ఆర్.ఎస్.ఎస్ శిక్షణ - RSS Training

0
ఆర్.ఎస్.ఎస్ శిక్షణ - RSS Training
శిక్షణ
   నిత్యమూ జరిగే శాఖలో కొన్ని శారీరిక శిక్షణ కార్యక్రమాలు, కొన్ని బౌద్ధిక (బుది సంబంధమైన) శిక్షణ కార్యక్రమాలు అభ్యసింపబడుతూ ఉంటాయి. ఆటలు యోగాసనాలు, దండ (లాఠీ) త్రిప్పటం, సమత (వరుసలలో నిల్చుని నడుస్తూ ఉండటం) సామూహిక వ్యాయామాలు - శారీరిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉండగా, చర్చలు సందేహాల నివృత్తి కార్యక్రమాల ద్వారా బౌద్ధిక శిక్షణ పొందుతారు. శాఖలో పొందే సాధారణమైన శిక్షణకు మించిన విశేష శిక్షణ ప్రాథమిక శిక్షావర్గ అని పిలువబడే ఏడురోజుల శిక్షణ కార్యక్రమంలో లభిస్తుంది. దీనికంటే విశేషమైన శిక్షణ వేసవికాలంలో నెలరోజులపాటు నిర్వహింపబడే సంఘశిక్షావర్గలలో లభిస్తుంది. (ఇది ఇప్పుడు 20 రోజులకు తగ్గించబడింది). వీటిద్వారా సుశిక్షితులైన కార్యకర్తలు తయారవుతారు.
    శిక్షావర్గలలో పాల్గొనే స్వయంసేవకులు వర్గ జరిగే 7 రోజులపాటు లేదా 20 రోజులపాటు పూర్తికాలం వర్గ స్థలంలోనే ఉండిపోతారు. శిక్షావర్గల ముగింపులో పరీక్షలు నిర్వహించి ఎవరు ఏ మేరకు నేర్చుకున్నారనే విషయం మూల్యాంకనం చేయటం జరుగుతుంది. వేసవిలో జరిగే 20 రోజుల శిక్షావర్గలు ప్రథమవర్ష, ద్వితీయవర్ష, తృతీయవర్ష - ఇలా మూడు సంవత్సరాలు శిక్షణ పొందినట్లయితే శిక్షార్థులుగా వారి శిక్షణ ముగిసినట్లుగా భావింపబడుతుంది. తృతీయవర్ష శిక్షణ పొందిన వారు ఆ తర్వాత సంవత్సరాలలో జరిగే శిక్షావర్గలలో శిక్షకులుగా వ్యవహరిస్తుంటారు. 2013 వేసవిలో జరిగిన సంఘ శిక్షావర్గలలో పాల్గొన్నవారి సంఖ్య ఇలా ఉంది. ప్రథమవర్ష శిక్షావర్గ 54 చోట్ల జరుగగా వాటిలో పాల్గొని శిక్షణ పొందినవారు 10,821 మంది. ద్వితీయవర్ష 12 చోట్ల జరుగగా వాటిలో పాల్గొని శిక్షణ పొందినవారు 2231 మంది. తృతీయవర్షలో పాల్గొనినవారు 967 మంది. మొత్తం పాల్గొనిన శిక్షార్థులు 14,019 మంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top