ఉన్నపుడు డబ్బు సంపాదించాలనే కోరికగాని, కీర్తి మూటగట్టుకోవాలనే కోరికగాని, అందంగా కనిపించాలనే కోరికగాని ఉండవు. కాస్త వయస్సు పెరిగి యౌవనంలోకి వస్తున్నపుడు రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. సంఘస్వయం సేవకులు కాంతా కాంచనాలపట్ల మోహాన్ని తేలికగా తీసుకొంటారు. నిజానికి ఈ మోహాలుగాని, ఇతర వ్యామోహాలుగాని అంత తేలికగా తీసిపారేయగల్గినవికావు. ఒక లోక విలక్షణ కార్యంలో నిమగ్నమై అనుశాసనము పరస్పర ఆత్మీయతలతో కూడికొనియున్న వాతావరణంలో ఉన్నందున స్వయంసేవకులకు ఇది సాధ్యమవుతున్నది. ఇతర క్షేత్రాలలో అలా ఉండదుగదా! ఇతర సంస్థలలో వ్యక్తుల వ్యవహారం ఎలా ఉంటుందో, అక్కడ ఏవిధమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయో, అవిధమైన సమస్యలు కారణంగా, మన ఎదురుగాకూడా ప్రత్యక్షమౌతాయి. అనుతాసనరాహిత్యము అహంకారం మేల్కొనటం, ముఠాలుకట్టటం వంటి సమస్యల ఉత్పన్నమౌతాయి. అటువంటి స్థితిలో ధ్యేయనిష్ఠతోపాటు ఒక విశిష్టమైన సంస్థాగత ఆత్మీయత, వ్యక్తిగత ఆత్మీయత అవసరమవుతాయి.

    స్వయంసేవకులతో మనం వ్యవహరించే తీరు ఎంతోప్రేమతోను, సాన్నిహిత్యంతోనూ కూడినదై ఉండాలని మనకార్యపద్దతిలో నొక్కిచెప్పటం చూస్తుంటాం. మిగిలిన సంస్థలలో ఈ విషయమై శ్రద్ధగాని, పట్టుదలగాని ఉండదు. ఏదో ఒక కార్యక్రమంకోసం లేదా, ఏదోఒక తీర్మానం ఆమోదించటంకోసం జనం ఒకచోటకు వస్తారు. ఒకవేళ జైలుకు వెళ్లే కార్యక్రమమైనా అందరూ కలసి ఒక నిర్ణయమైతే తీసుకొంటారేగాని, తమమధ్య పరస్పరం ప్రేమభావం నిర్మించుకోవటం అవసరమని అనుకోరు. సంఘం స్థాపించడానికి ముందు అనాడు పనిచేస్తున్న సంస్థలలో కార్యకర్తలమధ్య పరస్పర ప్రేమభావం అవసరమనే అవగాహన  ఏమాత్రం లేనేలేదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య ప్రేమాభిమానాలు, పరస్పర ఆత్మీయత అనేవిషయమై సంఘంలోనే శ్రద్ధవహించబడింది.
   డాక్టర్టీ స్వయంగా తననడవడిద్వారా దీనికి బాటవేశారు. మేము బాల స్వయంపేవకులుగా ఉన్నపుడు ఎప్పుడైనా రెండు మూడు రోజులు సంఘస్థాన్'కి రాకపోతే, డాక్టర్జీ తప్పక ఇంటికి వచ్చి నాన్నగరారిని కుశలప్రశ్నలు వేసేవారు. ఏమైంది? మూడురోజులుగా మీవాడు సంఘానికి రావటంలేదు. జ్వరమైతేరాలేదు గదా, ఏదైనా అవసరముంటే చెప్పండి, మేమున్నాంగదా- అంటూ ఆ ఇంటిలో ఉన్న అవసరాన్నిబట్టి రెండుమూడు రోజులు ఆపనిలో భాగస్వాములయ్యేవారు. సహాయంగా ఉంటూ ఉండేవారు. స్వయంసేవకుల వివాహం జరిగినపుడు కొత్తగా చుట్టరికం కలిసిన కుటుంబంతోకూడా సంబంధం ఏర్పరచుకొనేవారు. ఇలా అన్ని విధాలా ఘనిష్టమైన వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకొనే ప్రయత్నాలు చేస్తుండేవారు.

   ఈ విషయాలన్నింటితోపాటు సంస్థపట్ల ప్రేమాభిమానాలు, మమతానుబంధాలు కూడా అవసరమే. వీటికి ఏమంత ప్రాధాన్యం ఉందని కొందరు అనుకోవచ్చు. కాని తన స్వీయఅనుభవాల ఆధారంగా డాక్టర్టీ ఏవిషయాలపట్ల శ్రద్ధవహించారో, ఏవిషయానైతే నొక్కి చెప్పారో, ఈనాటి పరిస్థితులను పరిశీలించి చూసినపుడు అవి ఎంత మహత్వపూర్ణమైనవో అర్థమవుతుది. చాలా సంస్థల్లో అవి రాజకీయరంగంలోని సంస్థలైతే మరీ ఎక్కువగాను ఇద్దరు నాయకులు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి ముఠాను వారు తయారుచేసుకుంటారు. చాలా సందర్భాలలో తమ ముఠాల కీచులాటలకు సిద్ధాంతపరమైన రంగులద్దుతారు. తమమధ్యనగల ఎడమొహం-పెడమొహం విభేదాలకు ఒకరి వివేకాన్నీమరొకరు ప్రశ్నిస్తున్నట్లుగా తమ వైఖరులను ప్రదర్శిస్తారు. ఇటువంటి అనేక అనుభవాలను డాక్టర్జీ చాలా దగ్గరనుండి చూశారు. ఒకే సిద్ధాంతాన్ని నమ్మినట్లుగా చెప్పుకొనే కార్యకర్తలు ఒకచోటకు చేరినప్పుడు వారిలోని మానవీయ స్వభావాలు కారణంగా పరస్పరం పోటీపడటం భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేయటం జరుగుతూ ఉండటం వారిని చుట్టూఉన్నారు. భిన్నధ్రువాలుగా భావించటం, కొందరు ఒకవైపు మరొకొందరు మరోవైపు చేరి ముఠాలు మొదలుకావటం, వారిమధ్య గొడవలు, కొట్లాటలు ముదరటం, కొనసాగుతూ ఉండటం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యము-కార్యము ఏర్పడటం, ఆపైన ఒకరికాలు లాగి పడవేయాలని మరొకరు ప్రయత్నిస్తూ ఉండటం డాక్టర్జీ దృష్టిలో ఉండినవి. దేశంలో వివిధ ప్రాంతాలలో కాంగ్రెసులో ఇలాంటి ముఠాలమధ్య కీచులాటలు మనకు ప్రతినిత్యం కనిపించుతునే ఉన్నవి గదా! ( ఉత్తరప్రదేశ్లో చంద్రభానుగువ్త-కమలావతి త్రిపాఠీల మధ్య, పంజాబ్'లో ప్రతాప్సింగ్ కైరాన్-దర్బారాసింగ్లమధ్య, ఆంధ్రప్రదేశ్ లో నీలం సంజీవరెడ్డి-కాసు బ్రహ్మానందరెడ్డిల మధ్య ఢిల్లీలోనూ విభిన్న వర్గాలమధ్య సాగిపోయే ముఠాతగాదాలు ఆరోజులలో పత్రికలలో ప్రతిరోజూ మొదటిపుటల్లో దర్శనమిస్తుండేవి. వీటిలో ఎక్కడైనా సిద్ధాంత సంబంధమైన భేదాలున్నవా ? లేవుగదా - ఈ బౌద్ధికవర్గ 1965లో జరిగింది కాబట్టి ఆనాటి ఉదాహరణలు ప్రస్తావించబడినవి).
    ఇలావారిలోవారు తగాదాలు పడుతూ ఒకరికాలు ఒకరు లాగివేసే ప్రయత్నాలవల్ల కాంగ్రెసు చీలిపోయే పరిస్థితి ఏర్పడటం లేదా? ఒకరిపై మరొకరు విసురుతున్న ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్ళు-ఎదురు సవాళ్ళు గమనిస్తే అవన్నీ వ్యక్తిగతమైనవేనని సిద్దాంత సంబంధమైన అంశాలుగాని, కార్యక్రమం గురించిన విభేదాలుగాని మచ్చుకైనా లేవని స్పష్టమవుతుంది. ఇటువంటి తగాదాలు సంఘంలోను, యావత్తు హిందూసమాజంలోను పొడసూపేటట్లుగా చేయాలని కొందరు ఆరాటపడుతుంటారు. హిందువులను దిగ్భృరమితులను చేయడానికి 'వాళ్ళింట్లో తినకూడదు, వీళ్ళింట్లో తినకూడదు'వారితో కలసి తిరగరాదు-వీరితో కలసి ఉండరాదు' అంటూ నూరిపోసే ప్రయత్నాలు చేస్తారు. 
   కులం, భాష, ప్రాంతం వేషభూషలు ఆధారంగా భేదభావాలను రెచ్చగొ్టేప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మనకు సంఘంలో ఇటువంటి అనుభవాలు తటస్థపడకపోవచ్చు; కాని ప్రారంభదినాలలో ఇటువంటి మాటలు వినబడుతూ ఉండేవి. నాగపూర్ లో జరిగిన శిబిరానికి మహార్లు (హరిజనులు) వచ్చినపుడు-వారితో కలసి కూర్చొని భోజనం చేయడానికి నిరాకరిస్తూ కొందరు గొడవ ప్రారంభించారు. ఆ కారణంగా రెండు గంటలపాటు భోజనం వడ్డించకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఎంత సులభంగా అన్ని పనులనూ సంఘంలో చేయగల్గుతున్నామో, అంతసులభంగా చేయగలస్థితి మొదట్లో లేదు. కులంకట్టుబాటు దృడంగా ఉన్న కారణంగాను, భోజన ఖాజన వ్యవహారాలవంటి చిన్న చిన్న విషయాలలోకూడా పట్టింపులు ఉన్నందువల్లనూ చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. ఒక పాఠశాల కమిటికి అధ్యక్షులుగా ఎవరుండాలి, కార్యదర్శిగా ఎవరు ఉండాలి, డైరక్టర్ గా ఎవరుండాలి- అనే చిన్న చిన్న విషయాల్లో కూడా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడేవి. ఈ రకరకాల సమస్యల అనుభవాలు డాక్టర్టీ స్వయంగా చవిచూశారు. ఒక సిద్ధాంత సూత్రాన్ని అనుసరించదలచినవారుకూడా ఒక చోట చేరినపుడు వారిమధ్య పోటీలు, ఘరణలు చోటుచేసుకొని వారు విడిపోతారని ఆయనకు తెలిసిన విషయమే. ఈ స్థితిని నియంత్రించడానికి 'సంస్థాగతస్పర్థలను, వ్యక్తిగత స్పర్ధలను నిషేధించటం' ఒక మంచి ఉపాయం. 
   ధ్యేయనిష్ఠతోపాటు సంస్థాగతమైన ప్రేమకూడా ఉన్నట్లయితే, ఏదో ఒక సందర్భంలో కొద్దిపాటి పట్టింపులు, ఉద్రిక్తతలూ పొడసూపినా, ఈ సమస్య కారణంగా నేను సంస్థకు దూరంకాకూడదు అన్న ఆలోచన వస్తుంది. కార్యకర్తలలో పరస్పర ఆత్మీయ సంబంధాలు, వ్యక్తిగత స్నేహము, సాన్నిహిత్యమూ ఉన్నపుడు ఒకరినుండి మరొకకు దూరం జరగడానికి ముందు అయిదు-పది-పదిహేను-ఇరవైసార్లు మళ్ళీమళ్ళీ ఆలోచించుకోవలసి వస్తుంది. ఏడాది, రెండేళ్ళు, మూడేళ్లపాటు ఆలోచించవలసి వస్తుంది. సంస్థకు దూరంగా ఉండిపోవటంకాని, ఎవరితోనో పొట్లాడుతూ ఉండటంకాని, సంస్థను వదిలిపోవటంకాని తనవల్ల తేలికగా అయ్యే పనికాదని అర్థమవుతుంది. అందువల్ల వ్యక్తులమధ్య ఈవిధమైన ఘనిష్ట సంబంధాలు నిర్మాణమై ఉండటం ఎంతైనా అవసరం.
   అందువల్లనే మనకార్యపద్ధతిలో ఈరెండు విషయాలకు విశేష ప్రాధాన్యమిస్తూ నొక్కి చెప్పటం జరుగుతున్నది. కొందరు కార్యకర్తలు అటూఇటూ పోయినా, వారికిగల సంస్థాగత ప్రేమ, వ్యక్తిగత ప్రేమల కారణంగా ఒకటి-రెండు సంవత్సరాలుకూడా దూరంగా ఉండటం కష్టమవుతున్నది. కటుత్వము, వ్యతిరేకత నిర్మాణం కావటమన్న ప్రశ్నే లేదు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top