క్రైస్తవ మిషనరీల హత్యాకాండకు బలైన " శ్రీ లక్ష్మణానంద సరస్వతి " - Christist terrorists murdered Swami Laxmananda Ssaraswati

0
క్రైస్తవ మిషనరీల హత్యాకాండకు బలైన " శ్రీ లక్ష్మణానంద సరస్వతి " - Christist terrorists murdered Swami Laxmananda Ssaraswati

Christist terrorists murdered Swami Laxmananda Ssaraswati

1924 సంవత్సరంలో కంధమాల్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతమైన గురుజంగ్ గ్రామంలో జన్మించిన శ్రీ లక్ష్మణానంద సరస్వతి, చిన్నతనం నుండి కూడా తన జీవితాన్ని సామాజిక సేవకే అంకితం చేయాలని భావించేవారు.

తన కుటుంబ జీవితాన్ని త్యజించి, తన ఇద్దరు ఇద్దరు పిల్లలను వదులుకుని, ఆధ్యాత్మిక సాధన కోసం హిమాలయాలకు వెళ్లారు. అనంతరం 1965లో తిరిగి తన స్వస్థలాన్ని చేరుకున్న స్వామీజీ గోరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు.

మొదట్లో దట్టమైన అటవీ గ్రామమైన చక్పాడును తన కార్యక్షేత్రంగా చేసుకున్న శ్రీ లక్ష్మణానంద సరస్వతి, ఆ తర్వాత కొన్నేళ్ళకు తన సేవలను చుట్టుప్రక్కల అటవీ గ్రామాలకు విస్తరించారు. జనజాతి ప్రజల సామాజిక, ధార్మిక అభివృద్ధిపైనే కాకుండా వారి స్వయంసమృద్ధి, సాధికారత కోసం నాలుగు దశాబ్దాలుగా ఎనలేని కృషి చేశారు శ్రీ లక్ష్మణానంద. వారి కోసం అత్యంత మారుమూల గ్రామమైన చక్పాడులో ఒక గురుకుల పాఠశాల, సంస్కృత కళాశాల ఏర్పాటు చేశారు. జనజాతి బాలికల కోసం ప్రత్యేకంగా జాలెస్పీట్టా గ్రామంలో ‘శంకరాచార్య కన్యాశ్రమం’ పేరిట గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు.

1969లో స్వామీజీ చక్పాడులో తన మొదటి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ ఆశ్రమం అక్కడి ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. వేదాంతం, తత్వశాస్త్రం, సంస్కృత వ్యాకరణంలో ఏంతో ప్రావీణ్యం సంపాదించిన శ్రీ లక్ష్మణానంద సరస్వతి.. వేదాంతకేసరి బిరుదాంకితులయ్యారు. పూల్భాని జిల్లాలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించి, జనజాతి సంప్రదాయ పరిరక్షణకు లక్ష్మణానంద సరస్వతి చేసిన అనాసమాన కృషిని గుర్తించిన పూరీ గోవర్ధన పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర్యాచార్యుల వారు, వారికి ‘విధర్మ కుచక్ర విధరన్ మహారథి” బిరుదుతో సత్కరించారు.

కంధమాల్ జిల్లాలో లక్ష్మణానంద సరస్వతి తన సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సమయంలో అనేక ఏళ్ల పాటు స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ శ్రీ రఘునాథ్ సేథీ తన సహాయ సహకారాలందించారు. జనజాతి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అత్యంత ఆవశ్యకరం అని భావించిన స్వామిజీ, అందుకోసం అనేక ప్రాంతాల్లో గిరిజన దేవత అయిన ‘ధరణిపేను’ విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. అంతేకాకుండా గజపతి, కంధమాల్ జిల్లాలోని అనేక వారి ప్రారంభించిన రథయాత్రకు ఆకర్షితులైన స్థానిక తెగలకు చెందిన ప్రజలు తమ సాంస్కృతిక మూలాలను తీసుకుని, స్వధర్మంలోకి తిరిగి వచ్చారు.

క్రైస్తవ మిషనరీల బారి నుండి అమాయక జనజాతి తెగల ప్రజలను, వారి సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే  స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతి యొక్క లక్ష్యంగా కృషి చేశారు. వారి సేవలో కొన్ని ముఖ్యమైన అంశాలు:
  • – జనజాతి యువకులను దృఢమైన, భయంలేని, విద్యావంతులైన, స్వయం సాధికారత సాధించే పౌరులుగా తీర్చిదిద్దడం
  • – జనజాతి ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలపట్ల దృఢమైన విశ్వాసం కలిగివుండి, తమ ప్రజలు క్రైస్తవ మతంలోకి వెళ్లిపోకుండా తామే కాపాడుకోవడం
  • – గోవుల పరిరక్షణ
ఈ అంశాలలో శ్రీ లక్ష్మణానంద సరస్వతి చేసిన ఎనలేని కృషి కారణంగా అతని కీర్తి దశదిశలు వ్యాపించింది. 1986, 2007 సంవత్సరాల్లో వారు నిర్వహించిన రెండు అతిపెద్ద కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది ప్రజలు భారీగా హాజరయ్యారు. కంధమాల్ జిల్లాలోని గ్రామగ్రామానికి పాదయాత్ర చేపట్టిన స్వామీజీ, అక్కడి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు.

క్రైస్తవ మిషనరీల హత్యాకాండకు బలైన " శ్రీ లక్ష్మణానంద సరస్వతి " - Christist terrorists murdered Swami Laxmananda Ssaraswati
శ్రీ లక్ష్మణానంద సరస్వతిపై పలుమార్లు హత్యాయత్నాలు:
   1970 నుండి 2008 మధ్య కాలంలో శ్రీ లక్ష్మణానంద సరస్వతిపై 8 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఇవేవీ కూడా వారి కార్యదీక్షకు అడ్డంకి కాలేదు. ఏది ఏమైనా సరే గిరిజనులను క్రైస్తవ మతమార్పిడి మహమ్మారి నుండి కాపాడి తీరుతానంటూ దృఢమైన సంకల్పం వినిపించిన ఆయన.. “నన్ను అడ్డుకునేందుకు వారిని ఎన్ని ప్రయత్నాలైనా చేయనీయండి. ఈ దైవకార్యం ఆగదు” అంటూ అత్యంత ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసేవారు.
  • – 1969లో ఒక పాస్టర్ తో కూడిన క్రైస్తవ మిషనరీ బృందం రూపగామ్ గ్రామంలో హత్యకు ప్రయత్నించింది.
  • – 1970లో గోవుల అక్రమ రవాణాదారులు అయన హత్యకు విఫలయత్నం చేశారు.
  • – 1978లో బాటింగియాలోని ఓ కార్యక్రమం సందర్భంగా అతనిపై హత్యాయత్నం జరిగింది.
  • – 1981లో ఖాటింగియాలో సాయుధ క్రైస్తవ తీవ్రవాదులు అతనిని హత్యచేసేందుకు ప్రయతించారు.
  • – 1983లో కాంబాగిరిలో క్రైస్తవ మిషనరీ మూకలు అతనిపై హత్యాయత్నం చేశాయి.
  • – 1999లో ఫిరంగియాలో క్రైస్తవ తీవ్రవాదులు అతనిపై హత్యాయత్నం చేశాయి.
  • – 2002లో క్రైస్తవ మతమార్పిడి దళాలు అతనిపై దాడిచేయడంతో తలపై బలమైన గాయమైంది.
  • – 2007లో బ్రహ్మన్జ్ గాంలో స్వామీజీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
23 ఆగష్టు 2008 నాడు ఏం జరిగింది?
  • – ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కంధమాల్ జిల్లాలోని జాలెస్పటాలోని కన్యాశ్రమంలో స్వామీజీ భక్తులతో ప్రార్ధనా మందిరంలో సమావేశమయ్యారు.
  • – అదే సమయంలో ముసుగులు ధరించి, ఏకే 47 తుపాకులు చేతబట్టిన 15 మంది సాయుధ క్రైస్తవ మిషనరీ తీవ్రవాదులు ఆశ్రమంలోకి ప్రవేశించారు.
  • – మొదట అక్కడ ఉన్న బాబా అమృతానంద స్వామీజీని లక్ష్మణానంద స్వామీజీగా భావించి వారిని కాల్చివేశారు.
  • – వెంటనే అక్కడ ఉన్న మాతా భక్తమయి, మరో భక్తురాలు కలిసి స్వామీజీని అక్కడి నుండి తరలించి, వెనుక మార్గం గుండా గదిలోకి తీసుకెళ్లే, తలుపులు మూసివేసి, అక్కడే ఉన్న మరొక గదిలో వారిని దాచివుంచారు.
  • – అది గమనించిన సాయుధ క్రైస్తవ తీవ్రవాదులు, తలుపులు బద్దలుకొట్టి, మాతా భక్తమయి, అక్కడ ఉన్న కిషోర్ బాబాలపై కాల్పులు జరిపి హత్యచేశారు.
  • – అక్కడ స్వామీజీ లేకపోవడం గమనించిన తీవ్రవాదులు, స్వామీజీ ఉన్న్డ మరో గది తలుపులు బద్దలు కొట్టి, వారిపై విచక్షణారహితంగా కాల్పులు చేసి దారుణంగా హత్యచేశారు.
..84 ఏళ్ల వయసు గల శ్రీ లక్ష్మణానంద, క్రైస్తవ తీవ్రవాదులు జరిపిన కాల్పులతో అక్కడికక్కడే నేలకొరిగారు. క్రైస్తవ తీవ్రవాదులు అత్యంత పైశాచికంగా అక్కడ పడివున్న మృతదేహాలను కత్తులతో నరికివేశారు.

గతంలో 8 సార్లు శ్రీ లక్ష్మణానంద సరస్వతి స్వామీజీపై హత్యాయత్నం జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతనికి ఎలాంటి భద్రతా కల్పించకపోవడం గమనార్హం. అంతే కాకుండా వారి హత్య రోజు అక్కడ ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ గార్డు సెలవుపై వెళ్లిపోవడం, అతని స్థానంలో మరో సెక్యూరిటీ గార్డు ప్రత్యామ్నాయంగా నియమించకపోవడం పలు అనుమాలు కలుగజేస్తోంది. స్వామీజీ హత్యపై నాటి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. హత్యానంతరం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాత్రం స్పందించిన ప్రధాని మన్మోహన్ సింగ్, క్రైస్తవులకు మాత్రం సానుభూతిని తెలియజేసారు.

__విశ్వ సంవాద కేంద్రము.. 
Reference: Truth behind Swami Lakshmanananda Saraswati’s Murder: A Book  by Vishwa Sambad Kendra Bhubneshwar Orissa.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top