చరిత్ర: ద్విముఖమైన దండయాత్రలకు హిందువుల ప్రతిఘటన - History: Hindu resistance to two-way invasions

0
చరిత్ర: ద్విముఖమైన దండయాత్రలకు హిందువుల ప్రతిఘటన - History: Hindu resistance to two-way invasions
చరిత్ర: ద్విముఖమైన దండయాత్రలకు హిందువుల ప్రతిఘటన
   చారిత్రక సంఘటనలను బట్టి భారతీయ చరిత్రను రెందు కాలఖండాలుగా విభజించవచ్చు. మొదటిది క్రీ.పూ. 327 నుండి క్రీ.శ. 700 సం॥ల వరకుగల ప్రాచీన కాలఖండం. రెండవది క్రీ.శ. 700 నుండి 20వ శతాబ్ది వరకుగల ఆధునిక కాలఖండం. ఈ గ్రంథంలో ఆధునిక కాలఖండంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులపై జరిపిన ధార్మిక, సాంస్కృతిక దండయాత్రలగూర్చి విశ్లేషణ చేయబడింది. 
   ఆధునిక చరిత్ర ప్రారంభంనుండే భారతదేశంమీద మహమ్మదీయులు జరిపిన దండయాత్రలు ద్విముఖమైనవికావటం ఈదేశ దురదృష్టం. మహమ్మదీయులకు ముందు భారతదేశంమీద శక యవనులు మొదలుగాగల విదేశీయులు జరిపిన దండయాత్రల ముఖ్యోద్దేశం భారత్‌లో వాళ్లరాజ్యాన్ని స్థాపించటమే. అది తప్ప ధార్మిక సాంస్కృతికశతృత్వం వాళ్లకు లేదు. కాని కొత్తశత్రువులైన మహమ్మదీయులు జరిపిన దండయాత్రల ఉద్దేశం ఈదేశంలో వాళ్ల రాజ్యస్థాపనతోపాటు భయంకరమైన మతపరమైన, సాంస్కృతికమైన పరివర్తనం కూడా. ఇస్లామేతర విదేశీయ ఆక్రమణకారులెవరికీ ఈ దృష్టి లేదు. రాజ్యస్థాపన లక్ష్యంకంటే అనేక రెట్లెక్కువ ప్రమాదకరమైన సాంస్కృతిక పరివర్తనమే అంటే తీవ్ర మతోన్మాదమే ముస్లిం దండయాత్రల ఉద్దేశంగా ఉంది. ఈ దేశప్రజలందరినీ తమ మతంలోకి మార్చాలన్న లక్ష్యమే వాళ్ల దందయాత్రలకు 'పేరణకూడా ఉంది.

కైస్తవులవి కూడా ఆత్యాచారాలతోకూడిన పూర్ణయుద్దాలే :
   మహమ్మదీయ దందడయాత్రలతో దేశం ఆపదలో ఉన్న సమయంలోనే గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లు (క్రీ శుమొదటి శతాబ్దంలో మలబార్‌లో చొరబడిన సిరియన్‌ క్రైస్తవులను వదిలిపెట్టినా) పదిహేనవ శతాబ్దం చివరినుండి ఐరోపాకు చెందిన పోర్చుగీస్‌, డచ్‌, ఫ్రెంచ్‌, ఇంగ్రీష్‌ మొదలైన క్రైస్తవ రాజ్యాలు పడమటి సముద్రమార్గంగుండా వచ్చి భారత్‌మీద విరుచుకుపడ్ద్డాయి. మహమ్మదీయుల దండయాత్రలవలె ఈ క్రైస్తవ దండయాత్రలుకూడా _ వ్యాపారంద్వారా లాభార్జన, రాజకీయాధికారములతో పాటు మత, సాంస్కృతిక లక్ష్యాలు కల్షినవి. అత్యాచారాలు చేయటంలోకూడా మీరు మహమ్మదీయులకు తీసిపోలేదు.

-- వినాయక దామోదర సావర్కర్.....శ్యాంప్రకాష్..🖉

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top