తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు ' మంగళ్‌పాండే ' - The first freedom fighter 'Mangal Pandey' -

0
తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు ' మంగళ్‌పాండే ' - The first freedom fighter 'Mangal Pandey' -
భారతదేశ స్వాతంత్య్ర పోరాటపు తొలి హీరో మంగళ్‌పాండే. 1857 నాటి తిరుగుబాటుకు మూలమైనవాడు. బ్రిటీష్‌ సిపాయిగా పనిచేస్తూ బ్రిటీష్‌ పాలకులమీద తిరుగుబాటు చేసిన సాహసి. మనదేశాన్ని తమ గుప్పిట్లోపెట్టుకుని పరిపాలిస్తున్న బ్రిటీష్‌ వారిపై యుద్దాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తుండిపోతాడు.
   నాటివరకు బ్రిటీష్వారి పెత్తనాన్ని, అరాచకాలను తలవంచుకునిభరిస్తున్న భారతీయుల ఆలోచనలను స్వేచ్భాస్వాతంత్ర్యాలవైపుకు మళ్లించిన ఘనత మంగళ్‌ పాండేది. మూడుపదుల వయసుకు, చేరకుండానే ఉరికంబం ఎక్కేందుకు ఏమాత్రం వెనకడుగు వేయని ధైర్యవంతుడు. తన త్యాగం దేశంలోని యువతను మేల్కొలుపుతుందని విశ్వసించాడు. తాను మరణిస్తే మరెందరో వీరులు ముందుకువచ్చి భరతమాత దాస్యశ్ళంఖలాలను తొలగించే యత్నం చేస్తారని భావించాడు. అలా నాడు మంగళ్‌పాండే పెట్టిన తిరుగుబాటు చిచ్చురాజుకుని దేశం స్వతంత్ర దేశంగా అవతరించేందుకు మరో 90 ఏళ్ళుపట్టింది.

   మంగళ్ పాండే 1827 జూలై 19న నేటి ఉత్తరప్రదేశ్‌లోని ఒకసాంప్రదాయకుటుంబంలో జన్మించాడు. జమిందారీ వ్యవస్థ బలంగా వున్న కాలంలో పొలంలో పనిచేయటం తప్పించి మరోరకమైన వృత్తుల గురించి తెలియదు. కష్టించి పనిచేసినా తగిన ప్రతిఫలం దక్కేది కాదు. పేదరికంలో గ్రామాలు మగ్గుతుండేవి. అటు వంటి పేదకుటుంబంలోనే మంగళ్‌ పెరిగాడు.
   మంచి ఎత్తు, తెల్లని శరీరం కలిగిన మంగళ్‌పాండే ప్రతిరోజూ వ్యాయామశాలకు వెళ్ళేవాడు. కానీ వస్తాదు అయ్యేందుకు తగిన ఆహారం తీసుకోగలిగిన స్థోమత లేదు. మరో ఉపాధి మార్గంలేదు. అలావుండగా మంగళ్‌కి తెలిసినవ్యక్తి బ్రిటీష్‌ సైనిక దళంలో సిపాయిగా చేరాడని తెలిసింది. అతని ద్వారా తాను సిపాయిగా చేరాడు. అప్పటికి అతని వయసు 22 సంవత్సరాలు. శిక్షణతర్వాత మంగళ్‌పాండేని 34 బెంగాల్‌ ఇన్స్పెట్రీ లో ఆరవకంపెనీకి కేటాయించారు.
   బయట ప్రపంచంతో సంబంధంలేని కంటోన్మెంట్‌ జీవితం. అయినా సెలవలమీద ఇంటికి వెళ్ళి వచ్చిన సైనికులు బ్రిటీష్‌వారి ధాఫ్టీకం గురించి, హిందూస్థాన్‌లో చెలరేగుతున్న అసమ్మతి గురించిన వార్తలు తెస్తుండే వారు. నాటి స్టానికపాలకులు ఐకమత్యంగా తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు. 1857 మే 31న తిరుగుబాటు జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం చూచాయగా పసికట్టిన బ్రిటీష్‌ పాలకులు తమ సైనికులను మీరట్‌కి తరలించారు. అప్పటికే బ్రిటీష్‌వారు అందించే తుపాకీ తూటాల తయారీలో గోవు, పందుల కొవ్వు వాడుతున్నారన్న విషయం సైనికులకు తెలిసిపోయింది. తమ మత విశ్యాసాలను దెబ్బతీసే ఆ చర్యకు ఎదురుతిరగాలని సైనికులు అనుకుంటున్నారు. గోమాంసం వాడకం గురించి తెలిసిన మంగళ్‌పాండే ఉడికిపోయాడు. తోటి సైనికులకు తిరుగుబాటుకు సిద్దంకమ్మని చెప్పాడు. సైనికులలో తిరుగుబాటు లక్షణాలున్నాయని, పాండే దానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని పైఅధికారులకు మార్చి 29న సందేశం అందింది.
   తన తుపాకీని సిద్దంచేసుకుని, కనిపించిన తొలి బ్రిటీష్‌అధికారిని కాల్చిపారేయమని తోటిసైనికులను ఉత్తేజపరిచాడు. ఈలోగా అధికార వాగ్‌ రావటం మంగళ్‌పాండే అతనిమీద తూటా పేల్చటం జరిగిపోయింది. కానీ అది గురితప్పి బ్రిటీష్‌ అధికారి ఎక్కివున్న గుర్రానికి తగిలింది. 
   చేతిలో పిస్టల్‌తో కాల్పులు జరిపాడు వాగ్‌. ఆ తర్వాత కత్తి తీసుకుని మంగళ్‌పాండే మీదికి ఉరికాడు.. ఆ దాడిని మంగళ్‌పాండే తిరగగొట్టి, తన తుపాకీతో వాగ్‌ని కొట్టటోతుండగా మరో బ్రిటీష్‌ అధికారి సార్దంట్‌ హ్యుసన్‌ వచ్చి పాండే చేతిలోని తుపాకీని నెట్టి పారవేశాడు. పాండేని అరెస్టు చేయమని ఆర్డర్‌ వేసినా ఒక్క సిపాయి ముందుకు రాలేదు. ఒక అధికారి తర్వాత మరో పైఅధికారి అక్కడికి వస్తున్నారు. కానీ పాండేని అరెస్టుచేయించలేకపోతున్నారు. చిట్టచివరిగా మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారి వచ్చేసరికి సైనికులకు భయం వేసింది. అతని ఉత్తర్వుల ప్రకారం వరసలో నిలబడి నడవసాగారు.
   ఇక తన మంగళ్‌ పాండేకి అర్ధమైంది. అయినా తెల్లవారి చేతికి చిక్కటం ఇష్టంలేక తుపాకీని తనకు ఎక్కు పెట్టుకుని కాలివేలితో ట్రిగ్గర్‌ నొక్కాడు. కానీ ఆ బుల్లెట్‌ పాండేని గాయపరిచిందేకానీ ప్రాణం తియ్యలేదు. గాయంతో పడిపోయిన మంగళ్‌పాండే దగ్గరకు వెళ్ళేందుకు బ్రిటీష్‌ అధికారులు భయపడ్డారు.చివరికి అతన్ని ప్రాణాలతోవుంచాలన్న ఉత్తర్వులతో మంగళ్‌ పాండేని ఆస్పత్రికి తరలించారు. ఒక వారం రోజుల్లో కోలుకున్న మంగళ్‌పాండేమీద రాజద్రోహం, సైనిక తిరుగుబాటు నేరాలు మోపి కోర్టులో హాజరుపరిచారు. వీలైనంత త్వరితగతిన విచారణ ముగించాలన్నది ఉత్తర్వు.
మార్చి 29న తాను చేసిన తిరుగుబాటు తనం తట తాను, స్వధర్మం కోసం చేసినదేనని, అందుకు ఇతరులెవరినీ బాధ్యుల్ని చేయవద్దని మంగళ్‌పాండే ధైర్యంగా ప్రకటించాడు.
విచారణ ముగిసింది. మంగళ్‌పాండేకి ఉరిశిక్ష విధించారు.
    మార్చి 29, 1857న తిరుగుబాటుచేస్తే, ఏప్రిల్‌ 18న మంగళ్‌పాండేని ఉరితీయాలన్న ఉత్తర్వులు వచ్చాయి. అప్పటికే సైనిక తిరుగుబాటు వార్త వ్యాపించింది. మరోవైపు స్టానిక రాజసంస్టానాలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. మంగళ్‌పాండేని ఉరితీస్తే దాని ప్రభావం సైనిక దళాలమీద ఎలా పడుతుందోనన్న భయం. అందువల్ల ఉరిశిక్షను ఏప్రిల్‌ 8నే అమలుచేశారు. మంగళ్‌పాండే ప్రభావంలో సైనికులంతా వుండి వుంటారన్న భయంతో ఆ మొత్తం కంపెనీని రద్దు చేశారు. పాండేని ఒడిసిపట్టుకుని బ్రిటీష్‌వారికి పట్టించేందుకు ప్రయత్నించిన షేక్‌ పల్టుకి హవల్డార్‌గా. ప్రమోషన్‌ యిచ్చారు. 
   మంగళ్‌పాండే ఆవేశంలో తొందరపడి మొత్తం సైనిక తిరుగుబాటు సక్రమంగా జరగనివ్వకుండా చేశాడా! పాండే  తొందరపడక అనుకున్న ప్రకారం మే 31న తిరగబడివుంటే చరిత్ర ఎలా వుండేది ఇవి సమాధానంలేని ప్రశ్నలు. వాస్తవంగా మంగళ్‌పాండే తొలి స్వాతంత్ర్య సమర యోధుడు. ప్రాణాలకు లెక్కచేయక బ్రిటీష్‌వారిమీద తుపాకీ ఎక్కుపెట్టిన ధైర్యవంతుడు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top